భాషా నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు :_ ఆచార్య మల్లం నవీన్.
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ దేశాయిపేటలోని సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో గురువారం గ్రంథ పాలకుల దినోత్సవం పురస్కరించుకొని ఆంగ్ల భాషలో సమర్థవంతమైన సంప్రదింపు అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యాశాలలో ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు సమాచార భావవ్యక్తీకరణ ఎంతో ముఖ్యమని తెలిపారు. భాషా నైపుణ్యాలపై పట్టు సాధించినప్పుడు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు సులభంగా దరిచేరతాయని తెలిపారు. ఆంగ్ల భాషను ప్రభావంతంగా ఎలా వినియోగించాలో పవర్ పాయింట్ ద్వారా మన మాటలు, భావాలు, సమాచారం, ఆలోచనలు స్పష్టంగా మరియు సరైన రీతిలో ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం ఎలా అనేది వివరించారు. అలాగే ఆంగ్ల భాషపై స్పష్టత శుద్ధమైన వ్యాకరణం, శరీర భాష , వినే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం అనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ సికేఎం కళాశాలకు ఎంతో చారిత్రాత్మక విద్య ప్రాధాన్యత కలిగి ఉందని అందుకే కళాశాల ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లిందని తెలిపారు. కార్పొరేట్ విద్యకు దీటుగా విద్యా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు భట్టి సంస్కృతిని విడనాడి సమాజం జరిగే ప్రతి అంశం పైన విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథి ప్రొఫెసర్ మల్లం నవీన్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యశాల కన్వీనర్ ఎస్. అనిల్ కుమార్, ఐక్యుఏసి కోఆర్డినేటర్ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. కే ఎల్ వి. వరప్రసాదరావు, కెప్టెన్ డాక్టర్ పూజారి సతీష్ కుమార్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.