అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు.
#ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల కళ్ళల్లో ఆనందం.
#భూమి పూజ చేసి ముగ్గు పోసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రామతీర్థం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకై భూమి పూజ చేసి ముగ్గు పోసి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రజలు ఎవరు ఆందోళన చెంద కూడదని పేర్కొన్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు, బీసీ ఇతర సామాజిక వర్గాలకు ఐదు లక్షల రూపాయలు దశల వారిగా ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. మొదటి విడతలో రామతీర్థం గ్రామం ఎంపిక కావడం చాలా సంతోషమని లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, ఆర్డీవో ఉమా రాణి, తాసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో నరసింహమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ , ఇస్తారి శేఖర్ గౌడ్,నాయకులు మాలోతు రమేష్, చరణ్ సింగ్, తేజవత్ సమ్మయ్య నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.