మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు.!

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు బలి..

మందుబాబులు ఇకనైనా మారండి..

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సిందే.

ప్రతిరోజు డ్రంకన్ డ్రైవ్..

రామాయంపేట మార్చి 19 నేటి ధాత్రి (మెదక్)

Drunk driving

మద్యం తాగి వాహనాలునడిపితే తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. తాగే వారు మాత్రం తాగక మానడం లేదు. వాహనాలు నడిపేవారు మాత్రం నడపక మానడం లేదు. నిత్యం ఈ తంతు జరుగుతూనే ఉంది. అధికారులు వారు తగిన విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న తాగి నడపడం మాత్రం మానుకోవడం లేదు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు అంటూ అధికారులు ఆదేశించిన ప్రయాణీకుల్లో మాత్రం దృష్టి పెట్టడం లేదు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వాహనాదారులు మాత్రం తాగిన మైకంలో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికి జైలుకు పోతున్న సందర్భాలు ఉన్న, ప్రయాణికుల్లో మాత్రం చలణం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగినడపడమే అని చాలామంది వాదిస్తున్న వారికి ఆలోచనలు మాత్రం రావడం లేదు. తాగిన మైకంలో ద్విచక్ర వాహనదారులు వారి ఇష్టాను రీతిలో వాహనాన్ని నడుపుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రధాన రహదారిపై వాహనాల జోరు పెరిగింది. విందులు, వినోదాల పేరుతో దైవదర్శనాలకు వెళుతూ వచ్చేవారు కొంతమంది అయితే, తాగినడిపేవారు ఎక్కువగా ఉన్నారు.

వాహనదారుల తీరు మారాల్సిందే..

Drunk driving

తాగి నడిపిన పాపానికి కేవలం మనమే ఒకరికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. దీని ప్రభావం ఎన్నో కుటుంబాల పైన పడుతుంది. దీనితో వాహనదారులు సైతం తాగి వాహనాలు నడిపే ధోరణిని మానుకోవాలి, రామాయంపేట మండల ప్రాంతంలో తరచు ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాహనదారులు మారితే అందరికీ మేలు కలుగుతుంది.

తాగి నడిపితే జైలు శిక్ష తప్పదు..
ఎస్సై బాలరాజు రామయంపేట.

మందుబాబులు మద్యం సేవించి వాహనాలతో రోడెక్కుతున్నారా అయితే మీకు జైలు శిక్ష తప్పదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న వారిని కఠినంగా శిక్షించి జైలు శిక్షలు విధిస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడిపే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ న్యాయస్థానాలు కఠినంగా ఆదేశాలు జారి చేసిన వాహనదారుల్లో మాత్రం భయం ఏర్పడడం లేదు. ఇటీవలె మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకమైన వారి ప్రాణాలు బలిగొన్న సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి, వారికి కోర్టుల్లో జరిమానాలు జైలు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. అయినా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు.
మద్యం సేవించి రోడ్డుపై వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించి మద్యం సేవించిన వారిని పట్టుకుని కేసులు చేస్తున్నాం.మద్యం సేవించి వాహనం నడపడం నేరం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version