ప్రపంచ నీటి దినోత్సవం
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం రోజున బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమాన్ని గ్రామంలో ర్యాలీతో విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో నీటి వినియోగం గురించి విద్యార్థిని విద్యార్థులు మాట్లాడిన ఉపన్యాసంలో మొదటి బహుమతి రెండవ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ నుండి ఈ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తూ ప్రజల బాగోగులకు తోడ్పడింది.
జలమే జగతికిమూలఆధారం
జలమే ప్రగతికి ప్రణాధారం
జలమే మనకు ఆహారం
జలమే మనకు ఆరోగ్యం
జలాన్ని మనం రక్షిస్తే జలం మనం రక్షిస్తుంది.
నీరు కలుషితం కాకుండా నీటి స్వచ్ఛతను పెంచాలని తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలి ఉన్న నీటిని కాపాడాలి. త్రాగునీరు సాగునీరు బాధలన్నీ అరికట్టుటకు యువత ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,లలిత, సురేందర్, బాలవికాస సూపర్వైజర్ పరుశురాం,జోనల్ డైరెక్టర్ జీడి తిరుపతి గౌడ్, దుబాసి సంజీవ్, పాగాల ఎల్లం యాదవ్, బాలవికాస కమిటీ సభ్యులు మెట్టు వెంకట్, పోలు శ్రీనివాస్, దేవరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.