ఏకగ్రీవంగా రెండు గ్రామాలకు నూతన కమిటీ లా ఏర్పాటు.

ఏకగ్రీవంగా రెండు గ్రామాలకు నూతన కమిటీ లా ఏర్పాటు

ఏడపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చేకూర్తీ శ్రీనివాస్

సూరారం గ్రామ శాఖ అద్యక్షులు అయిల్ల అశోక్

బెల్లంపల్లి సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండల ఇన్చార్జి అంబల చంద్రమౌళి ఆదేశాల మేరకు మహాదేవపూర్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ ఆధ్వర్యంలో మండలంలో రెండు గ్రామాలకు నూతన గ్రామ కమిటీ వేయడం జరిగింది ఎడపల్లీ
గ్రామ శాఖ అధ్యక్షులుగా చేకుర్తి. సూరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆయిల్ల అశోక్ ఎన్నికైనారు అనంతరం కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది
శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గా చేకుర్తి రాజ లింగయ్య కార్యదర్శి చేకూర్తి రాజబాబు ప్రధాన కార్యదర్శి చేకుర్తి రాజయ్య కోశాధికారి ఆయిల్ల మహేష్ సూరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆయిల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి మండపల్లి విష్ణు కార్యదర్శి మీసాల సాంబం కోశాధికారి జిల్లెల అజయ్ ప్రచార కార్యదర్శి జిల్లేల రాజు వీరిని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశాలతో జులై 7న ఊరు ఊరులో దండోరా జెండా ఎగురవేసి సంబరాలు చేసుకోవాలని సామాజిక న్యాయం సాధించిన మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని కూడా జరుపుకోవాలని ఏబిసిడి వర్గీకరణ సాధించి పద్మశ్రీ అవార్డు తీసుకున్న మందకృష్ణ మాదిగ అని బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు ఈ గ్రామాల ఎన్నిక కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆయిల సమ్మ య్య తోటచర్ల దుర్గయ్య జిల్లెల్ల నాగరాజు చింతకుంట్ల రాము చింతకుంట సదానందం చేకుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మాజి ఎంపీటీసీ రజినీ సంతోష్ మల్లిపాటెల్ గార్ల ఆహ్వానం మేరకు కక్కర్వాడ గ్రామంలో నిర్వహించిన నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ ,పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా,మాజి సర్పంచ్ భోజి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

సరికొత్త అధ్యాయం.

సరికొత్త అధ్యాయం…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్న జట్టు దక్షిణాఫ్రికా.

చోకర్స్‌ (కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తయ్యే జట్టు)గా ముద్ర వేసుకొన్న సఫారీలు ఇప్పుడు చాంపియన్లుగా నిలిచారు.

దిగ్గజాల వల్ల కానిది..: ఏబీ డివిల్లీర్స్‌, గ్రేమ్‌ స్మిత్‌, గ్యారీ కిర్‌స్టెన్‌, అలెన్‌ డొనాల్డ్‌, జాక్‌ కలిస్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టు కోసం ఎంతో శ్రమించారు. వీరందరి కృషితో జట్టు మెరుగుపడినా..

ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే అయింది. ఎట్టకేలకు మార్‌క్రమ్‌, బవుమా అద్భుత పోరాటంతో సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

ఓటములను దిగమింగుకొని నాకౌట్స్‌లో నిరాశ.. సఫారీలకు 1992 నుంచి వెంటాడుతోంది. ఆ వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో వరుణుడి రూపంలో షాక్‌ తగిలింది.

1999 వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియాతో సెమీస్‌ మ్యాచ్‌ టై కావడం అనేది ఎప్పటికీ గుండెల్లో ముల్లులాంటిదే. గతేడాది జూన్‌ 29న జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. ఏడాది తిరిగే సరికి ‘జూన్‌ 14’ను సువర్ణాక్షరాలతో లఖించదగ్గ రోజుగా మార్చుకొంది.

కెరీర్‌ చివర్లో ఉన్న రబాడ.. ఫైనల్‌ మ్యాచ్‌లో కంగారూల పనిబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన మార్‌ క్రమ్‌.. భారీ శతకంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరి పోరాట స్ఫూర్తితో సౌతాఫ్రికా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

బానిసలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తోనే ఈ స్థాయి.

