కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా SP శ్రీ వైభవ్ గైక్వాడ్ ips.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి లోని పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం సుమారుగా 11:00 గంటల సమయంలో నాగర్ కర్నూలు జిల్లా SP ఎవరికీ ఎటువంటి సమాచారం లేకుండా, ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ లలో భాగంగా జిల్లా SP పోలీస్ స్టేషన్ లోని వివిధ రికార్డు లను పరిశీలించడం జరిగింది..ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ రిజిస్టర్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చే పిటిషన్ లను నమోదు చేస్తున్నారా లేదా రోజుకి ఎన్ని పిటిషన్ లు వస్తున్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అని రిసెప్షన్ women constable శ్రీమతి మహాలక్ష్మి అడిగి తెలుసు కొని తగు సూచనలు ఇవ్వడం జరిగింది..
తదుపరి పోలీస్ స్టేషన్ లాక్ అప్ రూమ్ ని పరిశీలించడం జరిగింది.. లాకప్ రూమ్ ని ఏవిదంగా నిర్వహిస్తున్నారు అని డ్యూటీ లో వున్న హెడ్ కానిస్టేబుల్ ని అడిగి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది… పోలీస్ స్టేషన్ లోని ASI ల తో మాట్లాడుతూ సరిగ్గా name plate,యూనిఫామ్ సరిగ్గా లేనందున వారికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది డ్యూటీ లో వున్న ప్రతి ఒక్కరు యూనిఫామ్ ని సరిగ్గా సరియైన విధంగా నిబంధనలకు అనుగుణంగా ధరించాలని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తదుపరి CI. నాగార్జున, DSP వెంకటరెడ్డి గారితో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన దొంగతనాల ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది అని తెలుసుకున్నారు.. పట్టణం లో జరిగిన దొంగతనాలను చేధించి, దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ చేయాలనీ సూచించారు. మరియు పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశీలించి వర్షాకాలంలో పెరిగే పిచ్చి మొక్కలను తొలగించి, దోమలు లేకుండా చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు..కల్వకుర్తి పట్టణం శరవేగం గా అభివృద్ధి చెందుతున్న పట్టణం ఇందులో కాలనీ లు పెరుగుతుండడం తో కొన్ని కాలనీలు దూరంగా ఉండి జనసంచారం తక్కువగా వున్న ప్రాంతాలలో తప్పకుండ ఆయా కాలనీ ప్రజలు, కాలనీ సంఘాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.