బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ – భారత్‌కు నీటి యుద్ధం సంకేతమా?

బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మించిన భారీ డ్యామ్ ఇప్పుడు ఆసియా ఖండంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. భారత్‌లో ఈ ప్రాజెక్టును నీటి యుద్ధానికి పునాదిగా భావిస్తున్నారు.

తిబెట్‌లోని మెడోగ్ ప్రాంతంలో యర్లంగ్ జంగ్‌బో నదిపై చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ — భారత్‌లో బ్రహ్మపుత్రగా ప్రసరిస్తుంది — ప్రస్తుతం ప్రారంభ దశలోకి వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో ఒకటిగా దీనిని చైనా ప్రకటిస్తోంది.

అసలు సమస్య ఏంటి?

ఈ డ్యామ్ నిర్మాణం భారతదేశానికి, ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆందోళనకరమైన పరిణామాలను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రహ్మపుత్ర నది తిబెట్‌లో జన్మించి, భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చైనా ఎప్పుడు ఎంత నీటిని నిలుపుతుంది, ఎంత నీటిని విడుదల చేస్తుంది అన్న దాని గురించి భారత్‌కు ముందుగానే సమాచారం ఉండదు.

ఈ విషయం వరదలకూ, కరవులకూ కారణమవుతుంది. అనేక మంది విశ్లేషకులు చైనా ఉద్దేశపూర్వకంగా నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశాన్ని ఖండించడం లేదు. ఇది నీటి ఆధిపత్యానికి చైనా ప్రయత్నంగా చూస్తున్నారు.

భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

ఈ డ్యామ్ వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లోని మానవ జీవితం, వ్యవసాయం, పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వరదల ముప్పు పెరగొచ్చు. మరోవైపు, కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది.

ముఖ్యంగా, చైనా ముందుగా సమాచారం ఇవ్వకుండా భారీగా నీటిని విడుదల చేస్తే, ఆ ప్రాంతాల్లో ప్రజలపై భారీ విపత్తుల ప్రభావం ఉంటుంది.

ప్రభుత్వ స్పందన:

భారత ప్రభుత్వం ఇప్పటికే చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య 2002లో “ట్రాన్స్ బౌండరీ రివర్స్” పై ఓ ఒప్పందం ఉన్నా, ఆ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం ప్రకారం, చైనా ఏదైనా చర్య తీసుకునే ముందు భారత్‌కు సమాచారం ఇవ్వాలి.

నిపుణుల హెచ్చరిక:

ఈ ప్రాజెక్ట్ ఒక సాధారణ విద్యుత్ ప్రాజెక్ట్ కాదని, ఇది భవిష్యత్తులో జల రాజకీయాల పేలుడు బిందువుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఆధిపత్య ప్రయత్నాన్ని భారత్ నిర్లక్ష్యం చేయకూడదని, నీటి భద్రతపై భారత ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలి

యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట నేటిధాత్రి:

యుద్దోన్మాదంతో సామాన్య ప్రజలను బలికొంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నబిన్నం చేస్తు ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. అమెరికా ట్రంప్ విధానాలకు వత్తాసు పలికే బిజెపి మోడీ పద్ధతులను మార్చుకోవాలని లేకపోతే ప్రజా వ్యతిరేకతను చెవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
యంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీస్ లో కామ్రేడ్ కుసుంబ బాబురావుఅధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ విధానం సంక్షోభం లో చిక్కు కొని ఆ విధానం అనుసరిస్తున్న అమెరికా అనేక ఆర్థిక సమస్యలతో అంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాల పై ఆర్థిక సుంకాలు, ట్యాక్సీలు విధిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆంతరంగిక సమస్యలను ఎగదోసి, సరిహద్దు దేశాలతో సమస్యలను ఎగదోసి సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు యుద్ధ వాతావరణం కల్పించి యుద్దాలు చేస్తున్న
తీరు భారత దేశం – పాకిస్తాన్ సమస్య, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం
ఇజ్రాయిల్ – పాలస్తీనా గాజా యుద్ధ సమస్య, నేడు ఇజ్రాయెల్ ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధ దాడులు యావత్ సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు పేద, వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలలో దోపిడీ ని పెంచి పోషిస్తున్న తీరు అంతర్గత సమస్యలను పోషించి నేడు పతనం చెందుతున్న తీరు తో యుద్ధాలను ఎగదోయటం జరుగుతుంది అని ఆ క్రమంలోనే నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు దెబ్బ తింటున్న సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ వ్యవస్థ ను తేటతెల్లం చేస్తుంది అని దీనికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్తె తప్ప ఈ పెట్టుబడి దారీ, సామ్రాజ్య వాద వ్యవస్థ కాదని అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అని, ప్రజలు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దోపిడీ పెట్టుబడి దారీ వ్యవస్థ ను కూల్చాలని పిలుపు నిచ్చారు.దేశంలో బిజెపి గత పదకొండు సంవత్సరాల పాలనలో దేశాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పని చేయకుండా విద్వేష రాజకీయాలను, మతోన్మాద రాజకీయాలను చేస్తున్న తీరు తో ప్రపంచం ముందు తలవంపుల పాలు కావడం జరుగుతుంది అని దీనికి వ్యతిరేకంగా పీడిత ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాలలో బాగంగా జూన్ 20 నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలు నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న సాచివేత విధానాలకు వ్యతిరేకంగా గ్రామ, వార్డు స్తాయి లో ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, వంగల రాగసుధ, కనకం సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి.

