చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పచ్చని చెట్లతో,పారే నదులతో,అందమైన పక్షులు, అలరించే జంతువులతో, ఎన్నో జీవుల్ని కలిగి వున్న గ్రహం ఈ భూమి.ఈ జీవులన్నిటి మనుగడకు కావలసినది నీరు.అటువంటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ప్రజలకు అవగాహన కలిగించుటకు 1993వ సం॥లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ జల దినోత్సవం’గా ప్రకటించిందని, భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరయితే ఉందో,ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కాని, తరగడం కాని లేదు.కానీ ప్రపంచ జనాభా నిత్యం పెరుగుతునే ఉంది. అందుకే కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూమి మీద ఉన్న నీటిలో 97% ఉప్పునీరు. కేవలం 3% మాత్రమే మంచినీరు. ఈ నీటిని మనం చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలని, ప్రపంచంలో భారీయుద్ధాలలో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు తాగడం వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువని,సంవత్సరానికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని అన్నారు.
కాబట్టి,నీటిని పొదుపుగా వాడుట, కలుషితం అవకుండా కాపాడుట మన అందరి యొక్క బాధ్యత అని,సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం నీరు,నీరు లేక జీవకోటి మనుగడ లేదని అన్నారు.అనంతరం జల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్,అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్యా,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం విజయవంతం.

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని గవర్నమెంట్ స్వతంత్ర సమరయోధులు షహిద్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పురస్కరించుకొని సంవేదన 2లో భాగంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్స్ ఆక్టివిటీస్ (నిఫా), యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశ సమైక్యత సంస్కృతిక సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ” గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ” సాధించడం కోసం 1,50,000 యూనిట్ల బ్లడ్ ను కలెక్ట్ చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో 20 దేశాలలో,భారత్లో 28 రాష్ట్రాలు,6 కేంద్రపాలిత ప్రాంతాలు,800 జిల్లాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,బ్లడ్ క్యాంపు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ),కొత్తకొండ అరుణ్ కుమార్,ఎస్.కె ముస్తఫా ను అభినందించారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా 35 మంది రక్తదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకృష్ణ,యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు),కానిస్టేబుల్ బొట్టు కమలాకర్,విజయ, చందర్రావు,సాధు ప్రసాద్, కునూరు గణేష్,బండి ప్రశాంత్,ఆనంద్,నరేష్, రాజేష్,రమేష్,సాంబరాజు, సంతోష్,శ్రీకాంత్,ఆనంద్, రాకేష్,వినయ్ కుమార్, రాజేష్,రంజిత్,రాజు,అనిల్, నాగరాజు,సాధు రోహిత్, అమర్నాథ్,సంతోష్,మధుకర్, సంజయ్ కుమార్,శివ సాయి, మడి కొండ సదానందం,మడి కొండ షిండే,ప్రవీణ్,రంజిత్, బండి శ్రీధర్,అన్వేష్, కోలా రాజేష్,ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్,అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్,ఊరటి రవికుమార్,సృజన,జ్యోతి, భావన,బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు,ఎస్.కె ముస్తఫా,లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ (హైకోర్ట్ అడ్వకేట్),యాద రవి కుమార్, చెలిమల్ల అశోక్ కుమార్, తూనం రాము,సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్, మండల భూపాల్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రోజా,ప్రమీల, ప్రశాంత్,సుమలత,రమేష్ విష్ణు లు పాల్గొన్నారు.

Blood donation

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేత..

రామాయంపేట మార్చి 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి బైపాస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ వద్దకు వెళ్లడానికి బీటి రోడ్డు మంజూరు అయింది. ఈ పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తారని తెలుసుకున్న కాలనీ ప్రజలు సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ ప్రాంతం చెరువు దగ్గర ఉండటం వల్ల చెరువుల నుండి , వర్షాలు పడితే వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. ముందుగా సైడ్ డ్రెయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని కాలనీ ప్రజలు అన్నారు. ఒకవేళ ఇలా నిర్మించకుంటే మురికి నీరు వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే దుస్థితి ఉందన్నారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని కానీ సైడ్ డ్రయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సదర్ కాంట్రాక్టర్ ను అడిగితే తమకు కేవలం రోడ్డు నిర్మాణానికి మాత్రమే తనకు నిధులు వచ్చాయని సైట్ డ్రీమ్స్ కు ఎలాంటి నిధులు రాలేదని కాంట్రాక్టర్ తెలిపారని వార్డు ప్రజలు అన్నారు. సైడ్ డ్రాయింగ్స్ వేయకుండా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి అస్నుద్దీన్. ఎండి సల్మాన్. ఎస్.కె షకిల్. సయ్యద్ జియా. సయ్యద్ నాజర్ బాయ్. పల్లె పెంటయ్య. ఎరుకల పోచయ్య. పల్లె యాదగిరి. ఎరుకల మోహన్. శ్రీశైలం. పల్లె కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

