వర్షాకాలంలో మొక్కజొన్న.. వీటి ప్రయోజనాలు తెలిస్తే

వర్షాకాలంలో మొక్కజొన్న.. వీటి ప్రయోజనాలు తెలిస్తే

 

 

 

 

 

 

వర్షాకాలంలో లభించే మొక్కజొన్న తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తును తినడం ఒక మధురానుభూతి. అయితే, ఇవి కేవలం రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుంది? దాని నుంచి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

రోగనిరోధక శక్తి పెంచుతుంది:

మొక్కజొన్న రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు సర్వసాధారణం. అయితే, మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి మిమ్మల్ని వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతుంది. మొక్కజొన్నలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కడుపును తేలికగా ఉంచుతుంది.

 

 

 

 

 

 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

వర్షాకాలంలో శరీరం నీరసంగా అనిపించవచ్చు. మొక్కజొన్నలో ఉండే సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు శరీరానికి తాజాదనాన్ని, శక్తిని అందిస్తాయి,.ఇది మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. అంతేకాకుండా, మొక్కజొన్నలో లభించే ఫోలిక్ ఆమ్లం, మెగ్నీషియం గుండెకు మేలు చేస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

 

 

 

 

 

 

బరువును నియంత్రణలో ఉంచుతుంది:

తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన మొక్కజొన్న ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గే వ్యక్తులకు ఇది సరైన చిరుతిండి. మొక్కజొన్నలో ఉండే విటమిన్ E, B-కాంప్లెక్స్ చర్మ కాంతిని, జుట్టు బలాన్ని పెంచడంలో సహాయపడతాయి.

మేడారం మహాజాతర తేదీలు ఖరారు .

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

 

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు

 

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.

 

 

 

ఆపై 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరుతున్నారు. కాగా.. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం జాతర జరుగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ.

 

ప్రపంచానికి బహుమతిగా రామాయణ

ప్రపంచానికి బహుమతిగా రామాయణ

 

రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌…
రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితీష్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రామాయణ.. ద ఇంట్రడక్షన్‌’ పేరుతో ఈ సినిమా గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ ‘మేం చరిత్రను తిరిగి చెప్పడం లేదు.. మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులందరినీ ఒక చోట చేర్చి ప్రామాణికంగా ‘రామాయణ’ చిత్రాన్ని తీస్తున్నాం. ఈ సినిమా ప్రపంచానికి మేం ఇచ్చే బహుమతి అవుతుంది’ అన్నారు. ప్రామాణికంగా, భక్తిశ్రద్ధలతో ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఐమాక్స్‌ సహా ప్రపంచంలోని అన్ని పాపులర్‌ ఫార్మెట్స్‌లో విడుదల చేస్తామని దర్శకుడు నితీశ్‌ తివారి చెప్పారు. ఈ సినిమాలో కన్నడ హీరో యశ్‌ రావణుడిగా, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి.

మహిళలు రాజకీయాల్లోనూ రాణించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్: మహరాష్ట్రలోని సేవాగ్రామ్ గాందీ
ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ నా యకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహ రించేందుకు నేర్చుకోవాల్సిన అంశాలపై ఐదు రోజుల వర్క్షాపులో రాజకీయ భాగస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొల గించుకునేలా బూత్అయిలో వెళ్లి మహిళలు ఒక సముహమును ఏర్పరుచుకొని నాయకులుగా ఎదగాలని రాజకీయాన్ని ప్రబావితం చేసే శక్తిగా మారి మరోవైపు రాజకీయ పార్టీలో మహిళా శక్తిగా అవ తరలించాలని ముఖ్య అతిథులు అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పండితులచే అనేక సెషన్సు నిర్వహించడం జరిగింది. భారతదేశం నుంచి ఈ పరిశ్రమలో నలబైమంది మహిళలు ప్రత్యేక ఆహ్వానం, అనేక ప్రక్రియల ద్వారా ఎంపిక చేయబడిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి అస్మా, విజయలక్ష్మి పాల్గొన్నారు.

డాన్ లీతో.. త‌రుణ్ ఫోటో వైరల్‌!

డాన్ లీతో.. త‌రుణ్ ఫోటో వైరల్‌! 

 

ద‌శాబ్దం క్రితం టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన త‌రుణ్ తాజాగా సౌత్ కొరియ‌న్ స్టార్‌తో దిగిన ఫొటో పెద్ద హంగామా సృష్టిస్తోంది.

 

ఒక‌నాటి చైల్డ్ ఆర్టిస్ట్ ఆపై హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన త‌రుణ్ (Tharun) సుమారు ద‌శాబ్దంగా సినిమాల్లో క‌నిపించ‌డం పూర్తిగా బంద్ చేశారు. కానీ త‌రుచూ ఎక్క‌డో అక్క‌డ వార్త‌ల్లో వినిపిస్తూ, క‌నిపిస్తూ త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూ వ‌స్తున్నాడు. టాలీవుడ్‌లో జ‌రిగే ఈవెంట్ల‌కు సైతం హ‌జ‌ర‌వుతున్నారు. అయితే తాజాగా త‌రుణ్ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఫొటోతో సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది.

 

ఇటీవ‌ల అమెరికా (USA) ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన త‌రుణ్ లాస్ వేగాస్ (Las Vegas)లో సౌత్ కొరియా (South Korea) అగ్ర‌ న‌టుడు డాన్ లీ (DonLee)ని క‌లిసి ఆయ‌న‌తో ఫొటో దిగారు. ఆ చిత్రం కాస‌త్ సామాజిక మాద్య‌మాల్లోకి చేరి ఇప్పుడుపెద్ద ర‌చ్చే చేస్తుంది. ఆ ఫొటో చూసిన వాళ్లంతా షేర్ చేస్తూ పెద్ద‌ హంగామే సృష్టిస్తున్నారు. మిమ్మ‌లి్న ఇలా చూడ‌డం హ్యాపీగా ఉంద‌ని, మ‌ళ్లీ సినిమాలు చేయాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

 

ఇదిలాఉంటే.. డాన్లీ ఇప్ప‌టికే అనేక కొరియ‌న్ సినిమాల‌తో ఇండియ‌న్ ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు. ఆయ‌న న‌టించిన సినిమాలు అనేకం ఓటీటీలో మంచి ఆద‌రణ‌న‌ను ద‌క్కించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్‌, యానిమ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeepreddy vanga) త‌దుప‌రి ప్ర‌భాస్ (Prabhas‌)తో తెర‌కెక్కించ‌నున్న స్పిరిట్ (Spirit) సినిమాలో డాన్‌లీని కీల‌క పాత్ర‌కు తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. ఆక్ర‌మంలో త‌రుణ్ డాన్ లీతో దిగిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌రోసారి స్పిరిట్ సైతం వైర‌ల్ అవుతుంది

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం

*జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ *

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

 

జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

జూన్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 02 FIRలు,04 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

 

SP Mahesh B. Gite IPS

 

విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,
ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.

మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

 

SP Mahesh B. Gite IPS

 

విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనేజిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ  తెలిపారు.

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ .

జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్

 

నేటి ధాత్రి చర్ల :

జూన్ 4వ తేదీన హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోవు సభలో 15000 వేల మంది గ్రామస్థాయి నాయకుల సమక్షంలో ఏర్పాటు చేయబోయే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారీ బహిరంగ సభకు
ప్రధాన అతిథిగా భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు
అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు వైస్ ప్రెసిడెంట్లు టిపిసిసి ప్రధాన కార్యదర్శులు మరియు అనేకమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నరు కావున ఈ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల.

నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జై బాపు – జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఐఎన్టియుసి నేతలు పిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులంతా పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.ఐఎన్టియుసి రాష్ట్ర నేత,తెలంగాణ ప్రభుత్వ మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ జైపూర్ లో మీడియాతో ఈసందర్భంగా మాట్లాడుతూ..గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది.కానీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడం అనేది చాలా అవసరం. జూలై 4న జరిగే ఈ సభలో కాంగ్రెస్ పార్టీని నమ్మి నిస్వార్థంగా పని చేస్తున్న నాయకులకు అర్థవంతమైన ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.సెంట్రల్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు,పార్టీలోని అందరూ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.మల్లికార్జున ఖర్గే స్వయంగా ఈసమావేశంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.అలాగే పార్టీ శ్రేణుల మద్దతును సమీకరించుకునే గొప్ప అవకాశం అని తెలిపారు.అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు,ఐఎన్టియుసి మిత్రులు అందరు కూడా తప్పకుండా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన..

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి మార్కింగ్ వాకింగ్ లో నష్టపోయే బాధితులు కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అధికారులతో కలిసివివేకానంద చౌరస్తా నుండి రామాలయం వరకు రోడ్ల విస్తరణలో నష్టపోయే బాధితుల అభిప్రాయాలను సేకరించారు ఎంతో కాలంగా కర్నూల్ రోడ్ లో రోడ్ల విస్తరణ పెండింగ్ ఉండడంతో కొత్త బస్టాండ్ దగ్గర రాజావారి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర రోడ్డు చిన్నగా ఉండడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వనపర్తి పట్టణ ప్రజల భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మెగా రెడ్డి నష్టపోయే బాధితులను ఒప్పించి రోడ్ల విస్తరణ చేపట్టడంపై ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు .ఈసందర్భంగా రోడ్ల విస్తరణ కు ముందుకు వచ్చిన ఎస్ ఎల్ ఎన్ రమేష్ రాజు షబ్బీర్ వినోద్ లకు ఎమ్మెల్యే మెగారెడ్డి శాలువతో సన్మానము చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ ఆ ర్ డి ఓ రెవెన్యూ జిల్లా అధికారులు టౌన్ ఎస్సై హరిప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం సుబ్బరాజు చుక్క రాజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు దక్కాకుల సతీష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ డి వెంకటేష్ వ్యాపారస్తులు కూన వెంకటేశ్వర్లు బట్టల షాప్ ల యజమానులు తదితరులు ఉన్నారు

మంత్రిని కలిసిన కోట ధనరాజ్.

మంత్రిని కలిసిన కోట ధనరాజ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ .గారిని మినిస్టర్ కోటర్స్ లో
మర్యాదపూర్వకంగా కలిసిన ఝరాసంగం మండల కొల్లూరు గ్రామానికి చెందిన డా.కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త.మంత్రి మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో విద్యా వ్యాపార సంస్థలు రాణించాలన్నారు డా.ధన్ రాజ్ గౌడ్ చేస్తున్న సేవల్ని మంత్రి వారిని అభినందించి తమ సేవలను ఇలాగే కొనసాగించాలన్నారు.

ప్రకృతిని పూజించే పండుగ .

ప్రకృతిని పూజించే పండుగ సిత్ల పండుగ…

గిరిజనుల ప్రకృతి ఆరాధనే సిత్ల…

బంజారాల సంస్కృతీ -సిత్ల భవాని పండుగ…

బంజారాలు ఎంతో పవిత్రంగా జరుపుకునే మొదటి పండుగ సిత్ల పండుగ…

సిత్ల పండుగ రోజును సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న గిరిజనులు…

నేటిధాత్రి-

 

 

 

 

 

 

 

 

 

