ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు..

ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు

కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసిన ఎన్ఎంసీ

నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది. 150 సీట్లున్న ఆ కళాశాలకు రెండేళ్ల కిందటే ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కళాశాలలో రెండు ఎంబీబీఎస్ బ్యాచుల విద్యార్థులున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కళాశాల గుర్తింపు రద్దు వెనుక గతంలో కళాశాలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు యాజమాన్యం లంచం ఇచ్చిన కేసు ప్రభావం చూపిందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వాటిలో రెండు కళాశాలలు గత ఏడాది డీమ్డ్. యూనివర్సిటీగా మారాయి. ఫాదర్ కొలంబో కళాశాల గుర్తింపు రద్దుతో ఈ ఏడాది మిగిలిన 27 కళాశాలల్లోని సీట్లకే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

లంచం కేసు ప్రభావమే..?

వైద్య కళాశాలల్లో తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు, ఎన్ఎంసీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎంసీ నిబంధనల మేరకు కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేకపోయినా.. తమ కళాశాలలకు అనుకూలంగా నివేదికలివ్వాలని మధ్యవర్తుల ద్వారా వాటి యాజమాన్యాలు ఎన్ఎంసీ అధికారులకు లక్షల్లో లంచాలు ముట్టజెప్పాయి. దానిపై గత నెల 30న సీబీఐ కేసు నమోదు చేసింది.

అందులో తెలంగాణకు చెందిన పలు కళాశాలల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ఫాదర్ కొలంబో వైద్య కళాశాల కూడా ఉంది. కళాశాల ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి రెండు విడుతల్లో 20లక్షల చొప్పున మొత్తం 46లక్షల రూపాయలు లంచం చెల్లించినట్లు సీబీఐ ఎఫ్ఎఆర్ లో పేర్కొంది. ఆ కేసు ప్రభావంతోనే కళాశాల గుర్తింపు రద్దయిందని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్ లో 36 మంది పేర్లుండగా, అందులో ఆరుగురు ఏపీ, తెలంగాణకు చెందిన వారున్నారు. తెలంగాణకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రజనీరెడ్డి పేరును కూడా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో చేర్చింది.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున కవి రచయిత మ్యాదరి సునీల్ మాట్లాడుతూ గద్దర్ అవార్డులలో తెలంగాణ సినిమాకు ఆన్యాయం జరిగిందని పులి అమృత్ నిర్మించిన సలాం హైదరాబాద్ సినిమాకు ఆన్యాయం జరిగిందని తెలంగాణ సినిమా రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రొడ్యూసర్, దర్శకులు రచయిత పులి అమృత్ సలాం హైదరాబాద్ సినిమా పాటల రచయిత మ్యాదరి సునీల్ ఆవేదన వ్యక్తం చేసారు, సలాం హైదరాబాద్ సినిమా పై వరకు వెళ్లి పైనల్ గా ఈ సినిమాను పక్కన పెట్టి ఆంధ్ర సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది గద్దర్ భావజాలానికి విరుద్ధమని అమృత్ మాట్లాడుతూ ఈ సలాం హైదరాబాద్ సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటిస్తే ఈ సినిమాలో ఒక మంచి పాట రాసిన కవి రచయిత మ్యాదరి సునీల్ కి గద్దర్ అవార్డు వచ్చే అవకాశం ఉండని ఇందులో నటి నటులకు కూడా అవకాశం ఉండని పులి అమృత్ అన్నారనితెలంగాణ చరిత్ర తెలువని వారికి జ్యూరీ చైర్మన్ల అని వెంటనే తెలంగాణ చరిత్ర తెలిసిన అటువంటి మేధావులను జ్యూరి మెంబర్ గా ఏర్పాటు చేసి తెలంగాణ సినిమాలను బ్రతకనివ్వండి అని సునీల్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version