మృతుడి కుటుంబానికి పరామర్శ…

మృతుడి కుటుంబానికి పరామర్శ

ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక,(కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరం మల్లయ్య 70 సం శుక్రవారం రోజున రాత్రి మృతి చెందగా, మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మృతికి గల కారణాలు తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు. మృతుడి అంత్యక్రియల నిమిత్తం 5000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల కిరణ్ గుప్తా,దూలం సమ్మయ్య గౌడ్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల సమ్మయ్య, మోరెచంద్రయ్య తదితరులు ఉన్నారు.

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా..

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా

 

నడికూడ,నేటిధాత్రి:

 

కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండల కేంద్రంలో ఇటీవీలే వివిధ కారణాలతో మృతిచెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు దుప్పటి రవి, తాళ్ళ మల్లయ్య,తాళ్ళ సమ్మయ్య కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నువ్వు శెట్టి చంద్రమౌళి (చందు) మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, మాజీ ఉపసర్పంచ్ కిన్నెరమని,గోడిశాల రంజిత్ కుమార్,దుప్పటి మొగిలి, రమేష్,అల్లూరి మొగిలి, రావుల కిషన్,నెవరుగొమ్ముల ప్రభాకర్ రావు,దురిశెట్టి రేవంత్,చందా కుమారస్వామి తదితరులు ఉన్నారు.

ఉల్లెంగల యాదగిరి నేతృత్వంలో పరామర్శలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T162844.055.wav?_=1

 

 

ఉల్లెంగల యాదగిరి నేతృత్వంలో పరామర్శలు

రాంనగర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల పరామర్శ కార్యక్రమం

నేటి ధాత్రి అయినవోలు :-

 

అయినవోలు మండలం రాంనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ నాయకుడు ఉల్లెంగల యాదగిరి నేతృత్వంలో గ్రామస్తురాలు ఉల్లెంగల ఉప్పలమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
పల్లంకొండ గోపయ్యను పరామర్శించిన యాదగిరి అదేవిధంగా, మండల కాంగ్రెస్ నాయకుడు పల్లంకొండ గోపయ్య అనారోగ్యంతో ఉన్నట్లు తెలుసుకున్న యాదగిరి,
వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు.
ఛాగంటి వెంకటయ్య ఆరోగ్యం గురించి ఆరా
మండల రజక సంఘం మాజీ అధ్యక్షుడు ఛాగంటి వెంకటయ్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలోఉల్లెంగల యాదగిరి వ్యక్తిగతంగా పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యాదగిరితో పాటు,గుడికందుల చంద్రయ్య
మండల రజక సంఘం ఉపాధ్యక్షులు లొంక సుధాకర్ మండల రజక సంఘం కార్యదర్శి పెద్దమ్మగడ్డ హనుమకొండ రాజేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు

పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T154052.585.wav?_=2

 

పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

చెనిగల రాములు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన… కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్ ఈ రోజు వర్ధన్నపేటమండలం లో, కట్రియా ల గ్రామానికి చెందిన చెనిగల కుమారస్వామి,చెనిగల రాజు గార్ల తండ్రి చెనిగల రాములు వృద్ధాప్యం పై బడి తేదీ 20-11-2025 రాత్రి 9-00 గంటల సమయంలో మరణించినందున నేడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,గుజ్జ రవీందర్ రెడ్డి, కట్రీ యాల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య గారులు రాములు గారి నివాసం వద్ద,రాములు గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించి కుమారస్వామి,రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ససంతాపం తెలుపడం జరిగింది.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన రామిండ్ల యాదగిరి వయసు 35 సం:: బుధవారం రోజున అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ బిఆర్ఎస్ నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్తలతో మృతిని కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు. నియోజకవర్గం లోఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న కంటరెడ్డి తిరుపతిరెడ్డికి టిఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ఎక్కడ ఏ చిన్నపాటి కష్టం ఎవరికైనా వచ్చిన వెంటనే స్పందించి తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న తిరుపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దుర్గయ్య, ఎల్లం యాదవ్,మంగలి నరసింహులు ఎండి హబీబ్, మెట్టు లింగం, మెట్టు బాలయ్య,మెట్టు రాజు, పంగ రాజు, మన్నె రవి, బాల నర్సు, తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాగుర్ల..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-20T155037.032.wav?_=3

