యుద్ద ప్రాతిపదికన విద్యుత్ అమర్చిన సింగరేణి.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చిన సింగరేణి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఏరియాలో సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం మధ్యాహ్నం పేలడంతో విద్యానగర్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో గల సింగరేణి క్వార్టర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి కార్మికుల సౌకర్యార్థం నూతన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే అమర్చడంతో కార్మికులు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కొరకు అహర్నిశలు పాటుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కార్మికులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణలో సింగరేణి ఇంజనీర్ సదానందం, ఎలక్ట్రిషన్లు తిరుమలరావు, ముస్తాఫ్ అలీ, కాంతారావు, సంపత్ తదితర సింగరేణి మజ్దూర్లు పాల్గొన్నారు.

5వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు.

5వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

ఎమ్. పి.పి.ఎస్ కల్వల పాఠశాల లో ఈరోజు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి, గౌరవ అతిథిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ విచ్చేయడం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి విద్యార్థులను మంచి విద్యావంతులు గా మార్చి, భావి భారత పౌరులు గా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిది. ఈనాడు ప్రభుత్వ పాఠశాల లో చదువు కున్న వారే నేడు గొప్ప స్థానంలో వున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చదివించాలని పిలుపునిచ్చారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో సర్వతోముఖ అభివృద్ధికి పాటు పడటం కేవలంప్రభుత్వ పాఠశాల తోనే సాధ్యం అని, ప్రభుత్వ విద్యా రంగం ను బలోపేతం చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను ఒక భాష లాగే చూడాలని, సబ్జెక్టు కు ఆపాదించవద్దని, మాతృభాష లోనే ఎక్కువ విషయావగాహనను, జ్ఞానాన్ని పొందదగలరని అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అని విద్యార్థులను ఏ భాష సరిగా రాకుండాచేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిీ ఉపాధ్యాయులైన గోపి, స్వరూప, హరిక్రిష్ణ, క్రిష్ణ,శ్రీదేవి, మోహనకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుత్తు వినియోగదారుల సమస్యలు.!

విద్యుత్తు వినియోగదారుల సమస్యలు 45 రోజుల్లో పరిష్కరిస్తాము.

ఎన్ పి డీ సీ ఎల్ ఫోరం చైర్ పర్సన్ వేణుగోపాల చారి.

చిట్యాల,నేటిధాత్రి

 

చిట్యాల మండలంలోని సమస్త విద్యుత్ వినియోగదారుల సమావేశం గురువారం (10/04/2025) రోజున చిట్యాల రైతు వేదిక లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక టి జీ జి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. టి జీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పషన్ తెలిపారు.
ఈ లోకల్ కోర్టులో లూస్ లైన్ లు, మిడిల్ పోల్స్, అగ్రికల్చర్ సర్వీస్ లు మొదలగు వాటికి సంబంధించి విద్యుత్ వినియోగదారులు రాతపూర్వకంగా తమ ఫిర్యాదులు 14 అందిఒంచినట్టు తెలిపారు. ఫిర్యాదులు ఉదయం. గం: 10:30 నుండి మధ్యాహ్నం గం:01:00 వరకు స్వీకరించి ఇట్టి ఫిర్యాదులను 2 అక్కడే పరిష్కరించి మిగతావి కేసులు రిజిస్టర్ చేసి 45 రోజులలో పరిష్కరించ్త్అమ్అని టీఎస్ టి జీ ఎన్ పి డి సి ఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పషన్ తెలిపారు.
చైర్పషన్- ఎన్ వి వేణుగోపాల చారి
ఫోరం ఫైనాన్స్ – ర్. చరణ్ దాస్
ఫోరం ఇండిపెండెంట్ అభ్యర్థి – రామ రావు
ఫోరం టెక్నికల్ అభ్యర్థి – K. రమేష్
ఎస్ ఈ – మల్చూర్
ఏఓ – రాజ్ కుమార్
డీ ఈ – పాపి రెడ్డి
ఏ డీ ఈ- సందీప్ పాటిల్
ఏ ఈ లు – చంద్రశేఖర్, మణిదీప్, సంజయ్
సబ్ ఇంజనీర్ లు – సుమంత్, వెంకటేశ్, శ్రీనివాస్
విద్యుత్ సిబ్బంది మరియు విద్యుత్ వినియోగదారుల పాల్గొన్నారు .

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా స్కూల్ డే వేడుకలు.

