అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలి.

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలి

లబ్ధిదారులకు ఇసుక ఉచితం.. రవాణా ఛార్జీలు చెల్లించాలి
పైలట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీల వారిగా ఇండ్ల నిర్మాణాల పురోగతి పై ఆరా తీశారు. ఎందుకు లక్ష్యం చేరుకోలేదో వివరాలు అడిగి తెలుసుకొని, త్వరగా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామ, కమిటీలు గుర్తించిన వారితో పాటుగా ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇండ్లు ఇవ్వాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన గృహాలను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Collector

 

 

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు. రవాణా ఛార్జీలు మాత్రమే లబ్దిదారు చెల్లించాలని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అయిన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేసి ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు.
గ్రామాలు, మున్సిపాలిటీలలో అధికారులు నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటించి, అర్హులకు ఇండ్ల నిర్మాణాలపై సూచనలు అందించాలని, పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, సర్వే వివరాలు ప్రతి రోజూ సాయంత్రం తమకు పంపించాలని కలెక్టర్ సూచించారు.వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.!

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల మండల కేంద్రం వాసవి కళ్యాణ మండపంలో జరిగిన *మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గారు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్j ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,
మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ గ్రామాల అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు  తదితరులు.

ఛలో వరంగల్ కు లక్షలాదిగా తరలివెళ్దాం.!

ఛలో వరంగల్ కు లక్షలాదిగా తరలివెళ్దాం

రణ యోధుడు రజతోత్సవ సభకు ఊరూ,వాడ ఏక మవుతున్నాయి

శాయంపేట నేటిధాత్రి:

ఛలో వరంగల్ కు లక్షలాదిగా తరలి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామ ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్ల కెసిఆర్ పాలల్లో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగా కేవలం 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు భరించ లేకపోతున్నారు.

Congress

గులాబీ దండు కేసీఆర్ దళం బీఆర్ఎస్ సైనికుల వెన్నంటి ఉంటా ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటా అన్నారు.రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. పోలీసులు రాజ్య మేలు తున్నారు . ఏప్రిల్ 27న ఎల్క తుర్తి బీఆర్ఎస్ సభకు నాయకులు తరలిరావాలని కోరారు.జరగనున్న రజతో త్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి దిశా నిర్దేశం చేయను న్నారని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని గోవిందాపూర్, పెద్దకోడేపాక,జోగంపల్లి ,మైలారం, ఆరేపల్లి గ్రామాలలో బీ ఆర్ఎస్ పార్టీ రజోత్సవసభకు కార్యకర్తలను సమయత్వం చేస్తూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆహ్వానిస్తూ పర్యటించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు , అన్ని గ్రామాల కార్యకర్తలు టిఆర్ఎస్ అభిమానులు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీ సీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భవ దినోత్సవం.!

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఈరోజు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 6వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది

పంపిణీ అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మరియు ఉపాధ్యాయులు సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ…
ఈరోజుల్లో యువత చెడు మార్గంలో వెళుతున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక కొత్త మార్గం ఎంచుకోవాలని వారిని కోరడం జరిగింది

5 సంవత్సరాలుగా మాకు సహకరించి మా కోసం ముందుండి నడిపిన ప్రతి ఒక్క మా మిత్రులకు అన్నలకు, తమ్ముళ్లకు కుటుంబ సభ్యులకు మరియు పట్టణ ప్రజలందరికీ మా తరఫున పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మొదలుపెట్టి సరిగ్గా ఈరోజుకు 6 సంవత్సరాలు పూర్తయింది

ఈ సంస్థ నేను స్థాపించినప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులతో మొదలై ఈరోజు కొన్ని వందల మందితో ముందుకు వెళుతుంది

మా ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు ఏమిటంటే కొన్ని మీకోసం తెలియజేయడానికి

1. కరోనా వచ్చి మృతి చెందిన వారికి దహన సంస్కరణాలు చేయడం జరిగింది

2. కరోనా వచ్చినవారికి మా సొంతంగా పౌష్టిక ఆహారం మేమే స్వయంగా వారి వద్దకు వెళ్లి వారికి ఇవ్వడం జరిగింది

3. లాక్ డౌన్ సమయంలో వందల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మేము వారి వద్దకు వెళ్లి అందించడం జరిగింది

4.పాఠశాల పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు బుక్స్ అందించడం జరిగింది

