ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు..

 

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

దేశంలో బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యపరుస్తూ ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటి, ఇతర నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.దేశంలో పసిడి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకుని మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, 2025 ఉదయం 6:10 గంటల సమయానికి బంగారం ధరలు సరికొత్త స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,560కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,010కి చేరుకుంది.

ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరిగాయి (gold and silver price on August 8th 2025). కిలో వెండి ధర రూ. 1,17,100 స్థాయిలో ఉంది. ఈ ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొనసాగుతోంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
  • హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,560.. 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి (1 కిలో) రూ. 1,27,100.
  • ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,710.. 22 క్యారెట్ల పసిడి రూ. 94,160, వెండి రూ. 1,17,100.
  • చెన్నై: 24 క్యారెట్ల గోల్డ్ రూ. 1,02,560.. 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి రూ. 1,27,100.
  • ముంబై: 24 క్యారెట్ల పసిడి రూ.1,02,560, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 94,010, వెండి రూ. 1,17,100.
  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల పసిడి రూ.94,010, వెండి రూ. 1,17,100.

బంగారం, వెండి ధరల ప్రధాన పెరుగుదలకు కారణాలు

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య అంశాలు తీవ్రతరం కావడం, అమెరికా డాలర్ విలువ క్షీణించడం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్లు, అమెరికా అప్పులు 36 ట్రిలియన్ డాలర్లకు చేరడం వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గేలా చేశాయి. దేశంలో దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి.

మార్కెట్ ప్రభావం

ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల విక్రయాలు కొంత తగ్గాయి. చాలా మంది కస్టమర్లు 18 లేదా 14 క్యారెట్ల ఆభరణాల వైపు మొగ్గుచూపుతున్నారు. చిన్న ఆభరణాల షాపుల వ్యాపారం 20-25% తగ్గినట్లు వర్తకులు తెలిపారు. అయితే, బంగారం ఎప్పటికీ సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ ధరల పెరుగుదలను సానుకూలంగా చూస్తున్నారు.

సలహా

బంగారం తీసుకునే క్రమంలో హాల్‌మార్క్ గుర్తు ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, కొనుగోలుదారులు కొనే సమయంలో మళ్లీ ధరల గురించి తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version