ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్

ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్

 

 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్‌ కుమార్.. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా అరవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి.

 

 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో (Formula E Car Race Case) ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS Officer Arvind Kumar) ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు వచ్చారు ఐఏఎస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్‌ అనుమతి లేకుండా నిధులను బదిలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది.

 

 

ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను కూడా ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16న కేటీఆర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే అరవింద్ కుమార్‌ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఎఫ్‌ఈవో కంపెనీకి దాదాపు రూ.45 కోట్లు 71 లక్షల నగదును బదిలీ చేశారు. వాటికి సంబంధించే మూడో సారి అరవింద్ కుమార్‌‌ను విచారణకు పిలిచి ఏసీబీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తోంది. అయితే రెండు సార్లు కేటీఆర్‌ను విచారణ జరిపిన సమయంలో ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని గతంలో అరవింద్‌ కుమార్‌ను ప్రశ్నించారు. అలాగే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను కూడా ప్రశ్నించారు. ఇక రెండో సారి కేటీఆర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా ప్రస్తుతం ఐఏఎస్ అధికారిని ఏసీబీ ప్రశ్నిస్తోంది.

ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది.

ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది???

మండలంలో మార్క్ చూపని ప్రతిపక్ష పా(ర్టీ)త్ర

ప్రజా సమస్యలపై పోరాటమే లేదు??

సామర్ధ్యం ఉంటే సంఖ్యా బలం ఎందుకు.??

గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు ఎంతో కొంత ప్రాధాన్యత..

 

ఎగరటం మరిచిపోయిన పక్షిలా ప్రతిపక్ష పార్టీ???

పెద్ద సారు రెండు పడవల ప్రయాణం పార్టీకి చేటు తెస్తుందా??

నియోజకవర్గ ఇంచార్జి ఇప్పట్లో లేనట్లేనా??

పార్టీ క్యాడర్ పెంచాల్సింది పోయి పదవులకై కొట్లాట??.

 

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

 

 

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సక్కగా ప్రజలకు చేరాలన్నా ప్రజల పక్షాన స్థానికంగా ఉన్న ప్రతిపక్షం బాధ్యతగా నిలిచి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేయడంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంతో కీలకమైంది.

అధికారపక్షం కన్నా ప్రతిపక్షమే ఎక్కువగా ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా పోరాటాలు చేయవలసి ఉంటుంది.

ఐతే అయినవోలు మండలంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరుగుతుంది.

మండలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోలేకపోతోంది.

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ రెక్కలు ఉన్న ఎగరడం మర్చిపోయిన పక్షిలా అచేతనావస్థలో ఉండడం విడ్డూరంగా అనిపిస్తుంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న బిఆర్ఎస్ పార్టీని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో నిలిపారు.

అంతటి బాధ్యతాయుతమైన స్థానాన్ని మోస్తూ మండలంలో సంక్షేమ పథకాల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజా క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల తరఫున నిలబడి కొట్లాడితేనే కదా గత ఎన్నికల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ పొందగలిగేది.

మండలంలో సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్న, అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్న, మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రతిపక్ష నాయకుడు అర్హుల తరుపున మాట్లాడింది లేదు.

టిఆర్ఎస్ పార్టీ అంటే కేవలం సభలకు సమావేశాలకు మాత్రమే పార్టీ శ్రేణులు రోడ్లమీద కనిపిస్తరు అన్న అపవాదు స్థానికంగా వ్యక్తం అవుతుంది .

ఇది ఇలాగే కొనసాగితే సంక్షేమ పథకాలు ఇస్తామన్న సాకుతో అధికార పార్టీ గీసే పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చి బిఆర్ఎస్ పార్టీలో పని చేయాలంటే పార్టీలో ఉన్న నాయకులు సామాన్యులకు ఎంత భరోసా కల్పించాల్సి ఉంటుందో నాయకులు గ్రహించాలి.

అయితే బిఆర్ఎస్ అచేతన వ్యవస్థకు నేతలు చెబుతున్న కారణాలు నియోజకవర్గంలో తమకంటూ ఒక స్థాయి కలిగిన నాయకుడు లేకపోవడము కొంత ప్రతికూల అంశం.

బిఆర్ఎస్ పార్టీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్దన్నపేటలో కర్చిప్ వేసి పాలకుర్తిలో తన కార్యకలాపాలను కొనసాగించడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నా, అది స్థానిక నాయకత్వలేమిని సూచిస్తుంది.

సరైన సంఖ్య బలం లేక అధికార కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వెనకడుగు వేస్తుందా అన్నది మరో కారణం అంటే క్షేత్రస్థాయిలో మండలంలోని సుమారు 17 గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారు.

మండల స్థాయిలో ఉన్న నాయకులు వారిని సమన్వయపరిచి ఏకతాటి మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదు అనే అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పదవుల కోసం వర్గ పోరాటాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రజల పక్షాన నిలిచేందుకు సంఖ్యాబలం ముఖ్యం అనుకుంటే గత పదిహేను అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ తమ పరిపాలన కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంతలా ఇరుకున పెట్టింది లేదు.

సంక్షేమ పథకాల అమలులో ప్రశ్నిస్తూ, సంక్షేమ పథకాలలో కొంత వాటాను లబ్ధి పొందడంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు సఫలీకృతం అయ్యారు .

అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో బిఆర్ఎస్ విఫలమవుతుందని చెప్పాలి.

అసలు పార్టీ నాయకులకు క్యాడర్ను పెంచాలన్న ఆసక్తి కంటే రాబోయే ఎన్నికల్లో పదవుల కోసం పోరాటం చేయడమే ఎక్కువ అవుతుందన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.

మండలంలో పార్టీని విస్తృతపర్చకుండా కేవలం అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు బ్యాంకును తీసుకొస్తుందన్న బిఆర్ఎస్ నాయకుల భ్రమ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమవుతుందా?

లేదా మరోసారి గత ఎన్నికల మాదిరిగానే ప్రజానాడిని గుర్తించడంలో బొక్క బోర్లా పడతారా అన్నది వేచి చూడాల్సిన అంశం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version