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాగుర్ల

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్,కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రమేష్ ముదిరాజ్ తండ్రి మల్లయ్య ముదిరాజ్ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలియగానే రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి అధైర్యపడవద్దని అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ సంఘం చైర్మన్ తాళ్ళ శామ్ రాజ్, గ్రామ ముదిరాజ్ సంఘం డైరెక్టర్ తాళ్ళరవి ముదిరాజ్, మండల ఆరె సంఘం అధ్యక్షులు లోకటి నగేష్, తాళ్ళ పున్నం చందర్, కుమార్,సారంగపాణి,రవి, నవీన్,మీనయ్య, రమేష్, సాంబయ్య,గణేష్,ఆనురాజ్ ముదిరాజ్ లు,రాజు,నారగని రాకేష్ గౌడ్,నవీన్,సంపత్ రావు ఉన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు..

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్దన్నపేట( నేటిధాత్రి):

 

వర్దన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎద్దు శ్రీనివాస్ తండ్రిగారైన ఎద్దు బచ్చన్న అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.అనంతరం అదే గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు మహమ్మద్ మైబ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మన ధైర్యం కల్పించారు..
తదనంతరం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా నేడు వారి నివాసానికి వెళ్లి అతని పరామర్శించి మనోధైర్యం కల్పించారు..
ఈ కార్యక్రమంలో ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఎద్దు రాజేంద్ర ప్రసాద్, గుంటి కుమారస్వామి, గడ్డం సమ్మయ్య, బుర్ల రవి, సమ్మేట యాకయ్య తో పాటు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T160140.528.wav?_=4

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

రుద్రగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాన బోయిన రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్టీవ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరామర్శించిన వారిలో మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, నాయకులు బత్తిని మహేష్ యాదవ్, అజ్మీర తిరుపతి, మామిండ్ల రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బై కానీ కోటి, మాసం పెళ్లి అఖిల్, గంధం చోటు తదితరులు ఉన్నారు.

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి 50 కిలోల బియ్యం అందచేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T161900.347.wav?_=5

 

 

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి 50 కిలోల బియ్యం అందచేత..

. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని. ఇందిరా నగర్ కి చెందిన చెలి మెట.రవి. తల్లి అనారోగ్యంతో మరణించగా. తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మండలం అధ్యక్షుడు. అo కారపు రవీందర్. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 కేజీల బియ్యాన్ని అందజేసిన. బిఆర్ఎస్. నేత రవీందర్. వారి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వపరంగా వచ్చే అందేలా ఏమైనా ఉంటే వచ్చే విధంగా అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు ఈo దుకుగాను. మరణించిన కుటుంబ సభ్యులు బియ్యం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. భోజన సమైక్య అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ వారి కుటుంబ సభ్యులైన రవి శివాజీ తదితరులు పాల్గొన్నారు

పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి ఘన నివాళులు.

పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి ఘన నివాళులు.

#బాధిత కుటుంబాలకు “మెపా” అండగా ఉంటుంది.

# పులి దేవేందర్ ముదిరాజ్
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు.

#అచ్చునూరి కిషన్ ముదిరాజ్
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.

