ఇదో అద్భుతమైన వేదిక.

ఇదో అద్భుతమైన వేదిక…

 

సరికొత్త ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో నిర్మాత దిల్‌ రాజు ఏర్పాటు చేసిన వేదిక ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌సైట్‌ను శనివారం లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా…

సరికొత్త ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో నిర్మాత దిల్‌ రాజు ఏర్పాటు చేసిన వేదిక ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ వెబ్‌సైట్‌ను శనివారం లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. ‘దిల్‌ రాజు’ డ్రీమ్స్‌ లక్షలాది మందికి ఒక హోప్‌ ఇచ్చింది. కొత్తవారికి ఇదో అద్భుతమైన వేదిక’’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఇలాంటి వెబ్‌సైట్‌ను నేనింతవరకూ చూడలేదు. కొత్తవారి కోసం ఇలాంటిది లాంఛ్‌ కావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న కొత్తవారికి సరైన గైడెన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన ఆలోచనే ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’. ఇది సినీ ఔత్సాహికులకు సరైన వేదిక అవుతుందని ప్రారంభిస్తున్నాం. అప్లై చేసుకునే వారికి ఆల్‌ ది బెస్ట్‌’’ అని తెలిపారు. నిర్మాత శిరీష్‌ మాట్లాడుతూ ‘‘మీ ప్రతిభతో ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోవద్దు’’ అని కోరారు.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు.

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య.

“నేటిధాత్రి”,బాలానగర్. (హైదరాబాద్):

 

 

 

 

ప్రభుత్వం నుండి నేరుగా మహిళలకు అందే పథకం ఏదైనా ఉందని అడిగితే అది కేవలం ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమేనని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవమైన పథకం అని ఇందులో ఎలాంటి బేషజాలు ఉండకూడదని ఆమె అన్నారు. బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయని, మహాలక్ష్మి పథకం లేనపుడు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. రోజు బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు మహాలక్ష్మి పథకం ముందు వెనుక ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఉచితం అని అందరూ బస్సుల్లో చేయడం లేదని ఇతర వాహనాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారని ఆమె తెలిపారు. అంతే గానీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పెట్టిన పథకాలను అగౌరవపరచకుండా , మన హక్కుగా భావించి అవసరాల నిమిత్తం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. కేవలం మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు పథకం మాత్రమే రద్దు చేయాలనీ కొంతమంది కోరుకోవడం తగదని ఆమె అన్నారు. మహిళల కోసం పెట్టిన పథకాలను కొంతమంది సాటి మహిళలలే విమర్శించడం ఒక బాధ్యత గల పౌరురాలిగా తీవ్రంగా ఖండిస్తున్నాని ఆమె తెలిపారు. అనేక వ్యయ ప్రయాసలకోర్చి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version