హజ్ యాత్రకు షేక్ ఫరీదుద్దీన్ ఘనంగా వీడ్కోలు.!

హజ్ యాత్రకు షేక్ ఫరీదుద్దీన్ ఘనంగా వీడ్కోలు పలికిన ముస్లింలు సోదరులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు షేక్ ఫరీదుద్దీన్ హజ్ యాత్రకు బయలుదేరిన సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అధ్యక్షుడు ముహమ్మద్ అయూబ్ అహ్మద్ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు.శాలువాలు, పువ్వులు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ హజ్ యాత్ర వెళ్తున్న యాత్రికుల ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాన‌ని అన్నారు. ఆ అల్లాహ్ దయతో అందరూ హజ్ యాత్ర సంపూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు దేశ ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు! ఉద్యోగులు వేధించుకు తింటున్నారు!!

-మిల్లర్లను వేదించొద్దన మంత్రి, కమీషనర్‌ ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు.

-ఉద్యోగుల తీరుతో మిల్లర్లు ఆగమౌతున్నారు.

-పై స్థాయి అధికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు.

 

-ప్రభుత్వాన్ని ఉద్యోగులే అబాసుపాలు చేస్తున్నారు.

-మిల్లర్లకు ప్రభుత్వం మీద అపోహలకు కారకులౌతున్నారు.

-ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు.

-సన్న బియ్యం పథకాన్ని తూట్లు పొడిచేలా కుట్రలకు ఉద్యోగులే తెర తీస్తున్నారు.

-చిన్న మిల్లర్లకు వడ్లు కేటాయించకుండా నాటకాలాడుతున్నారు.

-మిల్లర్ల మీద లేనిపోనివి సృష్టించి, ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొడుతున్నారు.

-లక్షలకు లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు.

-అడిగినంత ఇవ్వలేని చిన్న మిల్లర్లకు ఉద్యోగులు నరకం చూపిస్తున్నారు.

-ఉద్యోగుల తీరుతో మిల్లర్లు నష్టాల బారిన పడి అప్పుల పాలౌతున్నారు.

-అధికారులకు లంచాలివ్వలేక మిల్లర్లు నలిగిపోతున్నారు.

-కొత్తగా ఎవరైనా మిల్లులు ఏర్పాటు చేసుకోవాలంటే భయపడిపోతున్నారు.

-ఇండస్ట్రీస్‌ను కాపాడాల్సిన అధికారులు చిన్న మిల్లర్లను చంపేస్తున్నారు.

-డిటి స్థాయి ఉద్యోగులు కూడా మిల్లర్లను అల్లాడిస్తున్నారు.

-ఒక రకంగా ఏడిపించుకు తింటున్నారు.

-కోట్ల రూపాయల అప్పులు చేసి మిల్లులు పెట్టుకుంటే వడ్లు కేటాయిండం లేదు.

-నెలనెల మిల్లర్లు లక్షల రూపాయలు అప్పులు చేసి బ్యాంకుల వడ్డీలు చెల్లించుకుంటున్నారు.

-ప్రభుత్వ ఆదేశాలను డిటి స్థాయి ఉద్యోగి కూడా లెక్క చేయడం లేదు.

-డిఎం, డిఎస్‌ఓ, డిటిలు అక్రమాలకు బాగా అలవాటు పడ్డారు.

-అన్యాయాలకు తెగబడుతున్నారు.

-మిల్లర్లకంటే మించిన ఆస్థులు సంపాదించుకుంటున్నారు.

-దశాబ్దాల తరబడి ట్రాన్స్‌ ఫర్లు లేకుండా తిష్ట వేసుకుని కూర్చున్నారు.

-ఏసిబి, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాడులు చేస్తే సివిల్‌ సప్లయ్‌ ఉద్యోగుల బండారం మొత్తం బైటపడుతుంది.

-అవినీతికి అలవాటు పడి మిల్లర్లను పీడిరచే వారి పీడ పోతుంది.

