మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ..

శీర్షిక:అక్షరమా..!

 

(నేటిధాత్రి )

 

 

మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ… పకృతి మాతకు విఘాతం కలిగిస్తూ…
రకరకాల ఉడుపులతో వేషధారణ చేస్తూ…
మతిమాలిన మితిమీరిన తెలివితేటలతో సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తూ…
కాయంలో ప్రాణం పోయాక
ఒక్క క్షణం కూడా ఇంట్లో
ఉంచుకోని బంధాలు కోసం అబద్ధాలు, మోసాలు చేస్తూ…
కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తూ…
రాజ్యం ఏలుతున్న
దుష్ట నికృష్టు రక్కసులను
నామరూపాలు లేకుండా
చేసే అణ్వాయుధమైపో అక్షరమా..!
గుంట నక్కల మాయతెరల వెనుక కృంగుతున్న…కనులుండీ కబోదులుగా మారుతున్న ప్రతి మనిషి లోని అజ్ఞాన తిమిరాలను సంహరణ చేసి వారి జీవితాల్లో చిరుదీపమై వెలిగేట్లు చేయి అక్షరమా..!

శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న.!

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న జరిగే నిరసనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ముఫ్తీ మౌలానా అబ్దుల్ సబూర్ ఖాస్మీ అధ్యక్షతన జహీరాబాద్‌లోని ఇస్లామిక్ సెంటర్ లతీఫ్ రోడ్‌లో విలేకరుల సమావేశం జరిగింది. స్థానిక జమాతే-ఇ-ఇస్లామీకి చెందిన మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హసమి, ముఫ్తీ ఉబైద్-ఉర్-రెహ్మాన్, ముహమ్మద్ నజీముద్దీన్ ఘౌరి, అమీర్ సంయుక్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రకారం, ఏప్రిల్ 30 బుధవారం రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:15 గంటల వరకు, అంటే 15 నిమిషాల పాటు “బాతి గుల్ ప్రచారం” కింద ముస్లింలందరూ తమ ఇళ్ళు, దుకాణాలు, కర్మాగారాలు మరియు ఇతర వ్యాపార సంస్థలలో లైట్లు ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ద్వారా, కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ చట్టం, 2025పై మీ అసంతృప్తిని నమోదు చేయండి. ఈ బ్లాక్ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం ద్వారా మరియు ఇతర వర్గాల సంక్షేమం పేరుతో వివక్ష చూపడం ద్వారా భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులతో ఆడుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది, ఇది వాస్తవాలకు విరుద్ధం. ఈ సందర్భంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, తీవ్రంగా ఖండించారు మరియు ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించి, నిందితులను న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతిగుల్ ప్రచారం సందర్భంగా, ఎలాంటి శబ్దం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముహమ్మద్ మజీద్ ముహమ్మద్ మొయిజుద్దీన్, హఫీజ్ ముహమ్మద్ అక్బర్ ముహమ్మద్ మొయినుద్దీన్ ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ ముహమ్మద్ యూసుఫ్ ముహమ్మద్ అబ్దుల్ ఖదీర్, ముహమ్మద్ ఫిరోజ్, ముహమ్మద్ అయూబ్ ఖాన్ ముహమ్మద్ వసీం మరియు ఇతరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన.!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ మల్యాల బాలస్వామి ని ఫోన్ లో పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రంలో రాజనగరం గోశాల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ నాగవరం మల్యాల బాలస్వామిని ఫోన్ లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పరామర్శించి గాయాలపై ఆరా తీశారు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్యం చేయించుకుని త్వరగా కోలుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామిని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం 2024 జనవరిలో నిర్వహించిన గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్నారు. పెదమద్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నట్లు, సోమవారం ఉదయం పలువురు
ఝరాసంగం మండలం ప్రజలు తెలిపారు.

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని.!

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని
రజత్సోహలు చేస్తున్నారు??