Municipal officials.

ప్రపంచ నీటి దినోత్సవం…

ప్రపంచ నీటి దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం రోజున బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమాన్ని గ్రామంలో ర్యాలీతో విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో నీటి వినియోగం గురించి విద్యార్థిని విద్యార్థులు మాట్లాడిన ఉపన్యాసంలో మొదటి బహుమతి రెండవ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ నుండి ఈ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తూ ప్రజల బాగోగులకు తోడ్పడింది.
జలమే జగతికిమూలఆధారం
జలమే ప్రగతికి ప్రణాధారం
జలమే మనకు ఆహారం
జలమే మనకు ఆరోగ్యం
జలాన్ని మనం రక్షిస్తే జలం మనం రక్షిస్తుంది.
నీరు కలుషితం కాకుండా నీటి స్వచ్ఛతను పెంచాలని తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలి ఉన్న నీటిని కాపాడాలి. త్రాగునీరు సాగునీరు బాధలన్నీ అరికట్టుటకు యువత ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,లలిత, సురేందర్, బాలవికాస సూపర్వైజర్ పరుశురాం,జోనల్ డైరెక్టర్ జీడి తిరుపతి గౌడ్, దుబాసి సంజీవ్, పాగాల ఎల్లం యాదవ్, బాలవికాస కమిటీ సభ్యులు మెట్టు వెంకట్, పోలు శ్రీనివాస్, దేవరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులను సహించేది లేదు…

అక్రమ అరెస్టులను సహించేది లేదు బిఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

గంగాధర నేటిధాత్రి :

 

ఈరోజు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది, ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలాంటి అరెస్టుల వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్ప వేరే ఏమీ లేదు అన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడుగుతే అక్రమ అరెస్టుల అని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్కులర్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాల రాస్తున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు త్వరలో బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
మధుసూదన్ రెడ్డి తో పాటు మండలాధ్యక్షుడు సాయిల్ల సంతోష్ అరెస్టయ్యారు

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి.

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణిత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్డర్ల పురోగతి పై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సమగ్ర శిక్ష శాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తిచేసి సప్లై చేయాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి సంబంధిత ఆర్డర్ ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య,వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.!

లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు…

నేటి ధాత్రి / మర్చి 22

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలో వింటేజ్ కంపెనీలో పని చేసే వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీను మూడు నెలల క్రితం కల్వకుర్తి పట్టణంలో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీలో పని చేసే తోటి స్నేహితులు శనివారం రూ.60 వేలు బాధితుడికి అందజేశారు. శ్రీను కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొంగల్ల జగదీష్, గంగదారి శ్రీశైలం, రౌతు శ్రవణ్ కుమార్, బాలకృష్ణ, అనిల్ గౌడ్, మట్ట నరేష్, మల్లయ్య, వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

బహుళ జాతి మొక్కజొన్న సాగు చేసి అప్పుల భారంతో యువ రైతు మృతి…

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

మృతుని కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తానన్నుఆర్గనైజర్

ప్రభుత్వ అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు.

రైతుల గోడు పట్టించుకోని అధికారులు…రైతులక, ఆర్గనైజర్లక,

మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆర్గనైజర్ లను వెంటనే శిక్షించాలి..

ఈ ప్రాంతంలో ఆదివాసి ఐకాన్

ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి బాండ్ డీలర్ షిప్ ఆదివాసులకే ఇవ్వాలి..