మహబూబాబాద్-గార్ల గిరిజనుల కట్టు,బొట్టు వేషధారణ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అతి పవిత్రంగా ఉంటాయి.ప్రకృతిని పూజించడం,ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత.ప్రతి సంవత్సరం పెద్ద పూసల కార్తె మొదటి లేదా రెండవ మంగళవారం గిరిజన జాతి శోభ ఉట్టిపడేలా సీత్ల పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.సీత్ల పండుగను బంజారా జాతి మొత్తం ఓకే రోజున జరుపుకొని జాతీ ఐక్యతను చాటుతారు.పశు సంపదకు గాలికుంటు వ్యాధి రాకుండా, పశు సంపద బాగా వృద్ధి చెందాలని, వర్షాలు కూరవాలని, పంటలు సమృద్ధిగా పండాలని,ప్రకృతి కరుణించాలని,తండ ప్రజలందరిని దేవత సల్లగా ఉండేలా దీవించాలని, పశువులకు ఎటువంటి రోగాలు రాకూడదని,ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉండాలని, తండా వాసులు వారి పశువులను ఒకే చోటికి చేర్చి అందరు కలిసి సిత్ల భవాని (సాతు భవానీలను )దేవత ను బంజారాల సాంప్రదాయ పద్దతిలో పూజిస్తారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పూర్వం గిరిజనులు ఎక్కువ సంఖ్యలో పసుపు సంపదను కలిగి ఉండి వ్యవసాయమే జీవన ఆధారంగా జీవించేవారు.తండాలో పశువులు, గోర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలని, దూడలకు పాలు సరిపోను ఉండాలని,గడ్డి బాగా దొరకాలని, క్రూరమృగాల బారిన పడకుండా ఉండాలని, అటవీ సంపద తరగకూడదని సిత్ల భవాని మొక్కులు తీర్చుకుంటారు.ప్రకృతి ఆధారంగా తరతరాలుగా తండాలను ఏర్పరుచుకొని లంబాడిలు తమ మనుగడను కాపాడుకున్నారు. సిత్ల పండుగ సందర్బంగా వాంసిడో ను కన్నెపిల్లలు సిత్ల భవానీలకు సమర్పించడం ఆనవాయితీ.ఒకరోజు ముందు జొన్నలు, పప్పుధాన్యాలను నానబెట్టి తయారు చేసిన ఘుగ్రీ (గుగ్గిళ్ళు )నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని గిరిజనులు వాంసిడో (ప్రాచీన నైవేద్యం గా చెబుతారు. సిత్ల పండుగ ప్రకృతి ని ఆరాధించే సాంప్రదాయ పండుగ. పశు సంపద, అభివృద్ధి, ఆరోగ్యం, తండా సౌభాగ్యం కోసం సిత్ల యాడి పూజ చేయడం గిరిజనుల ఆనవాయితి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆషాడం లో జులై మాసంలో పెద్ద పూసాల కార్తె లో మంగళవారం రోజున ఎంతో ఘనంగా సిత్ల పండుగ నిర్వహిస్తారు. లంబాడిలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. (1)మేరమ్మ 2)తుల్జ 3)సిత్ల 4)అంబా భవాని 5)హింగ్లా 6) ద్వాళాంగర్ 7)కంకాళి ఏడుగురు దేవతలతో పాటు ముందు భాగంలో లుంకడియా దేవుడిని ప్రతిష్టించి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్ళు (ఘుగ్రీ ), పాయసం (లాప్సీ )సమర్పిస్తారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి వాటిపై నుంచి పశువులను దాటిస్తారు. అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారాల నమ్మకం. సిత్ల యాడి దేవతను పూజించే క్రమంలో పెద్దమనిషిని పూజారిగా ఉంచి, అతని చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 8న మంగళవారం రోజు బంజారాలు నిర్వహించే సిత్ల పండుగ రోజున సెలవు ప్రకటించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు.

మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలో మట్కా నిర్వాహకులను, మట్కా ఆడుతున్నవారిని స్థానిక తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని శాంతినగర్, రాంనగర్ కాలనీలలో పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు మట్కా నిర్వాహకులను, ఐదుగురు మట్కా ఆడుతున్నవారిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్దనుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.9,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

కొత్తగా ఏర్పడిన కోహిర్ మునిసిపాలిటీలో ప్రజల సమస్యలను.

కొత్తగా ఏర్పడిన కోహిర్ మునిసిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు లేరు: అనితా సుమిత్ కుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీ (ఎంవి) ప్రజలు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మరియు అతని సంతకం టోకెన్ మరియు టిపిఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా సమస్యలను మరియు వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కోహిర్ మండల్ మాజీ ఎంపిటిసి వార్డ్ నంబర్ 4 అనితా సుమిత్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

కోహెర్ కొత్త మునిసిపాలిటీ స్థాపించబడిన తర్వాత, కోహిర్ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు.

కోహిర్ మునిసిపల్ కౌన్సిల్ అధికారులకు ఈ సమస్యలను పరిష్కరించడంలో తెలియకపోవడం వల్ల, వీధి దీపాలు ఆపివేయబడటం మరియు ఐమాక్స్ లైట్లు సకాలంలో సర్దుబాటు చేయకపోవడం వంటి ప్రజల ప్రాథమిక సమస్యలు లాలా కుంట ప్రాంతంలోని ఐమాక్స్ లైట్లలో విద్యుత్ షాక్‌కు కారణమవుతున్నాయి, ఇది పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది.

అదనంగా, కాలువలు మరియు కల్వర్టులను సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల, మురికి నీరు కొన్ని చోట్ల రోడ్లపై నిలిచిపోతోంది.

దోమల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతోంది, దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది, ఈ మురికి నీరు కారణంగా ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు.

అదనంగా, మురుగునీరు మరియు డ్రైనేజీ లేకపోవడం వల్ల, చెత్త కుప్పలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అదనంగా, మొహల్లా బసంత్‌పూర్, అంబేద్కర్ చౌక్, చౌకి గోలా బండా, జహంగీర్ వాడా మరియు ఇతర రోడ్లతో సహా కోహెర్ మునిసిపాలిటీలోని ప్రధాన రహదారులపై ఉన్న గుంతల కారణంగా, వర్షపు నీరు కనిపిస్తోంది, దీని కారణంగా పాదచారులు నడవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అదనంగా, జనన ధృవీకరణ పత్రాలు మరియు ధృవపత్రాలు, ఇంటి బదిలీలు మరియు పునరుద్ధరణలతో పాటు ఇతర పనుల కోసం, ప్రజలు కోహెర్ మునిసిపల్ కౌన్సిల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, కానీ వారి ఫిర్యాదులను వినడానికి ఎవరూ లేరు.

వారు కార్యాలయానికి రావడం లేదు, దీని కారణంగా వారు ప్రజలకు అందుబాటులో లేరు.

ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి వారికి ఫోన్ చేసినా, వారు సమాధానం ఇవ్వరు, ప్రజల ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్ట్ చేసి, వాట్సాప్‌లో వారి సమస్యలను అడుగుతారు కానీ వాటిని పరిష్కరించరు.

పరిమితి ఏమిటంటే, గత 6 నెలల్లో 3 మంది మున్సిపల్ కమిషనర్లు మారారు మరియు ఇప్పుడు ఒకే ఒక కమిషనర్ పనిచేస్తున్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించలేనివారే కాకుండా, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అటువంటి అధికారులపై జిల్లా కలెక్టర్ మరియు DMA కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోహిర్ మునిసిపాలిటీ ప్రజల విజ్ఞప్తి.

అటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి మరియు ప్రజలకు సేవ చేసే మరియు ఏర్పడిన కోహార్ మునిసిపాలిటీ అభివృద్ధికి మరియు ప్రజల ప్రాథమిక సమస్యలకు సేవ చేసే అటువంటి అధికారులను నియమించాలి.