కొత్తగూడ నేటిధాత్రి:

60 ఏళ్లు సుదీర్ఘ పోరాటాలతో శ్రీమతి సోనియా గాంధీ చల్లని చలువతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు టిఆర్ఎస్ పరిపాలించి ఏ పేద వాళ్లకు న్యాయం చేశారు ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూములు ఇండ్లు నిర్మించి ఇచ్చారు ఎన్ని గ్రామాలలో రోడ్లు నిర్మించి అభివృద్ధి చేశారు పేదవారికి రైతు బందు పేరిట పది రూపాయలు ఇచ్చి పెద్దవారికి దొరలకు భూస్వాములకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రైతుబంధు ఇచ్చారు మీరు దోచుకుని తిన్నందుకా రజోత్సవాలు,ఏజెన్సీ మండల లో తరలుగా వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజన గిరిజనేతరుల భూములను హరితహారం పేరుతో మా భూములు గుంజుకున్నాందుక.
మీ రజత్సహలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు తోలక్షల కోట్లు
దొచుకున్నందుక రథోత్సవాలు నీళ్లు నిధులు నియామకాల అని ఊకడు దంపుడు ఉపన్యాసాలు తప్ప మీరు ఎన్ని ఉద్యోగలు ఇచ్చారు ఇంటింటికి ఉద్యోగం పేరుతో గద్దెనెక్కిన మీరు మీ కుటుంబంలో మాత్రం నాలుగైదు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. అప్పుడే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని మీ కబంధహస్తాలతో విచ్చిన్నం చేసి ఎక్కడికక్కడ దోచుకొని తిన్నారు నిరుద్యోగులను గాలికొదిలేసి కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి పేరుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని మీరే చెప్పి పేపర్లు లీకులు చేసి వాటి మీద కేసులు వేసి తప్పించకు తిరిగారు, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు హడావిడిగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేసి వారి చావులకు కారణమైనందుకా బి ఆర్ ఎస్ నాయకులు రజత్సోవాలు జరిపేది దొడ్డు బియ్యం పంపిణీ చేసి దళారుల చేతికి పంపించి వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రజలకు పంచి గప్పాలు కొట్టారు మీ ప్రభుత్వ హాయంలో ఏనాడైనా పేదవారిని పట్టించుకున్నారా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించార సన్న బియ్యం పంపిణీ చేయమని మాట్లాడితే రెండు వేల కోట్లు కావాలని మాట్లాడిన మీరు సంపద సృష్టిస్తాం సంపద పెంచడం పేదలకు పంచుతామని గొప్పలు చెప్పిన మీరు సంపద పెరిగింది అలాగనే మీ ఆస్తులు పెరిగాయి ఆ రూపాయల తోనే లతోనే ఈరోజు రజోత్సవాలు జరుపుతున్నారు.. మీరు పేదవాలని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని మరొక్కసారి గుర్తు చేస్తున్నామని
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు…

ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు.

ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు
విలేఖరి పై అనుమానాలు
జమ్మికుంట :నేటిధాత్రి

 

 

జమ్మికుంట అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు సిరిమల్లె జయేందర్, కార్యదర్శి ఎలిమెల్ల రాజేంద్రప్రసాద్ లపై ఆలయానికి వచ్చినటువంటి విరాళాలు సొంతానికి వాడుకొని లెక్కలు చూపించకుండా అక్రమాలు చేసినట్టు ఆలయ సభ్యులకు అయ్యప్ప మాలధారులకు కరపత్రాలు పోస్ట్ ద్వారా సీతారామయ్య చీటీ లాగా అడ్రస్ లేకుండా పంపించిన వారు ఎవరనేది తెలియకుండా పంపించడం జరిగింది ఇది జమ్మికుంట పట్టణం ఒక సంచలన వార్తగా మిగిలిపోయింది ఈ కరపత్రాల సమస్య విషయమై ప్రజల యొక్క నానుడి ఎలా ఉందంటే ఆలయ నిర్మాణ టైంలో యాంసాని కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసుకునే భక్తుడే కృష్ణమూర్తి అనుచరుడిగా శ్రేయోభిలాషిగా మెదులుతూ అతనిని తప్పుదోవ పట్టించి తప్పు చేయించి లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నటువంటి ఈ భక్తుడే కృష్ణమూర్తి ఉండే టైంలో గుడి పైసలు లక్షల రూపాయలు వాడుకొని కృష్ణమూర్తి తో ని కట్టించిన ఘనత ఈయనదే అని అనుకుంటున్నారు ఇతని లీలలు శ్రీకృష్ణ లీలలు త్వరలోనే బయటికి వస్తాయి అనుకుంటున్నారు ఇకపోతే ఆలయానికి చాలా ఖర్చులు ఉంటాయి ఒక కుటుంబం పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు అలాంటిది వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ఆలయానికి సౌకర్యాలు కలిగించడం ఉత్సవాలు జరిపించడం ప్రతి పండుగ రోజు పండుగ వాతావరణం కలిగించడానికి ఎంతో ఖర్చవుతుంది అలాంటిది రాయలేదు వచ్చిన రూపాయలు అక్రమం జరిగిందని రాస్తున్నారు అందులో ఎంతవరకు నిజం ఉన్నదో ఈ ఆకాశరామన్న ఉత్తరంలో ఏది నిజమో ఏది అబద్దమో కాలమే తెలియజేస్తుంది అలాగే ఆలయ మొత్తము విలువ 20 కోట్లు ఉంటుందేమో కానీ 15 కోట్ల రూపాయలు అక్రమం జరిగింది 15 కోట్ల రూపాయలు సంతానికి వాడుకున్నారు అనేదాంట్లో ఎంతవరకు నిజమో అనేది ప్రజలు గమనిస్తున్నారు ఏది ఏమైనా భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ భగవంతుని యొక్క పైసల విషయంలో ప్రజల్లోకి ఇలాంటి వార్తలు రావడం రానున్న రోజుల్లో విరాళాలు కూడా రాకుండా ఆలయ అభివృద్ధికి వెనకడుగు వేసే విధంగా చేసినారు తప్ప ఇది ఏదో అభివృద్ధి కో లేకుంటే ఏదో ఆలయానికి పనికివచ్చే విషయం అనేది ఎవరూ పరిగణించట్లేదు వాళ్ల దాంట్లో వాళ్లకు పడక ఆదిపత్య పూర్ లో భాగంగానే ఇది వచ్చిందని నిపుణులు భక్తులు ప్రజలు అనుకుంటున్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