-జిల్లాల వారిగా డిఎం, డిఎస్‌ఓ, డిటిల అక్రమాలు, ఆస్తులపై త్వరలో వరుస కథనాలు మీ ‘‘నేటిధాత్రి’’ లో..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేవుడు వరమిచ్చినా పూజారి కరునించడం లేదన్నట్లు వుంది సివిల్‌ సప్లైశాఖలోని జిల్లా స్దాయి ఉద్యోగుల సంగతి. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు మిల్లర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ఎంత చెప్పినా జిల్లా స్ధాయి ఉద్యోగులు పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. వారి ఆగడాలు ఆపడం లేదు. వారి దోపిడీ ఆడగం లేదు. ఆ శాఖ కమీషనర్‌ ఆదేశాలు కూడా జిల్లాల అధికారులు బేఖాతరు చేస్తున్నారు. పొరపాటున రైస్‌ మిల్లర్లు కమీషనర్‌ ఇచ్చిన ఆదేశాల గురించి ప్రస్తావిస్తే ఏకంగా ఆయన్నే వచ్చి వడ్లు కొనుగోలు చేసుకొమ్మని చెప్పమని బిరుసు సమాదానాలిస్తున్నారట. వడ్లు ఆయననే కేటాయించమని అడగండి అంటూ మిల్లర్లను హేళనగా మాట్లాడుతున్నారట. అంత బలుపు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు ఎదురు చెప్పలేక, వారి చెప్పిందానికల్లా తలూపలేక, అడినంత సొమ్ము ముట్ట చెప్పలేక రైస్‌ మిల్లర్లు విలవిలలాడిపోతున్నారు. అటు మిల్లులు నడవక, ఇటు ఉద్యోగులు అడిగినంత ముట్ట జెప్పలేక మిల్లులు మూసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని మధనపడుతున్నారు. జిల్లాల్లో డిటి నుంచి మొదలు, డిఎం వరకు వున్న ఉద్యోగుల మూలంగా చిన్న రైస్‌ మిల్లర్లు చితికిపోతున్నారు. వేదించుకు తింటున్న ఉద్యోగులను తట్టుకోలేకపోతున్నారు. లక్షలకు లక్షలు డిమాండ్‌ చేస్తుంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఐదు లారీల వడ్లు కేటాయించడం కోసం రూ.5లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఐదు లారీల వడ్లను బియ్యంగా మార్చి అమ్మితే వచ్చే లాభమే లక్ష అయితే, ఉద్యోగులకు రూ.5లక్షలు ఎలా చెల్లించలేక మిల్లులు మూసుకుంటున్నారు. ఇంతటి దుర్మార్గానికి ఉద్యోగులు పాల్పడుతున్నా పై స్ధాయి అదికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాలు కమీషనర్‌ వరకు చేరకపోతున్నాయి. కొంత మంది మిల్లర్ల అసోసియేషన్‌ ముఖ్యలు కూడా చిన్న మిల్లర్లను ఇబ్బందులు పెట్టాలనే చూస్తున్నారు. ఉద్యోగుల చేత వారిని మిల్లర్‌ సంఘాల ముఖ్యులు కూడా ఉద్యోగులకు సహకరిస్తున్నారు. నిజానికి మిల్లర్లకు సమస్యలొస్తే సహకరించాల్సిన మిల్లర్ల అసోసియేషన్‌ ఉద్యోగులతో లోపాయి కారి ఒప్పందాలతో చిన్న మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సన్న బియ్యం పధకం అమలు చేస్తోంది. దాని విజయవంతం చేయడం కోసం ప్రభుత్వం కొంత ఉదారమైన విధానాలు అవలంబించాలని చూస్తోంది. పైగా సన్న బియ్యం పధకం దిగ్విజయంగా సాగాలన్న లక్ష్యంత కమీషనర్‌ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. చిన్న మిర్లర్లు కోటి ఆపైన వున్న బకాయిలపై ఉద్యోగులు ఒత్తిడి చేయొద్దని, వారికి వడ్లు కేటాయించడంలో