ఉద్యమ కారులకు పెద్ద పీట!

`మళ్లీ రంగంలోకి రాములమ్మ!

`ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక!

`పార్టీకి చేసిన సేవలకు ఎట్టకేలకు గుర్తింపు.

`గల్లీ నుంచి డిల్లీ దాకా తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక మహిళా నాయకురాలు.

`కోట్ల రూపాయల సంపాదన వదులుకొని తెలంగాణ కోసం రంగంలోకి దిగారు.

`తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఉద్యమానికి ఊపిరిపోశారు.

`పార్లమెంటు సభ్యురాలిగా తన గళం వినిపించారు.

`తెలంగాణ కోసం పార్లమెంటును గడగడలాడిరచారు.

`ఒంటరిగా కొన్నేళ్ల పాటు లోక్‌సభ సాగుకుండా అడ్డుకున్నారు.

`తెలంగాణ తెచ్చి రాజకీయంగా కుట్రకు బలయ్యారు.

`కల నెరవేరింది!

`అద్దంకి అడ్డేముంది!!

`నల్గొండ ఉమ్మడి జిల్లా రాజకీయాలకు ఊపిరి వచ్చింది.

`అణగారిన వర్గాల గొంతుకు బలమొచ్చింది.

`కాంగ్రెస్‌ పార్టీకి మరో పదునైన గళం పదునుపెట్టినట్లైంది.

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన ప్రజల్లోకి తీసుకెళ్లే గొంతుక వచ్చింది.

`కాంగ్రెస్‌పై మాట్లాడాలంటే ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

`ఉద్యమ కాలం నాటి సింహం నిద్ర లేచింది.

`కాంగ్రెస్‌ కు రక్షణ కవచం తొడిగినట్లైంది.

`ఇచ్చిన మాట నిలబెట్డుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి.

`కాంగ్రెస్‌ కు కంచుకోట లాంటి నాయకత్వం మరొకటి చట్ట సభకు చేరింది.

……………

`కంచు కంఠం దాసోజు!

`పాయింట్‌ లేవదీస్తే ప్రత్యర్థులకు మాటరాదు.

`తెలంగాణ ఉద్యమ కారుడు.

`గతంలోనే దక్కాల్సిన అవకాశం.

`లేట్‌గా వచ్చినా లెటెస్ట్‌ గానే వుంది.

`ఎట్టకేలకు దాసోజును ఎమ్మెల్సీ వరించింది.