ఉనికి కోసమే పుట్ట మధుకర్ కొత్త నాటకం, తాను అధికారంలో ఉన్నప్పుడు భార్యకు చైర్మన్ పదవి.

తన కొడుకు పబ్లిక్ సిటీ చెల్లలేదు, శీను బాబు పై అనుచిత వ్యాఖ్యలు.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై విరుచుకుపడ్డ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రాజబాబు.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెట్టి కొత్త కుట్రను తెరలిపి తందుకు పుట్ట మధుకర్ ప్రయత్నిస్తున్నాడని, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. మంథని కేంద్రంగా పుట్ట మధుకర్ చేసిన కామెంట్లపై కోట రాజబాబు తీవ్రంగా ఖండిస్తూ పత్రిక ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బానిసలు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు గుర్తింపు విలువలు ఇస్తూ పదవులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారిదని, పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు, మంథని నియోజకవర్గంలో పుట్ట మధుకర్ ప్రజల్లో ఉనికిని కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెడుతూ కొత్త నాటకానికి తీరలేపడం జరిగిందని అన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ 84 లోనే సమితి కోఆప్షన్ సభ్యుడిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ మహదేవ్పూర్ నుండి రెండు మార్లు సర్పంచ్ గా అవకాశం కల్పించడం జరిగిందని అంతేకాకుండా కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ పదవితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, ఒకటి రెండు కాదు అనేక అత్యున్నత స్థానాలు కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ శ్రీపదరావు తో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తనకు అందించడం జరిగిందని రాజబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని అసత్యపు అర్థం లేని మాటలతో ఒక కొత్త నాటకాన్ని తెరలిపి ప్రయత్నం నియోజకవర్గ ప్రజల వద్ద చల్లదన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం గౌరవం ఇచ్చిందన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని, సాధారణ వ్యక్తిగా ఉన్న పుట్ట మధుకర్ కు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు కల్పించిన విషయం మర్చిపోయి కార్యకర్తలను బానిసగా అభివర్ణించడం సిగ్గుచేటని అన్నారు. పుట్ట మధుకర్ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు వారి సతీమణి శైలజాకు మంథని మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించడం జరిగిందని, కానీ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇక్కడ న్యాయం చేశారు అని రాజబాబు ప్రశ్నించారు. అలాగే పుట్ట మధుకర్ కొడుకు నియోజకవర్గంలో తిరిగినప్పటికీ కూడా పుట్ట మధుకర్ కు ఎమ్మెల్యే ఎన్నికల్లో కొడుకు పబ్లిసిటీ లో ఫీల్ కావడం జరిగిందని, కోపంతో మంత్రి సోదరు శీను బాబు పై ఆరోపణలు చేస్తున్నాడని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో శీను బాబు కు ప్రధాన కార్యదర్శి నియమించడం పార్టీ అంతర్గత విషయం అని కొడుకు పబ్లిసిటీ ఫెయిల్ అయితే సంవత్సరాల కాలంగా పెద్దపల్లి మంథని నియోజక వర్గాల్లో పార్టీ కోసం ఒక కార్యకర్తల పనిచేస్తున్న శీను బాబుకు గౌరవం దక్కిందన్న విషయం పుట్ట మధుకర్ జీర్ణించుకోలేకపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంపై మాట్లాడే నైతిక హక్కు పుట్ట మధుకర్ కు లేదన్న విషయం గుర్తుంచుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.

నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ.

— నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండల పరిధిలోని కే. వెంకటాపూర్ నూతన పోలింగ్ కేంద్రాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 1200 కు పైగా ఓటర్లు ఉన్నారని స్థానిక అధికారుల నివేదిక మేరకు నూతన పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమద్ లు ఉన్నారు.

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

నూతన మున్సిపల్ కమిషనర్ కు ప్రజల విన్నపం.

పేరుకుపోతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు. వాటిని పరిష్కరించటంలో అధికారుల అలసత్వం.

