నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు.

నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు..

ఎస్సీల స్మశానవాటిక కబ్జా చేసిన వైనం

భూకబ్జాదారులను కఠినంగా శిక్షించాలి:ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్..

జాతీయ రోడ్డుపై దళితుల ధర్నా..రెండు కిలోమీటర్ల మేర స్థంబించిన ట్రాఫిక్..

న్యాయం చేస్తామన్న ఎస్సై హామీతో ధర్నా విరమణ

వరంగల్ నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నాగయ్యపల్లెలో కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు భూకబ్జాదారులుగా అవుతారమెత్తి రెచ్చిపోయారు.ఏకంగా ఎస్సీల స్మశాన వాటికనే కబ్జా చేశారు.సర్వే నెంబర్ 931లో దాదాపు రెండు ఎకరాల భూమిలో ఆది నుంచి గ్రామంలోని మాదిగ కులస్తులు స్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని సమాధులు నిర్మించారు.ఈ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన పోగుల మహేందర్ రెడ్డి,పోగుల బ్రహ్మయ్య,పోగుల కైలాసం,పోగుల సురేందర్ అను వ్యక్తులు మంగళవారం గుర్తుతెలియని రెండు జెసిబిలను తీసుకువచ్చి సమాధులను తొలగించి స్మశానవాటికలోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేశారని :ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆరోపించారు.కబ్జా పట్ల పోలీసు అధికారులకు,రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన స్మశానవాటిక భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకాలను శాంతింపజేసి కబ్జాదాలపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు బాగాజీ రజనీకాంత్,జినుక అశోక్,మాదాసి ప్రభాకర్, మాదాసి ఎర్ర సూరయ్య,మాదాసి కృష్ణ, మాదాసి సాంబయ్య,మాదాసి సుధాకర్,సంగి యాకయ్య,గిన్నారపు భాస్కర్, మాదాసిరాజు,మాదాసి మల్లయ్య,మాదాసి రాహుల్ తదితరులు పాల్గోన్నారు.

వివాహ వేడుక లో టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్.

వివాహ వేడుక లో టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణం లోని శుభం కన్వెన్షన్ హాల్లో షీలా రమేష్ గారి కూతురి వివాహ వేడుకలో పాల్గొని అక్షంతలు వేసి నూతన వధువు వరులకు శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కుచ్చుబుద్దీన్ బిజీ సందీప్ రేవనప్ప శంకర్ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.

బిజెపి మండల కమిటీ ఎన్నిక.

బిజెపి మండల కమిటీ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీని మండల అధ్యక్షుడు నర హరిశెట్టి రామకృష్ణ ప్రకటిం చడం జరిగింది.ఈ కమిటీలో ప్రకటించిన వారు మండల ఉపాధ్యక్షులుగా పోల్ మహేందర్, రేణుకుంట్ల చిరంజీవి, కోమటి రాజశేఖర్, లావుడియా జ్యోతి, మండల ప్రధాన కార్యదర్శులుగా మామిడి విజయ్, భూతం తిరుపతి, కార్యదర్శులుగా మేకల సుమన్, కొంగర భారతి, వంగరి శివశంకర్, జున్నుతుల జీవన్ రెడ్డి, కోశాధికారిగా కుక్కల మహేష్ బిజెపి మండల కమిటీని ఎన్ను కున్నారు ఎన్నుకున్న మాట్లాడుతూ కమిటీ సభ్యులు భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని మండలంలో విస్తరింప చేస్తా రని రానున్న రోజుల్లో భారతీ య జనతా పార్టీ గెలుపు కొర కు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్య క్షులు ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

 

 

పట్టణం లోని శుభం కన్వెన్షన్ హాల్ లో జరిగిన మహిళ నాయకురాలు షీలా రమేష్ గారి కూతురి వివాహా వేడుకల్లో కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు శ్రీ కొన్నింటి మాణిక్ రావు, మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ స్రవంతి రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,యువ నాయకులు మిథున్ రాజ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప , వెంకట్ ,దీపక్, శంకర్ పటేల్ ,నర్సింహ రెడ్డి,రేవనప్ప తదితరులు.