‘రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, బాలానగర్, మొదంపల్లి, మోతీ ఘనపూర్, హేమాజీపూర్ గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్వినీ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో.. డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, ఆది రమణారెడ్డి, లింగారం యాదయ్య గౌడ్, బత్తుల రాఘవేందర్, భాస్కర్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది తేది 21.04.2025 రోజున, సమయం 14:46 గంటల సమయంలో కాంగ్రెస్ భవన్ కుమార్ పల్లి వద్ద కనిపించినది, ఈ మృతదేహాన్ని హన్మకొండ పోలీస్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించడం జరిగింది.చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్త బందువులు ఎవరైనా ఉంటే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించలని హనుమకొండ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. నెంబర్ 87126 85113, 9550961427.

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను.!

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను

డబులో బెడ్ రుములు నిర్మెంచి పేదలకు ఇవ్వాలి ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి ;

వనపర్తి పట్టణంలో:

పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ పాత వ్యవసాయ మార్కెట్ లోని సమీకృత మార్కెట్లను వెంటనే వినియోగంలోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక.జిల్లా అధ్యక్షులు
సతీష్ యాదవ్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు గత బీ ఆర్ ఎస్ .ప్రభుత్వ ములో కోట్లు రూపాయలు ఖర్చు చేసి
పాతకోట లోని కందకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉంది అని దాన్ని వినియోగం లోకి తేవాలనీ సతీష్ ప్రజల తరుపున కోరారు. లేకపోతే డబుల్ బెడ్ రూమ్ లను నిర్మాణం చేసి పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలు. పాత వ్యవసాయ మార్కెట్లో కట్టిన సమీకృత మార్కెట్ బిల్డింగును తక్కువ ధరలకు కిరాయలకు ఇచ్చి పేదలు వ్యాపారం చేసుకోవడానికి} వినియోగం లోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి కలెక్టర్ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని సతీష్ యాదవ్ కోరారు
సతీష్ యాదవ్ వెంట ఎస్సీ ఎస్టీ కమిటీ నాయకులు గంధం నాగరాజు సిపిఎం నాయకులు మార్టిన్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్ శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది
– సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

 

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణను స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదలు దోచుకున్నారని అన్నారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సిన కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పట్టించుకోవడంలేదని, అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతుల పక్షాన నిలబడడం లేదని మండిపడ్డారు.
ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ టీఆర్ఎస్ పార్టీదో లేక బీఆర్ఎస్ పార్టీదో కేసీఆర్ స్పష్టత ఇచ్చి వరంగల్ కు వెళ్లాలని కేకే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడా స్పష్టత ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావ, బావమరుదులు నాడు కుర్చీ కోసం నేడు పార్టీ కోసం కుస్తీ పడుతున్నారని, హరీష్ రావుకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతే పడుతుందని కేకే జోష్యం చెప్పారు. వరంగల్ సభలో పార్టీలో హరీష్ రావు స్థానం ఏంటో కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని, కుర్చీల కొట్లాటలో హరీష్ రావు బీఆర్ఎస్ నుండి బయటకు రావడం ఖాయమన్నారు. తెలంగాణను నయవంచన చేసిన వాళ్లే ఆ పార్టీలో ఉన్నారని, కార్యకర్తలకు అది బీఆర్ఎస్ పార్టీయో, టీఆర్ఎస్ పార్టీయో తెలియదన్నారు. సంపాదించిన అవినీతి సొమ్ముతో రజతోత్సవ సభకు ప్రజలను తరలిస్తున్నారని, సభకు వచ్చేవారు కదిలివచ్చే జనం కాదని, కదిలిస్తే వచ్చే జనం అని విమర్శించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా నాయకుడు యేళ్లే లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్, కత్తెర దేవదాసు, శ్రీనివాస్ రవి, మహిళా నాయకురాలు కల్లూరు చందన, వనిత తదితరులు పాల్గొన్నారు.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.

దోపిడీ ముఠాలకు దోరలుగా మార్చింది.

అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.

అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.

అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.

పలుగుల 8, 9, మరో మూడు ఇసుక రీచుల్లో రోజుకు వందకు పై లారీల ఇసుక రవాణా.

టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

 

దోపిడీ లక్ష్యంగా అక్రమ వసూళ్లు, అదునపు ఇసుకను లోడ్ చేస్తూ దర్జాగా దర్జాగా లక్షల రూపాయలు దూచుకుంటున్న ఇసుక క్వారీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా, దోపిడీకి మరింత సహకరిస్తూ దోపిడి ముఠాలకు దొరలుగా మార్చింది టీజీఎండిసి, దీనికి సాక్షాలు ఒకటి కాదు వందల సంఖ్యలో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది కానీ టీజీఎండిసి ఇలాంటి చర్యలు తీసుకోదు.

robbery gangs.

ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల కుదురుపల్లి కాలేశ్వరం పరిధిలో పలువుల 8 పలుగుల 9, ఉసుక్ పల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఆదేశం లాగా, దర్జాగా దూచుకోవడం జరుగుతుంది. ఇక పుసుకుపల్లి ఒకటి ప్రస్తుతం ఈ క్వారీ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు అక్రమ ఇసుక రవాణా చేసి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకుంది, ఇక్కడ సిబ్బంది దర్జాగా అదనపు ఇసుక రవాణా చేయడం నిబంధనకు విరుద్ధం కాదని చెప్పడం జరిగినప్పటికీ టీజీఎండిసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉన్నదంతా సమాప్తం చేసుకొని వెళ్లిపోయింది.

robbery gangs.

ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు ఇసుక క్వారీల అక్రమాలు మాత్రం ఆగడం లేదు, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు చేపడుతున్న కొద్ది ఈ క్వారీలకు లారీల సంఖ్య రోజుకు 100కు పైచిలువు లారీడు ఇసుక రవాణాకు రావడం ఆశ్చర్యం.

అక్రమ వసూళ్లపై టీజీఎండిసి నిశ్శబ్దం వేడుక బలమైన కారణం.

ఇక ప్రస్తుతం మహదేవ్పూర్ మండల పరిధిలో దర్జాగా టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ గుమస్తాల కంటే ఎక్కువగా, వసూళ్ల పర్వం చేపట్టడం, సీరియల్ లోడింగ్ కాంటా, వే బిల్, వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు చేయడం శరమాములుగానే కొనసాగుతుంది.

robbery gangs.

సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వం వెనుక ఒక బలమైన రహస్యం దాగి ఉందని తెలుస్తుంది. ఇక ఇసుక రిచుల్లో సిబ్బంది అక్రమాలపై టీజీఎండిసీ నిశ్శబ్దం, పెద్ద మొత్తంలో ప్రతి క్వారీలో సుమారు రోజుకు లక్ష 30 వేల నుండి 2 లక్షల పదివేల రూపాయల వరకు అక్రమ వసూళ్లు చేపడుతున్న టీజీఎండిసి నిశ్శబ్దం వెనుక ఒక బలమైన కారణం ఉందని అందుకే అధికారులు అక్రమ వసూళ్లపై పట్టించుకోవడంలేదని, ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి, అంతేకాకుండా మండలంలో ఇసుక క్వారీల అక్రమ వసూళ్లు, స్వయంగా టీజీఎండిసి సిబ్బంది కలెక్షన్ చేయడం, వెనుక దాగి ఉన్న ఒక రహస్యం అది రహస్యం కాదు జగమెరిగిన సత్యం అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు చర్యలకు ససేమిరా అనడానికి ప్రధాన కారణం అని చెప్పడంలో సందేహం లేదు.

