చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రాంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి వెంకటరమణ శారద ఏర్పాటు చేసిన సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరయ్యే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదట తన భర్త జ్యోతిరావు పూలే సహాయ సహకారంతో ఆ రోజుల్లో ఆడవారు వంటింటికే పరిమితం ఆడవారికి చదువులెందుకు అని సమాజం ఎన్నో రకాల హేళన చేసిన తన చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆడవారందరికీ ఆదర్శంగా నిలిచి 1848 సంవత్సరంలో పూనే లో మొట్టమొదట పాఠశాల శూద్ర కులాల వారికి ఏర్పాటు చేసి రాను రాను 17 విద్యాసంస్థలను నెలకొల్పి ఆడవారందరికీ చదువుల తల్లి అయి సామాజిక సేవలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచి ఈ రోజుల్లో ఆడవాళ్లందరూ అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అంటే అందుకు సావిత్రిబాయి పూలే గారే మనందరికీ ఆదర్శం ఆ తల్లికి ఘనంగా టీచర్స్ మహిళలు పిల్లలతో కలిసి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఆమె చిత్రపటానికి పూల మాలలతో అలంకరణ చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ కిరణ్ గారు, ఆదర్శ , మహిళలు, అంగన్వాడీ టీచర్స్, శారద, రాజేశ్వరి, వెంకటరమణ హాజరైనారు.