యువతమాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి…

యువతమాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం గోవిందా పూర్ గ్రామంలోజాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:45 గంటల వరకు శాయంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం వారిచే యువకులు గంజాయి డ్రగ్స్,గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్ద ని,గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచారం అందించాలి. ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, డయల్100, సీసీటీవీ కెమెరాలు, వృద్ధాప్యం లో తల్లితండ్రులను మంచిగ చూసుకోవాలని, మూడ నమ్మకాలపై మ్యాజిక్ షో, అలాగే తదితర సామాజిక అంశాలపై పాటల ద్వార వివరిస్తూ, మరియు సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ ఆప్స్ పై నాటిక ద్వార ప్రదర్శన చేస్తూ1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్ ఏ ఎస్ ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్స్ ఆఫీసర్స్, కళాబృందం ఇంచార్జ్ వుమెన్ ఏఎస్ఐ నాగమణి సభ్యులు, హెచ్ ఎస్ విలియమ్, వెంకటేశ్వర్లు,రత్న య్య, పిసి పూల్ సింగ్, హోమ్ గార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, చిరంజీవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

కలగానే బ్రిడ్జి నిర్మాణం… ఎన్నో ఏండ్లుగా…

కలగానే బ్రిడ్జి నిర్మాణం… ఎన్నో ఏండ్లుగా

నేరేడుపల్లి గ్రామస్తుల ప్రజలు ఎదురుచూపు

దశాబ్దాలుగా ప్రజల ఆశ నెరవేరేనా!

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామ స్తులు ఎదురుచూస్తున్నారు మండలానికి రావాలంటే చుట్టూ గ్రామాలు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం నిర్మించాలని ఏటా అధికా రులు ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతుందని ప్రజలు వాపోతున్నారు.

ఈసారైనా నెరవేరేనా!

 

 

 

గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మాణం కోసం రాజకీయ నాయకులు గ్రామ నాయకులు వేడుకున్న పట్టించుకోకపోవ డం కాని తర్వాత అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజ లు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ముందున్న లక్ష్యం కాబట్టి ఈసారి తమ కల నెరవేరుతుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు దశాబ్దాల తరబడి ఎదుర్కొం టున్న తమ సమస్యకు పరి ష్కారం చూపాలని నేరేడుపల్లి చలివాగు బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు

చుట్టూ తిరిగి వెళుతున్నాం

నేరేడుపల్లి,పత్తిపాక రహ దారిపైబ్రిడ్జికి మోక్షం కలిగే నా!.

ఇబ్బంది పడుతున్న రైతన్నలు.

శాయంపేటమండలం పత్తిపాక గ్రామం నుండి నేరేడుపల్లి పోవాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణంకు మోక్షం ఎప్పు డెప్పుడా అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలు మండలానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు ఏండ్ల తరబడిన బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయాల పార్టీలు నాయ కులు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం ఆ తర్వాత విస్మరిం చడం పరిపాటిగా మారింది. పత్తిపాక,నేరేడుపల్లె గ్రామానికి రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నా రు మండల గ్రామానికి అతి సమీపంగా ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు ఇబ్బందులు గురవు తున్నారు గత ప్రభుత్వం రోడ్డు మార్గము వాగు దాక వేసి కరెంటు అన్ని ఏర్పా టు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసు కుని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పుడైనా పూర్తి చేయాలి

ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూపులు మిగిలాయి ఈసారి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని, ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడో…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T135606.391.wav?_=1

 

పల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడో!

అద్వాన్నదారి,, ఎన్నాళ్ళు అవస్థలు

నేరేడుపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి..

యేండ్ల తరబడి రోడ్డు మార్గం లేని వాడ

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో మీసాల ఆయిలయ్య ఇంటి దగ్గర నుండి హనుమాన్ టెంపుల్ వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యింది.

 

 

 

 

పల్లె ప్రజలు నిత్యం తమ అవసరాలకు మండల కేంద్రానికి రాకపోకలు సాగించే గ్రామీణ రోడ్లు పూర్తిగా ధ్వంసం గుంతల మయంగా మారడం వారికి ఇబ్బందులు తప్పడం లేదు ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే మట్టిరోడ్డే దిక్కు! అది కూడా గుంతల మయంగా మారడంతో నడక నరకయాతంగా మారుతుంది ప్రతిరోజు పాఠశాల, కళాశా లకు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనులకు నిమిత్తం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తు లు పలుమార్లు బీటీ రోడ్డు వెయ్యాలని గత ఎమ్మెల్యేతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలి తంలేకపోయింది . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి అధికారులు నాయకులు రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకులు చొరవ తీసుకుని రోడ్డు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