మున్సిపల్ కార్యాలయంలోనే ముద్దులు పెట్టుకున్న ఉద్యోగులపై వారం గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రధాన కార్యాలయంలో రాత్రి పది గంటలకు కూడా థంబ్ వేస్తున్న ఉద్యోగులు.

మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించిన చర్యలు తీసుకొని అధికారులు.

ఎక్కడ కట్టడం జరిగిన అక్కడ మున్సిపల్ సిబ్బంది ప్రత్యక్షం కావడం. ఎంతో కొంత ఇస్తే కానీ వదిలి పెట్టరు.

కమర్షియల్ కాంప్లెక్ నిర్మాణాలకు “మేయర్ ప్రత్యేక అనుమతి” ఉంటేనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనులు?

కమీషనర్ లు వస్తున్నారు, పోతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీలో బాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కరీంనగర్ నుండి బదిలీపై వచ్చి, శుక్రవారం నాడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ చాహాత్ బాజ్ పేయి. నూతన కమిషనర్ కి బల్దియాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు. కమీషనర్ లు మారుతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

పెరుగుతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు

నగర ప్రజలు వారి సమస్యల పట్ల గ్రీవెన్స్ లో దరఖాస్తులు ఇస్తున్నారు, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను గుర్తించి, పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన సంబంధిత అధికారులు అలసత్వం చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నూతన కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు నగర ప్రజలు.

“మున్సిపాలిటీ ముద్దులాట” లకు నోటీసులు?

ప్రభుత్వ కార్యాలయంలో ముద్దులు పెట్టుకున్న ఇద్దరు ఉద్యోగులకు “సిడిఎంఏ” నుండి నోటీసులు అందినట్లు సమాచారం. వారిపై వారం రోజులు గడిచిన ఎలాంటి చర్యలు లేవని, ఇద్దరిని వేర్వేరు కార్యాలయాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. తాము చేసిన తప్పుకు కొంచెం కూడా పశ్చాతాప్తం లేని “సదరు ఉద్యోగులు”? పైగా తాము చేసింది తప్పు కాదు అంటూ, తప్పును కప్పి పెడుతూ, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని రాజకీయ నాయకుల లాగా ఆరోపణలు చేయడం. మున్సిపల్ కార్యాలయంలో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడానికి అదేం పార్క్ కాదు, ప్రైవేట్ ప్లేస్ కాదు. పబ్లిక్ కార్యాలయం అనేది గుర్తు పెట్టుకోవాలి సదరు ఉద్యోగులు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉంది వీళ్ళ ప్రవర్తన. కొన్ని రోజులుగా వీళ్లు కార్యాలయంలో చేసే పనులు చూసి, విసిగి వేసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మారని తీరు. “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమా లాగా మున్సిపల్ ఆఫీసులో “అన్నాచెల్లెళ్ల” బంధానికి కొత్త అర్థం చెబుతున్న కొందరు ఉద్యోగులు. గత శని, ఆదివారాలు సెలవు రోజులు లేకుంటే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రేమ జంటలపై ప్రత్యేక డిబేట్లు కూడా ఉండేవేమో. మీకేమి కాదు మేమున్నాం అంటూ ఓ అధికారి, కొందరు రిపోర్టర్లు అభయ హస్తం ఇచ్చినట్లు వినికిడి? నూతన కమిషనర్ ఈ అంశంపై చర్యలు తీసుకుంటారా లేదా అని కొందరు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అనేది తోటి ఉద్యోగుల వాదన.

థంబ్ ఎప్పుడైనా వేస్తాం మా ఇష్టం

 

 

New Municipal Commissioner.

