ఛలో వరంగల్ కు లక్షలాదిగా తరలివెళ్దాం
రణ యోధుడు రజతోత్సవ సభకు ఊరూ,వాడ ఏక మవుతున్నాయి
శాయంపేట నేటిధాత్రి:
ఛలో వరంగల్ కు లక్షలాదిగా తరలి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామ ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్ల కెసిఆర్ పాలల్లో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగా కేవలం 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు భరించ లేకపోతున్నారు.

గులాబీ దండు కేసీఆర్ దళం బీఆర్ఎస్ సైనికుల వెన్నంటి ఉంటా ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటా అన్నారు.రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. పోలీసులు రాజ్య మేలు తున్నారు . ఏప్రిల్ 27న ఎల్క తుర్తి బీఆర్ఎస్ సభకు నాయకులు తరలిరావాలని కోరారు.జరగనున్న రజతో త్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి దిశా నిర్దేశం చేయను న్నారని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని గోవిందాపూర్, పెద్దకోడేపాక,జోగంపల్లి ,మైలారం, ఆరేపల్లి గ్రామాలలో బీ ఆర్ఎస్ పార్టీ రజోత్సవసభకు కార్యకర్తలను సమయత్వం చేస్తూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆహ్వానిస్తూ పర్యటించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు , అన్ని గ్రామాల కార్యకర్తలు టిఆర్ఎస్ అభిమానులు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీ సీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.