నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు.

జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో ఎండిన మొక్కజొన్న పత్తి పంటలు

ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు..వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి.

◆ జాడలేని వానలు…

◆ ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు…

◆ అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు వరుణుడు మొఖం చాటేశాడు పంటలన్నీ ఎండిపోతున్నాయి.

పెట్టుబడులు రాని దుస్థితి అప్పులు మీదపడ్డాయి బతుకు కష్టమవుతోంది మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు.

అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరైన వర్షాలు కురవక ఖరీఫ్ సాగక రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు.

వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి.

20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి.

బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది.

దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతోఈసారి ఖరీఫ్కు సన్నద్ధమయ్యారు.

ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు.

వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి.

కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు.

పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక సంగారెడ్డి పట్టణంలోని కూలీల అడ్డమీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారజిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పత్తి పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు.

కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగ పత్తి మినుములు, పెసర్లు, కందులు, పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయ బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు.

జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు.

ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మక్క ఎండిపోయింది సారూ.

రెండెకరాల పొలం ఉంది అందులో రూ. 20వేల అప్పు చేసి పత్తి కందులు పంట వేశాను.

తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది.

దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా ఇక్కడ కూడా పనిదొరకడం లేదు ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు బొరేగౌ మొహమ్మద్ నవాబ్

రెండెకరాల పత్తి పోయినట్టే

నాకు రెండెకరాల పొలం ఉంది అందులో రెండు బోర్లున్నాయి వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి పత్తి పంట సాగుచేశాను.

వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి పంట ఎండిపోతోంది అడ్డమీద పనికొచ్చినా పనిచెప్పేవారే లేరురైతు మాచునూర్ ఖలీల్.

పనులు చూపించాలి

మళ్లీ కరువు మొదలైంది పంటలుఎండిపోయాయి ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి.

బుక్కెడు కూడు కోసం అడ్డమీద పడిగాపులే వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి.  మేదపల్లి పరమేశ్వర్ పటేల్

పోషణ భారమైంది.

నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పత్తి పంట వేసిన. వర్షాలు కురవక ఎండిపోయింది అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి.

బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు.

కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు ప్రభుత్వమే పనులు చూపించి తుమ్మనపల్లి మొహమ్మద్ రోషన్.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version