 

 

 

 

మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో రాత్రి 8 గంటల తరువాత స్టైల్ గా నిక్కర్ టీ షర్ట్ వేసుకుని రావడం మున్సిపల్ కార్యాలయంలో థంబ్ వేసి వెళ్తుంటారు కొందరు ఉద్యోగులు. అసలు ఎవరు వీళ్లు ఎక్కడ పని చేస్తున్నారు రాత్రి వేళ వచ్చి థంబ్ వేయడం ఏంటి.
మరి కొందరు మహిళా ఉద్యోగులు ఏకంగా కారులో వచ్చి, దర్జాగా సాయంత్రం 7 తరువాత థంబ్ వేయడం.
వీళ్లు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేసే నాథుడే లేడు. పట్టించుకునే అధికారి పర్వాలేదు అంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి వృతి రీత్యా ఉదయాన్నే ప్రధాన కార్యాలయంకు వచ్చి హాజరు వేసి, కొందరు బయటకు వెళ్లి నగరంలో పనిచేస్తూ, సాయంత్రం ఆరు గంటల లోపు ఆఫీసుకు వచ్చి హాజరు వేసి ఇంటికి వెళ్ళడం మనం సామాన్యంగా చూస్తాం.. కానీ ఇక్కడ వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లడం సహజం. సాయంత్రం వేళ థంబ్ వేయడానికి రాత్రి పది గంటలకు మున్సిపల్ కార్యాలయంకు వచ్చి వేయడం జరుగుతుంది అదేందో మరి అర్థం కావడం లేదు అని అంటున్నారు కొందరు ఉద్యోగులు. పని వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు అనుకున్న కానీ వీరు మాత్రం పని చేస్తున్నారో లేదో తెలియదు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మున్సిపాలిటీ ఉద్యోగులు థంబ్ వేయడంపై దృష్టి సారించాలని అంటున్నారు కొందరు ఉద్యోగులు.

ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి కబ్జా?

మున్సిపల్ ప్రధాన కార్యాలయం గేటు ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించుకొని పనులు చేయడం జరుగుతుంది. మున్సిపల్ స్థలాన్ని ఎవరు లీజుకు ఇచ్చారు ఎన్ని యేండ్ల పాటు ఇచ్చారు? అనేది అధికారులకే తెలియాలి. ప్రధాన కార్యాలయం గేట్ ముందు వినాయక విగ్రహాల తయారీకి సంబంధించిన వాటిని గేట్ ముందే పెట్టడం, రోడ్డు మీద పనులు చేస్తూ మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ఆగం ఆగం చేస్తున్న పట్టించుకొని అధికారులు.

బల్దియాలో సమస్యలు అనేకం. వాటిని అధిగమించి ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తూ. నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

 

 

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. చాహాత్ బాజ్ పేయి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన కమీషనర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాను. అంతకంటే పెద్ద అయినా గ్రేటర్ వరంగల్ కు కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను అని తెలిపారు.

రాష్ట్రానికి నూతనంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి.

రాష్ట్రానికి నూతనంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి

బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

పరకాల నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్య అభివృద్ధికీ నోచుకోలేకపోయిందని
బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చేతిలో విద్యాశాఖ నూ తీసుకొని సంవత్సరం గడిచిపోయిన కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లు ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేద మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ల మీదనే ఆధారపడి చదువుతున్నారని ఇప్పుడు అవి రిలీజ్ కాకపోవడంతో విద్యార్థులు పైచదువులు చదవలేని పరిస్థితిలు ఉన్నాయన్నారు.కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బడా కార్పొరేట్ విద్యాసంస్థల యజమాన్యాలకు లక్షలలో ఫీజులు కట్టడం జరుగుతున్నదని ఇంత జరుగుతున్నా కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు.

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధి.

సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్..

విజయవంతంగా దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వార్షిక మహాసభ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ వలన సంఘాల్లో సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు.

దుగ్గొండి మండల కేంద్రంలో గల
దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన ఆ సమితి 12 వ వార్షిక మహాసభ కార్యాలయం ఆవరణలో జరిగింది.

సమితి పరిధిలోని దుగ్గొండి,చంద్రయ్యపల్లి,దేశాయిపల్లి, రేబల్లె,వెంకటాపురం,నేరేడుపల్లి,
వసంతాపురం,ప్రగతిసింగారం,అక్కంపేట అనే 10 సంఘాలు ఉండగా మొత్తం 4382 మంది సభ్యులు కాగా మొత్తం రూ.10 కోట్ల నిధులు ఉన్నాయి.