5.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది

6. పట్టణ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిన సమయంలో రోడ్లపై స్వయంగా మేమే మరమత్తులు చేయడం జరిగింది

7. వాహనదారులకు రోడ్డు మార్గంలో చెట్లు చాలా వేపుగా పెరిగి రోడ్డు సరిగ్గా కనబడక చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో మా సొసైటీ సభ్యులంతా కలిసి ఆ చెట్లను తీసివేయడం జరిగింది

8. నిరుపేద కుటుంబంలోని అమ్మాయిల వివాహాలకు మా వంతుగా ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది చాలా సందర్భాలలో

9.వికలాంగులకు స్టాండ్స్ పంపిణీ చేయడం జరిగింది

10.కరోనా సమయంలో పెరిగిన ఆటో చార్జీలను మా వంతుగా కృషి చేసి తగ్గించడం జరిగింది
ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్న వారికి మా వంతుగా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది

11.మందమర్రి చుట్టుపక్కల రాత్రివేళ మహిళలకు ఇబ్బందికరంగా మారిన మార్కెట్ల లైట్ల కోసం సమస్యపై కృషి చేయడం జరిగింది

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి చేయడం జరిగింది

ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించిన నాతోటి మిత్రులకు అధికారులకు ఇతర పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు

ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకు వస్తాం

రాబోయే రోజుల్లో ఈ వందల సంఖ్య కాస్త వేల సంఖ్యగా మారి వేల నుంచి లక్షల సంఖ్యలుగా మారాలని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజ్ కుమార్ జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్ మండల అధ్యక్షుడు సకినాల శంకర్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఓరం కవిరాజ్, దాడి రాజు అబిద్ కిరణ్ చరణ్ చింటూ అజయ్ సుందర్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యార్థుల.!

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యార్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులు

జూనియర్ ఇంటర్ ఎంపీసీ లో 468 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

వెలువడిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో సత్తా చాటారని హోతి -కె ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు.

జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఎ.గాయత్రి, ఐశ్వర్య అనే విద్యార్థులు 468 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థాయి ర్యాంకులు సాధించినట్లు ఆమె తెలిపారు.

బి. నికిత 470 మార్కులకు గాను 468, కె. స్నేహ 467, ఎం. అరవింద 467, ఎం. పూజ 466, టీ స్పందన 465, ఆఫియా తాసుమ్ 465, ఏ. ప్రవళిక 465, జి మేఘన 464, జాదవ్ లతా బాయ్ 464 మార్కులు సాధించారు. బైపిసి మొదటి సంవత్సరంలో 440 మార్కులకు సిహెచ్ భవాని 436, జాయ్స్ మేరీ 435, ఎం. హరిణి 433, కే వైశాలి 432, వర్షిక 432, కీర్తి 432, మహేశ్వరి 430 సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 1000 మార్కులకు గాను ఎం. అర్చన 986, హరిప్రియ 986, దేవి శ్రీ 986, జి.లయ 981, బైపీసీ రెండో సంవత్సరంలో 1000 మార్కులకు గాను నిత్య స్వరూపిణి 991, ఎస్. శివాని 991, పి వైశాలి 982, సాయి భవాని 980 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేఖ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాల అయినప్పటికిని కార్పొరేట్ కళాశాల కు దీటుగా తమ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థులు శ్రద్ధ వహించి ఏకాగ్రతతో చదవడం మూలంగా ఈ ర్యాంకులు సాధించినట్లు, ఈ ఉత్తమ ర్యాంకులు సాధించడానికి ఎంతో క్రమశిక్షణతో పాఠాలు బోధించిన ఉపాధ్యాయ బృందానికి ఎంతో సాయ సహకారాలు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్.

బడులకు వేసవి సెలవులు వచ్చేశాయ్

నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ బడులు అన్నిoటికీ వేసవి సెలవులు గురువారం (ఏప్రిల్ 24) ప్రారంభమవు తున్నాయి,. బుధవారం పాఠశాలల్లో పని దినాలు ముగియనున్నాయి. ఇప్పటికీ వార్షిక పరీక్షలు పూర్తి చేసిన పాఠశాలలో ప్రోగ్రెస్ కార్డులు జారీ కూడా పూర్తి చేశారు దీంతో ఈ విద్యా సంవత్సరం ముగిసింది పాఠశాలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. తిరిగి పాఠశాలలు జూన్ 12 న పునః ప్రారంభమవుతాయి. దీంతో అన్ని పాఠశాలలో ఏప్రిల్ 23 తేదీనే ఈ ఏడాదికి చివరి పని దినంగా ఉండనుంది.

