పేదల వైద్య సేవలకు అండగా సీఎం సహాయ నిధి.
జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల లోని పర్లపల్లి గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ వారు మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణలో సీఎం సహాయ నిధి ( సిఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తుందని భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్ అన్నారు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్న ఖరీదైన చికిత్సకు వెనకాడకుండా ప్రజలకు ఈ సాయాన్ని వినియోగించుకోవాలని సీఎం సహాయ నిధి రాజకీయాలకు అతీతంగా అందరూ అందుబాటులో ఉంటుందని అవసరమైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామకాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు