డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒకరికి జైలు శిక్ష
రోడ్డు భద్రత నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలి
పరకాల సీఐ క్రాంతికుమార్
పరకాల నేటిధాత్రి
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష విధించినట్టు సిఐ క్రాంతికుమార్ తెలిపారు.ఆగస్టు 3న పట్టణ సమీపంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో విలీన గ్రామం సీతారాంపురం గ్రామానికి చెందిన పెర్వలా రమేష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు,అతనికి గురువారం పరకాల స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యూడిషయల్ మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్ ముందు కోర్టు కానిస్టేబుల్ నాగరాజు హాజరుపరచగా ఒకరోజు జైలు శిక్షతోపాటు 500 జరిమానా విధించినట్లు తెలిపారు.ఈ సందర్బంగా సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.