Summer vacations

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రవేట్ బడులన్నిం టికీ ఏప్రిల్ 24 వ తేదీతో తరగతులు ముగిస్తాయి
2025-26 విద్యా సంవత్స రానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించేం దుకు కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రణ కూడా ఇప్పటికే ప్రారంభమైంది బడులు తెరిచిన రోజే అంటే జూన్ 12 వ తేదీన విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు.

విద్యార్థుల సంఖ్యను పెంచాలి.

విద్యార్థుల సంఖ్యను పెంచాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని పెంచాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు.

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు.

సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.!

మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్‌ ఇస్తూ ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో కొన్ని టిప్స్‌ సూచించారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రతి ఏడాది ఎండాకాలంతోపాటే మామిడిపండ్ల సీజన్‌ వస్తది. మామిడిపండు రుచికరంగానే కాక అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పండులో విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, కాపర్‌, ఫోలేట్‌, మెగ్నీషయం, పొటాషియం, విటమిన్‌ బీ6, విటమిన్‌ కే తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణకోశం, చర్మం, కురుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మామిడిపండులోని పోషకాలు తోడ్పడుతాయి. అంతేగాక బరువును తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.అయితే మామిడిపండ్లు రుచిలో చాలా తియ్యగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచివి కావని, రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయని చెబుతుంటారు. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మధుమేహులు కూడా హాయిగా మామిడిపండ్లను ఆస్వాదించవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవనీత్‌ బాత్రా తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా ఖతాలో ఒక పెట్టారు.

Mangoes

‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్‌ ఇస్తూ ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో కొన్ని టిప్స్‌ సూచించారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. మితంగా తీసుకోవాలి

మీరు మధుమేహులు అయినప్పటికీ రోజుకు ఒకటికి మించకుండా మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదని లవనీత్‌ బాత్రా తన పోస్టులో పేర్కొన్నారు. ఒక మీడియం సైజు మామిడిపండులో 50 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయని, అలాంటి పండును రోజుకు సగం లేదా ఒకటి తినడంవల్ల వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు.

2. పోషకాల బ్యాలెన్సింగ్‌

మధుమేహులు మామిడిపండును తీసుకున్నప్పుడు శరీరంలో కార్బోహైడ్రేట్‌లు, చక్కెరల పరిమాణం బ్యాలన్స్‌ తప్పకుండా చూసుకోవాలని బాత్రా తెలిపారు. అందుకోసం మామిడిపండును తినడానికి ముందే కొవ్వులు, ఫైబర్‌లు ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా ఉండే మామిడిపండును ఫైబర్స్‌, కొవ్వులు లాంటి ఇతర పోషకాలతో కలిపి తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అంటే మామిడిపండును తినడానికి ముందు ఒక కప్పు నిమ్మరసంతోపాటు వాల్‌నట్స్‌, నానబెట్టిన చియా గింజలు లేదా బాదామ్‌ గింజలు తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడంవల్ల మామిడిపండు తిన్నప్పటికీ గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకుండా ఉంటాయని తెలిపారు.

3. టైమింగ్‌ పాటించాలి

మధుమేహులు మామిడి పండును ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా సరైన టైమ్‌లో మాత్రమే తీసుకోవాలని లవనీత్‌ బాత్రా సూచించారు. ఏదైనా పనిచేయడానికి ముందు, నడవడానికి ముందు, వ్యాయామం చేయడానికి ముందు మామిడి పండును తీసుకోవాలని తెలిపారు. దాంతో పెరిగిన కార్బోహైడ్రేట్స్‌ వెంటనే అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు.

4. సరైన పద్ధతిలో తినాలి

డయాబెటిక్స్‌ మామిడిపండును తినాల్సిన పద్ధతిలో మాత్రమే తినాలని బాత్రా సూచించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మామిడిపండును జ్యూస్‌ల రూపంలో, మిల్క్‌ షేక్స్‌ రూపంలో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తినాలని తెలిపారు. ప్రకృతి ఇచ్చిన పండును ప్రకృతి సిద్ధంగా తినడంవల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.!