సమస్యలు సృష్టించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్దాయి ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లలో ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయినా జిల్లా స్ధాయి ఉద్యోగులు అటు ప్రభుత్వం, ఇటు కమీషనర్‌ మాట కూడా లెక్క చేయడం లేదు. దాంతో చిన్న మిల్లర్లు ఆగమైపోతున్నారు. రాష్ట్ర స్దాయి అదికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సివిల్‌ సప్లై శాఖ జిల్లా స్దాయి అదికారులు అబాసు పాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా కొన్ని జిల్లాల సివిల్‌ సప్లై ఉద్యోగులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అనేకం వెల్లువెత్తుతున్నాయి. చిన్న మిల్లర్లను ఎట్టి పరిస్దితుల్లో ఇబ్బందులకు గురి చేయొద్దని ఇప్పటికే కమీషనర్‌ పలు మార్లు హెచ్చరించారు. మిల్లర్లు ప్రభుత్వానికి బకాయిలు వుండడమే కాదు, ప్రభుత్వం కూడా మిల్లర్లకు బకాయిలు వున్న మాట వాస్తవం. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో కోటిన్నర వరకు బకాయిలు వున్న ఏ మిల్లర్‌ను సమస్యలు సృష్టించొద్దని సూచించారు. అంతే కాకుండా ఆపై కూడా బకాయిలు వున్న మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా అండర్‌ టేకింగ్‌ లెటర్లు తీసుకొనైనా వడ్లు కేటాయించాలని చెప్పినా ఉద్యోగులు వినడం లేదు. వాళ్ల వద్ద అలాంటివేమీ అవసరం లేదు. మాకెంతిస్తావన్న బేరాలు తప్ప ప్రభుత్వ ఆదేశాలను ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. మిల్లర్లకువేధింపులు ఆపడం లేదు. మిల్లర్లకు సహరించి, ప్రబుత్వ లక్ష్యాలిను నెరవేర్చాల్సిన బాధ్యత కలిగిన ఉద్యోగులు తమ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ ఒక సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం వుంది. వరంగల్‌ జిల్లాలో ఓ వ్యక్తి కొత్తగా ఒక మిల్లులను ఏర్పాటు చేసుకున్నాడు. సుమారు 12 కోట్ల రూపాయల వరకు బ్యాంకు రుణం తెచ్చుకొని 9 నెలల క్రితం మిల్లు నిర్మాణం, మిషన్‌ ఏర్పాటు అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. ఇక మిల్లు నడిచేందుకు అవసరమైన వడ్ల పర్మిషన్‌ కోసం సివిల్‌సప్లై శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. తొమ్మిది నెలల క్రితం పెట్టిన ధరఖాస్తు ఇంత వరకు ఆన్‌ లైన్‌ లో కూడా నమోదుచేయలేదు. ఆ ఫైల్‌ డిటి నుంచి పై అధికారి వరకు వెళ్లలేదు. తొమ్మిది నెలలుగా ఆ మిల్లర్‌ను తిప్పించుకుంటున్నారు. అతన్ని పిండాల్సినంత పిండేశారు. కాని ఫైల్‌ను పక్క టేబుల్‌కు కూడా కదల్చలేదు. అప్పటి నుంచి ఫైల్‌ గురించి డిటిని అడిగితే డిఎస్‌ఓ వద్ద వుందంటారు. డిఎస్‌ఓను అడిగే డిఎం.