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా స్కూల్ డే వేడుకలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఘనంగా స్కూల్ డే వేడుకలు, గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ ఆఫీసర్ సింఫోనియా, అంగన్వాడి సూపర్వైజర్ సద్గుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని టీచర్లను ఆదేశించారు.

సమయానికి తెరుచుకొని పాఠశాల.

సమయానికి తెరుచుకొని పాఠశాల

విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులు

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మున్సిపల్ మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ రోజురోజుకు మరి అధ్వానంగా తయారవుతున్నాయని ప్రభుత్వ పాఠశాలలో కొలువులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా విధులలో అలసత్వం వహిస్తున్నారని, సమయానికి పాఠశాలల తలుపులు తెరుచు కోవడం లేదని విద్యార్థుల మాటలు వినబడుతున్నాయి, మండల విద్యాశాఖ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు మెమొలు జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల విధి నిర్వహణలో మార్పు కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఏ ఒక్కరు ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి కొన్ని రవాణా సౌకర్యాలు రైలుబండ్లు మరియు ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం రాకపోకలు జరుగుతున్నప్పటికీ ఎవరు ప్రశ్నించేవారు లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. స్థానికంగా ఉండకుండా ఇలా రోజు వచ్చి పోయే క్రమంలో ట్రైన్లు బస్సులు ఆలస్యంగా నడవడం సహజం, కానీ విధులు నిర్వహించే ఉద్యోగులు సమయానికి రాక ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడే వీరి పాఠశాల సమయపాలనగా భావిస్తూ విడుదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విద్యావేత్తలు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

Education

తల్లి తండ్రి దైవం గురువు వీరు అత్యున్నతమైన స్థానం కలిగిన వారిని, గురువుకు అత్యున్నతమైన గౌరవం ఈ సమాజంలో ఉందని అంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అద్దకారం అయిపోతుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు చదువులలో వెనుకబడిపోతున్నారని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గురువారం కేసముద్రం మున్సిపల్ లోని దానసరి ఎస్టి కాలనీ గల ప్రాథమిక పాఠశాల సమయానికి తలుపులు తెరుచుకోక విద్యార్థులు సమయానికి పాఠశాల చేరుకొని గేటు బయట ఎదురుచూస్తున్న సంఘటన చోటుచేసుకుంది, ఉదయం 7:40 నిమిషములకు పాఠశాలకు రావలసిన ఉపాధ్యాయులు సమయానికి రాక గేటు తాళాలు తీసేవారు లేక విద్యార్థిని విద్యార్థులు గేటు బయటే కూర్చుని ఉపాధ్యాయుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవడం జరిగింది, ఇంకో ఉపాధ్యాయులు మాత్రం నేను ఈరోజు రావడం లేదని లీవ్ లో ఉన్నానని ఫోన్ ద్వారా వివరణ ఇవ్వటం జరిగింది, ఈ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సమాచారం తెలియజేయగా మాకు ముందస్తు సమాచార లేదని తెలిపారు. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పనితీరు మండల విద్యాశాఖ అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచారం కాకుండా చూడాల్సిన విద్య శాఖ అధికారులు ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల కఠిన నిర్ణయాలు పాటించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

గోడపత్రిక ఆవిష్కరణ..

గోడపత్రిక ఆవిష్కరణ..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి: పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరకు సంబంధించిన గోడపత్రికను మహామండలేశ్వర్, శ్రీ దత్తగిరి ఆశ్రమం బర్దిపూర్లో పీఠాధిపతి డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దేవస్థాన ఆలయం సభ్యులు పాల్గొన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.

వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి. 

మాజీ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్

పరకాల నేటిధాత్రి

ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చారని ఇది మైనారిటీలను అణిచివేసే రాజ్యాంగ వ్యతిరేక బిల్లని దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే లక్ష్యంగా వక్ఫ్ బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు.దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక దుశ్చర్యఅని ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదని,వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగం పన్నుతున్నారని అన్నారు.వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా వారి ఆవేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని ఈ బిల్లును కేంద్రం వెంటనేఉపసంహరించుకోవాలని మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ డిమాండ్ చేసారు.

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూధన్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

మంగళవారం రోజున బిఆర్ఎస్ పరకాల మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.

చల్మెడలో సబ్ స్టేషన్కు శంకుస్థాపన.

చల్మెడలో సబ్ స్టేషన్కు శంకుస్థాపన. 

