విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం…

 విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.

 విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (Visakha Express)లో దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు (Robbery Attempt). దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకుని.. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు (Railway police).. దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు (Open fire) జరిపారు. దీంతో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన (Tummala Cheruvu incident) చోటు చేసుకుంది.కాగా పిడుగురాళ్ల సమీపంలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు వరుసగా రైళ్ళలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చోరికి పాల్పడటంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు రైలులోని పలు కోచ్‌లను లక్ష్యంగా చేసుకొని చోరీకి యత్నించారు. విశాఖ ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా, ఈ దుండగులు రైలులోకి చొరబడి ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి, దుండగులను అడ్డుకోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. లేకపోతే భారీ చోరీ జరిగేదని ప్రయాణీకులు వాపోయారు. అయితే రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. దుండగులు చీకటిలో రైల్లో నుంచి దూకి తప్పించుకున్నారు. దుండగులు రైలులోని ఐదు కోచ్‌లను టార్గెట్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా వారం రోజుల వ్యవధిలో రైళ్లలో రెండు సార్లు దొంగతనాలు జరిగాయి.

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు .

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవ సభ్యులు

వనపర్తి నేటిధాత్రి ;

 

 

పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై
భారత్ ఆర్మీ సైన్యం మెరుపు దాడులు నిర్వహించి .ఉగ్రవాదులను హతం చేసినందుకు భారత్ ఆర్మీ చీఫ్ ఆర్మీ జవాన్లకు వనపర్తి సామాజిక సేవకులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు .ఈ మేరకు వారు హర్షం వ్యక్తం చేశారు . గోనూరు వెంకటయ్య బి రాజశేఖర్ కె వేణుగోపాల్ శ్రీనివాసులు నరసింహ కె రమణ కె వెంకటేశ్వర్లు కె కె మూర్తి హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version