అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న రామగిరికృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. డాక్టర్. ఏ శ్రీనివాస్ హెడ్ కెవికె. డాక్టర్ అర్చన ఎస్ఎంఎస్ అనిమల్ హస్బండ్రీ. డాక్టర్. నీరజన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐ సి ఏ ఆర్ హైదరాబాద్. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ. ఐటి శాఖ మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు సాధారణంగా ఎప్పుడు వేసి వరి పంట కాకుండా ఇతర కూరగాయలు . మరియు చిరుధాన్యాలు పప్పు దినుసుల పంటలు సాగు చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జించి ఆర్థికంగా ఎదగాలని మరియు పెరటి కోళ్ల పెంపకం. పౌల్ట్రీ ఫార్మ్స్ ద్వారా. మరియు గొర్రెలు, ఆవులు, బర్రెలు. పెంచి వాటి ద్వారా ఆర్థికంగా రైతు లాభం పొందవచ్చని ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామాన్ని మూడు సంవత్సరాలు దత్తత తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు శ్రీనివాస్ తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలేఖ , సెక్రటరీ మల్లేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ చిగురు స్రవంతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, సింగల్ విండో డైరెక్టర్ పోతు పెద్ది రమణారెడ్డి.రైతులు మహిళా రైతులు పాల్గొనడం జరిగింది.
తొర్రూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:
ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు స్పష్టం చేశారు. తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..
అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..
కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు..
పట్టాల పంపిణీ అనంతరం, ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి మండలంలో పథకాల అమలు, నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు..
*మొగుళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి కాలేదు ఎండలు బాగా ఉండటంవల్ల వడదెబ్బ తలిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదేవిధంగా వర్షాలు కూడా అధికముగా పడడం వల్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి మలేరియాl, డెంగ్యూ ,చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి తగిన సూచనలు ఇవ్వాలని వైద్యాధికారి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సునీత, జమున, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నేస్తం (ఎపిసోడ్-56) కార్యక్రమానికి శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గారు, శ్రీ.. నేరెళ్ళ రమేశ్, ADA, భూపాలపల్లి , శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక లో రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. బి. గోపి, డైరెక్టర్ ఒఫ్ అగ్రికల్చర్ శ్రీ.ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు ప్రసంగం చేయడం జరిగింది, వానాకాలనికి అనువైన సన్న వరి ధాన్యం రకాల గురుంచి చర్చించడం జరిగింది, వాతావరణ ఆధారిత వానాకాల వ్యవసాయం పై రైతులకు సలహా ఇవ్వడం జరిగింది, అలాగే “నాణ్యమైన విత్తనం” నిర్వహణపై చర్చించడం జరిగింది, రైతు నేస్తం కార్యక్రమంలో శ్రీ. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వైస్ ఛాన్సలర్, PJTAU గారు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్యవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆయా రైతు వేదికల ద్వారా “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం” అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగింది. మొగుళ్ళపల్లి మండలానికి సంబంధించి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం” అనే కార్యక్రమంలో వరి రకం WGL-962 మరియు పెసర రకం MGG-385 అనే విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ” కార్యక్రమంలో శ్రీ. నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి , శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి గారు, శ్రీ. బైరి రాజు, PJTAU శాస్త్రవేత్త, స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.
