నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన మండల వైద్యాధికారి అమరేందర్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ మీద జరిగిన దాడిని ముత్తారం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఖండించారు వారు మాట్లాడుతూ ఇటీవలె జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో ఏలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్న స్కాన్ సెంటర్స్ ను పర్మిషన్ తీసుకోవాల్సిందని ఆదేశించిన సందర్భంలో జిల్లా వైద్యాధికారినీ అగౌరపరుస్తూ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చేసిన తప్పుడు మరియు అబద్ధపు ఆరోపణలను ఖండిస్తూ మండల వైద్యాధికారి అమరేందర్ రావు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది అని తెలిపారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపో కుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకరాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నిర్వాహ కులు తగిన ఏర్పాట్లు చేయా లని ఎమ్మెల్యే తగు సూచనలు ఇచ్చారు వివిధ శాఖల అధికా రులకు ఆదేశించారు. కొనుగో లు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారు లు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భానుడు భగభగలతో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు ఒక వైపు సూర్య ప్రతాపం మరోవైపు ఉక్కపోతుతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎండలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని మొగులపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెలవు దినాలు ఉన్నందున విద్యార్థులు చెరువుకుంటల వద్దకు ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఉపాధి పని జరుగుతున్న గ్రామాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైతే వారికి చికిత్స కోసం ప్రధమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే పని చేసే కూలీలను కూడా ఎండ తీవ్రం కాకుండా ముందే పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 అవగాహన సదస్సు పిఎసిఎస్ సేవలపై అవగాహన ర్యాలీ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 28-4-25సాయంత్రం 5: 30 ని లకు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 లో భాగంగా అవేర్నెస్ వాక్ ద్వారా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
International Year
ఈ కార్యక్రమంలో గుర్రం సురేష్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, ఎక్స్ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య, వైస్ ఎంపీపీ విడిది నేని అశోక్, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి చోట మియా, రైతులు, సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో జన సమితి జెండా ను జిల్లా అధ్యక్షులు య౦ఏ.ఖాదర్ పాష.ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఖాదర్ . మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షల సాదనే కర్తవ్యంఅని పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేసిందని అన్నారు. నిరుద్యోగ సమస్యపై, రైతాంగ సమస్యపై, ఆర్టీసీ సమస్యలపై, ఆదివాసీల సమస్యలపై పోరాడుతూనే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం శ్రమించిందని అన్నారు గత పది సంవత్సరాలు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలను చైతన్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉద్యమ ఆకాంక్షల సాధనకు కృషి చేస్తుందని ఖాదర్ వెల్లడించారు. జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయని నిర్వహించామని తెలిపారు ఈ. కార్యక్రమంలో. య౦డి. షఫీ మైనార్టీ జిల్లా నాయకులు. పిక్కిలి బాలయ్య మండల అధ్యక్షులు శాంతారామ్ నాయక్. కె వినోద్ కుమార్.పాన్ గల్ మైనుద్దీన్ సాబ్ జన సమితి జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ..
కాంగ్రెస్ నేతల కుమ్ములాట – కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం – చీటి ఉమేష్ రావుని స్టేజి దిగి వెళ్లిపోవాలని ఆందోళన సిరిసిల్ల/ వేములవాడ(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సిరిసిల్ల పట్టణ లహరి గ్రాండ్ లో ఏర్పాటు చేశారు. చీటి ఉమేష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో ఓడిపోతున్న వారికి టికెట్లు ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేకే మహేందర్‌రెడ్డి అనుచర వర్గం ఒక్కసారిగా స్టేజి వద్దకు దూసుకెళ్లారు.
discussion
ఏనాడు పార్టీకి సేవ చేయలేదని ఉమేష్ రావు స్టేజి దిగి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటి వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెయ్యగ నాయకులు, పోలీస్ లు కలగజేసుకొని శాంతింప చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సభను కొనసాగించారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు ఎదుటే నేతలు ఆందోళనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సైబర్ నేరాల చెధనకు పోలీసులకు ప్రత్యేక సైబర్ శిక్షణ కార్యక్రమం
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):
ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పరిశోధనలో ఊపయోగించవలసిన అంశాలపై సైబర్ నిపుణులతో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది,అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం. అందులో భాగంగా మంగళవారం రోజున,,సి.డి.టీ.ఐ ( సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ) హైదరాబాద్,రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సంయుక్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల పోలీస్ అధికారులకు,సిబ్బందికి సైబర్ నిపుణులు ఆధ్వర్యంలో రెండు రోజుల ‘ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించరు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.ప్రస్తుత సమాజంలో.