ఏకపక్ష సిద్ధాంతాలు ఎక్కువకాలం మనలేవు

`సర్వజనులకు హితమైనవే ఆమోదయోగ్యం

`బాధితులకు అండగా వుండని సిద్ధాంతాలు వ్యర్థం

`బాధితులకు కులం, మతం, వుండవు. అణచివేత మాత్రమే వుంటుంది

`పిడివాదంతోనే సమాజానికి ప్రమాదం

`ప్రజలకు వాస్తవాలు తెలియాలి

`సైద్ధాంతిక నిబద్ధతను ప్రజలు గుర్తించాలి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక సిద్ధాంతాన్ని నమ్మడం దానికే కట్టుబడి ముందుకు సాగడం వ్యక్తుల నిబద్ధతకు నిదర్శనం. అటువంటి వ్యక్తులు తాము కట్టుబడిన దానికే బద్ధులుగా వుండటం సహజంగా జరుగుతుంది. ఆవిధంగా కట్టుబడలేనివారు వారు నమ్ముకున్న మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఆవిధంగా మానవ సమాజం విభిన్న వ్యక్తుల వైవిధ్య అభిప్రాయాల సమారోహంగా కొనసాగుతుండటం అత్యంతసహజం. మానవ నాగరికత ఎప్పటికప్పుడు పరిణామం చెందుతుంటుంది. నూతన ఆవిష్కరణ లు, కొత్త ఆలోచనలు మానవ జీవన ప్రమాణాల్లో తీసుకొస్తున్న మార్పులు ఇందుకు కారణం. ఇది సిద్ధాంతాలకూ వర్తిస్తుంది. సామాజిక మార్పులకు అనుగుణంగా సిద్ధాతాలు కూడా తమ వైఖరిని మార్చుకోకపోతే అవి లుప్తమై పోవడం లేదా పిడివాదంగా మారి, సహజమార్పులను అడ్డు కునే ప్రక్రియలో అవి తీవ్రస్థాయి సాంఘిక సంఘర్షణలకు కారణమవుతాయి. అయితే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కో సమస్యను లేదా ఒక్కొక్క పరిణామాన్ని తన కోణంలో చూడటం సహజం. ఎవరు ఏ కోణంలో చూసినా ప్రతి సమాజానికి వున్న సాంస్కృతిక వారసత్వం, నేపథ్యం దెబ్బతినకుం డా, సామాజిక ఆలోచనా ధోరణుల్లో వస్తున్న సానుకూల మార్పులను మరింత వేగంగా ముం దుకు తీసుకెళ్లడానికి దోహదం చేసే సిద్ధాంతమే బహుళ ప్రజాదరణ పొందడమే కాదు, చిరకా లం మనగలుగుతుంది. మనదేశంలో కూడా ప్రస్తుతం లిబరల్‌ భావజాలం, జాతీయవాదం అనేవి ప్రస్తుతం విస్తృత ప్ర చారంలో వున్నాయి. ఈ రెండు భావజాలాలు పూర్తిగా భిన్నం కావడంతో ఒక జాతీయ లేదా అంతర్జాతీయ సమస్యను ఇవి చూసే కోణం వేర్వేరుగా వుండటం వల్ల, వీటిల్లో ఏది నిజం? ఏదివర్తమాన కాలానికి అనుగుణం కాదు అని ఒక సాధారణ వ్యక్తి నిర్ణయించుకోవడం కష్టమవు తుంది. ఎందుకంటే ఎవరి కోణంలో వారిది నిజంగా తోచడమే! అయితే ఇక్కడ కావలసింది నిష్పాక్షిక దృక్కోణంతో సర్వజనులకు హితకరంగా వున్న వాదనను లేదా సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసించాల్సి వుంటుంది. ఇక్కడ వారికి సైద్ధాంతిక నిబద్ధత కంటే, సర్వజన హితం ముఖ్యం! ప్రపంచం నలుమూలల విస్తరించి వున్న వివిధ నాగరికతల్లో, ఎవరు ఎక్కువ బాధలకు, పీడనకు గురవుతున్నారనేదానిపై నిష్పాక్షిక విశ్లేషణ అవసరం. అప్పుడు ప్రపంచంలో లేదా మన చుట్టు పక్కలఏం జరుగుతున్నదనేది అందరికీ చక్కగా అర్థమవుతుంది. ఇటువంటి వివరాలను చక్కగా వివ రించగలిగేది మీడియా మాత్రమే! అయితే మీడియా ఇటువంటి వాస్తవిక నిబద్ధతకు బదులు సైద్ధాంతిక కోణానికే పరిమితమైతే అప్పుడు ప్రజల్లోకి వెళ్లేది సమాచారం కాదు, ఒక సైద్ధాంతిక దృక్కోణం మాత్రమే! ప్రస్తుతం మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదిదే! దీనివల్లఅసలు సమస్య మరుగునపడిపోయి సైద్ధాంతిక సంఘర్షణలకు తావిచ్చినట్లవుతోంది. అందువల్ల సమస్యను వివరించి, దానికి సైద్ధాంతిక కోణాన్ని జతపరిస్తే సామాన్యులకు అప్పుడు విషయ పరిజ్ఞానంతో పాటు ఒక్కొక్క సిద్ధాంతం యొక్క సైద్ధాంతిక కోణాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతా రు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అది జరగడంలేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలించవ చ్చు. 