గార్ల :-పాఠ్య పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైనా మా దగ్గరే కొనాలి..! లేకుంటే అనుమతించేది లేదు..,అంటూ ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అడ్డంగా దోచుకుంటున్నాయి. ప్రతీది వారి వద్దే కొనాలని షరతులు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం పాఠశాలలను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. వారు నిర్ణయించిందే ధర. వర్క్ పుస్తకాలు..,నోటు పుస్తకాలు.., డ్రాయింగ్ బుక్స్..,అంటూ బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు వసూలు చేస్తున్నారు. అయినా విద్యాశాఖ నోరు మెదపడం లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్.., జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై దోపిడికి తెగబడుతున్నాయి. పుస్తకాల నుంచి సాక్సుల వరకు విద్యార్థులకు ఏది అవసరమైన మా దగ్గరే కొనాలి…! అంటూ హుక్కుం జారీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను బహిరంగంగానే పీల్చి పిప్పి చేస్తున్నాయి. వారు చెప్పిందే ధర. బయట మార్కెట్ లో కొన్న పుస్తకాలకు నో పర్మిషన్.., లేకుంటే క్లాస్ లో నుమతించేది లేదని తెగేసి చెప్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్లకు కనిపించడం లేదు. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం సిండికేటై పాఠశాలలో విక్రయిస్తున్న స్టేషనరీ ధరలు ఇలా ఉన్నాయి. యూని ఫాం (ఒకజత) రూ.1500 నుంచి రూ.3000, బెల్ట్ రూ.150 నుంచి 200, టై రూ.100, బ్యాగు రూ.600 నుంచి రూ. 800, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ రూ. 4000 నుంచి రూ.6000 వరకు విక్రయినున్నారు. ఇవి చాలదన్నట్లు వర్క్ బుక్ ల పేరుతో రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీది ఇక్కడే కొనాలన్న నిబంధనలు విధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికి కనీస చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. దీనికి సంబంధించి వారి విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వ మండల విద్యాధికారి అనుమతి ద్వారా పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఆ రేట్లకే అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్యపుస్తకాలకు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి నగదు వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలల యాజమాన్యాలు వేలాది రూపాయల ఫీజుల భారం మోపుతున్నాయి. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ల్యాబ్, ట్యూషన్, స్పోర్ట్, స్పెషల్ డేస్, కమ్యూ నికేషన్ ప్రోగ్రాం ఫీజులంటూ ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న యాజమన్యాలు మళ్లీ పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, షూ అంటూ అందిన కాడికి అందినంత దోచుకుంటున్నాయి.
కనిపించని మౌళిక వసతులు….!
Government Subjects.
జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. పూర్తిస్థాయి మౌలిక వసతులున్న పాఠశాలలను వేళ్లమీదే లెక్కపెట్ట వచ్చు. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. విద్యార్థులకు సరిపడా ఆటస్థలాల కొరత, తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ, అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇలా అరకొర వసతులతో పాఠశాలలు నిర్వహిస్తున్నా ఫీజుల వసూళ్లలో మాత్రం పోటీపడి మరీ వసూలు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పుస్తకాల దోపిడీ అదనంగా ఉంటోంది. పెద్ద తరగతులకు నోటు పుస్తకాల ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుందనుకున్నా..,గరిష్టంగా రూ.1500 మించి ఉండదు. అన్ని కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేలు పుస్తకాల ఖర్చు సరిపోతుంది. అయితే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరల వసూలు చేస్తుండగా, పెద్ద తరగతులకు రూ.8 వేలు నుంచి రూ.10 వేలవరకు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. తమ పిల్లల్ని ఎక్కడ వేధిస్తారోననే భయంతో తల్లిదండ్రులు ప్రశ్నించడం మానేశారు. ఇది ఆసరాగా చేసుకున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వహకులు దోపిడీని పెంచారు.
విద్యాశాఖ అధికారుల తనిఖీలు నిల్…!