crimes
ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది,అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సైబర్ మోసాలకు ,సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే నేరగాళ్ళకు శిక్ష పడటంతో డిజిటల్ సాక్ష్యాధారాలు ప్రధాన పత్ర పోషిస్తాయన్నారు. సైబర్ నేరం జరిగినప్పుడు పిర్యాదు నమోదు నుండి డిజిటల్ ఆధారాలు సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై సైబర్ నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకొని సైబర్ నేరస్థులకి శిక్షలు పడేవిధంగా కృషి చేయాలన్నారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.భౌతిక పోలీసింగ్ తో పాటు డిజిటల్ పోలీసింగ్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల పడకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి
1.అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయకండి. 2.వ్యక్తిగత సమాచారం (బ్యాంక్ డిటైల్స్, OTP, పాస్వర్డ్లు) ఎవరితోనూ పంచుకోకండి. 3.గుర్తు తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ ద్వారా వచ్చిన డిమాండ్లను పట్టించుకోకండి. 4.బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు మాత్రమే అధికారిక వెబ్సైట్లు, యాప్స్ ద్వారానే చేయండి. 4.సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంలో జాగ్రత్త వహించండి. 5.ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లల ఆన్లైన్ భద్రత పై తల్లిదండ్రులు దృష్టి సారించాలి,పిల్లల ప్రవర్తన పై నిత్యం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. 6.ఆన్లైన్ ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టి మోసపోవద్దు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, రాజ్ కుమార్ డీఎస్పీ , కోర్స్ కోఆర్డినేటర్ ,సి.డి.టీ.ఐ హైదరాబాద్ భీమా కృష్ణా నాయక్ ,,సి.డి.టీ.ఐ అఖిల్ రావు కొండూరి, ఇంటర్నేషనల్ సైబర్ ఎక్స్పోర్ట్ ,పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్హేర్ నాయబ్ తహశీల్దార్ పవన్ కుమార్, జహీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదిలాల్ ను సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పవన్ కుమార్ జహీరాబాద్ లో పనిచేసే సమయంలో భూమి వారసత్వ బదలాయింపు దరఖాస్తుపై సరైన విచారణ చేయనందుకు సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
ఝరాసంగం గ్రామంలో తాగునీటి ఎద్దడి పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రమైన బంగ్లా గడ్డ కాలోనీ వాసులు ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతున్న సంఘటనలు మండల కేంద్రంలో చోటుచేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని గ్రామ బంగ్లా గడ్డ కాలనీ వాసులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే ఎండాకాలం భానుడి భగభగ తో మునిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు సాధారణంగా అరకొరగా సప్లై అవుతున్న మంచి నీరు ఎండాకాలం వచ్చేసరికి మంచి నీటి సరఫరాలో తీవ్ర అంతరాయము ఏర్పడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురైతూన్నట్లు ప్రజలు తమ గోస చెప్పారు. జిల్లా కలెక్టర్ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.6రోజుల నుంచి గ్రామంలో గల వేసిన బోరులో నీరు రావడం లేదని, మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా మాత్రం రావడం లేని వల్ల బంగ్లా గడ్డ కాలనీ గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
Summer Season.
గ్రామంలో ఒకటి బోరు ఉన్నా,ఆ బోరులో నీళ్లు సరిగా లేవని స్థానిక అధికారులు తెలిపారు.ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు.
దీంతో పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న బోర్ల యజమాన్యులను అడిగి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నో నీరు వృథాగా పోతున్నది.
అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు తెలిపారు.
వేసవి కాలంలో నీరు వృథా చేయడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరపడిన గ్రామాలకు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.
మార్కెట్ కమిటీ లో మంచినీటి సమస్య మరియు విద్యుత్ సమస్య.
