జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం…

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో, నాయకులు ఎన్నికల వ్యూహాలు, అట్టడుగు స్థాయిలో సంస్థను బలోపేతం చేయడం మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ కేడర్‌ను సమీకరించడం గురించి చర్చించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి హజ్ కమిటీ మెంబర్ యూసఫ్ ,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగుడంపల్లి గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-( 2 లక్ష రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి , ధన్యవాదాలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version