మృతుని కుటుంబాన్ని పరామర్శించిన నాగుర్ల
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్,కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రమేష్ ముదిరాజ్ తండ్రి మల్లయ్య ముదిరాజ్ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలియగానే రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి అధైర్యపడవద్దని అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ సంఘం చైర్మన్ తాళ్ళ శామ్ రాజ్, గ్రామ ముదిరాజ్ సంఘం డైరెక్టర్ తాళ్ళరవి ముదిరాజ్, మండల ఆరె సంఘం అధ్యక్షులు లోకటి నగేష్, తాళ్ళ పున్నం చందర్, కుమార్,సారంగపాణి,రవి, నవీన్,మీనయ్య, రమేష్, సాంబయ్య,గణేష్,ఆనురాజ్ ముదిరాజ్ లు,రాజు,నారగని రాకేష్ గౌడ్,నవీన్,సంపత్ రావు ఉన్నారు.