ముందస్తు అరెస్టులు ప్రజలు ఖండిస్తున్నారు…

నూగుర్ వెంకటాపురం

నేటి ధాత్రి / మర్చి 22

 

బహుళ జాతి మొక్కజొన్న హైటెక్ విత్తనం వేసి అప్పుల భారంతో ఆదివాసీ యువ రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా,వెంకటాపురం మండలం,చిరుతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనతో చిరుతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంగా,లేకం మధు అనే వ్యక్తి(26),తండ్రి వెంకన్న వెంకటాపురం గ్రామానికి చెందిన,హైటెక్ బహుళ జాతి కంపెనీ చెందిన ఆర్గనైజర్ హైటెక్ సమస్ట మొక్కజొన్న సాగుచెయ్యమని,ఎకరాకు 4 నుండి 5 టన్నుల దిగుబడి వచ్చి అధిక లాభాలు వస్తాయని,మాయమాటలు చెప్పగా దీన్ని నమ్మివ్యవసాయం చేసి పంట నష్టం రావడం తో పురుగు మందు త్రాగి మృతి చెందాడు. లేకం మధు అనే రైతు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని,అదే భూమిలో హైటెక్ అనే బహుళ జాతి విత్తన ఉత్పత్తి సాగు చేయగా,ఎకరానికి ఒకటన్ను చొప్పున రెండు టన్నులు రాగా ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ఆ రైతు అప్పుల భారంతో ఏం చేయాలో తెలియని స్థితిలో గుర్తుతెలియని క్రిమి సంహారకం మందు తాగాడు. కుటుంబ సభ్యులుగమనించి ఏరియా ఆసుపత్రి తరలించారు, అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ములుగు ఆసుపత్రి కి తరలించారు. అక్కడ పరిస్థితి పూర్తి విషమంగా మారడంతో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5గంటలకు మృతి చెందాడు. దీనితో అతని కుటుంబ తీవ్ర దిగ్బాంతినికి గురయ్యారు. వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం స్పందించి ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని లేఖం మధు మృత దేహం తో ప్రధాన రహదారి పై రాస్తా రోకో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.దీనితో ప్రధాన రహదారి పై ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసు కున్న పోలీస్ శాఖ అధికారులు సిఐ బండారి కుమార్, ఎస్సై కె తిరుపతి రావు, పోలీస్ సిబ్బంది, సీఆర్పీఫ్ సిబ్బంది తో ప్రజలకు, ఎవరి ఏ హాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.హైటేక్ బహుళ జాతి మొక్క జొన్న కంపెనీ ఆర్గనైజర్ వచ్చి చనిపోయిన ప్రతి రైతుకు నష్టం పరిహారం ఇస్తానని అనడం తో రాస్తా రోకో విరమింప జేశారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, గ్రామ ప్రజలు, ఆదివాసీ రైతులు, పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం..

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

 

మందమర్రి నేటి ధాత్రి

 

బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

 

బి ఆర్ ఎస్ వి మందమర్రి పట్టణ అధ్యక్షులు MD.ముస్తఫా ..

కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా విద్యా రంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి.

అసెంబ్లీ ముట్టడి నిరసన గా ఈ రోజు ఉదయం 6 గంటలకు బి అర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు MD ,ముస్తఫా తో పాటు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దాసరి నవీన్ మరియు md,తాజ్ గారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం…

విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు కనబడుతుంది అని అన్నారు.

ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని పెండింగ్లో ఉన్నాయి కానీ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు.ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అని తెలిపారు.
హామీలు మాత్రం గంపేడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని కోరారు.

ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయింపు లో సున్నా అని కోరారు.ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదు..

ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం.

ప్రతి మండలంలో నవోదయ విద్యాలయంతో పాటు సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఇంటర్ కాలేజీ మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ లను నిర్మిస్తామని చెప్పినారు కానీ బడ్జెట్ మాత్రం సున్నా కేటాయించారు ఎలా సాధ్యమవుతుందన్నారు.

3 లక్షల వార్షికో ఆదాయం లోపు ఉన్నవారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఉన్నత చదువులు చదివే వారికి పది లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరులకు 25వేల పింఛన్ హామీ పచ్చి మోసని తెలిపారు.