ములుగు, నేటిధాత్రి:

 

 

మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి అయిన పొన్నం సారయ్య ముదిరాజ్ ఇటీవల గుండెపోటు’తో మృతి చెందిన సందర్బంగా ఈరోజు వారి స్వగ్రామం అయిన రాజపల్లె లోని వారి నివాసానికి వెళ్లి పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, వారి కుమారులు పొన్నం రాజు, కృష్ణ ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చడం జరిగింది.
ఈ సందర్భంగా మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ…..కష్టం వచ్చిన కుటుంబాలకు మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాజు, కృష్ణ కుటుంబానికి భరోసానిచ్చారు.
అలాగే మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ….. పొన్నం సారయ్య ముదిరాజ్ మృతి చాలా బాధాకరం, సారయ్య ఎక్కడ ఉన్న అతని ఆత్మ శాంతిచాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆపదలో ఉన్న ముదిరాజ్ కుటుంబాలకు మెపా అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, చొప్పరి రాజేందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మెపా నేత దేవేందర్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మెపా నేత దేవేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం రాజపల్లె గ్రామానికి చెందిన మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి పొన్నం సారయ్య ముదిరాజ్ గుండెపోటు మరణించగా మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్,చిరుత వెంకటేశ్వర్లు ముదిరాజ్ లతో పాటు
వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ, ఉపాధ్యక్షులు పోలుదాసరి రాము, సొక్కం వెంకన్న,పిట్టల కుమార్, పెండ్యాల సదానందం ముదిరాజ్
హన్మకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్, ఉపాధ్యక్షులు గోనెల విజేందర్,మట్టపల్లి సాంబయ్య, యువత అధ్యక్షులు గోనెల సాగర్,8వ డివిజన్ ప్రధాన కార్యదర్శి పులి మహేష్ ముదిరాజ్,ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్,ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు,ఉపాధ్యక్షులు భామ నరేష్,రాజేందర్ లతో పాటు కుటుంబ సభ్యులు పొన్నం రాజు గీత,పొన్నం కృష్ణ అనురాధ,రాజు అనిత,కట్ల విజయ్,పొన్నం కుమారస్వామి,బుస నర్సయ్య, రేగుల భాను,హంస ప్రతాప్, రాసమల్ల రాజేందర్,అనిల్ పాల్గొన్నారు.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన పిట్టల మల్లయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి మండల నాయకులు తో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి మల్లయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మల్లయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉండి పార్టీకి ఎలా లేని సేవలు చేశారు ఆయన అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన వెంట జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు పెంతల కొమరారెడ్డి, హౌసింగ్, రమేష్ తదితరులు ఉన్నారు.

రిపోర్టర్ సుమన్ పరామర్శించిన జర్నలిస్టులు…

రిపోర్టర్ సుమన్ పరామర్శించిన జర్నలిస్టులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఆర్ బి న్యూస్ రిపోర్టర్ రామగిరి సుమన్ కు మాతృమూర్తి రామగిరి సుజాత ఇటీవల అకాల మరణం చెందగా గురువారం వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు పరామర్శించి ఓదార్చారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ఉపాధ్యక్షులు గట్టు రవీందర్,జిల్లా సంయుక్త కార్యదర్శి కడపాక రవి.
టీయూడబ్ల్యూజే -143 జిల్లా టెంజు అధ్యక్షులు అంబాల సంపత్,తిక్క ప్రవీన్,బండ మోహన్ తదిరులు పాల్గొన్నారు.

హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించిన యువ నాయకుడు షేక్ సోహెల్

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించిన యువ నాయకులు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి నివాళులర్పించిన ఝరాసంగం మండలం తుమ్మన్ పల్లి గ్రామ యువ నాయకులు షేక్ సోహెల్ గారు.గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు రావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి వెళ్లి తన సానుభూతిని వ్యక్తం చేస్తూ దేవుడు వారి కుటుంబానికి ధైర్యం నింపాలని కోరినారు, షైక్ సోహైల్
మరియు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు,

హరీష్ రావు కుటుంబన్ని పరామర్శించిన మాజీ మంత్రి రెడ్యానాయక్

హరీష్ రావు కుటుంబన్ని పరామర్శించిన మాజీ మంత్రి రెడ్యానాయక్

నేటిధాత్రి డోర్నకల్ ఆర్సి.