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి…

వామపక్ష పార్టీల డిమాండ్

నేటి ధాత్ర:

మహబూబాబాద్ :గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు,వైమానిక దాడులకు పాల్పడుతూ,మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదని,ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి జనావాసాలపై రాకెట్ దాడులతో విద్వంసం సృష్టిస్తున్నదని వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు గౌని ఐలయ్య, విజయసారధి, సాదుల శ్రీనివాస్, పాయం చంద్రన్నలు అన్నారు.10వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్నలు ప్రసంగిస్తూ,ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి లస్తీనాలో ఇప్పటికే దాదాపు 50వేల మంది మరణించారని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు మరియు శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వేలాదిమందిని పొట్టన పెట్టుకుంటున్నదని విమర్శించారు.పాలస్తీనాలో పుట్టిన పసిపిల్లలను కూడా చంపుతామని ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించటం ఆ దేశం యొక్క అమానవీయ యుద్ధ పిపాసతకు నిదర్శనమని పేర్కొన్నారు. కనీసం ఆహారాన్ని అందించడానికి కూడా ఆటంకాలు కల్పిస్తున్నదని, ఐక్యరాజ్య సమితితో పాటు, ప్రపంచవ్యాపితంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇజ్రాయిల్ ఈదాడులు కొనసాగిస్తున్నదని అన్నారు.

ఇటీవల ఇరాన్ పై కూడా యుద్ధాన్ని ప్రకటించి భీభత్సం సృష్టిస్తున్నదని,అంతర్జాతీయ చట్టాలను, మానవహక్కులను కాలరాస్తున్నదని ఈదురహంకార మారణ హెూమ యుద్ధాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాలన్నారు.మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అనుకూల విధానాలను విడనాడాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, ఇజ్రాయిల్తో అన్ని రకాల సైనిక మరియు భద్రతా సహకారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇజ్రాయిల్ దాష్టీకానికి బలౌతున్న పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని వారు కోరారు.అనంతరం దురాక్రమణవాది,యుద్దోన్మాది ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా, డివిజన్ నాయకులు అజయ్ సారథి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట వెంకన్న, ఎండీ ఫాతిమా, లింగ్యా నాయక్,చిరంజీవి, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హేమా నాయక్, ముస్తఫా,రషీద్, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, హలావత్ లింగ్యా, యస్కే బాబు,తుడుం వీరభద్రం, బోనగిరి మధు,బట్టు చైతన్య,కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్…

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

హనుమకొండ: తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయాలు భగ్గుమన్నాయి. మాటల తూటాలతో రెండు పార్టీల్లోని నేతలు రెచ్చిపోయారు. భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వినయ్ భాస్కర్‌ అన్నారు. పూడికతీత పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని చర్చకు రమ్మను తాను సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కుడాకు ఒక రూపాయి అయినా నిధులు తెచ్చినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని నాయిని రాజేందర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు వీళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని నాయిని రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పరిస్థితి దొంగే దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. వరంగల్‌లో కుడా నిధులు దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చీడ పురుగులలాంటి వాళ్లు… వీళ్లను వెంటనే జైళ్లో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక్కడి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కి పారిపోతారని నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ అమర్చిన సింగరేణి.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చిన సింగరేణి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఏరియాలో సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం మధ్యాహ్నం పేలడంతో విద్యానగర్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో గల సింగరేణి క్వార్టర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి కార్మికుల సౌకర్యార్థం నూతన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే అమర్చడంతో కార్మికులు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కొరకు అహర్నిశలు పాటుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కార్మికులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణలో సింగరేణి ఇంజనీర్ సదానందం, ఎలక్ట్రిషన్లు తిరుమలరావు, ముస్తాఫ్ అలీ, కాంతారావు, సంపత్ తదితర సింగరేణి మజ్దూర్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version