ఆదివాసీలపై అక్రమ దాడులు ఆపాలి
అడవుల్లో నివాసం ఆదివాసీల హక్కు
సెల్ఫోన్లను ఎత్తుకెళ్లే హక్కు ఫారెస్ట్ అధికారులకు ఎక్కడిది.
సిపిఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు.
భూపాలపల్లి నేటిధాత్రి
అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవించడం ఆదివాసుల హక్కు అని, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల అక్రమ దాడులు ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు
మహా ముత్తారం మండలంలోని ఆదివాసులపై పారేస్ట్ అధికారులు చేస్తున్న దాడులను ఉద్దేశించి గురువారం బంధు సాయిలు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కార్పొరేటు మతోన్మాద ఆదివాసి ప్రజా వ్యతిరేక విధానాల అనుసరిస్తూ దాడులు చేస్తున్న కారణంగా చతిస్గడ్ లోని ఆదివాసీలు బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకొని తెలంగాణలోని అటవీ ప్రాంతాలలో గూఢాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారని,
అదే మాదిరిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహమూత్తాల మండలం పెగడపల్లి రేంజ్ పరిధిలోని పేగడపల్లి గ్రామ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా వలసదివాసులు నివాసం ఉంటున్నారని వారు అన్నారు, వేరొక రాష్ట్రం నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనే కారణంగా ఫారెస్ట్ అధికారులు పదేపదే వారిపై దాడులు చేస్తూ వారి గుడిసెలను కూల్చివేస్తూ, వారిని విపరీతంగా కొడుతూ, వారి పంట సామాగ్రిని, అదేవిధంగా బట్టలు, సెల్ ఫోన్లు ఇతర జీవితాల వస్తువులను మొత్తం ఎత్తుకెళ్తూ ఇవ్వకుండా నరకయాతన పెడుతూ ఇబ్బందుల గురిచేస్తు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు, వలస ఆదివాసీలు భారత పౌరులు కాదా, వారికి జీవించే స్వేచ్ఛ హక్కు లేదా వారు ఎక్కడికి పోయి బతకాలి అని ప్రశ్నించారు, భారత రాజ్యాంగమే ఆదివాసీలకు ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని వారిపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.
వెంటనే ఆదివాసీలపై పారేస్తా అధికారుల అక్రమ దాడులు ఆపాలని వారి నుండి ఎత్తుకెళ్లిన వస్తువులు సామాగ్రిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.