టిబెట్‌ను అక్రమంగా చైనా ఆక్రమించుకున్న మాట వాస్తవం. ప్రస్తుతం చైనా అక్కడ చేపడుతు న్న అభివృద్ధి పనులను లిబరల్‌ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న సాంస్కృక విధ్వంసమని, తరతరాలుగా అక్కడి ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం పూర్తిగా ధ్వంసమవుతున్నాయని జాతీయవాదం పేర్కొంటుంది. దలైలామా పేరు చెబితే జైలుకు వెళ్లక తప్పదు. ఇక్కడ రెండు వాదనలూ కరెక్టే. కానీ వాస్తవం ఏమిటంటే, టిబెట్‌ అనాదికాలంగా ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడి బౌద్ధ సన్యాసులు వారి గురువైన దలైలామా అహింసను మాత్రమే బోధిస్తారు. దలైలామా కేవలం కర్మ సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతి సాధనను ప్రభోధిస్తారు. అంతేకానివర్గపోరాటాన్ని గురించి చెప్పరు. మరి శాంతి కాముకులపై ఈరకమైన అణచివేత ఎంతవరకు సమంజసమనేది జాతీయవాదం ప్రశ్నిస్తుంది. మరోవిషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 76ఏళ్ల క్రితం మననుంచి విడిపోయిన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను, ఒకప్పుడు బ్రిటిష్‌ పాలనలో కొనసాగిన బర్మా (నేటి మయన్మార్‌), భూ టాన్‌లను మన భూభాగాలే అనగలమా? మరి ఎప్పుడో క్వింగ్‌రాజుల కాలంలో కొంతకాలం తమ ఆధీనంలో వున్నదన్న కారణంగా టిబెట్‌ను చైనా ఆక్రమిం చుకోవడం ఎంతవరకు సమర్థనీయం? నిజానికి టిబెట్‌ ఒక స్వతంత్రదేశం! మరో ఉదాహరణ గా ఇజ్రాయిల్‌, పాలస్తీనాలను తీసుకోవచ్చు. ఇజ్రాయిల్‌ ఆక్రమించిన భూభాగాల్లో మౌలిక సదుపాయాల పరంగా చేపట్టే అభివృద్ధి పనులను లిబరల్‌ మీడియా పట్టించుకోదు. పాలస్తీనా విష యంలో లిబరల్‌ మీడియా దురాక్రమణ, జాతివివక్ష, ప్రజల తిరుగుబాటు, ఆత్మగౌరవం, అజ్ఞా తం వంటి సానుభూతి పదజాలాలను ప్రయోగిస్తుంది. చైనా ఆక్రమణలో ఇదే పరిస్థితిని ఎదు ర్కొంటున్న టిబెటన్ల విషయంలో లిబరల్‌ మీడియా ఇటువంటి పదప్రయోగం చేయదు. ఇక్కడ జరుగుతున్న అణచివేతను అన్యాయమని జాతీయవాదం వాదిస్తుంది. టిబెట్‌లో చైనా చేపడుతు న్న మౌలిక సదుపాయాల వృద్ధి లిబరల్స్‌కు కనిపించినప్పుడు, వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ చేపట్టే మౌలిక సదుపాయాలు వీరికి ఎందుకు పట్టవని జాతీయవాదం ప్రశ్నిస్తుంది. అయితే పాలస్తీనా ప్రజలు తమ స్వస్థలాలను వదిలి వెళ్లాల్సి రావడం అమానవీయమని లిబరల్స్‌ వాదిస్తారు. మరిఇదే పరిస్థితి టిబెట్‌లో, కశ్మీర్‌లో, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నప్పుడు వీరు ప్రశ్నించకపోవడం ఉ దారవాదం కిందికి రాదు. ఏకపక్షవాదం కిందికే వస్తుంది. కశ్మీర్‌ విషయంలో ప్రజాభిప్రాయం, స్వీయనిర్ణయాధికారం, వాక్‌స్వాతంత్య్ర అని వాదించే ఉదారవాదులు, టిబెట్‌లో అహింసనుపా టించే బౌద్ధుల విషయంలో ఈ పదజాలాన్ని ఎందుకు ప్రయోగించరన్నది జాతీయవాదులు లేవనెత్తే ప్రశ్న. అదేమంటే అది చైనా అంతర్గత సమస్య అని వాదిస్తారు. మరి ఇదే సూత్రం ఇజ్రా యిల్‌కూ వ ర్తిస్తుంది కదా! ఒకవేళ మన జర్నలిస్టులను లాషాకు తీసుకెళితే చైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకాశానికెత్తేస్తారు. ఇదే ఇజ్రాయిల్‌ వెస్ట్‌బ్యాంక్‌కు తీసుకెళితే, అక్కడ జరిగే అభివృద్ధి వీరికి కనిపించదు. కేవలం పాలస్తీనా ప్రజల కన్నీళ్లు మాత్రమే కనిపిస్తా యి! అంటే ఇక్కడ అణచివేసేది పశ్చిమదేశం లేదా బూర్జువా అయినా తిరుగుబాటు ‘పవిత్రం’ అవుతుంది. అదే అణచివేసేది కమ్యూనిస్టు అయితే అది ‘స్థిరత్వానికి’ ఏర్పడిన ప్రమాదం అవుతుంది. ఇదా లిబరలిజం అంటే? అస్మదీయులకొక నీతి తస్మదీయులకు మరో నీతి పాటించడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా లిబరలిజం క్రమంగా తన స్థానాన్ని కోల్పోతున్నది. టిబెట్‌లో దలైలామా ను అమెరికా సమర్థించింది. ఇంకేం ఆయన్ను సి.ఐ.ఎ. ఏజెంట్‌గా ప్రచారం చేశారు. ఇదే సమయంలో టిబెట్‌లో తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉన్నతిని కావాలనే తమ ప్రచార హోరులో విస్మరించారనేది జాతీయవాదులు ఎత్తి చూపుతున్న అంశం. అంతేకాదు టిబెట్‌ అంటే అదొక ప శ్చిమదేశాలకు అనుకూలంగా ముద్రవేశారు. అందేకాని అక్కడి ఆధ్యాత్మిక ఔన్నత్యం వారికి పట్టదు! ఉదారవాదం అంటే జాతి,కుల, మత వివక్షలేకుండా బాధితులకు అండగా నిలబడి మాట్లాడటం. కేవలం మనదేశంలోనే కాదు యూరప్‌ దేశాల్లో కూడా ఉదారవాదులు ఇదే తరహా ఏకపక్ష వాదనలను వినిపించడం కనిపిస్తుంది. కేవలం ఇటువంటి వైఖరులే, మనదే శంతో సహా అన్ని యూరప్‌ దేశాల్లో జాతీయవాదం క్రమంగా వేళ్లూనుకోవడానికి కారణమవు తోంది. ఈ ఉదార వాదంలో కనిపించే మరో లోపమేంటంటే మెజారిటీ వర్గం అంటే అణచివేతకు పాల్పడతారనేది ఒక ముద్రవేయడం. మరి ఇదే వైఖరి ప్రకారం, బంగ్లాదేశ్‌లోని మైనారిటీలుగా వున్న హిందువులపై మెజారిటీలు జరుపుతున్న అత్యాచారాలు వీరికి పట్టవు. ఇదెక్కడి ఉదారవాదం. ఉదారవాదం అంటే మెజారిటీ మైనారిటీ అని కాదు. కేవలం బాధితుల పక్షానమాత్రమే నిలవడం. టిబెట్‌ విషయానికి వస్తే అక్కడి సంస్కృతి భారతీయ సంస్కృతితో కొన్ని వేల సంవత్సరాలుగా సంబంధాలను పెనవేసుకున్నది. మనకు వారికి మధ్య సరిహద్దు ఒక సమస్యే కాదు. నలంద నుంచితవాంగ్‌ వరకు బౌద్ధ సన్యాసులు స్వేచ్ఛగా పర్యటించారు. ఆధ్యాత్మిక శోభను మరింత పరిమ ళింపజేశారు. ఇప్పటికీ తవాంగ్‌లో మనదేశ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. మొత్తంమీద చెప్పాలంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించే వాదం ఎప్పుడైనా తన ఉనికిని కల్పోక తప్పదు. అన్నివర్గాలకు అనుకూలమైన వాదమే ఎప్పటికైనా మనగలుగుతుందన్నది మాత్రం సత్యం.