సమితి నిర్వహణ పట్ల స్థితిగతులు,అభివృద్ధి పట్ల చర్చించుకున్నారు.

ఈ నేపథ్యంలో 2024-25 వార్షిక నివేదికను అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,గణకులు పోలోజు రమణాచారిలు చదివి ప్రవేశపెట్టారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న సహకార వికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సహకార సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు మంచిన నడిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశ్యంతో సహకార వికాస సంస్థ ఏర్పాటు చేయగా నేడు స్వకృషీ ఉద్యమం వజయవంతంగా నడుస్తున్నాయని తెలియజేశారు.

 

Development

 

1995 చట్టం ద్వారానే రాజకీయ పార్టీలకతీతంగా సహావికాస సంస్థ సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

సహకార ఉద్యమంలో 54 సమితిలు ఉండగా సేవా దృక్పథంతో నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.

 

సిడీఎఫ్ ధర్మకర్తల మండలి ప్రతినిధి దర్మవతి మాట్లాడుతూ సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి కీలకమని అన్నారు.రానున్న రోజుల్లో సభ్యులు ,సంఘాలు ఇబ్బందులు పదద్దనే ఉద్దేశ్యంతో సహావికాస కార్యశాల నిర్ణయించిందని దీంతో కొన్ని ఖాతాలు నిలిపివేసిందని తెలియజేశారు.

సిడీఎఫ్ అభివృద్ధి అధికారి నవీన్ మాట్లాడుతూ సంఘాల్లో బకాయి శాతం జీరో చేస్తేనే మెరుగు లభిస్తుంది అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు కందికొండ రవీందర్,సంఘాల అధ్యక్షులు,సమితి పాలకవర్గ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, మోతుకూరి ప్రభాకర్,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి,బట్టి బక్కయ్య,పొగాకు రమేష్ గౌడ్,వేములపల్లి బాబు,పెండ్యాల మల్లేశం,రాయరాకుల రమేష్,ప్రేమ్ సాగర్,ఆయా సంఘాల ఉపాధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు,గణకులు పాల్గొన్నారు

నూతన తహసీల్దార్ కు సన్మానం.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

పలు సమస్యలు తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టులు.

జర్నలిస్టులపై ఫారెస్ట్ దౌర్జన్యం, వెంటనే చర్యలు తీసుకొని జర్నలిస్టుల భూమిని అప్పగించాలని వినతి.

సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నూతన తహసీల్దార్, రామ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

మహాదేవపూర్ నూతన తాసిల్దారుగా వై రామారావు బాధ్యతలను స్వీకరించడం తో స్థానిక పాత్రికేయులు తాసిల్దార్ కు సన్మానించడం జరిగింది. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వై రామారావు ఖమ్మం జిల్లా మదికొండ మండల తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై మహాదేవపూర్ తాసిల్దార్ గా వై రామారావు బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కు, శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక పాత్రికేయులు శాలువతో సన్మానించడం జరిగింది. అనంతరం పాత్రికేయులు నూతన తహసిల్దార్ కు మండలంలోని పలు ప్రధాన సమస్యలలో ఒకటైన భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డ్, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభానికి ముందు అందించేలా చూడాలని, మండలంలో పలు భూ సమస్యలపై దృష్టి సాధించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు సిబ్బందికి ఆదేశించాలని కోరడం జరిగింది. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఫారెస్ట్ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వే పేరుతో కాలయాపన చేసి జర్నలిస్టులకు గూడు కట్టుకోకుండా చేస్తున్నారని, తక్షణమే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని జర్నలిస్టులకు అందించేలా చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన నూతన తహసిల్దార్ మండలంలోని సమస్యలపై పరిష్కారం కొరకు సాధ్యమైనంత త్వరలో విచారణ చేసి ప్రజలకు అలాగే పాత్రికేయులకు భూ సమస్య ను పరిష్కా రిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తహసిల్దార్ కు కలిసిన వారిలో సీనియర్ పాత్రికేయులు, టీ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ జమీల్,మిన్నుభాయ్, రిపోర్టర్ లు ఉన్నారు.