గుంతలు పూర్తిగా పూడ్చని వైనం ప్రమాదాలకు నిలయం…

గుంతలు పూర్తిగా పూడ్చని వైనం -ప్రమాదాలకు నిలయం…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

 

 

బయ్యారం మండల పరిధి నామాలపాడు నుంచి కాచన పల్లి రహదారి మార్గం పక్కన కేబుల్ కోసం తవ్విన గుంటలు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.

గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ లైన్ వేయడం కోసం యంత్ర సాధనాలతో తీసిన గుంతలు పుడ్చకపోవడతో రహదారి ప్రయాణికులకు, పశువులకు ప్రమాదంగా మారి సతమతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అసంపూర్తిగా ఉన్న గుంటలలో ద్విచక్ర వాహనాలు, వాహనదారులు,మూగ జంతువులు పడి ప్రమాదాలకు గురి అవుతున్నాయి.

ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి.

BSNL tower

 

గుత్తేదారు గుంతలు పూడ్చకపోవడం ద్వారానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు చోరువచూపి ప్రమాదాల బారిన పడకుండా కేబుల్ కోసం వేసిన గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చుతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ…

సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ…

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురిజాల రవీందర్ రావ్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, క్యాతనపల్లి మాజీ సర్పంచ్ గురిజాల రవీందర్ రావ్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సివి రామన్ పాఠశాలలోఅడ్వకేట్ కస్తూరి శ్రీనివాస్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి లో ఓపెన్ కాస్ట్ గనులు వచ్చి ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేస్తదని నేను ఓపెన్ కాస్ట్ ను వ్యతిరేకిస్తే నా ఉద్యోగాన్ని సంస్థ తీసివేసింది అని అన్నారు.సింగరేణి కార్మికులు,కార్మికేతరులు, చిరు వ్యాపారుల కొరకు అనేక ఉద్యమాలు చేశానని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ పట్టణం కనుమరుగవుతుందేమోనని బాధను వ్యక్తం చేశారు.135 సంవత్సరాల చరిత్ర కలిగి,అత్యధిక కార్మికులు సింగరేణి సంస్థ లో పని చేసే వారని గుర్తు చేశారు.అత్యధిక ఉత్పత్తి, ఉత్పాదకత సింగరేణి సంస్థ సాధించి తెలంగాణకు ఒక ఆయువుపట్టుగా నిలిచిందని అన్నారు.మందమర్రి ఏరియాలో మ్యూజియం ఏర్పాటు చేస్తే అధికారుల, కార్మికుల ఫోటోలు, ప్రతి ఒక్కరి ఫోటోలు, సంస్థలో వాడే వస్తువులు మ్యూజియంలో ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు చూసుకునే అవకాశం ఉంటది కాబట్టి మ్యూజియం అవసరం అని, కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కలిసొస్తాయని అన్నారు.సింగరేణి లో నాటిన మొక్కలు మరెక్కడా నాటలేదని అన్నారు.కొత్తగూడెం, మందమర్రి ,భూపాలపల్లి మూడు ఏరియాలలో మూడు మ్యూజియాలు ఏర్పాటు చేసేలా సింగరేణి సంస్థ చొరవ తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.దేశంలోని వివిధ సంస్థలకు మ్యూజియాలు ఉన్నప్పుడు సింగరేణి సంస్థ కు ఎందుకు ఉండకూడదని అన్నారు. మ్యూజియాలు ఏర్పాటు చేస్తే వాటి ముందు విలియం కింగ్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థను కోరుతామని అన్నారు.

వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సై..

వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సై..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని సీనియర్ ఈనాడు పత్రిక రిపోర్టర్ బైగాని వీరస్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.కాగా బుదవారం దుగ్గొండి ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు మృతిని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

మెట్ పల్లి జూన్ 4 నేటి దాత్రి

 

 

 