18 ఏళ్ల పైబడి చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాసైతే 25000, పీజీ పాస్ అయితే ఒక లక్ష, పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడం పచ్చి మోసం. అని పేర్కొన్నారు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు

ముత్తారం :- నేటి ధాత్రి:

 

ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ముత్తారం ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎస్ ఐ నరేష్ తెలిపారు

ముత్యాల తలంబ్రాల కొరకు.!

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల కొరకు నగదు అందజేత

ఆలయ అభివృద్ధి కొరకు 10116నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏప్రిల్ ఆరవ తారీకు ఆదివారం నిర్వహించనున్న సీతారాముల కళ్యాణం కొరకు గణపురం వాస్తవ్యులు అయినా విశాఖపట్నంలో వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న తాళ్లపల్లి కిరణ్మయి రాజన్న దంపతులు స్వామివారి కళ్యాణానికి ముత్యాల తరంబ్రాల కొరకు 10116 రూపాయలను ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ కు అందజేయడం జరిగింది అదేవిధంగా రాజన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించనున్న సీతారామ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల ను పంపిస్తానని తెలపడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు మేడిపల్లి ప్రమీల కొమరయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్ ఆలయ అభివృద్ధి కొరకు10116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

అంబేద్కర్ యువజన సంఘం మండల.

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులుగా యుగేందర్ ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏవైఎస్ మండల నూతన కమిటీ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏకగ్రీవంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడుగా జన్నె యుగేందర్,ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ లను ఎన్నుకోవడం జరిగింది,ఉపాధ్యక్షులుగా కనకం తిరుపతి,గుర్రం అశోక్,సహాయ కార్యదర్శిలుగా దాసరపు నరేష్,బోనగిరి తిరుపతి, ప్రచార కార్యదర్శిగా కట్కూరి రాజు, కోశాధికారి కట్కూరి రాజేందర్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు యుగేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు , ఈ కార్యక్రమంలో ఏవైఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య, చిట్యాల మండల గౌరవ అధ్యక్షుడు గుర్రపు రాజేందర్,ఏవైఎస్ సభ్యులు సరిగోమ్ముల రాజేందర్, కట్కూరి రమేష్, గుర్రం రాజమౌళి, గుర్రం తిరుపతి, శీలపాక ప్రణీత్ కుమార్, మైదం మహేష్, పాముకుంట్ల చందర్,ముత్యాల సాంబయ్య, కట్కూరి శ్రీనివాస్, బొడ్డు ప్రభాకర్, అంబాల సాంబయ్య (అచ్చి) తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన.

అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన
చర్యలు తప్పవ్

ఎస్ ఐ నరేష్

ముత్తారం :- నేటి ధాత్రి

తెల్లవారుజామున ముత్తారం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ శివారులో పెద్ది లక్ష్మీరాజం తండ్రి లక్ష్మయ్య ,వయస్సు: 35 సంలు ఖమ్మంపల్లి ప్రాంతంలో ట్రాక్టర్ లో దొంగతనంగా ఇసుక రవాణా చేస్తు ఉండగా పట్టుకోవడం జరిగింది. వెంటనే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను డ్రైవర్ ను ముత్తారం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి, ట్రాక్టర్ ను సీజ్ చేశారు ఈ విధంగా ఎవరైనా కాని అక్రమంగా ఇసుకను, మట్టి రవాణా చేస్తే చట్ట ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోన బడతయాని
ఎస్ ఐ నరేష్ తెలిపారు

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం.

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఆదర్శ మోడల్ స్కూల్ సెంటర్లో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి శుక్రవారం ఉదయం 9 .30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో జిల్లా విద్య శాఖ అధికారి రాజేందర్ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు మండలంలో రెండు సెంటర్లు 360 మంది విద్యార్థులకు గాను 359 మంది హాజరు కాగా ఒకరు ఆఫ్ సెంట్ అయినట్లు ఎంఈఓ ఊరుకొండ ఉప్పలయ్య తెలిపారు మొదటి రోజు ఎలాంటి మాస్ షాపింగ్ జరగకుండా స్థానిక ఎస్సై రేఖ అశోక్ పటిష్ట భద్రత ను ఏర్పాటు చేశారు

వృక్షో రక్షతి రక్షితః.