జహీరాబాద్ నూతన ఎస్సైగా వినయ్ కుమార్.

జహీరాబాద్ నూతన ఎస్సైగా వినయ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ నూతన ఎస్సై గా బదిలీ పై వచ్చిన కె. వినయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పట్టణ ఎస్సై గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం.

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ప్రారంభించడం జరిగింది.
శుక్రవారం రోజు మండలంలోని సూరారం మూల మలుపు వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇంధన విక్రయ కేంద్రం, వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడిన వినాయక పెట్రోల్ పంతులు, బాజీ జడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ ప్రారంభించారు, మారుమూల ప్రాంతంలో ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అన్నారు. పెట్రోల్, డీజిల్ కొరకు రైతులు మండల కేంద్రానికి, రావాల్సి వస్తుండేదని గ్రామంలో ఇండియన్ ఆయిల్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ఇందాన కేంద్రం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వినాయక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన యజమాని కిరణ్ కు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపుతూ, నాణ్యత పరిమాణాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందించాలని కోరారు. వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభంలో గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల

పరకాల నేటిధాత్రి

 

పరకాల మండల ఎరువులు పురుగు మందులు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు, ఎర్ర లక్ష్మణ్ లను తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు,కార్మిక సంఘ నాయకులు లంకదాసరి అశోక్ లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని కోరారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజి పాక్స్ చైర్మన్ బస్వరాజు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్ , బస్వరాజ్ తదితరులు.

రూ.2,200 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి.

రూ.2,200 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి

అప్పటివరకు 25వేల పనుల ప్రతిపాదనలు కలెక్టర్ల పరిశీలనలోనే

పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం తీవ్ర జాప్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల మంజూరుపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కలెక్టర్లకూ అదే సూచన చేసింది.

గత ఏడాది (2024-25) చేపట్టిన పనులకు కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రూ.2,200 కోట్లకు చేరాయి.

ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్ గత మూడు నెలల్లో నాలుగుసార్లు దిల్లీ వెళ్లి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.

ఈ పరిణామాలతో కొత్త పనుల మంజూరుకు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం తొందరపడట్లేదు. బిల్లుల పెండింగ్ కారణంగా కొత్త పనులు చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువగా ఉంటారన్నది ఒక కారణమైతే..

Pending Bills.

 

 

వర్షాలు మొదలైనందున ఆదరాబాదరాగా చేసే పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించే అవకాశం ఉందన్నది మరో కారణం.

ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 25వేలకు పైగా కొత్త పనుల ప్రతిపాదనలను కలెక్టర్లు తాత్కాలికంగా పక్క పెట్టారు.

వర్షాకాలం ముగిశాకే కొత్త రోడ్ల పనులు

పూర్తయిన పనులను పోర్టల్లో అప్లోడ్ చేసిన 45 రోజుల్లో కేంద్రం బిల్లులు చెల్లించేది.

గత ఏడాది చేసిన మెటీరియల్ పనులకు అన్ని రాష్ట్రాలకూ అక్టోబరు నుంచి నిధులు నిలిపివేసింది.

గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 2025-26 వార్షిక ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ నుంచే కొత్త పనులు మొదలవ్వాలి.

ఈ ఏడాది కూడా 4,000 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని రాష్ట్రప్రభుత్వం భావించింది.

పనులను తాత్కాలికంగా పక్కన పెట్టి కేంద్రం ఇచ్చే నిధుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

మరో రెండు వారాల్లో అవి విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అయినా వర్షాకాలం ముగిశాకే పనులు మంజూరుచేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

తాత్కాలిక సర్దుబాటుకు సమస్యలు

ఉపాధిలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున తాత్కాలికంగా నిధుల సర్దుబాటుకు సాంకేతిక సమస్యలు అడొస్తున్నాయి.

ఉపాధి సిబ్బందికి రెండు నెలల జీతాల బకాయిల చెల్లింపులకు ఇటీవల రూ.60 కోట్లు సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

మెటీరియల్ పనులకు బిల్లుల విషయంలో వెనకడుగు వేస్తోంది.