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదవారి సొంతింటి కల నెరవేరిన వేళ
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్లో పట్టణానికి చెందిన 33 వార్డుల ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ తో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పట్టణానికి చెందిన 33 వార్డుల్లో అర్హులైన 502 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ప్రజా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయకుండా కేవలం తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేసిందన్నారు కోరుట్ల పట్టణంలో కేవలం 80 ఇల్లు మాత్రమే మంజూరు చేయగా అది కూడా తమ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే జనాభా ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపునిండా తినాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణం కేవలం ఎన్నికల్లో ఓట్లు దండు పోవడం కోసం తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని బాండ్ పేపర్ రాసి ఇచ్చింది కానీ గెలిచిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం ఊసే లేకుండా పోయిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 నెలల వ్యవధిలోనే 6 కోట్ల 80 లక్షల రూపాయల మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణ పనులకు పునాది వేసిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వార్డు ఆఫీసర్ల కృషి అభినందనీయమన్నారు ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రత్నాకర్ రావు హయాంలో కోరుట్ల పట్టణంలో సుమారు 500 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 80 మాత్రమే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా పట్టణంలోని 33 వార్డుల ద్వారా 502 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రోస్డింగ్ పత్రాలు అందజేస్తున్నామన్నారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రాని వారు ఉంటే వారికి కూడా త్వరలోనే అందేలా కృషి చేస్తామన్నారు కోరుట్ల నియోజకవర్గం లో ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు ఎవరికి ఏ సమస్య ఉన్న నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క నూతన రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తుందన్నారు.

నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు.

నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం లో దేశాయి పల్లె బదనపల్లి తంగళ్ళపల్లి గ్రామాలలో నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని . తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి.మండల కేంద్రంలో ఇప్పటివరకు 210. ఇండ్లకు గ్రౌండింగ్ చేయడం తో పాటు పేదింటి కలల సహకారం.చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో డబుల్.బెడ్ రూమ్ పేరు మీద. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అటువంటి దానికి. తావు లేకుండా ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం. ప్రజా పరిపాలన అందిస్తుందని. గత ప్రభుత్వాలు చేసిన. అప్పులను తీర్చుకుంటూ. రేవంత్ రెడ్డి. ప్రజా పరిపాల సాగిస్తూ. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు.

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కోరుట్లలో స్వాగతం పలికిన జువ్వాడి నర్సింగ్ రావు
మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి

 

 

జువ్వాడి నర్సింగరావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
కోరుట్ల నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామికి కోరుట్ల పట్టణ సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలికి ఆరపేట గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మెట్ పల్లి పట్టణంలో గల జువ్వాడి నర్సింగ్ రావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఏర్పాటుచేసిన తేనేటి విందులో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు అనంతరం
ఆర పేటలో వై కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాలలా గర్జనలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సభ్యులు కీ”శే” గడ్డం వెంకట స్వామి చిత్రపటానికి పూల మాలాలు వేసి నివాళులర్పించి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని శాలువాతో సత్కరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మాలల గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి
విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విల్సన్

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

ఎస్సీ గురుకులాల విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధులు నుండి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ప్రధన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ డిమాండ్ చేశారు.

మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
చిట్టు పాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ముందుకు సాగుతూ ఎస్సీ గురుకుల ను దేవాలయాల లాగా వుండాలని చెప్పారు.

కానీ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఒక ఐఏఎస్ అధికారిని అయి ఉండి దళిత విద్యార్థుల పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కుల అహంకారంగా భావించాల్సిన అవసరం ఉంది అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను దళితులు పక్షాన ఉన్నాను ఉంటాను అని ఎన్నో వేదికల పైన మనకు తెలపడం జరిగింది కానీ ఇటువంటి కులహంకార అధికారుల వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి వర్షిని మాట్లాడిన మాటలు మనము గమనిస్తే విద్యార్దులే వారి టాయిలెట్లు కడిగితే తప్పేముంది అనే మాట ఏంతో విషపూరిత మాట కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటేనే వారిని తొలగించండి .