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శివకుమార్,నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ గార్లు మాట్లాడుతూ.

Silver Jubilee

27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,వీర రెడ్డి,రాజు పటేల్,రాజ్ కుమార్,ప్రవీణ్ కుమార్,రాజేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అశోక్,హనీఫ్ పటేల్,యువత అధ్యక్షులు ఉమేష్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,
గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాట వినలేదు మన్నించండి!

మళ్లీ గెలిపించుకుంటాం పాలించండి!!

`కేసీఆర్‌ చల్లని పాలన మళ్ల తెచ్చుకుంటాం.

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిపించుకుంటాం.

`ప్రతి పల్లెలో జనం అంటున్న మాట.

`పల్లె పెడుతున్న కన్నీరుకు బీఆర్‌ఎస్‌ బాసట.

`అందుకే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

`కేసీఆర్‌ కోసం తెలంగాణ ప్రజలు వేయి

కళ్లతో ఎదురు చూస్తున్నారంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన పల్లె కన్నీటి గాథలు..ఆయన మాటల్లోనే…

`అరవై ఏళ్ల గోసను ఏడాదిలో తెచ్చారు!

`లేని కరువు తెచ్చి రైతును గోసపెడుతున్నారు

`తెలంగాణను చిన్నాభిన్నం చేస్తున్నారు

`అన్నపూర్ణ ను ఆగం చేస్తున్నారు

`తెలంగాణ జీవితాలను అడివడివి చేస్తున్నారు

`తాగుదామనుకుంటే నీటి చుక్క లేకుండా చేస్తున్నారు

`చెరువులన్నీ ఎండబెడుతున్నారు

`పదేళ్లలో పల్లె పండుగ, సంపద నిండుగ చూసింది

`ఏడాదిలోనే కాంగ్రెస్‌ వచ్చి తెలంగాణను ఎడారి చేస్తోంది

`బతకలేక పోయే రోజుల దాపురిస్తున్నాయి

`అధికారం తప్ప ప్రజా సమస్యలు గాలికొదిలేశారు

`పద్నాలుగేళ్లు కొట్లాడి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చాడు

`ఆరు నెలల్లో కరంటు కష్టాలు తీర్చాడు

`ఆరు నెలల్లోనే చెరువులన్నీ నింపి కరువును దూరం చేశాడు

`మూడేళ్లలో 46 వేల చెరువులు బాగు చేయించాడు

`ఇంటింటికీ మంచి నీళ్లిచ్చాడు

`పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు

`సాగువాటు సమయానికి సొమ్ము అందించారు

`రైతులను అప్పుల ఊబి నుంచి రక్షించాడు

`పదేళ్లలో కొత్త బోర్లు అవసరం లేకుండా చెశాడు

`ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు

`మూడేళ్లలో కాళేశ్వరం కట్టి తెలంగాణను నీటి గోస లేకుండా చేశాడు

`మా సారును ఓడిరచి, మా వేలుతో మా కన్ను పొడుచుకున్నాం

`కాంగ్రెస్‌ ను నమ్మి కష్టాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము

`మళ్ల యాభై ఏళ్ళయినా కాంగ్రెస్‌ మొఖం చూడము

`బీఆర్‌ఎస్‌ ను మా గుండెల్లో పెట్టుకుంటాము

`పేదల ఆకలి తీర్చిన సారు రుణం తీర్చుకుంటాము

`రైతును రాజును చేసిన కేసీఆర్‌ పాలన మళ్ల తెచ్చుకుంటాము

`తెలంగాణలో ఏ పల్లెలో విన్నా ఇవే మాటలు

`ఏ రైతును కదిలించినా ఇవే ముచ్చట్లు

డెబ్బైఐదు సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాదిలోనే ప్రజలు తూర్పార పట్టడం ఇదే మొదటిసారి. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టున్న ప్రభుత్వం ఇదే. తెలంగాణ సాధకుడు, పాలకుడైన కేసిఆర్‌ ప్రభుత్వాన్ని కాదనుకొని, కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మి మోసపోయామని బాధ పడుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను పదేళ్లలో ఊహించనంత అభివృద్ది చేసిన కేసిఆర్‌ను ఓడిరచి, ఇబ్బందులు పడుతున్నామని నేరుగానే చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలు అడుగడుగునా చుక్కలు చూపిస్తున్నారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మా సారు మాకు కావాలి. మళ్ల మా సారేరావాలి. తెలంగాణజాతి పిత కేసిఆర్‌ పాలన కోరుకుంటున్నామంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ను తుక్కుతుక్కుగా ఓడిస్తామంటున్నారు. కేసిఆర్‌ను కాదనుకొని కాంగ్రెస్‌ను గెపించుకున్నందుకు పాపం చట్టుకున్నదంటున్నారు. ఏడాదిలోనే ఎంతో నష్టపోయామని ప్రజలు చెబుతున్నారు. ఈ బాధలు ఇంకా నాలుగేళ్లు భరించడం మా వల్ల కాదని కూడా ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి నిండా మునిగామని ప్రజలు చెప్పడంకూడా ఇదే తొలిసారి. ఏడాదిలోనే ఇంత ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వం మూట గట్టుకోలేదు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచన తప్ప, ప్రజలను మోసం చేయొద్దని కాంగ్రెస్‌ అనుకుంటే గెలిచేదే కాదు. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్ధానాలలోనే మోసం స్పష్టంగా కనిపించింది. కాని ప్రజలను కాంగ్రెస్‌ మాయ చేసి ఓట్లేయించుకున్నది. గెలిచింది. కాని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయక, పదవుల కోసం అధికారంలోకి వచ్చామన్న భావనలో వున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. అందుకే ప్రజలు మా కేసిఆర్‌ మాకు మళ్లీ కావాలని ఊరు, వాడ, పల్లె, పిల్లా, జెల్లా అందరూ కోరుకుంటున్నారంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో తెలంగాణ పల్లెలు పడుతున్న గోసలు పూసగుచ్చినట్లు వివరించారు.
ప్రజలు అదికారమిస్తే పాలించాల్సిన కాంగ్రెస్‌ పాలకులు, లంకెబిందెలు వున్నాయోమో అనుకున్నాం..అన్నప్పుడే ప్రజలు అర్ధం చేసుకున్నారు. పైగా కడుపు కట్టుకుంటే చాలు అంటూ చెప్పిన మాటల్లోని పరమార్ధం ప్రజలకు అర్ధమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల మదిలో ఆలోచనలు, చేష్టలు పూర్తిగా తెలిసిపోయాయి. అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పల్లెల్లో రైతులు, హైదరాబాద్‌లో ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అరిగోసకు గురి చేస్తోంది. ఎక్కడ చూసినా విధ్వంసమే.. ఏ పనిచేసినా ప్రజలను ఇబ్బందిపెట్టే పనులే చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక్కసారి ప్లీజ్‌..ప్లీజ్‌ అంటూ ఏడాదిపాటు ప్రజలను వేడుకుంటూ, కాళ్లా వేళ్లాపడి, కేసిఆర్‌ ప్రభుత్వం మీద లేనిపోని నిందలు, అబద్దాలు చెప్పారు. ఎన్నికల ముందు అలవి కాని హమీలు ఇచ్చారు. పాలన చేతగా ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్‌ నాయకుడు మీడియా సమక్షంలోనే అధికారులతో అప్పుడున్నది ఇదే అదికారులు..ఇప్పుడున్నది అదే అధికారులు..కరంటు రైతులకు నీళ్లెందుకు రావడం లేదని అడిగారంటే కాంగ్రెస్‌ పాలన ఎంత అద్వాహ్నంగా వుందో అర్దం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పాలకుల చేత గాని తనం ఎంత దైన్యంగా వుందో తెలుసుకోవచ్చు. పాలన చేతగాక అధికారులను అంటే ఏమొస్తుంది. ప్రణాళిక లేకుండా, ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన చేయకుండా అవగాహన లేని వాళ్లు పాలిస్తే ప్రజల జీవితాలు గందరగోళంలో పడతాయి. అభివృద్ది కుంటుపడుతుంది. ప్రగతి ఆగిపోతుంది. ప్రజల జీవితాలు అస్తవ్యమస్తమౌతాయి. కాంగ్రెస్‌ను నమ్మినందుకుపల్లె మళ్లీ కన్నీరు పెడుతోంది. గోస పడుతోంది. వలవల ఏడుస్తోంది. రైతు కన్నీరు మున్నీరౌతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేవు. భూ గర్భ జలాలు పద్నాలుగు మీటర్ల లోతుకు అడుగంటిపోపయాయి. బోర్లలో నీటిచుక్కలేకుండాపోయింది. కేసిఆర్‌ పాలనలో పదేళ్లపాటు ఎల్లబోసిన బావులు కూడా మళ్లీ ఎండిపోయాయి. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులు కొత్తగా బోర్లు వేసుకునే అవకాశం రాలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా బోరు బండ్లే కనిపిస్తున్నాయి. మళ్లీ రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారు. చుక్క నీరు రాక నష్టపోతున్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాగు చేసిన చెరువులున్నాయి. వాటిని నింపాలన్న సోయిలేదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా కట్టించిన అనేక రిజర్వాయర్లుఉన్నాయి. వాటిని నింపడం లేదు. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. నీళ్ల చుక్క కాళేశ్వం నుంచి వాడితే కేసిఆర్‌కు మళ్లీ పేరొస్తుందని, తాము చెప్పిన మాటలు అబద్దాలౌతాయని రైతులకు నీళ్లివ్వడం లేదు. కాళేశ్వరంలో నీళ్లు నిలుపడం లేదు. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, తెలంగాణ మొత్తం ఎండిపోతోంది. ఎడారిగా మారుతోంది. ఈ సారి నాలుగు దొయ్యలు పెట్టుకోవాలన్నా రైతు భయపడుతున్నాడు. ఏడాది క్రితం వరకు పదేళ్ల కాలంలో గుంట జాగ కూడా వదలకుండా ఉన్న భూమినంతా పొలం చేశారు. ఒకప్పుడు ఎందుకూ పనికి రాదన్న భూములను కూడా పొలాలు చేసి పారించారు. రైతులు బంగారు పంటలు పండిరచారు. చెలకలన్నీ పొలాలు చేసి సన్న బియ్యం పండిరచారు. అలా తెలంగాణ మొత్తం కాళేశ్వరం నీటి పారకంతో కోటిన్నర ఎకరాల మాగాణ అయ్యింది.. కాంగ్రెస్‌ రాగానే మళ్లీ ఎడారిగా మారిపోయింది. కాళేశ్వరం నీళ్లు నల్లగొండ జిల్లా కోదాడ చివరి ఆయకట్టు దాకా పారినసంగతి ప్రజలకు తెలుసు. రైతులకు తెలుసు. కాని కాంగ్రెస్‌నాయకులకు మాత్రం కనిపించలేదు. రైతులకు లేని పోని మాటలు చెప్పి మాయ చేశారు. నమ్మితేనే కదా మోసం చేయొచ్చన్నట్లు పాలిస్తున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేశరు. ఓవైపు అకాల వర్షాలతో తెలంగాణ అంతటా పంటలు ఆగమౌతున్నాయి. కుప్పలు కొట్టుకుపోతున్నాయి. మామిడి తోటలు రాలిపోతున్నాయి. అసలే అరకొర పంటలు చేతికొస్తుంటే, ఆ మాత్రం కూడా దక్కకుండా పోతుంటే పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారు. రైతులను పరామర్శించడం లేదు. ఈ రోజు హెలీకాప్టర్‌ నాకు, రేపు నీకు అనుకుంటూ హెలీకాప్టర్‌తో తిరిగేందుకు కొట్లాటలు పెట్టుకుంటున్నారు. రైతుల గోసను గాలికి వదిలేశారు. ఏడాది వరకు పండగైన సాగు ఇప్పుడు దండుగౌతోంది. రైతు బంధు ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ సరిగ్గా అందింది లేదు. ఎంత మంది రైతులకు అందిదో, లేదో అర్దం కావడం లేదు. ఏ రైతును అడిగినా నాకు మాత్రం రైతు బంధు రాలేదనే అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు మాత్రం నిత్యం అబద్దాలు చెబుతున్నారు. రైతుబంధు వేస్తున్నామని చెప్పి, మాయ మాటలు ఇంకా చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. రైతులను అడుగడుగునా ఆగం చేస్తూనే వున్నారు. దాంతో రైతు బంధు అందక, పంటలు పండక, సాగువాటు చేయాలంటే రైతుకు ధైర్యం చాలడం లేదు. కన్నీటి వ్యవసాయం చేయాల్సిన పరిస్దితి వస్తోందని గొడగొడ ఏడుస్తున్నాడు. ఇటు రైతు బంధు రావడం లేదు. అటు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. మళ్లీ కాంగ్రెస్‌ పాత రోజులు తెచ్చిందని రైతులు గొడగొడ ఏడుస్తున్నారు. కేసిఆర్‌ పాలనలో పదేళ్లు పండగ చేసుకుంటే, ఇప్పుడు దండుగౌతుందని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనిపించడం లేదు. రైతులకు సాగుకు సరిపడ నీళ్లియ్యాలన్న సోయి ఒక్కరిలో కూడా లేదు. కాంగ్రెస్‌ నాయకుల్లో కూడా ఎంతో మంది రైతులున్నారు. వాళ్లు కూడా తమ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఏడాదిలో ఇలా జరగడానికి పాలక పెద్దలే అని నిందిస్తున్నారు. ప్రజల్లోకి మళ్లీ ఎలా వెళ్లాలని ముఖాలు దాచుకుంటున్నారు. ప్రజలకు ముందుకు వెళ్లలేక ముఖం చాటేస్తున్నారు. రైతులకు ఎదురుపడితే ఎక్కడ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారో అని కళ్లాల దగ్గరికి కూడా వెళ్లలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను కోరి తెచ్చుకుంటే కరువు వచ్చిందంటున్నారు. పాపం కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటే శాపం చుట్టుకున్నది రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. మళ్లా కాంగ్రెస్‌కు జీవితంలో ఓట్లు వేయమని అంటున్నారు. మరో యాభై ఏళ్లయినా కాంగ్రెస్‌ ముఖం చూడమంటున్నారు. ఇక కలలో కూడా బిఆర్‌ఎస్‌ వదులుకోమంటున్నారు. కేసిఆర్‌ను మళ్ల ముఖ్యమంత్రిని చేసుకుంటామంటున్నారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు స్వచ్చందంగా వచ్చి రైతులోకమంతా కేసిఆర్‌కు మద్దతు ప్రకటిస్తామంటున్నారు. పల్లెల్లో ఇండ్లలో ఎవ్వరం వుండం..అందరం కేసిర్‌ సభకే పోతామంటున్నారు. కేసిఆర్‌ మీద రైతులకు వున్న ప్రేమను చాటుకుంటామంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి పంపిణీ.!