రాజకీయాలలో అవకాశాలు వెత్తుక్కుంటూ కొంత మందికి వస్తాయి. కొంత మందికి జీవితాంతం ఎదురుచూసినా రావు. రాజకీయాల్లో ఎంత కష్టపడినా, ఆవ గింజంత అదృష్టంకూడా వుండాలని అంటారు. అదే నిజమని కూడా చాలా సార్లు రుజువైంది. ఈసారి ఎమ్మెల్సీల ఎంపికలో అలాంటి సంకేతాలు కనిపించాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్‌, ఇటు బిఆర్‌ఎస్‌ ఎంపిక చేసిన అభ్యర్ధులను చూస్తే అర్ధమౌతుంది. ఎంత కష్టపడినా, ఎన్ని త్యాగాలు చేసినా కొన్ని సార్లు వారికి పదవులు చాలా అలస్యమౌతుంటాయి. ప్రజలనుంచి కూడా వారికి సానుభూతి ఎంత వున్నా, సరే కొన్ని సార్లు అవకాశాలు దక్కవు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా వారి పోరాటం నిజంగానే స్పూర్తిదాయమే..కాని అలాంటి వారికి పదవులు అందకపోతే మిగిలేది నైరాశ్యమే..ఓపికకు కూడా ఒక హద్దు వుంటుంది. ఏడాదో, రెండేళ్లో కాదు. దశాబ్దాల పాటు ప్రజా సేవ, రాజకీయ సేవలు చేసిన వారికి పదవులు దక్కకపోతే రాజకీయాలలో కొనసాగడం అంత సులువు కాదు. అయినా పదవులో,తమ పరిశ్రమో చూద్దామని కంకణం కట్టుకున్నవారికి మాత్రం ఎప్పటికైనా మళ్లీ గుర్తింపు వస్తుందని చెప్పడానికి ఈసారి ఎమ్మెల్సీ పదవులు పంపకమే నిదర్శనమని చెప్పకతప్పదు. ముందుగా తెలంగాణ ఉద్యమనాయకురాలు, సినీ నటి విజయశాంతి. తెలంగాణ సమాజమే కాదు, దేశ వ్యాప్తంగా వున్న ఆమె అభిమానులు రాములమ్మ అంటూ గొప్పగా పిలుచుకుంటారు. సినీ కేరిర్‌ ఉచ్చదశలో వున్నప్పుడు ఎవరూ వదులుకోవాలని అనుకోరు. కాని దేశంలోనే ఏ మహిళా నటి తీసుకోనంత రెమ్యునరేషన్‌తో సినిమాల్లో విజయశాంతి నటించారు. జాతీయ స్దాయిలో ఆమె ఊర్వశి అవార్డును సొంతం చేసుకున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు. సినిమా అంటే హీరోయిజం. అలాంటి దశలో హీరో లేకుండా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు కోట్లు ఖర్చు పెట్టి తీసేంత ఇమేజ్‌ వున్న నటి విజయశాంతి. అలాంటి విజయశాంతి తెలంగాణ కోసం తన జీవితం త్యాగం చేశారు. తన కేరిర్‌ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన కాదనుకున్నారు. నా తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించే కాలం రావాలని కోరుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాలనుకున్నారు. తెలంగాణ సాదన కోసం ఆమె తల్లి తెలంగాణ అనే పార్టీని స్దాపించి తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర్ర ఆకాంక్షను బలపర్చారు. మరింతగా తెలంగాణలో చైతన్యం నింపారు. తెలంగాణ సమాజమంతా ఉద్యమంలో పాలు పంచుకునేలా చేశారు. బిఆర్‌ఎస్‌ అప్పటి టిఆర్‌ఎస్‌కు ధీటుగా తెలంగాణ వాదం వినిపించారు. కేసిఆర్‌ కోరిక మేరకు ఉద్యమ సంస్దలన్నీ ఒకే వేదిక మీదకు వస్తే తెలంగాణ ఉద్యమానికి మరింత బలం పెరుగుతుందని నమ్మారు. కేసిఆర్‌ మాటను మన్నించారు. తల్లి తెలంగాణ పార్టీని భేషరుతుగా టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆమె మెదక్‌ నుంచి పోటీచేసి గెలిచారు. పార్లమెంటులో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఇక నిరంతరం ఆమె ఇటు గల్లీలోనూ, అటు డిల్లీలోనూ తెలంగాణ గళం వినిపించిన ఏకైక నాయకురాలు విజయశాంతి. అయితే డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటన వచ్చినా, తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తీసుకోవడాన్ని ఆమె పార్లమెంటు సాక్షిగా నిలదీశారు. నాలుగేళ్లపాటు ఆమె నిరంతరం పార్లమెంటులో తన గళం వినిపించారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్‌ నుంచి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచారు. ఒకరు కేసిఆర్‌, మరొకరు విజయశాంతి. కేసిఆర్‌ పార్లమెంటు సమావేశాలకు హజరు కాకపోయినా, ఆమె మాత్రం పార్లమెంటు వేదికగా సభ జరిగినన్ని రోజులు స్పీకర్‌ పోడియం వద్ద నిలబడి నిరసన తెలియజేసేవారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ ఎంపిలు పార్లమెంటు బైట నిరసన చేస్తే, విజయశాంతి ఏకంగా స్వీకర్‌ పోడియం ముందే నిరసన తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. పార్లమెంటు జరిగినన్ని రోజులు, సభ సాగినంత సమయం ఆమె అయితే వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేసేవారు. లేకుంటే తన సీట వద్దనే నిలబడి ఉద్యమ ఆకాంక్షను నినాదాల ద్వారా తెలియజేసేవారు. 2014కు ముందు ఆమెను కేసిఆర్‌ పక్కన పెట్టే రాజకీయం చేశారు. తెలంగాణ వస్తే విజయశాంతికి క్రెడిట్‌ పోవడం ఆయన ఇష్టం లేదు. అందుకే ఆమెను పార్టీలో ప్రాధాన్యత తగ్గిసూ వచ్చారు. అయినా ఆమె ఉక్కు మహిళ. పదవుల కోసం ఆమె తెలంగాణ ఉద్యమం చేయలేదు. తెలంగాణ వస్తే చాలనుకున్నారు. తెలంగాణ సాధనలో ముందు వరసలో వున్నారు. తెలంగాణ రావడంలో తన పాత్రను చరిత్రలో లిఖించుకున్నారు. తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్‌ లో చేరారు. ఆ పార్టీలో కూడా తగిన ప్రాదాన్యత లభించలేదు. తర్వాత బిజేపిలోకి వెళ్లారు. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కనిపంచలేదు. తిరిగి గత ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంటుగా పదవిని కూడా పొందారు. కాని సరిగ్గా ఎన్నికల సమయంలో ఆమె సహాకారం ఎవరూ కోరకపోయినా, తన కర్తవ్యాన్ని ఆమె నెరవేర్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. కాని ఆమె పదవులకోసం ఏనాడు ప్రయత్నం చేయలేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పుడే పార్టీ అధిష్టానం హమీ ఇచ్చింది. ఆ హమీని పార్టీ నిలబెట్టుకున్నది. ఏది ఏమైనా రాములమ్మ లాంటి చైతన్య కిరణం కాంగ్రెస్‌కు ఎంతో అవసరం. ఆ పార్టీ అధికారంలోకి రావడంలో రాములమ్మ ప్రయత్నం కూడా వుంది. అందుకే పార్టీ ఆమెకు ప్రాధాన్యత కల్పించింది.

