జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!
◆:- మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం!
◆:- రహ్మత్ నగర్ డివిజన్ శ్రీ రామ్ నాగర్ లో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తో కలిసి రహమత్ నగర్ డివిజన్ గడప గడప తిరుగుతూ బి.ఆర్.ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గంగా నగర్ 110,151, బూత్ లలో ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ముర్తజా నియోజకవర్గ సీనియర్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