వారి మీద రాష్ట్ర ఉన్నత పోలీస్ శాఖకేసును సుమోటోగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విచారణ జరిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలి గురుకులాల సెక్రటరీ పోస్టును అర్హులైన దళిత అధికారిని వెంటనే నియమించాలి అప్పుడే మా దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా చదువుకునే విసులుబాటు అందుతుందిఅని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ టి. ఎం. ఆర్. పి. ఎస్ తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ “టెక్ బ్రిక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్”(TekBrix IT Pvt.Ltd) ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు,ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ కావడానికి అర్హతలుఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని, టైపింగ్ లో మంచి నైపుణ్యం ఉండాలని తెలిపారు. అంతేకాకుండా 25 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలని తెలిపారు. విద్యార్థులను టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందనీ తెలిపారు. జీతం నెలకు 20000 నుండి 25000 వరకు ఇవ్వబడుననీ తెలిపారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్.ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు తేదీ: 06/06/2025 అనగా శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు హజారు కాగలరు. వచ్చేటప్పుడు 2 బయోడేటా ఫామ్ లు తీసుకొని నేతాజీ డిగ్రీ కళాశాల, ఆటోనగర్ సిరిసిల్ల లో సంప్రందించగలరని కళాశాల యాజమాన్యం తెలిపారు.

మలబార్ గోల్డ్ & డైమండ్స్ ను పునః ప్రారంభించిన ఉప్పల్ శాసన సభ్యులు.

* మలబార్ గోల్డ్ & డైమండ్స్ ను పునః ప్రారంభించిన ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి

కాప్రా నేటిధాత్రి 04:

 

 

 

డీ యర్ ఏఎస్ రావు నగర్
లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్బార్ గోల్డ్ & డైమండ్స్ షో రూమ్ ప్రారంభోత్సవం నకు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తో కలసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

BRS party leaders Bandari Lakshma Reddy.

 

ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
కరోనాకాలం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ప్రధాని మోదీ
కృతజ్ఞతలు తెలిపిన ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు ప్రణయ్

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సందర్భంగా భాజాపాయనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్షాకాల దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి చేయడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు మాదాసు ప్రణయ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు మరియు రేషన్ బియ్యం తీసుకున్న పేద మహిళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. కరోనాకాలం నుండి దాదాపు నాలుగు ఏళ్లుగా ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలికారు, మోడీజీ పేదల సంక్షేమం కోసం నిరంతరం పేదల పక్షపాతిగా అనిపించుకుంటున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొన్నాల రాజు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ కోట కిరణ్ కుమార్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు తాటికాయల ఆనందం, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, మాదాసు వేణు, కట్ట విజయ్, మహేష్, లెనిన్, శివమణి, తదితరులు పాల్గొన్నారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ‌. ‌

రోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణ నూతన సీఐగా ఇటీవల విధుల్లో చేరిన పట్టణ సి.ఐ రఘుపతిరెడ్డి ని స్థానిక స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు.ఈ సందర్బంగా సి.ఐ మాట్లాడుతూ స్వచ్చంధంగా పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంధ సంస్థలకు తమ వంతు పోలీస్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో ప్రతిభా సంస్థ నిర్వాహకులు, వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వచ్చంధ వాలంటీర్ కాసుల వెంకటాచారి, గన్ మెన్ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున కవి రచయిత మ్యాదరి సునీల్ మాట్లాడుతూ గద్దర్ అవార్డులలో తెలంగాణ సినిమాకు ఆన్యాయం జరిగిందని పులి అమృత్ నిర్మించిన సలాం హైదరాబాద్ సినిమాకు ఆన్యాయం జరిగిందని తెలంగాణ సినిమా రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రొడ్యూసర్, దర్శకులు రచయిత పులి అమృత్ సలాం హైదరాబాద్ సినిమా పాటల రచయిత మ్యాదరి సునీల్ ఆవేదన వ్యక్తం చేసారు, సలాం హైదరాబాద్ సినిమా పై వరకు వెళ్లి పైనల్ గా ఈ సినిమాను పక్కన పెట్టి ఆంధ్ర సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది గద్దర్ భావజాలానికి విరుద్ధమని అమృత్ మాట్లాడుతూ ఈ సలాం హైదరాబాద్ సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటిస్తే ఈ సినిమాలో ఒక మంచి పాట రాసిన కవి రచయిత మ్యాదరి సునీల్ కి గద్దర్ అవార్డు వచ్చే అవకాశం ఉండని ఇందులో నటి నటులకు కూడా అవకాశం ఉండని పులి అమృత్ అన్నారనితెలంగాణ చరిత్ర తెలువని వారికి జ్యూరీ చైర్మన్ల అని వెంటనే తెలంగాణ చరిత్ర తెలిసిన అటువంటి మేధావులను జ్యూరి మెంబర్ గా ఏర్పాటు చేసి తెలంగాణ సినిమాలను బ్రతకనివ్వండి అని సునీల్ తెలిపారు.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట డిపో జేఏసీ విజ్ఞప్తి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జూన్ 5 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగు మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావాలని 40 వేల మంది యావత్ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహా విశేష కృషి చేశామని, గెలుపులో భాగస్వామ్యం అయ్యామని వారు గుర్తు చేశారు.