వృక్షో రక్షతి రక్షితః

 

నడికూడ,నేటిధాత్రి:

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థుల చేత నాటకీకరణ చేయించడం అందరినీ ఆకట్టుకున్నది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ మనం ఈనాడు ఎంతో అందమైన నగరాలలో నివసిస్తున్నప్పటికీ,మానవుని తొలి నివాసాలు మాత్రం అడవులే.అలాంటి అడవులపై ఈనాటికి కూడా మానవుడు ఎంతగానో ఆధారపడి జీవిస్తున్నాడు.
అడవులు మనకు మేఘాలను చల్లబరచి వర్షాన్ని ఇస్తున్నాయని, గృహోపకరణాలకు, వంటచెరకుకు అవసరమైన కలపను అందిస్తున్నాయని,అనేక రకాలైన జంతువులకు, పక్షులకు నివాసప్రాంతాలుగా ఉంటున్నాయని,అనేక రకాలైన మూలికలు, ఔషదాలు అడవులనుండి లభిస్తున్నాయని,కాలుష్యాన్ని నివారించి,పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్నాయని, వరదలు సంభవించినపుడు, నేలకోతకు గురికాకుండా అడ్డుకుంటున్నాయని
కాని,నేడు మానవుడు వివిధ అవసరాల కోసం అడవులను నరికివేయడం వలన వర్షపాతానికి,ఆహారానికి లోటు ఏర్పడడమే కాకుండా, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని,కాబట్టి మనం మన ఇళ్ళలోను, పాఠశాలలోను,ఖాళీ ప్రదేశాలలోను చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడుదాం.అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి.

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి…

– చేసిన వాగ్దానాల నెరవేర్చేందుకు పైసా కేటాయించలే

– అప్పు పుట్టట్లేదని పరువు తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

– 15నెలలైనా కాళేశ్వరం నిర్వాసితులకు పరిహరమేది

– ఇసుక దందా కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేసిండ్లు

– ఎన్ని ఆటంకాలు ఎదురైన పేదోళ్ల కోసమే మా పోరాటం

– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

 

మంథని:- నేటి ధాత్రి

 

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి శ్రీధర్‌బాబుకు కల్పించిన మంథని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఆయన మొండి చేయి చూపించారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.

శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో కుటుంబం, బంధువులు లేని మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40ఏండ్లు అవకాశం కల్పించారని,

ఈనాటి మంత్రికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన మంథని నియోజకవర్గానికి బడ్జెట్‌లో ఒక్కరూపాయి కేటాయించకపోగా ఈప్రాంత ప్రజలకు మంత్రిగా చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహరం ఇప్పిస్తామని మాట ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

నియోజకవర్గంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం, అనేక ఔషదమూలికలు లభించే రామగిరి ఖిల్లాను అభివృధ్ది చేస్తానని, ఈ ప్రాంతంలో విద్యాభివృధ్దికి ప్రాధాన్యత ఇస్తానని మెడికల్‌ కళాశాల తీసుకువస్తానని హమీ ఇచ్చారన్నారు.

ప్రభుత్వం రాగా సీఎం రేవంత్‌రెడ్డి తన నియోకవర్గానికి మెడికల్‌కళాశాల తీసుకువెళ్లాడే కానీ ఆయన పక్కనే కూర్చుండే మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి మెడికల్‌కళాశాలను మంజూరీచేయించలేక పోయారని ఎద్దేవా చేశారు.

పోతారం లిఫ్ట్‌ అయితే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందుతుందనే ఆలోచనతో ఆనాడు సింగరేణి అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఆనాడు ప్రతిపాదనలు కూడా చేశామని ఆయనగుర్తు చేశారు.

కానీ మంత్రిగా పోతారం లిఫ్ట్‌ గురించి ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్న కాళేశ్వరంను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి హోదాలో మాట్లాడి ఇప్పటి వరకు ప్రతిపాదనలు చేయకపోగా ఒక్క ఎకరం భూమి కూడా సేకరణ చేయలేదన్నారు.

ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులను వాడుకుంటున్నాడే తప్ప ఈ నియోజకవర్గంలో 80శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల గురించి ఆలోచన చేయడం లేదని, వారి సంక్షేమానికి బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదని విమర్శించారు.