నిజాంపేట , నేటి ధాత్రి

 

మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులో నీ తిరుమల స్వామి ఆలయ భూమిలో 33 / 11 కెవి సబ్ స్టేషన్ ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ చల్మెడ గ్రామ ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలనే ఉద్దేశంతో సబ్ స్టేషన్కు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అందరూ సన్నబియ్యమే తినాలని ప్రభుత్వము రేషన్ షాపుల ద్వారా అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. తిరుమల స్వామి ఆలయాన్ని కూడా త్వరలోనే అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దర్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎస్ ఇ శంకర్, డి ఈ లు గరుత్మంతా రాజు, చాంద్ పాషా, ఏడి ఆదయ్య , ఏఈ గణేష్, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, పంజా మహేందర్ , మారుతి, వెంకటేష్ గౌడ్ , నజీరుద్దీన్ , ముత్యం రెడ్డి, తుమ్మల రమేష్ ,కాకి రాజయ్య ,బాజ రమేష్, సత్యనారాయణ రెడ్డి, దేశెట్టి సిద్ధ రాములు , మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమావత్ వినోద్ , మసూద్ ,రవీందర్ రెడ్డి, అందే స్వామి, బొమ్మెన మల్లేశం, లక్ష్మణ్, భూపతి రెడ్డి, రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

‘ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

నేటిధాత్రి:

 

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరీ గుట్ట మీద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు వాటర్ ట్యాంక్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్వరీ గుట్ట పైకి వచ్చి ప్రార్థనలు నిర్వహించుకునే క్రైస్తవ సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీ రోడ్ ను అలాగే తాగునీటి సౌకర్యం కొరకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. భక్తులకు ఇన్నాళ్లు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజిమొగ్గ నరసింహులు, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు సామ్యూల్ దాసరి , కల్వరీ ఎంబీ చర్చి పాస్టర్ మరియు చైర్మన్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ జాకబ్, సెక్రెటరీ డేవిడ్, రాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు.

‘దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని టంకర, వేపూర్ గ్రామాల్లో MGNREGA పథకం క్రింద రూ.44.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్లు, రవాణా, కమ్యునికేషన్, ఆరోగ్య సదుపాయాలు, విద్యాసంస్థలు, విద్యుత్ ఏర్పాటు వంటివి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం అని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా.

మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా?

వీటిని సైతం విడిచి పెట్టరా?

పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి

పేదలపై పెనుభారం మోపవద్దు

దోపిడీ, మోసానికి కేరాఫ్
మోదీ ప్రభుత్వం

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను యాభై రూపాయల మేర పెంచడంతో సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, తక్షణమే పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. దోపిడీ, మోసానికి మోదీ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నదని, చివరకు గ్యాస్ సిలిండర్లను సైతం విడిచిపెట్టడం లేదని మండి పడ్డారు. వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచడం వల్ల పేద కుటుంబాలకు మరింత నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో, కొత్తగా గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి జీవన వ్యయాన్ని మరింత పెంచి, వారి రోజు వారీ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉజ్వల యోజన ద్వారా పేదలకు సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్లను అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఈధరల పెంపు ఆహామీలను గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోక పోవడం దారుణమని, వంట గ్యాస్ ధర పెంచడం వల్ల గృహిణులు, చిరు వ్యాపారులు, రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా ? అని మండిపడ్డారు ఈసారి ద్రవ్యోల్బణం కొరడా దెబ్బ పేద మహిళల పొదుపు పైనా పడిందనీ, దోపిడీ, మోసం అనే పదాలకు మోదీ ప్రభుత్వం పర్యాయ పదంగా మారిందని రాజేందర్ రావు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించక పోవడం దారుణమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్య తరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారిందని రాజేందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పదకోండు ఏళ్ల మోడీ సర్కార్ హాయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు తగ్గినప్పుడల్లా ఎక్సైజ్ సుంకాన్నీ పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేందర్ రావు పేర్కొన్నారు. తరచూ పెట్రోలు, డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని  హెచ్చరించారు.

 

ఎంపీ బండి సంజయ్ ని మర్యాదపూర్వకముగా.! 

ఎంపీ బండి సంజయ్ ని మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు చిలుముల రమేష్. 

రామడుగు, నేటిధాత్రి:

 

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ బిజెపి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన గల్ఫ్ జెఎసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సమస్యలు మరియు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక కోట ఇవ్వాలని, గల్ఫ్ లో ప్రమాదంలో అవయవాలు కోల్పోయి ఉపాధి లేక ఉన్న కుటుంబాలకు బ్యాంక్ ద్వారా జీవన ఉపాధి కల్పించాలని, నకిలీ ఏజంట్లపై చేర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో బిజెపి రామడుగు మండల అధ్యక్షులు మోడీ రవీందర్, చిలుముల సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ జన్మదిన వేడుకలు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్ గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు,

ZPTC

డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,
యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు.