క అద్దంకి దయాకర్‌. ఆయనకు పదవి రాకపోతే తెలంగాణ సమాజమే తిరగబడేంత పరిస్దితి కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్‌పార్టీ కోసం ఆయన చేసిన సేవను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూనే వుంది. అడుగడుగునా ఆయనకు అన్యాయం జరుగుతుంటే సానుభూతి పెరుగుతూనే వుంది. తెలంగాణ ఉద్యమంలో అద్దంకి దయకర్‌ కీలకభూమిక పోషించారు. అటు మాలమహానాడురాష్ట్ర అధ్యక్షుడుగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమానికి అంకితయ్యారు. జేఏసి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. జేఏసి సమావేశాలకు ఆ సమయంలో హజరు కావాలంటే కొంత మంది ముందూ వెనకు ఆలోచించేవారు. కాని జేఏసి ఏర్పాటు చేసే ప్రతి సమావేశానికి, సభలకు ఆయన క్రమం తప్పకుండా హజరౌతూ వచ్చేవారు. తెలంగాణ గళం వినిపించేవారు. తెలంగాణ వ్యతిరేకులను తన వాక్చాతుర్యంతో చీల్చి చెండాడేవారు. ఉన్నత విద్యావంతుడు కావడం వల్ల తెలంగాణ మీద పూర్తి పట్టు వుంది. అవగాహన వుంది. గత చరిత్ర తెలుసు. వర్తమానంలో తెలంగాణ సమజానికి ఏం కావాలో తెలుసు. ప్రతి అంశంపై సునిశితన జ్ఞానం వుంది. ఆయా సమస్యల మీద పూర్తిగా పట్టు వుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎలా మోసపోయారు. ఎంత మోసపోయారు. మోసపోడానికి ప్రేరేపించిన అంశాలపై ఆయన అనర్గళంగా లెక్కలతో సహా చెప్పడంతో దిట్ట. అందుకే ఆయనకు పార్టీలకు అతీతంగా ఉద్యమ సమయంలో పేరొచ్చింది. అంత గౌరవం కూడా దక్కింది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఆహ్వానించింది. పార్టీలో చేర్చుకున్నది. నిజానికి ఆయన ఆ సమయంలో బిఆర్‌ఎస్‌లో చేరితే ఇప్పటికే అనేక రాజకీయ అవకాశాలు,పదవులు అందుకునేవారేమో! కాని కష్టపడడమే ఆయన తత్వం. ఏటికి ఎదురీడడం ఆయన నైజం. ఏదైనా సరే, కష్టపడిసాధించున్నదానిలో వుండే ఆత్మ సంతృప్తి మరెందులోనూ వుండదని నమ్ముతారు. ఎందుకంటే అద్దంకిదయకర్‌కు పదవీ కాంక్ష అప్పుడు లేదు. ఇప్పుడూ లేదు. కాని సమాజ దిశా నిర్ధేకులైన కొంత మందికి పదవులు అవసరం. సామాన్య వ్యక్తిగానే సమాజాన్ని ఎంతో చైతన్య పర్చిన అద్దంకి దయాకర్‌ లాంటి వారు చట్టసభల్లో వుంటే ఆ సమాజానికే ఎంతో మేలు కలుగుతుంది. అద్దంకి దయాకర్‌ అంటే ఒక ప్రశ్న. స్పందించే గళం. ఎదిరించే నైజం. పాలకులను నిలదీసే గుణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు చట్టసభలో వుంటే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి ఆయన 2014లోనే ఎమ్మెల్యే కావాలి. ఆ ఎన్నికల్లో పోటీ చేసినా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లోనూ గెలుపు తీరం చేరుకుంటున్న దశలో ఫలిత ంత తారు మారైంది. తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఆయనను లాక్కోవాలిన బిఆర్‌ఎస్‌ అనేక సార్లు ప్రయత్నం చేసింది. కాని అద్దంకి దయకర్‌ గాలి వాటం నాయకుడు కాదు. అంతెందుకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఆయన ఎదుర్కొన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ఎన్నికల్లో చిరునవ్వుతో సీటు త్యాగం చేశారు. తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గెలుపుకు కృషిచేశారు. ఆఖరు దశదాకా టికెట్‌ అద్దంకికే అని ప్రచారం జరిగినా, ఆఖరు నిమిషంలో ఆయనకు టికెట్‌ ద్కక్కపోయినా ఇబ్బంది పడలేదు. పార్టీ మీద అలగలేదు. నిరసన తెలియజేయలేదు. పైగా తెలంగాణ మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీని గెలిపించడంలో కీలకభూమిక పోషించారు. తర్వాత ఎమ్మెల్సీ వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్‌ నుంచి టికెట్‌ వస్తుందని ఆశించారు. టికెట్‌ కన్‌ఫర్మ్‌ అనుకునే క్షణంలో మళ్లీ నిరాశే ఎదురైంది. అయినా ఆయన కలత చెందలేదు. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పాడు. తనకు ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది. ఆ కృతజ్ఞత వుంది. తనకు పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా పక్కకు జరిగేదిలేదు. పార్టీ మారే ప్రసక్తిలేదని పలుమార్లు చెప్పారు. ఆయనను అడుగడుగునా ఎవరు అడ్డుకుంటున్నారో ఆయనకుతెలుసు. ఎందుకు అడ్డుకుంటున్నారో తెలుసు. అయినా ఆయన ఏనాడు సహనం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. రాసి పెట్టి వుంటే అదే వస్తుందని నమ్మిన నాయకుడు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆదరించేలేదు. ప్రజలు కూడా సానుభూతితో కోరుకుంటున్నప్పుడు పార్టీ సహకరించలేదు. ఎప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి అద్దంకి దయకర్‌. అంతే కాకుండా ఒక్కసారి మాట ఇస్తే తప్పని నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సమయం చూసి అద్దంకికి పదవి ఇప్పిస్తానని చెప్పారు. చెప్పినట్లే పదవి ఇప్పించారు.