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా. తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి.

 

MLA

పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి…

ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్వామి,సారంగారవు, అమర్నాథ్ రెడ్డి.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలు గత నెలలో ముగియడంతో ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ గౌరవ అధ్యక్షులుగా పిలుమాల్ల గట్టయ్య(మెట్రో ఈవినింగ్), గౌరవ సలహాదారులు గా కలువల శ్రీనివాస్ (జర్నలిస్టు దినపత్రిక)ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు ఆరెంద స్వామి(సిటీ కేబుల్),ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు (జనం సాక్షి), కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి(వుదయం )లకు పదవీ బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాంగారపు గౌతమ్ ( ప్రజా పక్షం), ప్రచార కార్యదర్శి ఆరెల్లి గోపి కృష్ణ( మన సమాజం),ఉపాధ్యక్షులు నాంపల్లి గట్టయ్య( నేటి ధాత్రి), ఎం వేణుగోపాల్ రెడ్డి( వాస్తవం), కొండ శ్రీనివాస్ ( మనతెలంగాణ),కార్యనిర్వాహణ కార్యదర్శి పి రాజేంద్ర ప్రసాద్ (తెలంగాణ గళం),సహాయ కార్యదర్శులు ఎన్ శ్రీనాథ్ (సూర్య ) పి గంగులు యాదవ్ (సామాజిక తెలంగాణ) లు నూతనంగా ఎన్నికయ్యారు. క్లబ్ సభ్యులుగా ఎం ప్రవీణ్, కె సదానందం, ఎం రవీందర్, డి స్వామి, డి వెంకటస్వామి లు ఉన్నారు. సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం తో పాటు పలు అంశాలను చర్చించారు. నూతన కమిటీని శాలువాలతో సత్కరించారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి లు మాట్లాడారు. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి ని సమిష్టిగా కలిసి మెలిసి పని చేసి ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. ప్రెస్ క్లబ్ నియమనిబంధనలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాటించాలని, నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో.!

