ములుగు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన..

ములుగు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జాయింట్ డైరెక్టర్ డా. అమర్ సింగ్

ములుగు జిల్లా, నేటిధాత్రి:

వర్షాకాలంలో వచ్చే కీటక జీనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ నియంత్రణ కార్యక్రమాలు జిల్లాలో అమలుతీరును పరిశీలించడానికి జాయింట్ డైరెక్టర్ కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ అమర్ సింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ములుగును సందర్శించి, మాట్లాడుతూ , ఆరోగ్య సిబ్బంది విధి నిర్వహణనలో అలసత్వం వహించకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సమయపాలన పాటించాలని తెలిపారు. హాస్పటలోఉన్న అన్ని వార్డులను పరిశీలించి, వైద్య సేవలు పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలతీరుని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపుల రక్త నిల్వలను నిల్వ ఉంచుకోవాలని, డ్రగ్ స్టోర్ లో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకుని మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వర్షాకాల వ్యాధులకు ఇచ్చే చికిత్స మందులను సమకూర్చుకోవాలని, జ్వరం ఉన్న ప్రతి రోగికి మలేరియా డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని, టీ హబ్బులో అన్ని రకాల రక్త పరీక్షలను చేసి వాటి రిపోర్టులను సరి అయిన టైంలో అన్ని హాస్పిటలకు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ చంద్రశేఖర్, హాస్పిటల్ అడిషనల్ డెరైక్టర్ గఫర్
టీ _హబ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ , మరియు డా,ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version