‘‘మంత్రి గారు’’ ఈ విధానం మీరైనా మార్చరా!

 

ఇదెక్కడి న్యాయం..ఇదెక్కడి దుర్మార్గం.

`అటు ఒత్తిళ్లు..ఇటు పెనాల్టీలు!

`టెండర్‌ ప్యాడి దళారీ వ్యవస్థను పోషించడం ఎందుకు!

`బకాయిలు చెల్లించే సమయంలో టెండర్‌ ప్యాడి మూసుడెట్లా!

`దేశంలో ఏ రాష్ట్రంలో లేని టెండర్‌ ప్యాడి విధానం తెలంగాణలోనే ఎందుకు?

`మిల్లర్లు ఎదుర్కొంటున్న మద్దెల దరువులు!

`చెల్లించే వారి చేతులు కట్టేసి..బలవంతంగా పెనాల్టీలేస్తారా?

`టెండర్‌ ప్యాడీ మూలంగా నలిగిపోతూ నష్టపోతున్న మిల్లర్లు.

`చెల్లింపుల్లో ఆలస్యమైందని పెనాల్టీలేస్తామనడం ఎట్లా!

`విచిత్రమైన టెండర్‌ ప్యాడీ విధానాలు.

`మిల్లర్ల మీద టెండర్‌ ప్యాడీ పెత్తనమెందుకు!

`టెండర్‌ ప్యాడీ దళారీ వ్యవస్థను పోషించడమెందుకు!

`ప్రభుత్వ ఖజాను నుంచి టెండర్‌ ప్యాడీ వ్యవస్థను బతికించుడెందుకు!

`రైతులు, మిల్లర్ల మధ్య టెండర్‌ ప్యాడీ దళారీ వ్యవస్థ ఎందుకు!

`టెండర్‌ ప్యాడీ మూలంగా రైతు నష్టపోతున్నాడు.

`మిల్లర్లు నలిగి నష్టాల బారిన పడుతున్నారు.

`ఖజానాకు టెండర్‌ ప్యాడీ గండికొడుతున్నారు.

`ఇన్ని రకాల టెండర్‌ ప్యాడీని ఎందుకు కొనసాగిస్తున్నారు.

`ప్రభుత్వానికి విసృతమైన సివిల్‌ సప్లయ్‌ విభాగముంది.

`దానిని పర్యవేక్షించేందుకు, మిల్లర్లను నియంత్రించేందుకు విజిలెన్స్‌ వ్యవస్థ వుంది.

`టెండర్‌ ప్యాడీ కనుసన్నల్లో విజిలెన్స్‌ పనిచేయడమేమిటి?

`టెండర్‌ ప్యాడీ మీద నియంత్రణేది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