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన నాయకులు
మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ ఉప, సర్పంచ్
కక్కిరాల పల్లిలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

ఐయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ మోసపూరిత కాంగ్రెస్ మాటలు విని మేం మోసపోయామని ప్రజలు అంటున్నారని,కెసిఆర్ ఒక విజన్ తో పని చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ప్రజలను ఆగం పట్టిస్తున్నారని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయని వారు అన్నారు.వీరితోపాటు బీ. ఆర్. ఎస్ పార్టీలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు,ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీష్, జోగు రమేష్, గుబ అరుణ్ కుమార్, కోల శ్రీనివాస్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, ఆరూరి అనిత ఇంకా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు పార్టీలో చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపల్లి చందర్ రావు మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇంచార్జ్ గుజ్జ గోపాలరావు, నాయకులు పల్లకొండ సురేష్, గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అల్లం సోమయ్య, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల దేవదాస్,దుప్పెల్లి కొమురయ్య, గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా.

 

MLA

తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి. పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

భూ-భారతి చట్టంపై నిర్వహించే.!

భూ-భారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సు వాయిదా
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఈనెల 23న నిర్వహించాల్సిన భూ-భారతి చట్టం అవగాహన సదస్సును అనివార్య కారణాల వలన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు ఈనెల 24న నిర్వహించనున్నట్లు తహసిల్దార్ జాలీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మండలంలోని రైతులు ఇట్టి విషయాన్ని గమనించి ఈ నెల 24న మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించే భూ-భారతి చట్టం అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై, వారికున్న భూ సమస్యలను నివృత్తి చేసుకోగలరని ఆమె తెలిపారు.

పరకాల 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

పరకాల 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

 

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలో మంగళవారం రోజున ఎల్తూరి సంమృత వర్ధన్(చిన్ను)ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ని మాజీ శాసనసభ్యులు మోలుగూరి బిక్షపతి,క్రాంతి కుమార్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యాడా శ్రీనివాస్ లు ప్రారంభించారు.అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించి ఆటను ప్రారంభించారు.

 

Cricket Tournament

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి శారీరికంగా స్నేహభావంతో ఆడుకోవాలి గెలుపు ఓటుములు సహజంగా తీసుకోవాలి మంచిగా ఆట ఆడిన వారికి జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో సెలక్షన్లు అయినప్పుడు తప్పకుండా తగిన గుర్తింపు వస్తుందన్నారు.అందుకే ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆట ఆడి సాధించాలి అప్పుడే వారికి తగిన గుర్తింపు ఊరుకో జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆటలు ఆడాలని అన్నారు.ఈ కార్యక్రమం మాజీ కోఆప్షన్ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,సమన్వయ కమిటీ నాయకులు దుబాసీ వెంకటస్వామి,కొలనుపాక సిద్దు,మంద టునీట్,జిల్లెల్ల వినయ్,వినాయక హాస్పిటల్ యజమాన్యం,దార సతీష్,ఏకు లడ్డు,మడికొండ లడ్డు,అఖిల్,ప్రణయ్,రమెష్ తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

వివాహా వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

ముసాపెట్ మండలం.మహ్మద్ హుసేన్ పల్లి గ్రామాని కి చెందిన మాజీ సర్పంచ్ నిర్మల కాశీ నాథ్ సాగర్ సోదరుడు వెంకటయ్య కుమారుడు శేఖర్ దీపిక వివాహా వేడుకలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గొల్ల శేషయ్య సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ చెన్నారెడ్డి బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఉన్నారు

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం.

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం

సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని

సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకు వరంగల్ మారిందని

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దారకొండ నాగరాజు నివాసంలో గ్రామానికి చెందిన నాయకులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

భూభారతి చట్టంతోభూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.!

భూభారతి చట్టంతోభూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

 

 

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికను మంగళవారం రోజున భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉందని.పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి వంటి చట్టాలు దరిద్రంగా మారిందని, ధరణితో అధికారులకి.. అధికారాలు లేకుండా పోయాయన్నారు. ధరణి వల్ల ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొచ్చారన్నారు. భూ భారతి చట్టం ప్రకారం.. భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

opportunity


ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా గతంలో మాదిరిగా రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించామని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్‌ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రస్తుత చట్టంలో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అదనపు కలెక్టర్ అశో,క్ డి ఆర్ డి ఎ పి డి నరేష్, తాసిల్దార్ హేమ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా అధికారులు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి కాంగ్రెస్ నాయకులు దొడ్డికిష్టయ్య బుర్ర లక్ష్మణ్ గౌడ్, మధు వంశీకృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version