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు.! 

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి- ఎంపీడీవో. 

రామడుగు, నేటిధాత్రి:

 

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీడీవో రాజేశ్వరి అన్నారు. రామడుగు మండల కేంద్రంలో ఆమె మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉంటే గుర్తించి వెంటనే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఈ అజీముద్దీన్, ఏఈ షారోన్, ఎంపిఓ శ్రావణ్ కుమార్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ JAC అధ్యక్షులు.

ఎంపీ బండి సంజయ్ ని మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు చిలుముల రమేష్

రామడుగు, నేటిధాత్రి:

 

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ బిజెపి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన గల్ఫ్ జెఎసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సమస్యలు మరియు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక కోట ఇవ్వాలని, గల్ఫ్ లో ప్రమాదంలో అవయవాలు కోల్పోయి ఉపాధి లేక ఉన్న కుటుంబాలకు బ్యాంక్ ద్వారా జీవన ఉపాధి కల్పించాలని, నకిలీ ఏజంట్లపై చేర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో బిజెపి రామడుగు మండల అధ్యక్షులు మోడీ రవీందర్, చిలుముల సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ.!

వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులదే గెలుపు-బీజేపీ నాయకులు. 

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో క్రియశిలా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి నరేంద్రమోది నిధులతోనే జరుగుతుందని, రేషన్ బియ్యం పంపిణీ కేంద్రమే ఇస్తుందని వారన్నారు. ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామాలలో సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వం మే ఇస్తుందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని వారు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయానికి నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కోశాధికారి వైద రామానుజం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కాడే నర్సింగం, కారుపాకల అంజిబాబు, మండల కార్యదర్శి కడారి స్వామి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మునిగంటి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రచోత్సవ సభకు సంబంధించిన గొడ పత్రిక ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రచోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు 5 వేలకు పైగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని, పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారిందని పేర్కొన్నారు.

BRS

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు.

చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బి.వై నగర్ లోని చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ మాట్లాడుతు గత ప్రభుత్వహయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంతన్న హయాంలో పేద, ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది.

నేడు సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరూ కూడా వాళ్ల పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా కడుపునిండా భోజనం తింటున్నారని పేద ప్రజలందరి కళ్ళలో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ సామల రోజా సుధ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కాజా పాల్గొన్నారు.

తెలుగు విభాగంలో కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్.

తెలుగు విభాగంలో
కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్
హైదరాబాద్ నేటిధాత్రి:

 

ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్ తెలుగు విభాగంలో వరంగల్ జిల్లా కథా సాహిత్యం పరిశీలన అనే అంశం పైన డాక్టర్ పూర్ణ ప్రజ్ఞ చంద్రశేఖర రావు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందున పీహెచ్డీ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అందజేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం గుడిపహాడ్ అనే గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న సమ్మయ్య సారమ్మ అనే దంపతులకు జన్మించిన చివరి సంతానం ఓదేలు శారీర వైకల్యం కలిగిన ఓదేలు తన కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో అన్నత విద్యనభ్యసించి డాక్టర్ పట్టాను పొందారు.ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తిచేసి, హై స్కూల్ విద్యను మొగుళ్లపల్లి మండలం లో ఉన్న జెడ్ పి పి ఎస్ ఎస్ మొగుల్లపల్లి హైస్కూల్లో చదివి, ఇంటర్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల స్టేషను ఘన్ పూర్ లో, కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బిఎ స్పెషల్ తెలుగు చదివి ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఎం. ఎ తెలుగులో, ఎం.ఎ అర్థశాస్త్రంలో పూర్తిచేసి, టీచర్ ట్రైనింగ్ చేసి పీహెచ్డీ లో ప్రవేశం పొంది వరంగల్ జిల్లా కథా -సాహిత్యం పరిశీలన అంపశయ్య నవీన్ రామచంద్రమౌళి గారి కథల పైన పరిశోధన చేసి పీహెచ్డీ పట్టానుపొందారు. పీహెచ్డీ పట్టాను పొందిన ఓదేలును మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ,వ్యాఖ్యాత, డా బి. వెంకట్ కవి, కుటుంబసభ్యులు, గురుకుల అధ్యాపకులు, మిత్రులు, కవులు, కళాకారులు, తదితరులు, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version