వాస్తవానికి ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు నిషేధం. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి పుస్తకాల అమ్మకాలను అడ్డుకోవాల్సి ఉంది. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే విద్యాసంస్థల నిర్వా హకులు బహిరంగానే పుస్తకాల ధరలను ప్రకటిస్తున్నాయి. ఏ తరగతికి ఎంత చెల్లించాలి? నోట్ పుస్తకాలకు ఎంతా?, బెల్టుషూ వంటిది ఎంతా?.. ధరలు నిర్ణయించి వసూలు చేస్తు న్నాయి. ప్రతి వస్తువు కొనుగోలుకు రసీదు ఇవ్వాలన్న నిబంధన తూట్లు పొడిచి తెల్లకాగితంపై రేట్లు వేసి దోచుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ తో పోల్చితే ఈ ధరలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. నిర్దిష్ట గడువు నిర్ణయించి పుస్తకాలు కొనుగోలు చేయాలని లేకుంటే క్లాస్ లోకి అనుమతించేది లేదని చెబుతున్నాయి. ఇవేమీ అధికారులకు కనిపించడం లేదు. నిర్దిష్టమైన ఫిర్యాదులు అందలేదని సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాల దోపిడీ యధేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.
11 కె.వి విద్యుత్ వైర్ పంట పొలాలలో యమ పాశాలుగా తయారయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 11 కె.వి విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నాయి. ఈ సందర్బంగా బాధితుడు మాట్లాడుతూ.. ప్రమాదం ఏ విధంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కింది నుండి చేయి చాచితే చేయికి వైర్లు తగులుతున్నాయన్నారు. ఈ విషయమై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. దీని పై సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్ర:
ఝరాసంగం మండల పరిధిలోని గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి బర్దిపూర్ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రం – రాజేంద్రనగర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ హాజరై ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పెసర రకం MGG-295 మరియు కంది WRGE-96 రకాల యొక్క లక్షణాలు మరియు పంట సాగు మెలకువలపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు.ఈ విత్తనంతో అభ్యుదయ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సాగుచేసి వచ్చే దిగుబడిని తిరిగి ఆయా గ్రామాలలోని రైతాంగానికి విత్తన రూపంలో సరఫరా చేయాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమం కింద ఝరాసంగం మండలానికి MGG-295 అనే పెసర రకం 80 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) అలాగే WRGE -97అనే కంది రకం మన మండలానికి 50 కిట్లు (ఒక కిట్టు 3 కిలోలు) కేటాయించడం జరిగింది అని తెలిపారు. పంట పూర్తి కాలంలో వివిధ దశల్లో క్షేత్ర సందర్శన నిర్వహిస్తామని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఝరాసంగం చైర్మన్ గౌస్ ఉద్దీన్ మాజీ ఎంపీటీసీ శంకర్ పటేల్, మల్లన్న పటేల్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, హరికృష్ణ, ఙ్ఞానం, రేణుక వేదవతి, భారతి మరియు రైతులు మల్ల రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
— భూ భారతి లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి • తహసిల్దార్ శ్రీనివాసులు
నిజాంపేట: నేటి ధాత్రి
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని మండల తాహసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో తమ గ్రామాల్లోకి అధికారులు వచ్చి భూ సమస్యల పరిష్కారానికి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు భూ సమస్యల గురించి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మండల స్థాయి సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సులో ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారులు గ్రామంలో అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ రమ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ధరణి ఆపరేటర్ రాజు, సిబ్బంది కళ్యాణ్, నవీన్, గ్రామ ప్రజలు ఉన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అధికారుల సమక్షంలో నిర్వహించారు.భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ 6 వేల మంది సర్వేయర్లను నియమించి ప్రజల భూ సమస్యలను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎంపీఓ తిరుపతి బాపూరావు, ఎస్సై జాడి శ్రీధర్, పంచాయతీ సెక్రెటరీ సురేష్ ఇతర సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాలు సమావేశం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొందరు ముస్లిం ముకలు గోవుల అక్రమ రవాణా గోవధ నిర్వహిస్తున్నారని,సమాచారం మేరకు,మెదక్ విభాగ్ కార్యదర్శి గ్యాదరి రాజారాం పై 14 మంది హిందూ బంధులు అడ్డుకుంటే ముస్లిం ముకలు వారిపై విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగినట్టు తెలిపారు.ఆ దాడులను ఖండిస్తూ రాజారాం కు ఎలాంటి హాని తలపెట్టిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుందని అన్నారు.దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై దాడులకు,ప్రతి దాడులకు హిందూ సమాజం సిద్దంగా ఉంది అని, తెలియజేస్తూ ఖబర్దార్ మతోన్మాద శక్తుల్లారా, ఖబర్దార్,అంటూ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి కర్ణ కంటి రవీందర్,రాష్ట్రీయ హిందూ పరిషత్ లీగల్ అడ్వైజర్ కొట్టినటేశ్వర్,వి హెచ్ పి కోశాధికారి బైరి విష్ణు దాస్,సందేశ్గుప్తా,శివాజీ సేన ఉదేయ్,శ్రీకాంత్,సంతోష్,బద్రి నారాయణ,వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుణ్ణి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, ప్రజా క్షేత్రంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సిబ్బంది పని తీరును, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3వ తేది నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్ కు సిఫారసు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లు నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో నమోదు అయిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేసి వచ్చిన దరఖాస్తును రిజిస్టర్ లో నమోదులు చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలు సహాయక కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు పొందాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు చేరుకున్న లారీ యజమానుల రిలే నిరాహార దీక్ష
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిఐ గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్ట కొడుతున్న సిసిఐ అధికారులు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ చేపట్టే చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. లేనిపక్షంలో ఈ దీక్షను ఇంకా ఉదృతం చేసి మాకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని లారీ యజమానులు తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం కొత్తపేట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ ను ప్రారంభించి, సబ్సిడీ ద్వారా కుట్టు మిషన్లు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్రను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో సమానంగా ప్రోత్సహించాలన్నారు. గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత కూడా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు వద్ద మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ప్రజా ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాలను ఎంపిక చేసుకొని గ్రామాల్లో ఉన్న మహిళల సాధికారత కోసం పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మారేపల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, గ్రామ స్వరాజ్య సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పప్పుల సుధాకర్ తల్లూరి సలేందర్ కుమార్ కో-ఆర్డినేటర్ వట్టెం రాములమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామాలలో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అవగాహన సదస్సును మంగళవారం తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రజల నుంచి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను భూభారతి అవగాహన సదస్సు ఫారంలో రైతు పేరు గ్రామం పేరు రెవెన్యూ శివారు పేరు.
సర్వేనెంబర్, భూమి విషయంలో ఎదుర్కొంటున్న సమస్య తదితర వివరాలు పొందుపరచాలన్నారు.
రెండు భూభారతి రైతుల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు రెండు రెవెన్యూ గ్రామంలో భూభారతి రైతు అవగాహన సదస్సు ఉంటుందన్నారు.
మండలంలోని ఆయా గ్రామాలలో భూముల సమస్యలు నెలకొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలో షేక్ సోహెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల శివారులోని శ్రీ కితకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఝరాసంగం జరిగిన వేడుకల్లో మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ఫారూఖ్ పటేల్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
గుడుంబా స్థావరం పై రైడ్ చేసిన పోత్కపల్లి పోలీసులు..
గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు…పోత్కాపల్లి ఎస్సై దీకొండ రమేష్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల లోని కొలనూరు గ్రామం లో పోత్కపల్లి ఎస్సై దీీకొండ రమేష్ సిబ్బందితో కలిసి గుడుంబా స్థావరంపై రైడ్ చేసి 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం మరియు 5 లీటర్ల గుడుంబా ను పట్టుకొని దానిని తయారుచేసిన బోదాసు పద్మ భర్త పేరు సదయ్య వయసు 40 సంవత్సరాలు కులం వడ్డెర కొలనూరు గ్రామం అనే ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ సెల్ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు, హెడ్ కానిస్టేబుల్ కిషన్, కానిస్టేబుల్స్ రాజేందర్ రాములు పాల్గొన్నారు.
#ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానోపాధ్యాయుడు ఉడత రాజేందర్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుతూ ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్ ,సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి 3కోడిగుడ్లు ,నాణ్యమైన ఉచిత విద్య, వెనుకబడిన విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన, అర్హత గల ఉపాధ్యాయులచే విద్య బోధన చేయడం జరుగుతుందని. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తల్లిదండ్రుపై ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఈర్ల సుమలత, అంగన్వాడి టీచర్ రజిత ,ఆశ కార్యకర్త జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పోరిక రవికుమార్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఊరటీ నరేష్, గ్రామస్తులు లింగారెడ్డి , ముకుంద రెడ్డి, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్నీ నియమించాలి
ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎం ను నియమించాలి
నడికూడ,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం మిగులు టీచర్లను సర్దుబాటు చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన అశాస్త్రీయంగా ఉన్న ఈ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలనీ పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎందుకంటే బడిబాట తర్వాత నమోదు అయిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయాల్సిన ఉపాధ్యాయుల సర్దు బాటును బడి బాటకు ముందు ఎలా చేస్తారు.
ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి అని,అరవై మంది విద్యార్థుల వరకు ఇద్దరే ఉపాధ్యాయులు పద్దెనిమిది సబ్జెక్టులు ఎలా బోధించడం సాధ్యమవుతుంది.
ప్రైమరీలో సబ్జెక్టులు లేదనే భావన అధికారుల్లో ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించాలి.అదే ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు లేకున్నా సబ్జెక్టు ఒక టీచర్ ను నియమిస్తారు.
ఇక్కడే అర్థమవుతుంది ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పట్ల ఉన్న వివక్షత.
ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో అదే విధంగా ఉన్నత విద్యకు కూడ ప్రాథమిక విద్య అంతే ముఖ్యమని ప్రభుత్వం తెలుసుకోవాలి.
అప్పుడే ప్రాథమిక విద్య మెరుగై ఉన్నత విద్యలో సత్ఫలితాలను అందిస్తుంది.
ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం నిర్వహించడానికి, గుణాత్మకమైన విద్య అందించడానికి ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయులు, తరగతికి గదికి ఒక ఉపాధ్యాయున్ని కేటాయించకుండా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు పేరుతో ఏకపక్షంగా తీసేస్తే ఆ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం మరియు గుణాత్మక విద్య అనేది ఎలా సాధ్యమవుతుంది.
ఒకవేళ ఈ ప్రజా ప్రభుత్వం కనుక బడుగు బలహీన వర్గాల పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి.
ఇప్పుడిప్పుడే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు నడిపిస్తున్న సమయంలో మీరు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టే విధంగా తీసుకొచ్చిన ఈ ఉత్తర్వులను వేంటనే రద్దు చేయాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.
మిగులు టీచర్లున్నట్లు జూన్ మాసంలోనే ఎలా తెలుస్తుంది.
చాలా ప్రాంతాల్లో సర్కారు బడుల్లో విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తున్నారు.
మేం ఇంటికి తిరిగి పిల్లల నమోదును పెంచేందుకు ప్రయత్నింటే,అధికారులేమో బడుల్లో టీచర్లు లేకుండా చేస్తున్నారు.
పిల్లలు చేరిన తర్వాత బడుల్లో టీచర్లులేకపోతే ఎలా..?
జులై, ఆగస్టు మాసాల్లో చేయాల్సిన సర్దుబాటును జూన్లోనే చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముందస్తు బడిబాట మరియు రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలల్లో స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన గుణాత్మకమైన విద్య,ఆంగ్ల భాషలో బోధనతో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు భరోసానిచ్చి పాఠశాలలో విద్యార్థులను నమోదు చేయిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం అనేది ప్రాథమిక పాఠశాలల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్మ వైఖరికి నిదర్శనంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
ఈ అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులు వెనుకకు తీసుకోవాలని నడికూడ మండల శాఖ పక్షాన కోరుచున్నాము.
బడిబాట ముగిసిన తర్వాత జులై మాసంలో సర్దుబాటు చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.