గంగమ్మ ఒడిలోకి గణ నాథులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం మహిళలు యువతీ యువకులు భజనలు కోలాహాటాలతో బ్యాండ్ డీజే పాటలతో సాగింది చిన్న పెద్ద అంతా కలిసి శోభాయతులు ఉత్సాహంగా పాల్గొని ఆడి పాడారు చివరి రోజు కావడంతో గణనాధునికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు.ఈ క్రమంలో మండలం లోని పలు గ్రామాల్లో చెరువు లు కుంటలు ప్రాజెక్టుల వద్ద గణేష్ నిమజ్జనాలు కోలాహా లంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండపాల యువతీ యువకులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=2

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

ఆ రహదారిలో ప్రయాణం.. నరకంతో సమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T141236.528-1.wav?_=3

 

ఆ రహదారిలో ప్రయాణం.. నరకంతో సమానం

అడుగడుగునా భారీగుంత లు వాటిలో వర్షపు నీళ్ళు

తీవ్ర ఇబ్బందులు పడుతు న్న వాహన చోదకులు

 

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామం నుండి గంగిరేణిగూడెం గోరీకొత్తపల్లి రేగొండ భూపాలపల్లి కాలే శ్వరం వెళ్ళుటకు నర్సంపేట నుండి వయా మల్లంపల్లి ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం గత పది సంవత్సరాల క్రితం అప్పటి శాసనసభ స్పీకర్ మధుసూదననాచారి కాట్రపల్లి నుండి గంగిరేణిగూడెం వరకు ఒక కోటి 16 లక్షలతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను బీటీ రోడ్డు వేసి తీర్చడం జరిగింది.

 

 

వామ్మో ఈ రహదారిలో ప్రయాణించా లంటే నరకం కనిపిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు గుల్ల కావడం కాయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న ఈ మార్గం ఎక్కడో కాదు. ప్రజలకు ఈ రహదారి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ప్రయాణం సాగిస్తు న్నారు పాలకుల నిర్లక్ష్యానికి గురై కనీసం కాలి బాటలో కూడా నడవలేని దుస్థితి నెలకొం ది.గత 20 నెలలుగా అధికారం లోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మ లైన గ్రామాలను విస్మరించిం ది.కనీస అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది గ్రామా ల్లో పారిశుద్ధ్యంలోపించి అనేక రోగాలబారిన ప్రజలు పడుతు న్న గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్ఛేనిధులు రాకుండా రాష్టంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని కాట్రపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ అని ఫాగౌస్ విమర్శించాడు.

 

కావున రాష్ట్ర ప్రభుత్వం త్వర గా 42%బీసీ రిజర్వేషన్ అమ లు చేసి దొంగనాటకాలు ఆడ కుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వారు అన్నారు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీని కుడా గెలుచుకో లేని దుర్భార స్థితిలో ఉందని కాంగ్రేస్ భయపడుతుందని , ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఇప్పటికైనా స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకొని ఈ రహదారిని మర మ్మత్తు చేయించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ ప్రజలు బాబు పెద్ద రమేష్ బాబు సాంబయ్య పాక చిన్న రాజయ్య బాబు చిన్నన్న బాబు తిరుపతి బాబు శ్రీను బైకని సాంబయ్య అరే తిరుపతి పోతరాజ్ ఐలయ్య నూనెటి రమేష్ ఎల్లవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మతల్లికి వెండి తొడుగులు విరాళం.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T122529.944.wav?_=4

పోచమ్మతల్లికి వెండి తొడుగులు విరాళం.

వరంగల్, నేటిధాత్రి.

 

 

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య-లక్ష్మి దంపతులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష-శ్రీమాన్ దంపతులు, తమ అమ్మమ్మ వాళ్ళ గ్రామం అయిన హంటర్ రోడ్డు శాయంపేటలో, బస్వరాజు సారయ్య కుటుంబం తరపున హంటర్ రోడ్డు, శాయంపేటలో స్వయంభువుగా వెలసిన శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహానికి 5 కిలోల 250 గ్రాముల వెండితో తయారు చేసిన తొడుగులను బహుకరించారు. ఈ తొడుగులను రేపు, అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 7 గంటలకు గ్రామస్థుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి అలంకరించనున్నారు. ఈ సందర్భంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో అందరు ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పోచమ్మ తల్లి వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కుటుంబ సభ్యులు భక్తులందరికీ విజ్ఞప్తి చేశారు.

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు…

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు

సిఐ రంజిత్ రావు, ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఐ రంజిత్ రావు ఎస్సై పరమేష్ ప్రతిజ్ఞ చేయించారు. మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక దుష్పప్రహాలను వివరించారు అలవాటు పడితే వ్యక్తి ఆరోగ్యం భవిష్యత్తు కుటుంబం సమాజం నాశనం అవుతుందని హెచ్చరించారు కూడలి వద్ద ప్రజలతోని డ్రక్స్ రహిత జీవనశైలి పాటించడం చుట్టుపక్కల వారు మాదక ద్రవ్యాలకు బారిన పడకుండా చూడడం వాటి విక్రయం కొనుగోలు అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై అధికా రులకు సమాచారం అందిం చడం డ్రగ్స్ లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మత్తుపదార్థా లకు బానిసలుగా మారితే చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బం ది, యువతీ యువకులు ప్రజ లు అధిక మొత్తంలో పాల్గొ న్నారు.

