కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా..

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా

 

నడికూడ,నేటిధాత్రి:

 

కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండల కేంద్రంలో ఇటీవీలే వివిధ కారణాలతో మృతిచెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు దుప్పటి రవి, తాళ్ళ మల్లయ్య,తాళ్ళ సమ్మయ్య కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నువ్వు శెట్టి చంద్రమౌళి (చందు) మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, మాజీ ఉపసర్పంచ్ కిన్నెరమని,గోడిశాల రంజిత్ కుమార్,దుప్పటి మొగిలి, రమేష్,అల్లూరి మొగిలి, రావుల కిషన్,నెవరుగొమ్ముల ప్రభాకర్ రావు,దురిశెట్టి రేవంత్,చందా కుమారస్వామి తదితరులు ఉన్నారు.

చిన్నారిని ఆశీర్వదించిన చల్లా…

చిన్నారిని ఆశీర్వదించిన చల్లా

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు గోడిశాల శోభ – రంజిత్ కుమార్ దంపతుల కుమార్తె ఆశ్రిత నూతన వస్త్రపుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version