ఇక బిఆర్‌ఎస్‌లో 2008 నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకి సేవలు చేస్తున్న నాయకుడు దాసోజు శ్రవణ్‌. మేదావి వర్గంలో ఒకడుగా పేరుపొందిన దాసోజు శ్రవణ్‌ తన రాజకీయాన్ని ప్రజారాజ్యాంతో మొదలు పెట్టారు. చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆ పార్టీలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. చిరంజీవి ముందు చెప్పిన సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆ పార్టీలో చేరారు. అయితే 2009లో తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించారు. సమైక్య రాష్ట్రనినాదం అందుకున్నారు. ఆ సమయంలో దాసోజు శ్రవణ్‌ పార్టీని వదులుకున్నారు. అయితే ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న సందర్భంలో శ్రవణ్‌కు పదవి కల్పిస్తానని చిరంజీవి మాటిచ్చారు. దాసోజు రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని చిరంజీవి చెప్పారు. కాని శ్రవణ్‌కు నచ్చలేదు. అయితే ఇక్కడ మరో విషయం వుంది. దాసోజు ప్రజారాజ్యంపార్టీలో చేరినప్పటికీ ఆయన మనసంతా కేసిఆర్‌ చుట్టే వుంది. కేసిఆర్‌ ప్రసంగాలు వింటూ ప్రభావితమయ్యారు. ఎలాగైనా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి వున్నారు. కాకపోతే చిరంజీవి సామాజిక తెలంగాణ నినాదాన్ని శ్రవణ్‌ నమ్మారు. అందుకే ఆ పార్టీలో చేరారు. ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నాడో అప్పుడే ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కేసిఆర్‌కు ఎంతో సన్నిహితులయ్యారు. ఎక్కెగడప, దిగే గడప అన్నట్లు కేసిఆర్‌ డల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ దాసోజు ఆయనతో వుండేవారు. ఇలా కేసిఆర్‌కు అంత్యంత సన్నిహితులలో ఒకడుగా మారారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీతరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీచేయాలని అనుకున్నారు. కాని ఆయనకు టికెట్‌ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లోనూ క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి అధ్యక్షుడయ్యాక శ్రవణ్‌ను దూరం పెడుతూ వచ్చారు. రేవంత్‌రెడ్డితో రాజకీయ విభేదాల కారణంగా ఆయన బిజేపిలో చేరారు. అక్కడి రాజకీయం ఆయనకు నచ్చలేదు. దాంతో తిరిగి బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. 2023లోనే ఆయనకు కేసిఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కాని అప్పటి గవర్నర్‌ తమిళ సై ఆ ఫైలు మీద సంకతం చేయకపోవడంతో ఆ ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. అప్పడు దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవి వాయిదా పడిరది. ఆ సమయంలో అందాల్సిన ఎమ్మెల్సీలు ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బిఆర్‌ఎస్‌ ఒకరిని ఎంపిక చేసే అవకాశం వచ్చింది. ఆ ఒక్కటి దాసోజు శ్రవన్‌ను వరించింది. నిజానికి 2014 వరకు కేసిఆర్‌తో వున్న దాసోజు ఎన్నికల ముందు పార్టీని వీడడం ఆయన చేసిన తొందరపాటు చర్య. ఎందుకంటే దాసోజు కన్నాముందు నుంచి బిఆర్‌ఎస్‌లో వున్న వారున్నారు. దాసోజుకన్నా ముందు నుంచి ఉద్యమం చేస్తున్నవారు అనేక మంది వున్నారు. 2001 నుంచి కేసిఆర్‌తో కొనసాగుతున్న వాళ్లున్నారు. అయినా దాసోజు బిఆర్‌ఎస్‌లో చేరినప్పటినుంచి కేసిఆర్‌ ఎంతో ప్రాదాన్యత కల్పించారు. ఆ నాడు దాసోజు తొందరపడకపోతే ఇప్పటికే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. అటూ ఇటు తిరిగి వచ్చిన దాసోజుకు సత్వర న్యాయమే జరిగింది. ఎందుకంటే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ లాంటి వారు పదవులు రాకుండా బిఆర్‌ఎస్‌లో దాసోజు కన్నా ముందునుంచే వున్నారు. అయినా దాసోజు అదృష్టవంతుడే అని చెప్పాలి. బిఆర్‌ఎస్‌ గొంతు వినిపించడంతో అందరికన్నా దాసోజు వుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే రాజకీయంగా ఎదుర్కొవడంలో, పార్టీకి అండగా వుండడంలో దాసోజు ముందుంటారని చెప్పడంలో అతిశయోక్తికాదు. ఆల్‌దిబెస్ట్‌.

విద్యా నిధికి రూ.10 లక్షల విరాళం.

విద్యా నిధికి రూ.10 లక్షల విరాళం

నేటి దాత్రి / మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ విద్యా నిధికి రూ.10 లక్షల భారీ విరాళాన్ని మై హోం గ్రూప్స్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి కలెక్టర్ చాంబర్ లో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ విద్యా నిధిని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగిందని, ఈ విద్యా నిధిని మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు, ప్రభుత్వ విద్యా సంస్థలో అత్యవసరమైన మౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ అధికారుల ద్వారానే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఈ యొక్క విద్యా నిధి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేవారికి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు హన్వాడ మండలంలోని వేపూర్ నుంచి, అలాగే మహబూబ్ నగర్ మండలం లోని మన్యం కొండ నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వరకు విద్యార్థులను తీసుకొచ్చి తిరిగి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం..

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఉపాధ్యాయులుగా సంతోషించిన విద్యార్థులు ..

ఇటీవలే బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని హేమలతకు సన్మానం

వేడుకలలో పాల్గొన్న మండల విద్యాధికారి కాలేరు యాదగిరి.

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

Happy Self-Government Day..

కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులే ఈరోజు ఉపాధ్యాయులుగా మారి తమకు బోధించే గురువుల మాదిరిగానే విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రార్థనా సమయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులుగా తమ బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారిగా గట్ల మనీష్, ఎంఈఓ గా బొల్లు రిత్విక్ సాయి, ప్రధానోపాధ్యాయులుగా తుమ్మనపల్లి సుమాంజలి , ఉపాధ్యాయులుగా రావుల అక్షయ, భూక్యా స్పందన , ధరావత్ ప్రియాంక ,నాగవల్లి వర్షిని, గట్ల మనీషా ,గాజుగాని నిహారిక , లకావత్ ఇందు, బట్టి దివ్య , గుతుప స్వాతి వరుణ్ సిద్ధార్థ్ ,జాటోత్ విజయ్ కుమార్ ,అటెండర్ గా తూర్పాటి ఈశ్వర్ లు పాల్గొన్నారు.
భోజన విరామానంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్నా హరినాథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి కాలేరు యాదగిరి ,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాం నర్సయ్య విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు నిర్మాతలని , విద్యార్థులు చదువుల పట్ల మక్కువ చూపించి చదువులో రాణించాలని, తద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు హేమలతను ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుండు సురేందర్ ,వీసం నరసయ్య, వెలమాల భాస్కర్ , అప్పల నాగరాజులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

దేవరకద్ర /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రాంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి వెంకటరమణ శారద ఏర్పాటు చేసిన సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరయ్యే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదట తన భర్త జ్యోతిరావు పూలే సహాయ సహకారంతో ఆ రోజుల్లో ఆడవారు వంటింటికే పరిమితం ఆడవారికి చదువులెందుకు అని సమాజం ఎన్నో రకాల హేళన చేసిన తన చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆడవారందరికీ ఆదర్శంగా నిలిచి 1848 సంవత్సరంలో పూనే లో మొట్టమొదట పాఠశాల శూద్ర కులాల వారికి ఏర్పాటు చేసి రాను రాను 17 విద్యాసంస్థలను నెలకొల్పి ఆడవారందరికీ చదువుల తల్లి అయి సామాజిక సేవలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచి ఈ రోజుల్లో ఆడవాళ్లందరూ అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అంటే అందుకు సావిత్రిబాయి పూలే గారే మనందరికీ ఆదర్శం ఆ తల్లికి ఘనంగా టీచర్స్ మహిళలు పిల్లలతో కలిసి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఆమె చిత్రపటానికి పూల మాలలతో అలంకరణ చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ కిరణ్ గారు, ఆదర్శ , మహిళలు, అంగన్వాడీ టీచర్స్, శారద, రాజేశ్వరి, వెంకటరమణ హాజరైనారు.

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 102 వర్ధంతి వేడుకలు.

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 102 వర్ధంతి వేడుకలు..

రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 128 వ వర్ధంతి కార్యక్రమాన్ని రామాయంపేట పట్టణంలోని పూలే విగ్రహాల చెంత ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా ఫౌండర్ అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద ఆలు పెరగని పోరాటం చేసి మహిళా హక్కులను సాధించిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు.
అలాగే ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి అని, సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి అనేక ప్రయత్నం చేసిన సామాజిక ఉద్యమకారిని సావిత్రిబాయి పూలే అని అన్నారు.
అలాగే మహాత్ములు చూపిన బాటలో యువత నడుస్తూ చెడు మార్గాన్ని వదిలిపెట్టి సన్మార్గంలొ నడుస్తూ మంచి లక్షణాలను అలవాటు చేసుకొని మంచి యువకులుగా ఎదగాలని, సమాజానికి మన వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలని, మహనీయుల ఆశయాలను పునికిబుచ్చుకొని మన చుట్టూ ఉన్న ప్రాంతమునకు, ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అబ్రమైన గంగా రాములు , సుంకోజు దామోదర్ , అల్లాడి వెంకట్, శశికాంత్ ,రెడ్డమైన నరేష్ , దేవుని రవి, పిట్ల శ్రీశైలం, పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు.

#ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల కళ్ళల్లో ఆనందం.

#భూమి పూజ చేసి ముగ్గు పోసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Indiramma

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రామతీర్థం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకై భూమి పూజ చేసి ముగ్గు పోసి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెంద కూడదని పేర్కొన్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు, బీసీ ఇతర సామాజిక వర్గాలకు ఐదు లక్షల రూపాయలు దశల వారిగా ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. మొదటి విడతలో రామతీర్థం గ్రామం ఎంపిక కావడం చాలా సంతోషమని లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, ఆర్డీవో ఉమా రాణి, తాసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో నరసింహమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ , ఇస్తారి శేఖర్ గౌడ్,నాయకులు మాలోతు రమేష్, చరణ్ సింగ్, తేజవత్ సమ్మయ్య నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి కళావతమ్మ.

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి కళావతమ్మ
వనపర్తి నేటిదాత్రి:
సంఘసంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి పట్టణం లో శ్వేతా నగర్ లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. సంఘసంస్కర్త అయిన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యనభ్యసించి దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేశారన్నారు. మహిళలు, బాలికలకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించి చదువు చెప్పారన్నారు. సావిత్రిబాయి పూలే ఆమె అడుగు జాడలలో అందరం నడవాలన్నారు. సంఘసంస్కర్తలు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే, సిద్ధాంతాన్ని భారత దేశంలో అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు.ఈకార్యక్రమంలో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ పట్టణ కోకన్వీనర్ శిరీష, శ్రీదేవి, జ్యోతి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్, సిపిఐ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