అదనపు బకెట్ పోతే పర్వాలేదు,అక్రమ వసూళ్లు ఉన్నాయి కదా.

టీజీఎండిసి ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయడం జరిగిందని, నిఘానేత్రం, రెవెన్యూ ,పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలను ఏర్పాటుచేసి అక్రమ ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, చెప్పడం జరిగింది. కానీ అది కేవలం చెప్పుడు మాటల కొరకే, అదనపు బకెట్ తో ఇసుక క్వారీలు చిన్న బకెట్ కు 1500, పెద్ద బకెట్ కు 2000 నుండి 2500 వసూలు చేసేవారు, కానీ అప్పట్లో ఇసుక దోపిడీ జరుగుతుందని బహిర్గతం కావడంతో, కాంట్రాక్టర్లకు కాస్త ఇబ్బంది కలిగింది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా టీజీఎండిసి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి దానికి అమలు చేస్తుంది, అదేమిటంటే అక్రమ వసూళ్లు చేస్తే సరిపోతుంది అదునపు బకెట్ కు ఎంత అయితే కాంట్రాక్టర్లకు వస్తుండేది దానికి సరి సమానం అదునపు చార్జీలు, సీరియల్ కాంట లోడింగ్, కలిపితే 1600 నుండి 2200 వరకు వస్తుందని చెప్పి మరి తన సిబ్బందిచే కాంట్రాక్టర్లకు కలెక్షన్ చేసి అప్పజెప్పేలా చేసింది. దీనికి వందల సాక్ష్యాలు గత 20 రోజుల నుండి తెరపైకి తీసుకురావడం జరిగింది.

అక్రమ వసూళ్ల సాక్షాలు తెరపైకి వచ్చిన కొద్ది పెరుగుతున్న లారీలు.

టీజీఎండిసి అక్రమ వసూళ్లపై వ్యవహారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి, గడిచిన 20 రోజుల నుండి అనేక సాక్షాలు తెరపైకి తీసుకు వచ్చినప్పటికీ, మహాదేవపూర్ కాళేశ్వరం పరిధిలోని ఐదు ఇసుక క్వారీలపై చర్యలు తీసుకోకుండా ఉండడం ఒకవైపు అయితే, మరోవైపు పలువుల 8, 9, పుసుపల్లి పలువుల ఆరు, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ఈ ఇసుక క్వారీలో ఒక్క రోజు కూడా ఇసుక రవాణా కొరకు లారీలు తగ్గుముఖం పట్టిన దాఖలా లేదు, గడిచిన 22 రోజుల్లో పలుగుల 8 ,9, 100 నుండి 150 లారీల వరకు ప్రతిరోజు ఈ రెండు క్వారీల్లో పెద్ద మొత్తంగా ఇసుక అరవణ చేయడం జరిగింది. మరోవైపు మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, పుసుపల్లి పలువుల 6, పుసుపల్లి ఒకటి, 70 నుండి 110 లారీల వరకు ఈ మూడు ఇసుక క్వారీలు ప్రతిరోజు లారీల్లో ఇసుక రవాణా చేయడం జరిగింది. పూసుకుపల్లి ఒకటి, క్వారీలో తమ క్వాంటిటీ పూర్తికాకముందు ఒకటవ తేదీ నుండి 21వ తేదీ వరకు యావరేజ్ రోజుకు డెబ్బై నుండి మొదలుకొని 110 లారీల్లో ఇసుక రవాణా చేసింది. అక్రమ వసూలు చేస్తూ పాసింగ్ పై అదనపు ఇసుక దర్జాగా తరలిస్తున్నప్పటికీ టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఈ క్వారీల్లో పాసింగ్ పై అదనపు ఇసుక వస్తుందని, లారీ యజమానులు ఈ క్వారీలో మరింత రెట్టింపు ఉత్సాహంతో తమ లారీలను బుక్ చేయడం జరుగుతుంది.

 

టీజీఎండిసి అక్రమాలపై చర్యల కు నిరాకరణ, రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పర్వం.