బీడు భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే బదనాం చేసి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి పక్కనే ఉండే మంత్రి వంత పాడకుండా ఈ ప్రాంత రైతుల గురించి ఆలోచన చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎడారిగా మారేది కాదన్నారు.

కేవలం ఇసుక దందాను కొనసాగించుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు.

అయితే ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్‌ అని ప్రకటించారని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదన్నారు.

ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి స్వయంగా తమకు అప్పు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదంటూ మాట్లాడిన తీరు రాష్ట్ర పరువు పోయిందని ఆయన అన్నారు.

అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మీడియాపై అక్కసు వెల్లబోసుకున్న ముఖ్యమంత్రి బట్టలూడదీసి కొడుతానని మాట్లాడుతుంటే మంథనిలోమాత్రం మంత్రి ప్రెస్‌క్లబ్‌లను ఏర్పాటు చేయిస్తున్నాడని, దేశంలో ప్రెస్‌క్లబ్‌లకు పార్టీలను అంటగట్టిన చరిత్ర మంత్రికే దక్కిందన్నారు.

మంథని ఎమ్మెల్యే ఎప్పుడు అదికారంలో ఉంటే అప్పుడు కొత్త పద్దతులను చూపించే అలవాటు నాటి నుంచే ఉందన్నారు.

ఆనాడు మంత్రి తండ్రి సైతం ప్రజలను హింస ఏవిధంగా పెట్టాలే, నక్సల్స్‌ పేరుమీద ఎలా మట్టుబెట్టాలనే కొత్త పద్దతులు అవలంబిస్తే ఈనాడు మంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై దేశ ద్రోహం కేసులు ఎలా పెట్టాలని చూశాడన్నారు.

మనలోమనకు వైషమ్యాలు పెంచి దాన్ని వాడుకుని గొప్పగా వర్థల్లాలనే చూస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఐటీ మంత్రిగా పది మందికైనా ఉద్యోగాలు ఇప్పించాలని అడుగుతూనే ఉన్నామన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క కుటుంబానికి ఇన్నేండ్ల అవకాశం కల్పిస్తే కనీసం ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.

రెండుసార్లు మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మంథని ప్రాంత అబివృద్దికి ఒక్కరూపాయి కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆనాలోచిత విధానాలతో గోదావరి, మానేరు తీర ప్రాంతాల్లోని పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.బీద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చేస్తామన్నారు.

అనంతరం మంథని పట్టణంలోని రాజాగృహ లో మంథని నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో 23న కరీంనగర్ లో జరిగే భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశం గురించి నాయకులకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దిశా నిర్దేశం చేశారు

తహసీల్దార్ సస్పెండ్

తహసీల్దార్ సస్పెండ్

“నేటిధాత్రి”, బీబీనగర్.

బీబీనగర్ తహశీల్దార్ ను సస్పెండ్ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

బీబీనగర్ మండలం పడమట సోమారం గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా పాసుబుక్స్ జనరేషన్ కు బాధ్యులయిన తహశీల్దార్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు

రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.

 

#రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే.

 

#ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పవనాలు.

 

#జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రానా ప్రతాపరెడ్డి.

 

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశంలో దశాబ్ది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ వంతంగా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి అండగా నిలవడానికి పలువురు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారని

జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన విధానాన్ని గమనించి దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విసిగిపోయిన ప్రజలు

రాష్ట్రానికి ప్రత్యామ్నయం బిజెపి పార్టీ అని భావించి నర్సంపేట నియోజకవర్గం లో భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బిజెపి జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేసే విధంగా కార్యకర్తలు నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన అన్నారు.

పార్టీలో చేరిన వారు మాజీ వార్డ్ మెంబర్ గుంపుల రాజు, బిఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగరబోయిన సాగర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షు డు జక్కుల నరసింహ రాములు, మండల

కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎద్దునరేష్, తదితరులు వాటిలో చేరారు

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, నాయకులు ఊటుకూరి చిరంజీవి, బత్తిని కుమారస్వామి, కక్కెర్ల సమ్మయ్య, మురికి మనోహర్, దొమ్మటి శీను తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

జైపూర్,నేటి ధాత్రి:

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version