ఆనాటి కాలంలో ఎవరికి ఏమి తెలియని వారికి విద్య ద్వారా అందరినీ చైతన్య వంతులను చేయాలని ముందుగా స్త్రీల విద్యాభివృద్ధికి మరియు వారి హక్కుల కోసం ఎంతో కృషి చేసిన తొలి ఉద్యమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారూ,చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో *సావిత్రిబాయి పూలే వర్ధంతి*వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ పూర్వ కాలంలో ప్రజలు అమాయకత్వం తో బానీసలుగా బ్రతుకులు బ్రతుకుతున్న వారిని చూసి విద్యి ద్వారా చైతన్య వంతులను చేయాలని పట్టుదలతో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీల తో పాటు ప్రజలందరికి విద్యను అందించిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు. మహిళల తో పాటు ప్రజల హక్కుల కోసం ఎదురించి అలుపెరుగని పోరాటం చేసిన ఉద్రమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలిపారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషి చేసిందని తెలిపారు. ఆమె చేసిన సేవలు మరువలేనివని స్త్రీలతో పాటు ప్రజలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ ఎమ్మార్పీఎస్ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ పాముకుంట్ల చందర్ శీలపాక ప్రణిత్ దాసారపు సాంబయ్య మహిళలు పాల్గొన్నారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు
ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ?
అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :-

ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి ఖమ్మరి వారి కుంట కింద ఉన్న వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లాల్సిన దారికి వాహనాలు దిగకుండా చేశారని బాధ పడాలో అర్ధం కాని అయోమయంలో ఆ ఏరియా రైతులు ఉన్నారు. రోడ్డు పోసిన అధికారులు,కాంట్రాక్టర్లు ప్రధాన రహదారికి లింక్ గా ఉన్న మట్టి బాటకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును ఏటవాలుగా చేయడం మర్చి పోయారు. రోడ్డు వేసి చాలా రోజులు అవుతున్నా కనీసం ఇబ్బంది ఉన్నచోట మట్టి కూడా పోయలేదు. దాంతో అటుగా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే ద్విచక్ర వాహనదారులు రాత్రి పూట వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవేవి పట్టించు కోకుండా అధికారులు రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. మరి ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప వారు స్పందించేలా కనిపించడం లేదు అని స్థానికులు వాపోతున్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.

నూతన వధూవరులను ఆశీర్వదించిన

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం పారుపెల్లి గ్రామం సలాకుల సారయ్య పుత్రుడు అందీప్ – సమత వివాహ రిసెప్షన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు నాంసాని సమ్మయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది.

ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది…

ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది…

కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి..
కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.!

ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు..

పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం…

రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్)

Ramayampet

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామయంపేట నుండి నిజాంపేట మండలం విడిపోయింది. అంతేకాకుండా కొన్ని కార్యాలయాలు తరలిపోవడం జరిగాయి. రామయంపేట ప్రధానంగా పట్టణ అభివృద్ధి రోజురోజుకు దీనస్థితిలోకి జారిపోతుంది. నిజమాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి లకు వెళ్లడానికి ఇది కేంద్ర బిందువు. నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణికులు రాకపోకలు జరిగే పట్టణం. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రధానంగా రోడ్లు, నిర్మాణం లేకపోవడం వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం అభివృద్ధి లేకపోవడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్రస్థాయి వరకు ప్రధాన పార్టీల్లో ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉండి ఆయా పార్టీలకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పదేపదే ఒకరి పార్టీని ఒకరు ఒకరి నాయకులను మరొకరు దూషించుకోవడం తప్ప అభివృద్ధి విషయంలో కలసికట్టుగా ఉంటే ఇప్పటివరకు రామాయంపేట ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల సైతం ఎంతో అభివృద్ధి చెందాయని అక్కడ అన్ని రకాల వ్యాపారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామయంపేటకు సమీపంలో ఉన్న మండలాలు ఎంతో సుందరంగా వేగంగా అభివృద్ధి జరిగినా రామయంపేట మాత్రం అదే స్థితిలో ఉంది. పట్టణంతోపాటు మండలంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. ఎవరి స్వార్థం వారిది, సొంత లాభం కోసం కొంతమంది. రోడ్ సైడ్ నాయకులంతా కోటీశ్వరులుగా మారి అధికార పార్టీ ఏది వచ్చిన ఉన్న పార్టీని వదిలేసి తమ సొంత పనులకోసం, సొంత అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. కొందరు కార్యకర్తలు వారినీ అనుసరించే పార్టీలు మారడంతో ప్రజల అవసరాలు కనీస కష్టాలు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు పట్టణ మధ్యలో ప్రతి గల్లి గల్లి రోడ్డు పక్కల గుంతలతో వర్షాకాలం వస్తే ఇంట్లోకి నీరు రావడం, మున్సిపాలిటీ ప్లానింగ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఏ మాత్రం కూడా రామాయంపేటకు మార్పు లేకపోవడం అయినప్పటికీ రామయంపేట వెనుకబడి ఉండడానికి కారణమేంటని అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, మరియు పార్టీ భేదాలు విడిచిపెట్టి రామాయంపేటకు ఉపయోగపడే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా ఇప్పటికైనా రామాయంపేట ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అధినాయకులు స్థానికంగా లేకపోవడం వారు తమ తమ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిలు, ప్రణాళికలు చేస్తున్న రామాయంపేటకు ఏమాత్రం లాభం లేకుండా నష్టం జరుగుతున్న, వెంట ఉన్న నాయకులు కార్యకర్తలు గాని అధినాయకులను అడ్డగించకపోవడం పట్టణ ప్రాంతం గ్రామం పట్ల ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించకపోవడం వల్ల కూడా రామాయంపేట పూర్తిగా రాజకీయ ప్రలోభాల నాయకుల వంచన మరియు పార్టీలు మారుతూ తమ స్వార్థం చూసుకోవడం వల్ల పూర్తిగా వెనుకబడిపోయిందని చెప్పవచ్చు నియోజకవర్గం మార్పుతో పాటు నియోజకవర్గ మారుతుందన్న అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏమాత్రం కదలకపోయినా ఆమె వెంటనే అనడం వల్లనే నియోజకవర్గం మారిపోవడం ఇక్కడున్న కార్యాలయాలు అధికారులు వెళ్లిపోవడం జరిగాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఎలుకకుర్తి రోడ్డు బైపాస్ వల్ల ఇప్పటికే నియోజకవర్గం నుంచి మండలానికి మండలం నుంచి మున్సిపాలిటీకి కుంచకపోయినా రామాయంపేట మరొక చిన్న పల్లెగా గ్రామంగా మారిపోనున్నది. బైపాస్ రోడ్ల వల్ల ఇక్కడ జనాలు రాకపోవడం రాకపోక లేకపోవడం సముద్ర గర్భంలో దీపంగా మారిపోతున్న రామాయంపేటకు వెలుగునిచ్చేది ఎప్పుడని ప్రజలు అడుగుతున్నారు. రాజకీయంగా ప్రజాసంఘాలు యువజన సంఘాలు వాణిజ్య సంఘాలు ఒక అభివృద్ధి వేదికగా మారి దీనిపై ఏదన్న ఒక కమిటీ వేసి అభివృద్ధికి ఆలోచిస్తే తప్ప రామాయంపేట అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. మన భవిష్యత్ తరాలకు ఇప్పటి రామయంపేట ఇస్తే వారి మనసులో మనం చేసిన పొరపాటులను ఇచ్చినట్లే అవుతుంది. భవిష్యత్ తరాలకు అన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అప్పుడే అభివృద్ధి జరుగుతుందని భావన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు, పార్టీల నాయకులు, అన్ని వర్గాలు, కుల సంఘాల్లో ఏకతాటి పై ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్..

హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారా..

ప్రభుత్వం పై మండిపడ్డ పూనెం సాయి…

న్యాయకళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం..

గిరిజన ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డ ఆదివాసీ సంఘాలు..

మొక్కజొన్న ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్..

నూగూరు వెంకటాపురం (నేటి దాత్రి )

మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం

College’s

న్యాయ కళాశాల ఆదిమ తెగల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఏజెన్సీ న్యాయ కళాశాల సాధన సదస్సు వెంకటాపురం మండలం లోని కాఫెడ్ గ్రౌండ్ లో జరిగింది. జి ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి గిరిజన ప్రజా ప్రతినిధుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలను విస్మరిస్తున్నాయని ముఖ్య అతిధులుగా పాల్గొన్న పాయం సత్యనారాయణ,కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, మైపతి అరుణ్ కుమార్ మండిపడ్డారు. జి ఎస్పీ ముందుకు తెచ్చిన న్యాయమైన డిమాండ్ న్యాయ కళాశాల అన్నారు. ఆదివాసీలను న్యాయ వ్యవస్థలు విస్మరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యంత అన్యాయానికి గురయ్యేది ఆదిమ తేగలని తెలిపారు. న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసీలు న్యాయ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని నాయకులు అన్నారు.ఏజెన్సీ నుండి రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించడం లేడని నిలిదిశారు..బహుళజాతి విదేశీ విత్తన కంపెనీలను గిరిజనేతరులు ఏజెన్సీ లోకి తెచ్చి ఆదివాసీ రైతులను దగా చేస్తున్న వారిని వదిలి పెట్టేది లేదన్నారు. కాంగ్రెస్, భారాసా పార్టీలను అడ్డుపెట్టుకొని ఆదివాసీ రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా దారుణాలకు పాల్పడుతున్న కంపెనీ ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన.!

బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నెటిదాత్రి :
వనపర్తిలో
సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బ్యాట్ మెన్టెన్ పోటీలలో డబుల్స్ సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన సయ్యద్ జీషాన్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు .15 వ వార్డ్ మున్సిపల్ మాజి కౌన్సిలర్ ,బండారు కృష్ణ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోజ్ పెద్దింటి.వెంకటేష్, జోహెబ్బు హుస్సేన్. ,చిట్యాల రాము, ధర్మా నాయక్, మురళీ సాగర్ ,నీలస్వామి, శ్రీను, సల్మాన్,ఖలీల్ తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు

రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.

రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి,ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం

కాంగ్రెస్ పార్టీతోనే డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి

గతంలో ఏకలవ్య గురుకుల పాఠశాల మోడల్ స్కూల్స్ వివిధ గురుకులాలు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ స్కూలుకు 200 కోట్లు విడుదల కావడంతో సంబరాలు జరుపుకున్నారు

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కొరకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసిననందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మరిపెడ మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి యువ నాయకులు నూకల అభినవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు నిన్న ఒక్కరోజు 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించేందుకు 11,000 కోట్ల రూపాయాలను మంజూరీ చేయడం పట్ల ఆయన హర్హంవ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నప్పటికి నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన ఎజెండాగా 11 వేల కోట్ల రూపాయలను కేటాయించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనే 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించేందుకు 600 కోట్ల రూపాయలను కేటాయించామని.. మొత్తంగా 58 పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలను కేటాయించడం విద్యకు ప్రజాప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన అన్నారు, తాము అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు నిర్మించి విద్యలో అసమానతలు లేకుండా చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు,ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రవి నాయక్, అప్సర్, మెన్స్ అశోక్ కుమార్ గౌడ్,రామ్ లాల్ , వీరభద్రం గౌడ్, కృష్ణ, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

రంగులమయంగా 145 వ నగర సంకీర్తన.

