షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రచారం నిర్వహించిన
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం షేక్ పేట్ డివిజన్లోని బూత్ నెంబర్ 63 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులూ డాక్టర్” సిద్ధం ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా, హస్తం గుర్తుకే ఓటు వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలుపించాలన్నారు.ఈకార్యక్రమంలో షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు జహీరాబాద్ నాయకులూ పి శ్రీకాంత్ రెడ్డి రంగ అరుణ్ జావీద్ మొహిన్ ఆత్మ డైరెక్టర్ బి రవి కుమార్ లాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
