రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T143615.810.wav?_=1

రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు.

జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని ఆమె అభివర్ణించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత తనదైన శైలిలో స్పందించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రిగ్గింగ్‌ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ది అసలు గెలుపే కాదని.. నైతికంగా తానే గెలిచానని ఈ సందర్భంగా మాగంటి సునీత స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. 24, 658 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ గల్లంతయింది.
ఈ ఏడాది జూన్ 8వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అంటే.. నవంబర్ 14వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో సైతం కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించిన విషయం విదితమే.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version