గోడపత్రికను ఆవిష్కరించిన మాడ హరీష్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
బిసి బిల్లు 42% పైన పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదం తెలపాలనే డిమాండ్ తో కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వేదికగా తలపెట్టిన 72 గంటల నిరాహార దీక్ష సంబంధిత పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ జాగృతి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యుపిఎఫ్ రాష్ట్ర నాయకులు గోపూ సదానంద , గొరిగే నర్సింహ , వంగ సదానందం గౌడ్ హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిసి బిల్లు కవిత ద్వారానే సాధ్యపడుతుందని దాని కోసం ఉద్యమిస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవిత 72 గంటల నిరాహార దీక్ష కు సబ్బండా బిసి కులాలు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో బద్దెల వంశీ , పొక్కురి శ్రీనాథ్, శివప్రసాద్ రెడ్డి, వినయ్, వంశీ, దీక్షిత్ , రామన్ తదితరులు పాల్గొన్నారు..