తగ్గాల్సిన సమస్యలు పోను పోను పెరుగుతుంటే ఎవరికైనా ఇబ్బందే..తెలంగాణ మిల్లర్ల పరిస్ధితి కూడా అలాగే వుంది. సమస్యలు పరిష్కామౌతున్నాయనుకుంటున్న ప్రతిసారి ఏదోఒక సమస్య మళ్లీ వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ మధ్య తెలంగాణలో వున్న మిల్లర్ల బకాయిలన్నీ దాదాపు వసూలుచేశారు. అందుకు ఆ శాఖ కమీషనర్‌ చౌహన్‌ను ఎందుకైనా అభినందించాల్సిందే. ఎందుకంటే పదేళ్లకు పైగా మిల్లర్ల వద్ద వేలాది కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయారు. ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి చేసినా వాటి వసూలు సాధ్యం కాలేదు. అప్పటి పాలకులు కూడా వసూలుకు చిత్తశుద్ది ప్రదర్శించలేదు. దాంతో ప్రభుత్వానికి అందాల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువైన తర్వాత సివిల్‌ సప్లైశాఖకు కమీషనర్‌గా చౌహన్‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన బకాయిల వసలూ మీద దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా చౌహాన్‌ మిల్లర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండానే వసూలు చేయించారు. విడతల వారిగా అవకాశం కల్పించారు. మొత్తానికి మిల్లర్ల నుంచి వేల కోట్లు వసూలు చేయించారు. ఇంకా కొన్ని వందల కోట్లు బకాయిలు మిగిలి వున్నాయి. వాటిని కూడ చెల్లించడానికి మిల్లర్లు అందరూ సిద్దం వున్నారు. కాని ఇక్కడే కొందరు అధికారులు, టెండర్‌ ప్యాడీ దారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మిల్లర్లను ఇబ్బందులకు గురి చేయాలిన చూస్తున్నారు. దాంతో మిల్లర్లకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వేధింపులు ఎక్కువౌతున్నాయి. ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్ధితులు సృష్టించబడుతున్నారు. మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు సిద్దంగా వున్నప్పటికీ టెండర్‌ ప్యాడీకి చెందిన దళారులు మూలంగా మిల్లర్ల మీద మరింత అదనపు బారం పడేలా వుంది. మిల్లర్ల మీద పెనాల్టీలు విధించాలిన మధ్య దళారీ వ్యవస్ధ అయిన టెండర్‌ ప్యాడీ మిల్లర్లను ముప్పు తిప్పలు పెట్టాలనుకుంటోంది. దాంతో మిల్లర్లు మద్దెల దరువునుకు ఎదుర్కొనే పరిస్ధితులు సృష్టించబడుతున్నాయి. మేం బకాయిలు చెల్లిస్తాం మహా ప్రభో అని మిల్లర్లు అంటుంటే వారి చేతులు కట్టేసినంత పనిచేస్తున్నారు. వారు బకాయిలు చెల్లిస్తామంటుంటుంటే ఇప్పుడు వద్దన్నారు. వెసులుబాటు కల్పించినట్లు నమ్మించారు. ఇప్పుడు ఒత్తిడికి టెండర్‌ ప్యాడీ దళారులు సిద్దమౌతున్నారు. టెండర్‌ ప్యాడీ క్లోస్‌ అయ్యిందని పెనాల్టీ విధించేందుకు సిద్దమౌతున్నట్లు మిల్లర్లుకు సమాచారం అందింది. అంతే తెలంగాణ వ్యాప్తంగా మిల్లర్లు లబో దిబో మంటున్నారు. తాము సంతోషంగా వున్నాం. బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తామని చెప్పినప్పుడు టెండర్‌ ప్యాడీ మూలంగా వసూలు ఆలస్యమైంది. ఇప్పుడు మెడమీద కత్తిపెట్టినట్లు పెనాల్టీలతో సహా వసూలు చేస్తామని చెబుతున్నట్లు సమాచారం. దాంతో మిల్లర్లు తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదంటున్నారు. తప్పు మిల్లర్ల వైపు నుంచి జరిగితే నిజంగానే పెనాల్టీలతో సహా వసూలు చేసుకోవచ్చు. కాని తాము బకాయిలు చెల్లిస్తామని చెప్పినా తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ మిల్లర్లనే దోషులు చేయాలనుకుంటున్నారు. ఇది ఎట్టిపరిస్ధితుల్లో ఒప్పుకునే పరిస్ధితి లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. తమ హక్కులను పూర్తిగా టెండర్‌ ప్యాడీ విధానం వల్ల కోల్పోతున్నామని అంటున్నారు. అయినా ప్రభుత్వానికి,మిల్లర్లకు మధ్య ఈ టెండర్‌ ప్యాడీ దళారులెందుకు? వారి పెత్తనమెందుకు? ఆ వ్యవస్ధ ఎందుకు? వారి చేత మాకు లేనిపోని ఇబ్బందులెందుకు? అని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. చెల్లింపులు చేస్తామంటూ తాము ఎంత చెప్పినా వినిపించుకోకుండా, వసూలు చేసుకోకుండా, బలవంతంగా పెనాల్టీలు వేసి మిల్లర్లను నష్టాలల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం…ఇదెక్కడి దుర్మార్గమని మిల్లర్లు నిలదీస్తున్నారు. ప్రభుత్వం అనవసరంగా మధ్య ధళారుల మూలంగా అబాసు పాలౌతుందని మిల్లర్లు వాదిస్తున్నారు. మధ్య దళారుల మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటున్నారు. అంతే కాదు ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌ ప్యాడీ విదానం అనేది దేశంలో ఎక్కడా లేదు. ఏ రాష్ట్రంలోనూ లేదు. పొరుగున వున్న ఏపిలో కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఈ పెంట మిల్లర్ల మీద రుద్దడం జరిగిందంటున్నారు. అలా టెండర్‌ తీసుకున్న మధ్య ధళారుల మూలంగా మిల్లర్లు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఇబ్బందుల పాలౌతున్నారు. కష్టాలకు గురౌతున్నారు. మిల్లులు మూసుకునే పరిస్ధితిని టెండర్‌ ప్యాడీ దళారులు సృష్టిస్తున్నారని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బకాయిలు చెల్లించే సమయంలో టెండర్‌ ప్యాడీ గడువు ముగియడమేమిటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. బకాయిలు అందరూ చెల్లించేందుకు సిద్దమౌతుంటే ఆలస్యమైందని పెనాల్టీలు చెల్లించాల్సిందే అని మిల్లర్లను బెదిరించడమేమిటని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు మిల్లర్ల మీద టెండర్‌ ప్యాడీ పెత్తనమేమిటని వాళ్లు నిలదీస్తున్నారు. అసలు ప్రభుత్వం టెండర్‌ ప్యాడీ దళారీ వ్యవస్ధను పోషించడమెందుకంటున్నారు. రైతులకు, మిల్లర్లకు మధ్య టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ అవసరం లేనిది. అర్దం లేనిది. అనవసరంగా కోట్లాది రూపాయలు చెల్లిస్తూ, ప్రభుత్వం టెండర్‌ ప్యాడీ వ్యవస్ధను పోషించాల్సిన అవసరం లేదంటున్నారు. రైతులకు, మిల్లర్లకు మధ్య సివిల్‌ సప్లై వ్యవస్ధ వుంది. ఆ వ్యవస్దతోనే దేశంలోని అన్ని రాష్టాలలోనూ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరుగుతోంది. కాని ఒక్క తెలంగాణలోనే ఈ వ్యవస్ధ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? ఎవరి మేలు కోసం వచ్చింది? ఏ రకంగా చూసినా ప్రభుత్వానికి టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ వల్ల నష్టమే తప్ప రూపాయి లాభం లేదు. టెండర్‌ ప్యాడీ మూలంగా అటు రైతు నష్టపోతున్నాడు. ఇటు మిల్లర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. కేవలం పర్యవేక్షణ తప్ప పని లేని టెండర్‌ ప్యాడీని కోట్లాది రూపాయలు చెల్లించి ప్రభుత్వం మేపాల్సిన పనిలేదు. టెండర్‌ ప్యాడీ మూలంగా ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోంది. అలాంటి టెండర్‌ ప్యాడీని ప్రజా ప్రబుత్వం కూడా ఎందుకు నిర్వహిస్తోందని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో సివిల్‌ సప్లైకి విసృతమైన యంత్రాంగముంది. ఆ యంత్రాంగం చాలు. దానికి అనుబంధంగా విజిలెన్స్‌ విభాగం వుంది. ఈ రెండు వ్యవస్ధలు పటిష్టంగానే వున్నాయి. అయినా కొత్తగా టెండర్‌ ప్యాడీ తెచ్చిపెట్టారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మిల్లర్లు ఏదైనాపొరపాటు చేస్తే నియంత్రించేందుకు విజిలెన్స్‌ వ్యవస్ధ వుంది. అలాంటి విజిలెన్స్‌ వ్యవస్ధను కూడా ఆడిరచేందంతగా ప్యాడీటెండర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. విజిలెన్స్‌ వ్యవస్ధ కూడా ప్యాడీ టెండర్‌ కనుసన్నల్లో పనిచేస్తోంది. ప్యాడీ టెండర్‌ చెప్పినట్లు విజిలెన్స్‌ విభాగం పనిచేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమే జరుగుతోంది. రైతులనుంచి వడ్లు సేకరించడానికి ప్రత్యేకంగా టెండర్‌ ప్యాడీ దళారీ వ్యవస్ధ అవసరమే లేదు. ఆ వ్యవస్ధను కూర్చోబెట్టి మేపాల్సిన అవసరం లేదు. వారికి పారితోషికం కింద కోట్లాదిరూపాయలు చెల్లించాల్సినపనిలేదు. ఆ వ్యవస్ధకు చెల్లిస్తున్న దానిని తమకు చెల్లిస్తే చాలు. అటు రైతు నుంచి కోతలకు కూడా పెద్దగా ఆస్కారం వుండదు. ఇటు మిల్లింగ్‌లోనష్టాలకు తావుండదు. ఆ వ్యవస్ధకు అనవసరంగా చెల్లించే సొమ్మును రైతులకు, మిల్లర్లకు పంచినా బాగుంటుంది. లేకున్నా ఇబ్బంది కూడా లేదు. అనవసరంగా టెండర్‌ ప్యాడీని ఫోషిస్తూ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. రైతుల నుంచి వడ్లు సేకరించడం కోసం టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ ముందుస్తుగా ప్రభుత్వానికి ఎలాంటి చెల్లింపులు చేస్తున్నది లేదు. కాని వడ్లు వచ్చిన తర్వాత పర్యవేక్షన పేరుతో మిల్లర్ల మీద పెత్తనం సాగిస్తున్నది. మిల్లర్ల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఈ మాత్రం దానికి టెండర్‌ప్యాడీ విధానమెందుకు? నేరుగా మిల్లర్లే ప్రభుత్వానికి చెల్లింపులు సాగిస్తే సరిపోతుంది. గతంలో ఇదే విదానం అమలులో వుండేది. అన్ని రాష్ట్రాలలోనూ ఇదే అమలు జరుగుతోంది. ఇప్పటికెనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టిపెట్టాలని మిల్లర్లు కోరుతున్నారు.

