కాంగ్రెస్ నేతల కుమ్ములాట
– కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం
– చీటి ఉమేష్ రావుని స్టేజి దిగి వెళ్లిపోవాలని ఆందోళన
సిరిసిల్ల/ వేములవాడ(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని సిరిసిల్ల పట్టణ లహరి గ్రాండ్ లో ఏర్పాటు చేశారు. చీటి ఉమేష్ రావు సభను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో
ఓడిపోతున్న వారికి టికెట్లు ఇస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేకే మహేందర్రెడ్డి అనుచర వర్గం ఒక్కసారిగా స్టేజి వద్దకు దూసుకెళ్లారు.

ఏనాడు పార్టీకి సేవ చేయలేదని ఉమేష్ రావు స్టేజి దిగి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ చాలా సేపటి వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెయ్యగ నాయకులు, పోలీస్ లు కలగజేసుకొని శాంతింప చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సభను కొనసాగించారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు ఎదుటే నేతలు ఆందోళనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.