 

హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్న డోర్నకల్ మాజీ ఏమ్మెల్యే, మాజీ మంత్రి,డిఎస్ రెడ్యానాయక్, ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, అచ్యుతరావు, రవీందర్, రాంబాబు, గడ్డం వెంకన్న,సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, రాంపల్లి రవి గౌడ్,కూరవి పిచ్చిరెడ్డి, కత్తెరశాల విద్యాసాగర్, ఆయుబ్ పాషా,గందసిరి కీృష్ణ గౌడ్,ముఖేష్,కొమ్ము నరేష్,ధర్మారాపు వేణు,పేపర్ శ్రీను, డోర్నకల్ నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మండల రాజమల్లు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మరియు కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు ఈ కార్యక్రమం లో తాండ్ర మల్లేష్ లక్కం ప్రభాకర్ మండల రవీందర్ మూగ రవీందర్. తోడేటి శశి కుమార్ దామ మదన్ నాంసాని సదయ్య ఆకోజ్ అశోక్ బందెల మల్లయ్య చొప్పరి రాజాలు చొప్పరి రోషాలు మారుపాక మధుకర్ బొజ్జ మహేష్ తుమ్మల శ్రీనివాస్ దొంగల కుమార్ మరియు యూత్ నాయకులు సాదా స్వామి తదితరులు పాల్గొన్నారు

బాధిత కుటుంబాలకు వెలిచాల రాజేందర్ రావు పరామర్శ….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-28T134319.662.wav?_=6

 

బాధిత కుటుంబాలకు వెలిచాల రాజేందర్ రావు పరామర్శ

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్, వల్లంపహాడ్ లలో ఇరువురు బాధిత కుటుంబాలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పరామర్శించారు. వల్లంపహాడు మాజీ సర్పంచ్ సాదినేని మునిరాజ్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, అనంతరం పాత బజార్లో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు కోడూరి హరికృష్ణ గౌడ్ సోదరులు కోడూరి శైలేష్ గౌడ్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కొలగాని అనిల్, గుర్రం అశోక్ గౌడ్, వేల్పుల వెంకటేష్, అనంతుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంకి చెందిన బూత్ అధ్యక్షులు ఉత్తేం కనకరాజ్ తాత మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల అధ్యక్షులు మోడీ రవీందర్. ఈకార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతిరెడ్డి, మండల జనరల్ సెక్రటరీలు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, పోచంపల్లి నరేశ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, మండల కార్యదర్శి గుంట అశోక్, దళిత మోర్చా అధ్యక్షులు సంటి జితేందర్, ఐటీ సెల్ మండల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బీజేయం ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజుకుమార్, సీనియర్ నాయకులు అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి

మహాదేవపూర్ అక్టోబర్ 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామం బెగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాధిత కుటుంబాన్ని శుక్రవారం రోజున మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పరామర్శించారు. మండలంలోని బెగులూర్ గ్రామానికి చెందిన శంకర్అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన అనంతరం ఆయనకు పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు

ఆర్టీసీ డ్రైవర్ మొగిలికి దొమ్మటి సాంబయ్య నివాళులు

మొగిలి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి

 

పరకాల,నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మడికొండ మొగిలి గుండెపోటుతో అకాల మరణం చెందగా టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గురువారం మడికొండ మొగిలి పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ పరామర్శలో పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ బొజ్జం రమేష్,టీపీసీసీ ఎస్సిసెల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,మడికొండ సంపత్ కుమార్,బిసి సంఘం నాయకుడు అముదాలపల్లి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్యాల గాంధీ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ నాయకులు పాడి వివేక్ రెడ్డి,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రవి,ఒంటెరు వరుణ్,బొచ్చు అనంత్,బొచ్చు రవి కుమార్,లాదేళ్ల బిక్షపతి,మడికొండ రాజు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version