దగ్గరుందంటారు. డిఎంని అడిగితే కమీషనర్‌ కార్యాలయానికి చేరిందంటారు. ఇదిగో అదిగో అంటూ మిల్లర్‌ వద్ద నుంచి నొక్కేసేది నొక్కేస్తూనే వున్నారు. కాని ఆయన పని మాత్రం చేయలేదు. నెలకు రూ.9లక్షల రూపాయలు బ్యాంకు వడ్డీలు చెల్లిస్తూ, శాఖ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా తెలిసిందేమిటంటే అసలు ఆఫైల్‌ డిటీ టేబుల్‌ నుంచి కదల్లెదు. కనీసం ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదు. అంటే ఉద్యోగుల నిర్లక్ష్యం, అలసత్వం ఎలా వున్నాయో అర్ధం కావడం లేదు. ఈ విషయాన్ని ఆ మిల్లర్‌ పై స్ధాయి అదికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఫోన్‌ చేయిస్తే సదరు వ్యక్తి మీద కక్ష కట్టినంత పనిచేస్తున్నారు. పై స్దాయి అదికారి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించినా కిందిస్దాయి డిటీ, డిఎస్‌ఓలు కనీసం భయపడడం లేదంటే ఎలా తయారయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తిన్నది కాదని, మళ్లీ ఎంతిస్తావంటూ లెక్కలు చెబుతున్నారంటే ఉద్యోగులు అవినీతి ఏ స్ధాయికి చేరుకున్నదో తెలిసిపోతోంది. అంతే కాదు పై స్ధాయి నుంచి ఫోన్‌ రాగానే ఆన్‌లైన్‌ చేయాలా..మరో పది రోజులు తిప్పించుకుందాంలే..అంటూ ఆ వ్యక్తి ముందే ఉద్యోగులు మాట్లాడుకోవడం అంటే ఉద్యోగం పోతుందన్న భయం కించిత్‌ కూడా లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ ఉద్యోగులు ఎలాంటి ట్రాన్స్‌ఫర్లు లేకుండా పాతుకుపోయారు. మిల్లర్ల ఇచ్చే లక్షలకు బాగా అలవాటు పడ్డారు. మిల్లర్లను బెదిరించి వసూలు చేసే ఆదాయం కోట్లలో పేరుకుపోయింది. ఉద్యోగమంటే లెక్కలేకపోతోందని అంటున్నారు. ఉద్యోగులు తిరుపతి వెళ్లాలన్నా, అక్కడ వసతులు ఏర్పాటుకు అయ్యే ఖర్చులన్నీ మిల్లర్లే భరించాలి. ఇక ఎంజాయ్‌ మెంటు కోసం గోవా లాంటి విహర యాత్రలు ఉద్యోగులు చేయాలంటే కూడా మిల్లర్లు ఆ ఖర్చు భరించాల్సిందే అన్నంత దోపిడీ జరుగుతోంది. ఇదంతా భహిరంగ రహస్యమే అయినా మిల్లర్లను వేదించకుండా వుండలేదు. పెద్ద పెద్ద మిలర్లు, యూనియన్‌ ప్రతినిధులకు వడ్లు కేటాయించడం కోసం చిన్న చిన్న మిల్లర్లను లేకుండా చేయడం కోసం ఉద్యోగులు పని గట్టుకొని వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. మిల్లర్‌ ఇండస్ట్రీ మరింత పెరిగేందుకు కృషి చేయాల్సిన ఉద్యోగులు ఆ వ్యవస్ధలో పెద్దల కోసం చిన్న చిన్న మిల్లులే లేకుండా చేయడం అంటే ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. పెద్ద మిల్లర్ల కోసం చిన్న మిల్లర్లను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు మిల్లర్లను మించిన సంపాదన పరులుగా మారిపోయారు. దశాబ్ధాల తరబడి ఒకే కార్యాలయంలో పనిచేస్తుండడంతో మిల్లర్లను వేధించడం ఎంతో సులువైపోతోంది. డిఎం స్ధాయి నుంచి డిఎస్‌ఓ, డిటిలు అక్రమాలకు బాగా అలవాటు పడిపోయారు. కోట్లుకు కోట్లు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిపై ఏసిబి, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాడులు చేస్తే వారి బండారం మొత్తం బైట పడుతుంది. అలా అవినీతికి అలవాటు పడి మిల్లర్లను పీడిస్తున్న ఉద్యోగులపై జిల్లాల వారిగా వరుస కధనాలు త్వరలో …మీ నేటిధాత్రిలో వరుసగా…

గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.

కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోలోజ్ సంతోష్ ఎన్నిక.

చిట్యాల నేటిధాత్రి:

జూకల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి అభివృద్ధి గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు అలాగే మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆదేశాల మేరకు నూతనకాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామశాఖ*అధ్యక్షుడిగా: పోలోజు సంతోష్*
ప్రధానకార్యదర్శిగా: ముష్కే నాగరాజు*
వర్కింగ్ ప్రెసిడెంట్ గా: బుస్సరవి
ఉపాధ్యక్షుడిగా: బోయిని రవి, మేకల ఐలయ్య*
సహాయకార్యదర్శిగా: కురిమిళ్ళ ప్రసాద్ కోశాధికారిగా: భయగాని రాజు*
కార్యవర్గ సభ్యులుగా: నల్ల ధర్మారెడ్డి, బయగాని* రమేష్,మంగళంపల్లి శ్రీనివాస్, మొలుగురి రమేష్,ఆవంచ. సదానందం, ఎలమాద్రి భద్రయ్య,*
ఎనుమల్ల రాములు, డబ్బాల మహేందర్, బయగాని సదానందం, నూనె సురేందర్ గా ఎన్నుకోవడం జరిగింది.*

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పేరు దివంత నేత మొహమ్మద్ పరిదోద్దీన్ పెట్టాలి.

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పేరు దివంత నేత మొహమ్మద్ పరిదోద్దీన్ పెట్టాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్‌ పట్టణంలోని రైల్వేగేటు వద్ద కోట్లతో రెండు వరుసలతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులకు 2018 ఆగస్టు 30న ఎంపీ బీబీ పాటిల్‌, అప్పటి ఎమ్మెల్సీ మహ్మద్‌ పరీదుద్దీన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌-పర్లివైజ్యనాథ్‌ రైలు మార్గం జహీరాబాద్‌ పట్టణం మీదుగా వెళుతుంది. సికింద్రాబాద్‌, నాందేడ్‌, పూర్ణ, షిర్డీ, బెంగుళూరు, తిరుపతి, కాకినాడ రైళ్లు రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతిసారి గేటు పడటంతో వాహనదారులకు కష్టాలు తప్పడం రైల్వేగేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ను ప్రారంభం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొహమ్మద్ పరిదోద్దీన్ పేరు పెట్టాలని ఝరాసంగం మండల యువ నాయకులు మొహమ్మద్ సద్దాం హుస్సేన్ చెప్పారు ఎందుకంటే మాజీ దివంత నేత మొహమ్మద్ ఫరిద్రుద్దీన్ జహీరాబాద్ కు చేసిన సేవలు అందించిన ప్రజలలో జ్ఞాపకాలు ఉంటాయని తెలిపారు ప్రతి ఒక్క ప్రజలకు కుల మతాలు లేకుండా జ్ఞాపకం గా ఉండే అందుబాటులో ఉంటూ సేవలందించారు అందు గురించి ఒక జ్ఞాపకం ఉండే రైల్వే ఓవర్ బ్రిడ్జి ను అతని పేరు పెట్టాలని యువ నాయకులు కోరారు.

పురుగు మందుల చట్టంపై అవగాహన.

పురుగు మందుల చట్టంపై అవగాహన 
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి      
      
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మొగుళ్ళపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారులకు(డీలర్లకు) రైతు వేదిక మొగుళ్ళపల్లి లో విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల చట్టాలపై అవగాహన/సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో   ఈ క్రింద సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని . 
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా  
    ఎదురుగాపెట్టాలి. లైసెన్సు లేకుండా విత్తనాలు గాని, ఎరువులు గాని మరియు పురుగు 
    మందులు అమ్మకం చేయరాదు. డీలర్ యొక్క షాప్ పేరు, ఇంటి/డోర్ నెంబర్ మరియు ఇతర  
    వివరాలు పేయింట్ తో రాయాలి
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి. డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు  
    ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి. 
కంపనీల నుండి వచ్చే సరుకులకు ఇన్వాయిస్ లేనిదే అమ్మకాల స్థలంలో లేదా గోదాముల్లో 
    దింసుకోనరాదు.బిల్లు మరియు డి.సి.లు లేనిదే స్టాక్ సరఫరా చేయరాదు.స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్ 
     బోర్డుపై రాయాలి.బ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును.లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా  
      పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా   నిల్వచేయాలి. డీలర్లు తామ యొక్క లైసెన్సు గడువు మీరినట్లైతే ఎటువంటి అమ్మకాలు జరపరాదు.డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం  జరపరాదు.లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలి.డీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి.
 స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి మరియు. అలాగే అన్ని గ్రామాల డీలర్లు, AEO లు ఇట్టి సమావేశంలో పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి

నేటిధాత్రి మొగుళ్ళపల్లి:

 

భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి.

నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి

మూస పద్ధతులను విడనాడాలి

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…. రైతులకు అవగాహన కార్యక్రమం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

శనివారం కేసముద్రం రైతు వేదికలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను ప్రోగ్రాం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేయడం జరిగింది. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు ఈ విధమైన సలహాలు చేయడం జరిగింది
1. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలి
2. అవసరమేరకు మందులను పిచికారి చేసి మేలా ఆరోగ్యాన్ని కాపాడాలని
3. విత్తనాలు పురుగు మందుల మరియు ఎరువుల రసీదులు భద్రపరుచుకోవాలి
4. సాగునీటిని ఆదా చేసుకోవాలి
5. పంట మార్పిడి చేసుకోవాలి
6. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి
7. పచ్చిరొట్ట ఎరువులు, పశువుల పెంట, చెరువు మట్టి వలన కలిగే ఉపయోగాలు.

వారు మాట్లాడుతూ వచ్చే వానకాలం సీజన్ 2025 -26
గాను వివిధ పంటలలో సాగు చేసే వివిధ రకాల విత్తనాలు మరియు మేలైన యాజమాన్య పద్ధతులు,
వరి పంటలో నేరుగా విత్తనాలు వెదజల్లి మంచి దిగబడులు పొందే మీద సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
రైతులు పురాతన మూస పద్ధతులను విడనాడి, నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి, ఖర్చులను తగ్గించి మంచి దిగబడులు, పొందాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా
కెవికె మల్యాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డాక్టర్, ఎస్. మాలతి , ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం ధనసరి అధ్యక్షులు మర్రి రంగారావు, సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు, కె వి కె మల్యాల శాస్త్రవేత్తలు డాక్టర్ రాంబాబు , డాక్టర్ క్రాంతి కుమార్ , మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, తోట వెంకన్న, ఆయా గ్రామాల అభ్యుదయ రైతులు, మండలంలోని ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు, రాజేందర్, శ్రీనివాస్, రవివర్మ, సాయి చరణ్, లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి

నేటిధాత్రి మొగుళ్ళపల్లి

 

భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

మేధా చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన కొండూరు విద్యార్థులు.

“రాయపర్తి, నేటిధాత్రి*

 

 

మేధా చారిటబుల్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ లో జెడ్ పి హెచ్ ఎస్ కొండూరు పాఠశాల విద్యార్థులు గంకిడి సాయి వర్ధన్, బొబ్బల వర్షిత్ రెడ్డి లు సెలెక్ట్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత తెలియజేశారు. వీరికి శ్రీ మేధా ట్రస్ట్ నుండి సుమారు మూడు నుండి నాలుగు లక్షల విలువైన రెండు సంవత్సరాల ఉచిత విద్యను ప్రఖ్యాత నారాయణ, శ్రీ చైతన్య కాలేజిలలో అందిస్తారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు రామిరెడ్డి, ఆచార్యులు, సత్యనారాయణ, రఘు, నాగరాజు, వెంకటరమణ, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్య నాయక్ , స్వామి, అమర స్వర్ణ ,శివకృష్ణ  అభినందించారు.

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలో అభయ అంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని స్థానిక విజయగణపతి దేవాలయ ఆవరణలోని హనుమాన్ ఆలయంలో పూజారి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని యజ్ఞశాలలో నిర్వహించిన మహా యజ్ఞంలో హనుమాన్ మాలాధారులు పాల్గొన్నారు. పట్టణంలోని భక్తులు ఆయురారోగ్యాలతో సుఖ జీవనం సాగించాలని, స్వామివారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు.

పోగొట్టుకున్న మొబైల్ అందజేత.