ప్రస్తుతం మండలంలోని కాలేశ్వరం మహాదేపూర్ పరిధిలో నిర్వహించబడుతున్న నాలుగు ఇసుక రీచ్ లో, అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక, అక్రమంగా రవాణా చేస్తూ, లక్షల రూపాయలను దూచుకుంటున్న క్వారీలపై టి జి ఎం డి సి, చర్యలు తీసుకోకపోవడం. కాంట్రాక్టర్లకు అధికారులు తమపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న బలమైన నమ్మకం, మరోవైపు టి జి ఎం డి సి సిబ్బంది అధికారులు తమకు ఏమీ చెప్పరు, ఎందుకంటే మా రూటు కాస్త సపరేటు, అన్న విషయం వారికి తెలియడంతో, వారి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న క్రమంలో, ఈ నాలుగు ఇసుక రీచ్ లో అక్రమ వసూలు మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నాయి, అమాయక లారీ డ్రైవర్ల నుండి లోడింగ్ ,పాసింగ్, కాంట, వే బిల్, మరోవైపు పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 తమకు అడిగే నాధుడే లేడని, మరింత రెట్టింపు ఉత్సాహంతో దర్జాగా వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా టీజీఎండిసి, ఈ ఐదు క్వారీలపై చర్యలు తీసుకొని, క్వారీల కమిషన్ నిలిపివేసి, ఈ క్వారీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని వారిని విధుల నుండి తొలగిస్తారా, లేక అక్రమాలకు ప్రోత్సహిస్తారా అనేది వేచి చూడాలి.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన పనులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన బ్రిడ్జి నిర్మాణం పనులు.

ఓడేడ్ బ్రిడ్జి ని పూర్తి చేయండి.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని డిమాండ్.

సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

మంథని నియోజక వర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నది పై గత ప్రభుత్వ పాలన లో ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే కూలి పోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడెడ్ గ్రామ శివారులో లో కూలి పోయిన బ్రిడ్జి ని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం లో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్ లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేక పోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలీ పోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి పిల్లర్లు కూలీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పోవడం వల్ల బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహానాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జి ప్రక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ ని వర్షాకాలంలో ఇబ్బందులకు గురి అవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా మంత్రి వర్యులు శ్రీదర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి ఐతే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం రెండు జిల్లాల ప్రజలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని స్థల సేకరణ పై రీ సర్వే చేయాలని గత పది రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.

వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ శుక్రవారం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూములను పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఎంపీ వంశీకృష్ణ చొరవతో రీ సర్వే జరగడం ద్వారా రెండు దశాబ్దాల కల నెరవేరబోతుందనీ ప్రజలలో ఆశాభావం వ్యక్తం అవుతుంది.

అంతర్గాం మండల కేంద్రంలోని టెక్ట్స్ టైల్స్ భూములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు సందర్శించి ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని రీ సర్వే నిర్వహించారు.

సమీపంలోని రైల్వే ట్రాక్,రాజీవ్ రహదారి కనెక్టివిటీ,ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు.

అక్కడి నుండి బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ భూములు పరిశీలించారు.ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎంతో అవసరం కాగా అంతర్గాం,బసంత్ నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే ల్యాండ్ మార్క్ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏఏఐ అధికారులు తీసుకు వెళ్తామన్నారు.

అతి త్వరలో ప్రతిపాదిత స్థలాన్ని గుర్తించి ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.

రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు జగిత్యాల జిల్లా వాసులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం తో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య,అంతర్గాం తాసిల్దార్ రవీందర్ పటేల్ ఉన్నారు.

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…
– పీవీ బ్రిడ్జికి రిపేరు చేయించలేని దుస్థితి ఎమ్యెల్యేది
– 16నెలలైనా ఓడేడ్‌ వంతెనకు తట్టెడు మట్టి తీయలే
– అవసరం లేని చోట రూ.300కోట్లతో బ్రిడ్జి మంజూరు
– ఐదేండ్లలో మంథని అభివృద్ది ప్రణాళిక చెప్పని మంత్రి
– ప్రజల అవసరాలను గుర్తించని మంథని ఎమ్మెల్యే
– అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

 