కల్వకుర్తి/నేటి దాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోనిఆమనగల్ మార్కెట్ కమిటీ లో మంచినీటి సమస్య విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు ఆమనగల్ మున్సిపల్ కార్యాలయం లో కమిషనర్ శoకర్ నాయక్ కు వినతి పత్రం అందజేచేయడం జరిగింది ఆమనగల్ మార్కెట్ యార్డ్ లో తాగు నీటి సమస్య ఉందని అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ కి లైట్ల ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ గ్రామాల నుండి రైతులు ధాన్యం అమ్మడం కోసం వస్తుంటారు వారికి కనీస సౌకర్యం తాగునీరు విద్యుత్ లైట్ల సమస్యను తక్షణమే వాళ్లకు సౌకర్యం కల్పించాలని తాళ్ల రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరారు.
కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ముందస్తు అరెస్ట్
మంచిర్యాల నేటి దాత్రి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది మంచిర్యాల పోలీసులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నస్పూర్ అఖిల్. శ్రావణ్ . రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్బంగా నస్పూర్ అఖిల్ మాట్లాడుతూ బి సి ,ఎస్ సి, ఎస్ టి విద్యార్థుల ఫిజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంత వరకీ ఒక స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు అన్నారు విద్యార్థుల బంగారు భవిష్యత్తును గుర్తుంచుకొని ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయాని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది
చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ మంచి మంచి పాటలతో జనాదరణ పొందుతు తనకంటు ఒక ప్రత్యేక శైలిలో ఆలతి ఆలతి పదాలతో అద్భుతమైన భావాలతో పాటలు రాస్తున్నందుకు గాను జూకల్ బిడ్డకు దక్కిన గౌరవం దిల్ సుఖ్ నగర్ జగదాంబ సారిస్ వి ఈవెంట్స్ అధ్వర్యంలో స్టార్ ఐకాన్ అవార్డ్స్ 2025 అవార్డు సునీల్ బెస్ట్ ఇయర్ రచయితకు మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలచారి ఎల్బి ప్రముఖ వైద్యులు కాంటెస్టేడ్ ఎమ్మెల్యే విరబోగ వసంతరాయులు మరియు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా హైదరాబాద్ సురభి ఎలైట్ హోటల్ లో స్టార్ ఐకాన్ అవార్డ్ తీసుకుంటున్న కవి రచయిత మ్యాదరి సునీల్ గని స్టార్ ఐకాన్ అవార్డ్ కు ఎంపిక చేసిన దుర్గ ప్రసాద్ కి ధన్యవాదాలు ఈ అవార్డ్ వచ్చిన సందర్భంగా జూకల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం.. ★ఎస్సై టి. నరేష్ ……
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఎస్ఐ టి నరేష్. వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు తమ సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ టి నరేష్ సూచించారు. దొంగతనాల నియంత్రణకు జిల్లా పోలీసు వారి సూచనలు ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. ఊళ్ళకు వెళ్లే వారు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. ఇండ్లలో నుండి బయటకు వచ్చే ముందు గ్యాస్ లివర్ తప్పనిసరిగా ఆఫ్ చేయడం మంచిది షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి. ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి. అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి. సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. • ప్రయాణాలలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఎస్ఐ టి నరేష్ గారు సూచించారు.
తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన
తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్చార్జ్ ఎలిశాల రాజేష్
వర్దన్నపేట (నేటిదాత్రి ):
తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లంద గ్రామంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఎలిశాల రాజేష్ ఇంటి ఆవరణలో జెండా ఎగరవేసిన సందర్భంగా ఎలిశాల రాజేష్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో పోరాటాలకు పిలుపునిచ్చి రాష్ట్రాన్ని సాధించినం సబ్బండ వర్గాల ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆశయాలతో ముందుకు వెళతామని ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటం చేస్తూ వారి వెంట ఉంటామని తెలియజేస్తూ ఏడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట మండల నాయకులు పెద్దూరు నాగరాజు పరకాలఅజయ్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన
తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్చార్జ్ ఎలిశాల రాజేష్
వర్దన్నపేట (నేటిదాత్రి ):
తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లంద గ్రామంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఎలిశాల రాజేష్ ఇంటి ఆవరణలో జెండా ఎగరవేసిన సందర్భంగా ఎలిశాల రాజేష్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో పోరాటాలకు పిలుపునిచ్చి రాష్ట్రాన్ని సాధించినం సబ్బండ వర్గాల ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆశయాలతో ముందుకు వెళతామని ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటం చేస్తూ వారి వెంట ఉంటామని తెలియజేస్తూ ఏడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట మండల నాయకులు పెద్దూరు నాగరాజు పరకాలఅజయ్ కుమార్ పాల్గొన్నారు.
మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కమిటీ మెంబర్స్ పద్మశాలీల ఉద్యోగ శిక్షణ కార్యక్రమం ప్రకటన ప్రెస్ క్లబ్ లో వెల్లడించడం జరిగినది. అనంతరం కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు,24 నెలలు మరియు ఇంటర్మీడియట్ పాస్, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు18 నెలలు ఉచిత భోజన,వసతి మరియు శిక్షణ పని కాలంలో స్టాయిపాయండ్ కూడా , ఇస్తుంది అని మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ సిరిసిల్ల మెంబర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్, గోనే ఎల్లప్ప, కోడం ఆంజనేయులు, చిమ్మని ప్రకాష్, గంట్యాల సురేష్, కొండ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్ అంతర్జాతీయ అవార్డు..
రామాయంపేట ఏప్రిల్ 28 నేటి ధాత్రి (మెదక్)
లయన్స్ క్లబ్ రామాయంపేట చార్టర్ సభ్యుడిగా 35 సంవత్సరాలుగా ఆర్తుల సేవయే పరమావధిగా ఆర్తులకు అన్ని రకాలుగా సేవలందిస్తూ గత రెండున్నర దశాబ్దాలుగా రక్త అవయవ దానాలకు కృషి చేస్తూ, అత్య వసర పరిస్థితులలో అవసరము ఉన్నవారికి సేవలందిస్తూ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, రక్త అవయవ దానాల ప్రచారానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా యువతి యువకులకు అవగాహన కల్పిస్తూ, వృద్ధులకు ఆపదలో ఉన్నవారికి అన్ని రంగాలలో సేవలందిస్తున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు లయన్ ఫిబ్రయిషీయో అలివేరా అభినందిస్తూ **లయన్స్ అత్యంత ప్రతిష్టాకరమైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్‌ను.
లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జి. బాబురావు కానిస్టిట్యూషనల్ ఏరియా లీడర్ ఆర్ సునీల్ కుమార్ అభినందిస్తూ ఆదివారం సాయంత్రం హైదరాబాదు, షామీర్పేట్ లోని ఎస్.ఎన్.ఆర్ పుష్ప కన్వెన్షన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని 8 లైన్స్ జిల్లాల నుండి పాల్గొన్న లయన్స్ ప్రతినిధులు పాల్గొన్న “మల్టీకాన్ కన్వెన్షన్” లో అవార్డును ప్రధానం చేశారు. కాగా రాజశేఖర్ రెడ్డి 54 మార్లు రక్తదానం చేసి ప్రాణాపాయకర స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేస్తున్నారని, రక్తదాన శిబిరంలను నిర్వహిస్తూ, అవయవ దానం ల గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, మారుమూల గ్రామాలలో సైతం అవయవ దానానికి ప్రజలను సంసిద్ధం చేస్తున్నారని అన్నారు. లయన్స్ ఏరియా కాన్స్టిట్యూషనల్ లీడర్ లయన్ రుమాళ్ళ సునీల్ కుమార్ మాట్లాడుతూ రక్త అవయవదానాలపై రాజశేఖర్ రెడ్డి కృషి అభినందనీయమని, గతంలో కూడా ఉత్తమ సేవలు అందించి నందులకు రాజశేఖర్ రెడ్డి కి పలుమార్లు అవార్డులు అందుకున్నట్లు గుర్తు చేశారు.మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హనుమాన్ల రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి మాసం గోడపత్రిక, కరపత్రంల ద్వారా రక్త అవయవ దానాల ప్రచారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి రూపొందించిన గోడపత్రికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని లోని ఎనిమిది లయన్స్ జిల్లాలలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, యువతి యువకులను ప్రోత్సాహ పరుస్తున్నారని గవర్నర్ లయన్ నగేష్ పంపాటి అన్నారు… లయన్స్ జిల్లా 320-డి గతంలో కూడా రక్త, అవయవ దానాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించి రక్తా, నేత్ర అవయవ దానాలకు, కరపత్రంల ద్వారా గోడపత్రికల ద్వారా యువతి యువకులకు, ప్రజలకు అవయవాల ప్రాముఖ్యత, ఆవశ్యకతపైన అవగాహన ఏర్పడిందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా రక్త అవయవ దానాలకు ప్రజలు ముందుకు వస్తున్నారని లయన్ ఏ. అమర్నాథ్ రావు అన్నారు… లయన్ ఎమ్. విజయలక్ష్మి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ రామాయంపేట. రెడ్ క్రాస్ మెదక్ శాఖ సభ్యులు,మరియు రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాల ద్వారా రోగులకు, వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఆర్తులకు అన్ని రంగాలలో సేవలందిస్తున్నాయని అన్నారు, సేవలను ఇంకా విస్తృత పరిచి ప్రజలకు సేవా కార్యక్రమాలను అధికంగానిర్వహించాలని లయన్ డి. నరసింహారాజు తెలిపారు. 