ఉపాధి పనులకు మెటీరియల్ సరఫరా చేసే వెండర్లకు కేంద్రం నేరుగా బిల్లులు చెల్లిస్తోంది.

గతంలో పంచాయతీలకు చెల్లించేది. 2019-24 మధ్య వెండర్ విధానం తీసుకొచ్చింది.

 

Pending Bills.

 

 

మెటీరియల్ సరఫరాదారులను వెండర్ల కింద రిజిస్ట్రేషన్లు చేయించారు. వారికే కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా నిధులు సర్దుబాటు చేసినా ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం అసాధ్యమని అధికారులు అంటున్నారు.

ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల నిర్వహణకు లేబర్ బడ్జెట్లో 4% నిధులు పరిపాలన ఖర్చులకు (అడ్మిన్ కాస్ట్) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తోంది.

దీనివల్ల సిబ్బంది జీతాలకు ప్రస్తుతం సర్దుబాటు చేసిన రూ.60 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేశాక తిరిగి వెనక్కి తీసుకునే వీలుంది.

మెటీరియల్ పనుల బిల్లులు నేరుగా వెండర్లకు చెల్లిస్తున్నందున, ప్రస్తుతం నిధులు సర్దుబాటు చేసినా తరువాత వెనక్కి రావడం కష్టమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

నేటి ధాత్రి

 

 

 

తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు నూతన వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణం శుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మున్సిపల్ వాహనాల కొత్త సదుపాయం ఎంతో అవసరం. ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్యాలయానికి అందిన ఈ వాహనాలు — ప్రత్యేకించి కచ్రా వాహనాలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర ఉపయుక్త వాహనాలు — పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు తోడ్పడతాయి..

పట్టణంలోని పారిశుద్ధ్య పరిరక్షణ, డ్రైనేజ్ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను శక్తివంతం చేస్తోంది..

అలాగే, మున్సిపల్ సిబ్బంది సమర్థంగా పనిచేస్తే పట్టణ వాతావరణం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని నేను కోరుతున్నాను..

ఈ కార్యక్రమంలో కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు..

కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్..

కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్.. ఈ ప్రాంతాలకు అస్సలు వెళ్లకండి

 

నేటిదాత్రి :

 

 

 

 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

మహారాష్ట్రలో రెండు కేరళ,తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో మరణం నమోదు అయ్యింది..

యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ,పశ్చిమ బెంగాల్ ,కర్ణాటకలోనే ఉన్నాయి ..

కేరళలో అత్యధికంగా 1416 యాక్టివ్ కేసులున్నాయి,మహారాష్ట్రలో 494, ఢిల్లీలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు.

కేరళలో తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతు 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు..

మహారాష్ట్రలో 70, 73 ఏళ్ల మహిళలు మృతి చెందారు..

తమిళనాడులో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 69 ఏళ్ల మహిళ మృతి చెందారు.

పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్, సెప్టిక్ షాక్, తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మృతి చెందింది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో 28,తెలంగాణలో 4 యాక్టివ్ కేసులున్నాయి..

ఒడిశాలో 15 యాక్టివ్ కేసులు,కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

2020-21-22 తరువాత కోవిడ్ కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది..

వైరస్ వేరియంట్లలో వస్తున్న మార్పులు ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణంగా గుర్తించారు వైద్య అధికారులు..

COVID 19 వేరియంట్ ఓమిక్రాన్ NB.1.8.1, భారతదేశం అంతటా కేసుల పెరుగుదలకు కారణం.

ఇది అంటువ్యాధి, పరివర్తన చెందే వ్యాప్తి చెందే లక్షణం కలిగింది..అందుకే ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది

కోవిడ్ లక్షణాలు..

 

జ్వరం, దగ్గు,జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు, అలసట ముక్కు కారటం వంటివి తాజాగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)వెల్లడించింది… ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి సైతం మారుతున్న వేరియంట్ల రీత్యా కోవిడ్ సోకే అవకాశం ఉంది… సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం , పరిశుభ్రత పాటించడం కోవిడ్ దరిచేరకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలుగా కొనసాగుతున్నాయి..