జనాసమూహం ప్రదేశం లో మద్యం దుకాణాలు

జనాసమూహం ప్రదేశం లో మద్యం దుకాణాలు ముసివేయాలి

పట్టణంలోని ఎక్కువ రద్దీ ఉన్నచోట ఇబ్బందిగా మారిన మద్యం షాపులు

మెయిన్ రోడ్ చౌరస్తాలో ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో పెట్టించాలి*

ప్రజాతంత్ర మహిళా సంఘం
ఐ.ద్వా జిల్లా కార్యదర్శి.జవ్వాజి విమల

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐ ద్వా. జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మెయిన్ రోడ్ల వెంబడి పాత బస్టాండ్ గాంధీ చౌక్ కొత్త బస్టాండ్ చౌరస్తాలలో మద్యం షాపులు పెట్టడం మద్యం కొనడానికి వచ్చేవారు మొత్తం రోడ్డు ఇరువైపులా వెహికల్స్ పెట్టడం వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది మద్యం షాపులో ప్రక్కనే బెల్ట్ షాపులు ఉండడం వలన ఆ ప్రాంతం నుండి వెళ్లే మహిళల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం మద్యం అమ్మడానికే ప్రాముఖ్యత ఇస్తుంది గాని ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు మద్యంపై వస్తున్న ఆదాయమే ప్రభుత్వానికి ముఖ్యంగా కనబడుతోంది ప్రధాన రహదాల నుండి 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు పెట్టాలి కానీ ప్రజలకు కండ్ల ముందు కనబడే విధంగా దూరంగా ఉంటే మద్యం తాగుడు మర్చిపోతారేమో అని ప్రధాన చౌరస్తాలో పెట్టించడం జరుగుతుంది ఇది సరైన విధానం కాదు
ఎక్స్చేంజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించాలి రోడ్డుకు వంద మీటర్ల దూరంలో పెట్టించాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కొనసాగితే ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కొడం లలిత,ఆడెపు లావణ్య,పద్మ,విజయ,వడ్డేపల్లి లక్ష్మీ,కొడం అరుణ తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు రూ 33 కోట్ల రుణమాఫీ .

చేనేత కార్మికులకు రూ 33 కోట్ల రుణమాఫీ మంజూరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు

మినిమమ్ వేజెస్ బోర్డు మెంబర్ బాసని చంద్ర ప్రకాష్

శాయంపేట నేటిధాత్రి:

 

చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి చేనేత కార్మికులకు అందజేసిన రూ33 కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని తెలంగాణ రాష్ట్ర కనుక మినిమం వేజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్రకాష్ తెలియ జేశారు. ఈసందర్భంగాముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా ర్కకు,రెవెన్యూమంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డికి,బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కి, స్థానిక భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావులకు బాసాని చంద్రప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞ తలు తెలియజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా కొత్త రుణాలను మంజూరు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

రామకృష్ణాపూర్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్ పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. రామకృష్ణాపూర్ పట్టణానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ సేవలు లేవని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటైన నేపథ్యంలో ఆర్టీసీని పునరుద్ధరించాలని డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించడం జరిగిందని జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిపో మేనేజర్ స్పందించి వారం రోజులలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటామని తెలిపినట్లు వారు తెలియజేశారు.వినతి పత్రం అందించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, కాదండి సాంబయ్య, మామిడి గోపి, వనం సత్యనారాయణ, మొండి ,మారేపల్లి రవి ,చందర్, సిరికొండ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు తెర్చే అధికారులే లేరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ కొత్తగా మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత అధిక సమస్యలు ఎదుర్కొంటున్న కోహిర్ ప్రజానీకం సమస్యలు చెప్పుకోవడానికి మున్సిపాలిటీ అధికారులు దిక్కులేరు,, వీధిలైట్లు లేక,,, మురికి నీరు నిండి వివిధ రోగాల బారిని పడుతున్న ప్రజలు,, బర్త్ సర్టిఫికెట్లు,, డెత్ సర్టిఫికెట్లు రాక,, రోడ్లు గుంతల మయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న,, ప్రజల ఇండ్లు రికార్డులో ఒకరి పేరు ఆన్లైన్లో ఇంకొకరి పేరు ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను చెప్పుకుందాం అని వెళితే అధికారులు దిక్కులేరు టిపిఓ టౌన్ ప్లాన్ ఆఫీసర్ నియమితులై ఎన్నో రోజులు గడుస్తున్న ప్రజలకు అందుబాటులో లేకుండా కనీసం సమస్య తెలపటానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రతిస్పందన లేకుండా ప్రజల ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్టులో వేస్తూ వాట్సాప్ లో సమస్యల గురించి విన్నవించుకున్న నిమ్మకు నెరెత్తినట్టు ప్రజల కష్టాలను తీర్చడమే లేకుండా ఇంకా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఇలాంటి అధికారుల పైన కోహిర్ మున్సిపల్ కమిషనర్ ,,, జిల్లా కలెక్టర్,, CDMA కమిషనర్ చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను సస్పెండ్ చేసి ప్రజలకు సేవ చేసి అధికారిని నియమించవలసిందిగా ప్రజల విజ్ఞప్తి  చేస్తున్నారు.

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జులై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మారపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్టుబడ్డిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాళ్లరాస్తున్నారన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్ లతో బలిచ్చే విధంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము.ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్.. రాజు.. పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version