పోగొట్టుకున్న మొబైల్ అందజేత

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన ఎక్కల సుజాత నెల రోజుల క్రితం తమ గ్రామంలో ఆమె మొబైల్ ఫోన్ను పోగొట్టుకుంది. సీఈఐఆర్ వెబ్సైట్లో నమోదు చేయగా పోగొట్టుకున్న ఫోన్ ఐఎంఈఐ నంబర్ ను ట్రాక్ చేసి బాధితురాలుకి శనివారం ఇంచార్జ్ ఎస్సై సృజన అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఎవరైనా మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నట్లయితే అధైర్య పడకుండా సీఈఐఆర్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించారని  పేర్కొన్నారు.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొమిశెట్టి కిరణ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా, మృతుడు కాశీపేట 2 గని లో విధులు నిర్వర్తించేవాడు.సింగరేణి సంస్థకు ఎస్బిఐ బ్యాంక్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎస్బిఐ సాలరీ అకౌంట్ ఎస్బిఐ లొ మెయింటైన్ చేసినందుకు గాను కోటి రూపాయల భీమా ఎస్బిఐ బ్యాంక్ మంజూరు చేసింది. ఇట్టి కోటి రూపాయల చెక్కును నామిని అయిన మృతుని భార్య కొమిశెట్టి కోమల కు శనివారం రామకృష్ణపూర్ ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో మంచిర్యాల ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్త, ఆర్బీవో సివిఈ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి లు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ గోపాల్, బ్యాంక్ స్టాఫ్ ప్రశాంత్,రామ కార్తిక్, వెంకటేశ్. రాజేంద్ర ప్రసాద్ , చందు, రమాదేవి లు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ సీడ్స్ నూతన అధ్యక్షుడిగా.!

ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ నూతన అధ్యక్షుడిగా గందె వెంకటేశ్వర్లు

అసోసియేషన్ అభివృద్ధికి కృషిచేస్తా-గందే వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్స్ పేస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రేటర్ గందె వెంకటేశ్వర్లు ను,ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీ,కోశాధికారిగా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Gande Venkateshwarlu

 

 

ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన నాగుర్ల వెంకటేశ్వర్లు కి ఎల్లవేళలా రుణపడి ఉంటు పరకాల పట్టణ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నాతోటి వ్యాపారస్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.

మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో అగ్నిప్రమాదం.

మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో అగ్నిప్రమాదం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది.పరిశ్రమలోని ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్లోని స్టోరూమ్లో మంటలు చెలరేగాయి. ప్లాంట్ నుంచి దట్టమైన పొగలు వెలువడంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిశ్రమలోని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్మికులు, ఉద్యోగులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని
ఆగిన దళిత బంధు ఇవ్వాలని
…,. జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….

జమ్మికుంట :నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు గురించి, హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపి వేయబడిన రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌడ్ పనులు వెంటనే ప్రారంభించాలి అని, దళితుల అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కరీంనగర్ జిల్లాలో నిలిపివేయబడిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన

MLA Padi Kaushik Reddy

ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు గారు, జిల్లా అధ్యక్షులు GV రామాక్రిష్ణా రావు గారు. మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు పాల్గొన్నారు

అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మంత్రుల అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ

-మంత్రి వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి..సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

-బీసీ మహిళా మంత్రిపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీ సమాజం

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు చేసిన అవినీతి చిట్టాను విప్పిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీలోని అగ్రకులస్తులు తప్పుగా వక్రీకరించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని, అట్టి కుట్రలను చూస్తూ బీసీ సమాజం ఊరుకోబోదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. కమిషన్లకు కక్కుర్తి పడి..ప్రతి పనిలో వాటాలు తీసుకుని..ధనిక తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి వేశారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగాలన్నా, ఫైల్ కదలాలన్నా మంత్రులకు కమిషన్లు ఇస్తేనే పనులు జరిగేవని కాలేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తే.ఆ ఆరోపణలపై సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు..వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోని కొందరు అగ్రవర్ణ కులస్తులు మంత్రి కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని, బీసీ మంత్రిగా..ఓరుగల్లు ప్రజల ముద్దుబిడ్డగా.పేద ప్రజల గుండెచప్పుడుగా..నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యి..వారి హృదయాల్లో కొలువుదీరి.ప్రజా నాయకురాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని.మిగతా మంత్రులను కలుపుకొని..సమిష్టి నిర్ణయాలతో ప్రజా పాలనను ముందుకు తీసుకెళుతున్న తరుణంలో.బీసీ మంత్రి అయినా కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేక.ఆమెను టార్గెట్ చేసి.కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం మధ్య చిచ్చుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీలోని అగ్ర కులస్తులు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.ప్రజా కోర్టులో బీఆర్ఎస్ పార్టీ అగ్రకులస్తుల వైఖరిని ఎండగడతామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు.