దేశంలో కేసుల పెరుగుదల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆసుపత్రులకు,ప్రజలకు సూచనలు జారీ చేశాయి..

 

పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు పునరుద్ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో ఆసుపత్రులు హై అలర్ట్‌లో ఉంచాయి.

అనేక ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులను సైతం ఏర్పాటు చేస్తున్నాయి..

ప్రస్తుత కోవిడ్ కేసుల పెరుగుదలతో భయపడవద్దని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు తెలియజేసింది.

13 బంతుల్లో మదగజంలా మీదదిపోయాడు..
పాములను పట్టి అడవిలో వదులుదామకున్నాడు..
కట్ చేస్తే..
పైకి చూసి మందు సిట్టింగ్ అనుకునేరు..
అసలు విషయం తెలిస్తే కోవిడ్ కేసుల పెరుగుదల..
కేంద్రానికి నోటీసులు..

 

దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగియలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

కోవిడ్ శాంపిల్స్ సేకరణ, సేకరణ కేంద్రాలు,శాంపిల్స్ రవాణాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది..

జనవరి 27, 2023న డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం చర్య తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ డాక్టర్ రోహిత్ జైన్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు..

కోవిడ్ శాంపిల్స్ సేకరణ విధానాలు, సేకరణ కేంద్రాల పనితీరు నమూనాల రవాణాకు కనీస ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదని జైన్ పేర్కొన్నారు.

దీంతో కోవిడ్ పరీక్షల విధానంపై ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ (CGSC) మోనికా అరోరాను ఆదేశించింది.

తదుపరి విచారణ జూలై 18న కొనసాగనుంది.

వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి.

నియోజకవర్గం వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,నియోజకవర్గం, మండల,గ్రామల నూతన కమిటీ నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ అధ్యక్షులకు నియమించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిను సంగారెడ్డిలో కలసి వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా వివిధ మండలలాల నుండి నూతన కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు.ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం నుండి జహీరాబాద్ లో నూతన అధ్యక్షులకు మార్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే 2018- 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని ఆమెకు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తప్పకుండ నూతన మండల కమిటీని వేయడం జరుగుతుంది అన్నారు. త్వరలో జహీరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముల్తాని మక్సుదలిసాబ్ హదునూర్ మస్తాన్ అలీ హదునూర్ సమీబాయి మిర్జాపూర్ నరసింహులు మలిగి రియాజ్ భాయ్ చాలు కి కోయిరు మండల్ మొగుడంపల్లి మండల్ న్యాల్కల్ మండల్ జైరాబాద్ టౌన్ నుంచి తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి నూతనంగా వచ్చిన డీఎస్పీ సైద్ నాయక్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జహీరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) అధ్యక్షుడు చెల్మెడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి ఆఫీసర్ జహీరాబాద్ ప్రాంతానికి రావడం శుభ పరిణామం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టీ వై జె ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బి. నగేష్ , జనరల్ సెక్రెటరీ ప్రకాష్ కుమార్, టీ వై జె ఎఫ్ ట్రెజరీ మహేష్ కుమార్, కోఆర్డినేటర్ కె అశోక్ కుమార్, కోఆర్డినేటర్ రాములు, ఝరాసంగం టీవైజెఎఫ్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చారకొండ, వెల్దండ, కల్వకుర్తి మండలాలకు చెందిన రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో.. లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న రైతులు నూతన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లకు దరఖాస్తు చేసుకున్నారని.. లో వోల్టేజీ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి మంజూరు చేయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనందకుమార్, బాలాజీ సింగ్, సంజీవ్ యాదవ్,జిల్లెల్ల రాములు, దున్న సురేష్, పడకండి వెంకటేష్, చంద్రకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం అల్గోల్ రోడ్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది . దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో సభ్యులు వి ప్రభాకర్ గౌడ్ కే సురేందర్ రెడ్డి రమేష్ బాబు బరోరు లక్ష్మి బి. శ్రీనివాస్ అఫీషియల్ మెంబర్ ఎం సంగమేశ్వర స్వామి స్వీకారం చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version