40ఏండ్లు నియోజకవర్గాన్ని పరిపాలన చేసిన తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణం చేయలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి సమీపంలోని మానేరు బ్రిడ్జి మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఆనాడు స్వర్గీయ పీవీ నర్సింహరావు మంథని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అడవిసోమన్‌పల్లి మానేరుపై వంతెన నిర్మించారని అన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తండ్రి కొడుకులు ఒక్క వంతెనను తీసుకురాలేదన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా రెండు బ్రిడ్జిలుమంజూరు చేయించామని, ఒక్కటి ఖమ్మంపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా మరొకటి ఓడేడ్‌ వద్ద నిర్మాణంలో ఉందన్నారు. తాను అనేక మార్లు తండ్రి కొడుకుల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలేదంటే పేరుకోసం తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ కోసం రూ.300కోట్లతో అవసరం లేనిచోట బ్రిడ్జిని తీసుకువచ్చారని అన్నారు. ఆ రూ.300కోట్ల నిధులతో మంథని మండలం ఆరెంద మానేరు లేకపోతే అడవిసోమన్‌పల్లి వద్ద మరో బ్రిడ్జి నిర్మిస్తే అద్బుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మంథని ఎమ్మెల్యే మంత్రిగా అయి 16నెలలు గడుస్తున్న సోమన్‌పల్లి బ్రిడ్జి దయనీయ స్థితిలో ఉండటం విడ్డూరమని, కనీసం మరమ్మత్తులు చేయించలేని దుస్థితిలో మంత్రి ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చకుండా ఇంత పెద్ద పదవిలో ఉండి ఏ ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌, జర్మనీ తరహాలో అభివృధ్ది చేస్తామని, ఏఐ ద్వారా అనేక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు చెబుతున్నారని, మార్పు, అభివృధ్ది ఏమో కానీ ఈ బ్రిడ్జి మాత్రం రిపేరుకు నోచుకోవడం లేదన్నారు. గత 25రోజుల క్రితం మరమ్మత్తు పనులు ప్రారంభించి మధ్యలోనే అపివేయడంతో వాహనదారులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఎమ్మెల్యే, ఆయన సోదరులు ఈ బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారని, కనీసం ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోరా అని ఆయన అన్నారు. మంత్రి పదవి వస్తే ఎంతో అబివృద్ది జరుగుతుందని, అనేక ప్రయోజనాలు ఉంటాయనుకుంటే చీకట్లోకే నెట్టివేస్తున్నారని ఆయన అన్నారు. సోమన్‌పల్లి బ్రిడ్జికి రిపేరు చేయకపోగా ఓడేడు బ్రిడ్జి వద్దకు వెళ్లి పనుల్లో నాణ్యతపై విచారణ చేయిస్తామని, బాధ్యులతపై చర్యలు తీసుకుంటామని మాట్లాడిన మంత్రి 16 నెలలు గడుస్తున్న తట్టెడు మట్టి తీయలేదని ఆయన విమర్శించారు. ఇక్కడ మరమ్మత్తులు పూర్తి చేయకపోగా ఓడేడుబ్రిడ్జి పనులు మొదలు పెట్టకుండా అవసరం లేనిచోట రూ.300కోట్ల నిధులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో మానేరు, గోదావరి, ఆలయాలు, అడవులు, భూములు ఉన్న ఈ నియోజకవర్గ అభివృధ్దిపై ఇప్పటి వరకు ప్రణాళిక చెప్పలేదని, ఐదేండ్లలో అభివృద్ది గురించి చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఎక్కడ ఏం అవసరం ఉంటుందనే విషయంపై మంత్రికి అవగాహణ లేదని అర్థం అవుతోందని, కేవలం ప్రజలను గొర్రెల్లా ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, నోట్ల కట్టలతో ఓట్లు వేయించుకోవచ్చనే ఆలోచన ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి మరమ్మత్తు పనులను పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వనపర్తిలో చేయూత అనాధాశ్రమంలో అన్నదానం.

వనపర్తిలో చేయూత అనాధాశ్రమంలో అన్నదానం

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రం చిట్యాల రోడ్ లో కల్వ సత్యనారాయణ శెట్టి జ్ఞాపకార్థం శనివారం నాడు శ్ చేయుత అనాధాశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశామని ఆర్యవైశ్య యూవజన సంగం ప్రచారకార్యదర్శి కల్వ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు . అన్నదానం సేవలో గిరీష్ ఆర్యవైశ్య అధ్యక్షులు బచ్చు వెంకటేష్ దివంగత కల్వ సత్యనారాయణ సతీమణి శ్రీమతి కల్వ అరుణ సౌమ్య. పాల్గొన్నారు ఆలుగడ్డ శంకరయ్య కల్వ భూపేష్ మిత్రులు బంధువులు దివంగత కిరాణం వ్యాపారి కల్వ సత్యనారాయణ శెట్టికి శ్రద్ధాంజలి ఘటించారు

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.!

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండా లో జరిగిన వివాహ విందు లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,జనరల్ సెక్రటరీ గోపాల్,మిథున్ రాజ్ ,అశోక్ రెడ్డి,ప్రవీణ్ మెస్సీ, రతన్ సింగ్, కీరు,బుక్కు,చందర్ పవార్ తదితరులు.

రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు చేసి అలసిపోయిన.

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు చేసి అలసిపోయిన నాయకులు

ముచ్చటగా మూడు జేఏసీలు ఏర్పాటు చేసి ముందుకు పోనీయని నాయకులు

మూడు ముక్కలాట లెక్క చేసిన రెవెన్యూ డివిజన్ అంశం

చేర్యాల నేటిధాత్రి

 

 

 

చేర్యాల కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయినను గత పాలకులు పట్టించుకోలేదు ఇగో తీసుకొని వస్తాము అగో తీసుకొని వస్తాము అని మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వాలు మారాయి అయినను రెవెన్యూ డివిజన్ అంశం ప్రభుత్వం పట్టించుకున్నట్టే కనబడుతూనే గత ప్రభుత్వం మాదిరి మభ్యపెడుతున్నారు చేర్యాల ప్రాంత ఇక్కడి నాయకులు కు ఒంటెద్దు పోకడలు రెవెన్యూ డివిజన్ అంశం వచ్చేసరికి మూడు జేఏసీలు 60 మంది నాయకులు అన్నట్టు సమస్యపై పోరాడకుండా జేఏసీలుగా ఏర్పడి కీచులు ఆడుకుంటున్నారు సమస్య తీవ్రతను పాలకులకు దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారు ఇక్కడి ప్రాంత ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారన్న సంగతి మరిచి వ్యవహరిస్తున్నారు మీ వ్యక్తిగత తగాదాలు రెవెన్యూ డివిజన్ అంశానికి ముడిపెడుతూ మూడు జేఏసీలు ఏర్పాటు చేశారు వారేమో వారి నిత్య కార్యక్రమాలు వ్యాపారాలలో మునిగితేలుతూ విలాసాలు చేస్తూ పక్కన పెట్టిన రెవెన్యూ డివిజన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఇబ్బందులు నాయకులకు పట్టనట్టు వ్యవహరిస్తూన్నారని ఇక్కడి ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మీ నేటిధాత్రి జర్నలిస్ట్ కాసుల కుమార్

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం..

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం
ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఐనవోలు మండలంలోని బిఆర్ఎస్ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలనీ ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు.ఈ సభ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుందని
ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వరంగల్ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని అభివర్ణించాడు.రామాయణంలో రాముని కోసం రామదండు లంకకు ఏవిధంగా బయలుదేరిందొ అదేవిధంగా మన అధినేత కెసిఆర్ కోసం మన గులాబీదండు అలాగే బయలుదేరాలని మోహన్ పిలుపునిచ్చారు.ఆదివారం జరగబోయే సభలో మన అధినేత కెసిఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తుందనారు.
420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు ఈసభతో వెన్నులో వణుకు పుట్టా లనని అన్నారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమిలేదని
తెలంగాణ కోసం పుట్టిన మన పార్టీతోనే తెలంగాణకు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
మన రాష్ట్రం- మన పార్టీ అనే నినాదంతో ముందుకు సాగాలని మోహన్ పిలుపునిచ్చారు.

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం.!

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ అయినవోలు మండల పార్టీ పిలుపు
నేటి ధాత్రి అయినవోలు హనుమకొండ:-

బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ అయినవోలు మండల కన్వీనర్ తక్కలపల్లి చందర్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఐనవోలు మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం నరకావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అందుకే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత మరియు రైతన్నలు ప్రతి ఒకరు రజతోత్సవ సభకు తండోపతండాలుగా రావడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరై మన సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు జడ్పి కో.ఆప్షన్ నెంబర్ ఉస్మాన్ అలీ మాజీ సర్పంచులు పల్లకొండ సురేష్ కావటి స్వామి బరిగల సదానందం కంజర్ల రమేష్ మండల నాయకులు మర్పట్ల దేవదాస్ తీగల లక్ష్మణ్ గౌడ్, పఠాపురం ఎల్ల గౌడ్ దుపెళ్లి కొమురయ్య గడ్డం రఘు వంశీ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమారస్వామి ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

గణపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు

వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయాలి

వరి ధాన్యం కొనే సెంటర్లో వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలల్లో కన్య బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీ ల ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, గణపురం మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఎండి చోట మియా మొలంగూరి రాజు అశోక్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, ఎమ్మార్వో ఎంపీడీవో కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

error: Content is protected !!
Exit mobile version