బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం..

బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని రామాలయం పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రం,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.నర్సంపేట బ్రహ్మకుమారీస్ నిర్వాహకులు జ్యోతి బెహన్,నర్సంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు విడిపిఓ మధురిమ హాజరై మాట్లాడుతూ సోదర భావాలను పెంపొందించే ఈ రక్షాబంధన్ కార్యక్రమం పిల్లలతో నిర్వహించడం వలన ప్రేమ,స్నేహం,సౌభ్రాతృత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు.శాంతియుత సమాజ నిర్మాణంకోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులతో ధ్యానం చేయించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ వీరలింగం, సుభద్ర, ఐసీడీఎస్ స్థానిక సూపర్ వైజర్ రమ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్,వెంకటేశ్వర్లు,పద్మ, స్థానిక అంగన్వాడి టీచర్ నల్లభారతి, గౌసియా, ఆయా సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల కోసం టియుటిఎఫ్ కృషి…

ఉపాధ్యాయుల సమస్యల కోసం టియుటిఎఫ్ కృషి

ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి.

ఘనంగా టియుటిఎఫ్ ఆవిర్భావ వేడుకలు.

నర్సంపేట,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టియుటిఎఫ్ సంఘం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దార గణేష్ పేర్కొన్నారు.నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2011ఆగస్టు 7 న ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిందన్నారు.టియుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం నర్సంపేట మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో
వేడుకలు ఘనంగా నిర్వహించి టియుటిఎఫ్ పతాకాన్ని ఎగురవేశారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని టియుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు సందినేని వేంకటేశ్వర్ రావు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎన్.ఇంద్రారెడ్డి, కోశాధికారి పి.కవిత, ఉపాధ్యాయులు పత్తి నరసింహారెడ్డి, బోడ రమేష్,రేవూరి కృష్ణారెడ్డి,అంబటి సత్యనారాయణ రాజు,గుండె లక్ష్మయ్య, అనిరుధ్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version