శాయంపేటలో పండుగలా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు..

శాయంపేటలో పండుగలా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి;

శాయంపేట మండలకేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుక లను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి మరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వంగాలనారాయణ రెడ్డి, మండల యూత్ అధ్యక్షు లు మారేపల్లి మోహన్, సీని యర్ నాయకులు లక్ష్మారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీని వాస్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, లక్ష్మణ్, గంట శ్యాంసుందర్ రెడ్డి, మండ ల కోఆప్షన్ సభ్యులుమొహిబు ద్దిన్, మాజీ సర్పంచులు వలప దాస్ చంద్రమౌళి,పోతురమణా రెడ్డి, చింతనిప్పుల భద్రయ్య, గడిపే విజయ్, ధైనంపల్లిసుమ న్, కొమ్ముల శివ, చెన్నబోయిన అజయ్, విద్యాసాగర్, నర్ర రాజు, అట్ల తిరుపతి, రంగు మహేందర్, కుసుమ రమేష్ , కోల మచ్చయ్య, రాజ మహ మ్మద్, సదాశివరెడ్డి, ఆదిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రభాకర్, వైద్యుల సాంబరెడ్డి, మస్కి సుమన్ ,నాగరాజు , రేణిగుంట్ల సంతోష్ , ఎండి పాష, వినయ్, శ్రీను, సునీల్, శివ,మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న.!

శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని కమిటి చైర్మన్ రాజేశ్వరి సద్వినియోగం చేసుకోవాలన్నారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

వేసవి పిల్లల శిభిరం విద్యార్థులకు మంచి వరంలోఉందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుప్పానగర్ లో 24/04/2025 నుండి 14/05/2025 20 రోజులపాటలు స్వచ్చంద సంస్థ మయిన శ్రామిక్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న శిక్ష శిఖిరన్ని అమ్మ అద పాఠశాలల కమిటి చైర్మన్ రాజేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ శిక్షణా శిఖరం విద్యార్థులకు వరం లాంటింది దీనిని అందరు విద్యార్ధులు సద్వనియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిభిరం నిర్వహకులు ఆయేషా సిద్దిఖీ శిభిరం కో ఆర్డినేటర్లు, రాంచెందర్, అశోక్ సి ఆర్ పి షఫీయుద్దీన్ & యోజ్బెన్, అంగన్ వాడి టీచర్. శక్తిమంతులు పాల్గొన్నారు.aa

శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన.

శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటి ధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని సింగరకొండ రమేష్ గుప్తకు చెందిన రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రతకార్డు ఉన్న లబ్దిదారులకు భూపాల పల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారం భించి పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్రంలో ఈ సంవ త్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిల్వనున్నదని ,దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్య మంత్రి ఎనుములరేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పిం చాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు.

Congress

 

ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుందని,రాష్ట్రంలోని పేద ప్రజల ఆహారభద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవ డం వలన పక్కదారి పడు తున్నాయని అన్నారు.

వీటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి నిర్ణయం తీసుకుం దని అన్నారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

Congress

అనంతరం 32 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ. 10,63,500/- విలువ గల చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.

లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశా లల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుంద న్నారు.

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ,శాయంపేట ఎమ్మార్వో మండలములోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం చేయాలి

భజన మండలికి పోటీ తోపాటు బహుమతి ప్రధానోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పత్తిపా క గ్రామంలో శ్రీ సంజీవ ఆంజ నేయ స్వామి దేవాలయంలో 07-02-2025 శుక్రవారం రోజున అదిత్యాది నవగ్రహ పున:ప్రతిష్ట , శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది.ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. అదే రోజున ఉదయం 11 గంటలకు భజన మేళ కార్యక్రమాలు జరుపబడుచు న్నాయి.కావున పాల్గొనే ప్రతి భజన బృందం డ్రెస్ కోడ్ తో పదిమంది సభ్యులతో రావాలని ఎవరి వాయిద్య పరికరాలు వారే తెచ్చుకోగల రని కోరారు.ప్రతి బృందానికి సమయాన్ని బట్టి 15 నిమిషాలలో మూడు పాటలు పాడగలరు.పాల్గొన్న ప్రతి భజన మండలికి బహుమతి ప్రశంసాపత్రాలతో సత్కరించ బడునని సంజీవ ఆంజనేయ భజన మండలి మరియు శ్రీ రామాంజనేయ భజన మండలి పత్తిపాక భక్తులు తెలియజేశారు.భజన భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7702264370, 8790773601.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version