2024 -25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో లయన్స్ ఉత్తమ సేవలందించారని ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కి అప్పగించిన రక్త అవయవ దానం లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని లయన్స్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ 2024- 25 లయన్స్ సంవత్సరం జిల్లా 320-డి లోని లయన్స్ సభ్యులు “ఎంపవర్” నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ, 35 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్, రామాయంపేట, రెడ్ క్రాస్ మెదక్ సంస్థల ద్వారా పరిసర ప్రాంతాలలో అన్ని విషయాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా రక్త, అవయవదానాల అవగాహనకు యువతి యువకులకు, మారుమూల గ్రామస్తులకు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు, లయన్స్ జిల్లా 320-డి లోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలో సామాజిక మాధ్యమాలలో మరియు పత్రికలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించి నందులకు లయన్స్ నాయకులు బీ.వి బన్సల్, జి. ఆర్ సూర్య రాజ్ సి. ప్రకాశరావు, గంప రమేష్ ఎం.నాగరాజు, ఆసపల్లి శ్రీధర్, వెంపటి మధు, కే. సూర్యనారాయణ ఇవి రమణ, రామ్ ఫనిధర్ రావు, కరుణాకర్, జనార్దన్ రెడ్డి, ప్రఫుల్ కుమార్, రమణారెడ్డి, తో పాటు పలువురు నాయకులు కొనియాడారు
వీణవంక మండల కేంద్రంలో సోమవారం రోజున వీణవంక, చల్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక రికార్డులను పరిశీలించడం జరిగింది. ఇన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఫార్మసీ స్టోర్ లోని వేసవి కాలానికి సంబంధించి మందుల నిల్వలను కుక్క కాటు మందులను పరిశీలించారు. లేబరేటరీ మరియు ఎన్సీడీ క్లినిక్ లను సందర్శించి రక్తపోటు, డయాబెటిస్ రోగులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ప్రతి నెల వారికి మందుల పంపిణీ రికార్డు పరిశీలించి అక్కడికి వచ్చిన రోగులను వారికి అందుతున్న ఆరోగ్య సేవల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని లేబర్ రూమ్ లను సందర్శించి జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి కానుపు లన్నీ గవర్నమెంట్ నార్మల్ డెలివరీల కొరకు ప్రోత్సహించి సిజేరియన్ డెలివరీల పర్సంటేజీ తగ్గించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని నార్మల్ డెలివరీలను పెంచాలన్నారు. అదేవిధంగా అవుట్ రీచ్ కేంద్రాలలో ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులు నిర్వహించి మహిళలందరికీ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ స్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వరుణ సుచిత్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆకునూరు గ్రామంలోనీ ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో అన్ని వార్డులలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విధ్య లభిస్తుందని, ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు ఉచిత సౌకర్యాలతోపాటు టెక్నాలజీతో బోధన చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్ధలకు వెళ్లి తల్లిదండ్రులు కష్టపడి సంపాందించిన డబ్బులను వృధా చేయవద్దన్నారు. విద్యార్ధులకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని సర్కారు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.