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం అయితే తమ జీవితంలో అద్భుతం జరుగుతుందని కార్మికులు ప్రతి రోజు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం అయినటువంటి ప్రభుత్వ విలీనం అడుగు దూరంలో ఆగిందని, దాన్ని కేబినెట్ సమావేశంలో “విలీనం అమలు తేదీ” ని సగర్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని వారు కోరారు.

CM Revanth Reddy.

 

 

 

మహిళా ప్రయాణీకుల కోసం ఉచిత మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.

పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని, ప్రతి నెల మహాలక్ష్మి డబ్బులతోనే ట్రెజరరీ నుండి జీతాలు సులభంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చెల్లించవచ్చని వారు అన్నారు.

విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021 మరియు 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులందరం జీవితాంతం ఋణపడి ఉంటామని రంగయ్య, వేణు తెలిపారు.

ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్ ఏకగ్రీవం.

బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్ ఏకగ్రీవం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భూపాలపల్లి బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడు నూతల నిషిదర్ రెడ్డి, మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి చందుపట్ల కీర్తి రెడ్డి ఆదేశాల మేరకు చిట్యాల మండలం బిజెపి నూతన కమిటీ ప్రకటించడం జరిగింది ఉపాధ్యక్షులుగా మాచర్ల రఘు
నల్ల శ్రీనివాస్ రెడ్డి.సుదగాని శ్రీనివాస్.చింతల రాజేందర్ ప్రధాన కార్యదర్శ గా మైదం శ్రీకాంత్ రావుల రాకేష ఎన్నికైనారు,
కార్యదర్శులుగా కుసుంబసుందర్, చిన్నవేణి సంపత్, అనుప మహేష్, వల్లాల నిరోషా,కోశాధికా: పెరుమాండ్ల అనుష
మండల కార్య వర్గసభ్యులుగా
గాజా నరేష్, ఉమ్మనవేణి రాజేష్ ,బుర్ర తిరుపతి, గుగులోతు వెంకన్న, గజనాల రవీందర్, ఓదెల శ్రీహరి ,బావు బుగులయ్య, రాకేం రాజేందర్, మల్లవేని రమేష్ ,సదా సదానందం, మార్తా అశోక్, గుర్రపు రవీందర్, బుర్ర సాంబయ్య ,పంచిక స్రవంతి, రాయిని మమత ,మైదం శ్రావ్య, జరుపుల కరుణ, గుగులోతు విజేందర్,లావుడియా రాజు, శ్యామల వెంకటేశ్వర్లు, కొడిమాల సారంగపాణి ,పాలకుర్తి బిక్షపతి ,మహేందర్ ,కింసారపు సంధ్యారాణి, తుమ్మల రాజు*లకవత్ నరేష్, నీలం శ్యాంసుందర్, చాడా సమ్మిరెడ్డి, జంగా మధుకర్, యాదన్ల గట్టయ్య, లను*
ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ తెలిపారు.

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం.

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

◆- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి*

◆ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంత ఇంటికల నెరవేరాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.మొగడంపల్లీ మండలంలోని మాడ్గి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజలో వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి, పునాదులు తీసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

Congress party state leaders Dr. Siddham.

 

ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ సోసైటి చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి,మొగడంపల్లీ మండల మాజీ కోఆప్షన్ మెంబర్ హర్షద్ పటేల్,ఎంపిడివో మరియు వివిధ శాఖల అధికారులు,మాజీ సర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version