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్.

డీఎస్పీ కార్యాలయం రెన్యు వేషన్ ఎస్పీ కలెక్టర్ తో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే

 

వనపర్తి నేటిధాత్రి :

 

శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్ దగ్గర పాత భవనానికి రెన్యువేషన్ చేసిన సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయానికి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఉండాలని అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీస్ విషయంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని అన్నారు.

ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో డీఎస్పీ కార్యాలయాన్ని రెనోవేషన్ చేయించి పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు.

భవనం రెనోవేషన్ కు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.

వనపర్తి పట్టణానికి, మండలాలకు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన స్వంత నిధుల నుండి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాలో కొత్తగా మూడు మండలాల్లో కొత్త తహసిల్దార్ కార్యాలయాలు ఒక్కోటి రూ 32 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా పట్టణంలో ఒక సర్కిల్ కార్యాలయం, మరో ఎస్. హెచ్. ఒ మంజూరు కు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం పట్టణంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ చొరవ చూపడం వల్ల నిధులు మంజూరు చేయడంతో రెనోవేషన్ అనంతరం నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుండి అద్దె చెల్లించే బాధ కూడా తప్పిందని అన్నారు.

అదేవిధంగా పోలీస్ శాఖకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం, రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్రజలకు శాంతి భద్రతల విషయంలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి వనపర్తి జిల్లాకు మంచిపేరు తెస్తామని అన్నారు
పోలీస్ శాఖకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి డీఎస్పీ వెంకటేశ్వర రావును గౌరవ ప్రదంగా తన కుర్చీలో కూర్చోబెట్టారు డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.

డీఎస్పీ వెంకటేశ్వర రావు, మార్కెట్ యార్డు చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్ ఎల్ ఏన్ మిడిదొడ్డి రమేష్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ టి శంకర్ ప్రసాద్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ లు, ఎస్సై లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

పరకాల క్లస్టర్ ఏఈఓ ఎం.శైలజ

పరకాల నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పరకాల క్లస్టర్ పరిధిలోని పరకాల,మాదారం,మల్లక్కపేట గ్రామలకు చెందిన పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల క్లస్టర్ వ్యవసాయ విస్తరాణాధికారి(ఏఇవో) ఎం.శైలజ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు, సబ్సిడీలు,బీమా వంటివి ఈ గుర్తింపు కార్డు ద్వారా సులభంగా అందుతాయని,ఆకస్మికంగా వచ్చే ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితులలో సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుందని,ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పథకాలకు ఈ గుర్తింపు కార్డు ఆధారంగా రైతులకు సాయం అందజేస్తారని అన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా ఆమనగల్ మార్కెట్ శనివారం నాడు కమిటీ వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి ఆకస్మిక పర్యటన సందర్భంగా ఆమనగల్ PACS ఆధ్వర్యం లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం సేకరణ వివరాలను సంబధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డు లో నిర్మినా దశలో ఆగిపోయిన పనులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని పరిశీలించారు.కూరగాయల మార్కెట్ .మాటెన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సమస్యను MLA గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రజలకు కూడా అన్ని సదుపాయాలు ఒకే దగ్గర ఉంటాయని వైస్ చైర్మన్ వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తాళ్ల రవీందర్ ,నరేష్ నాయక్ , సంపత్ కుమార్ ఉన్నారు.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణ సిఐ గా బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ సిఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దేశిని స్వప్న కోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తాజా మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారెపల్లి బిక్షపతి, దేశిని రాధా సదానందం ఎలగందుల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేతా రమేష్, పొన్నగంటి సారంగం, కుదాడి రాజయ్య, బుల్లి పూలమ్మ మొగిలి,దిడ్డి రామ్మోహన్,రావికంటి రాజు,తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version