రంగులమయంగా 145 వ నగర సంకీర్తన.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతంలో ఆదివారం జరిగిన 145 వ నగర సంకీర్తన రంగులమయంగా జరిగింది. అత్యంత వైభవంగా కొనసాగిన సంకీర్తన కార్యక్రమంలో భక్తులు శ్రీ కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ శోభయాత్ర జరిపారు. చిన్నారులు, మహిళలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు శ్రీ కృష్ణ గీతాలకు నృత్యాలు చేస్తూ ఆనంద పరవశంలో మునిగితేలారు.

శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు పర్యావరణ.!

శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులోని శాంతిఖని గని ఆవరణలో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆధ్వర్యం లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఎక్స్ టెన్షన్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు గ్రామాలైన బట్వాన్ పల్లి, పెర్కపల్లి, ఆకెనపల్లి, లింగపూర్, తాళ్ల గురిజాల గ్రామాల ప్రజలను వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపకుండా వందలాది పోలీసులు సింగరేణి ఎస్ ఎన్ పి సి. సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. కావున ప్రభావిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని ప్రభావిత గ్రామాలైన బట్వాన్ పల్లి, పెర్కపల్లి, ఆకెనపల్లి, లింగపూర్, తాళ్ల గురిజాల గ్రామాలలో గ్రామాల వారీగా మళ్లీ నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి లో వినతిపత్రం అందచేసిన ప్రభావిత గ్రామాల రైతులు,ప్రజలు.సింగతి కిరణ్ కుమార్ కందుల రాకేష్ కుమార్.ఆకిరెడ్డి శంకర్.కందుల శంకరయ్య.గోమాస శ్రీనివాస్ మాజీ ఎంపీపీ. తొంగల మల్లేష్ మాజీ ఎంపీపీ.సింగతి నరేందర్
. గోమాస వినోద్ కుమార్. అచ్చె శివ తదితరులు పాల్గొన్నారు.

మల్గి గ్రామంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి.

మల్గి గ్రామంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

మల్గి గ్రామ బి ఆర్ పార్టీ కార్యాలయం లో
సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాలల్లో విద్య వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు అఖిల్ శాంతు మహేష్ హనుమంత జగన్నాథ్ గౌడ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు.!

మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలి..

రామయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే జయంతుల, వర్ధంతుల కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తున్నప్పటికీ రామాయంపేట మున్సిపల్ నాయకులకు మాత్రం తమకు సంబంధంలేని అంశం అంటూ గాలికి వదిలేస్తున్నారని
మహనీయుల పండగల రోజు సైతం కార్యక్రమాన్ని చేస్తున్న తామే అక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పని తొలగించి మహనీయులను నీటితో శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని పోచమ్మ అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ పరిస్థితి మారాలంటే ఎంత సమయం పడుతుంది, ఎప్పటికీ మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలుగుతుందో , ఈ విషయాలను ప్రజలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు, నాయకులు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అని పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా జయంతి ఉత్సవాలు అధికారికంగా స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల ఆవేదన. చేశారు.

రక్త అవయవ దానాలు చాలా ముఖ్యం.

రక్త అవయవ దానాలు చాలా ముఖ్యం..

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320డి గవర్నర్ నగేష్..

రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)

రక్తదానము, అవయవదానం అనే రెండు దానములు నేటి పరిస్థితుల్లో సమాజంలో అవసరము ఉన్నవారికి సరియైన సమయంలో దొరకనట్లయితే అపాయకరమని లయన్స్ క్లబ్స్ ఇంటర్ నేషనల్ జిల్లా 320 డి గవర్నర్ నగేష్ పంపాటి అన్నారు..
ఆదివారం (09.03.2025 న)

Blood

రాగి కన్వెన్షన్,హైదరాబాద్ లో సాయంత్రం జరిగిన లయన్స్ జిల్లా 320-డి
19 వ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్** లో రామాయంపేట లయన్సక్లబ్ చార్టర్ సభ్యులు లయన్ డా. ఏలేటి రాజశేఖర్ రెడ్డి రూపొందించిన తన 18 వ రక్త, అవయవ దాన ప్రచార గోడపత్రిక ను విడుదల చేస్తు అన్నారు.గత కొంతకాలంగా రక్త అవయవ దాన ప్రచారానికై తీవ్ర కృషి చేస్తున్నట్లు, దానివల్ల లయన్స్ జిల్లా 320-డి లో విస్తృతంగా రక్తదాన శిబిరం లను నిర్వహించినట్లు తెలిపారు. అలాగే అవయవదానం కూడా చాలా ప్రాముఖ్యతను పొందిందని, ఎంత ప్రచారం నిర్వయించిన కూడ దాతలు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. లయన్స్ తమ తమ క్లబ్ ల ద్వారా రక్త,అవయవ దానాలకు విస్తృత ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు, ఏరియా గాట్ లీడర్ ఆర్.సునీల్ కుమార్ తో పాటు ఇతర లయన్స్ నాయకులు లయన్ ఏ. అమర్నాథ్ రావు గవర్నర్ ఎలెక్ట్ , లయన్ ఎం. విజయలక్ష్మి ఫస్ట్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ ,లయన్ డిచిపల్లి నరసింహ రాజు సెకండ్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ , లయన్ కె. సూర్యనారాయణ జి.ఎల్.టి ఎక్స్టెన్షన్ లీడర్ మరియు ఇతర లయన్స్ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version