తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు.

Central government

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు

కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలి బీసీ జేఏసీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బిసి జేఏసీ,మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పోరాటం చేస్తున్న అన్ని బీసీ సంఘాల విజయమని,బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారందరికీ ఇది గర్వకారణమన్నారు.ఈ బిల్లు ద్వారా స్థానిక సంస్థలు,విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అవుతుందని,దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్ని చేకూర్చే మైలురాయిగా నిలుస్తుందనీ,బీసీ జేఏసీ తరఫున ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిమితులలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,దేశవ్యాప్తంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు మేము నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు.రిజర్వేషన్ బిల్లుకు న్యాయస్థానాల్లో ఆటంకాలకు అవకాశమున్నందున,దీన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలనీ,అప్పుడే ఈ చట్టాన్ని న్యాయపరమైన సవాళ్ల నుండి రక్షించవచ్చునని,ఇది బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం అందించడంలో కీలక పాత్ర పోషితుందనీ,అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ,బీసీ లకు విద్య,ఉద్యోగ,స్థానిక సంస్థల రిజర్వేషన్ 42% శాతం కల్పిస్తూ బిల్లు ను పెట్టి,తెలంగాణ లోని బీసీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ కి ధన్యవాదములు తెలియ జేస్తూన్నామనీ బీసీ జేఏసీ,మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు
ఒడ్డేపల్లి మనోహర్ అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సేవ దళ్ నాయకులు,బీసీ నాయకులు డా.నిలకంటేశ్వర్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు,డా.రాజకిరణ్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ,బీసీ జేఏసీ నాయకులు రాజన్న యాదవ్,పిట్టల రవీందర్,పెద్దల్ల చెంద్రకాంత్,ఎండీ లతీఫ్, భీమాసేన్,చెంద్రగిరి చెంద్రమౌళి,పిట్టల తిరుపతి,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా సభ్యులు
దినకర్,దీపక్,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!