నీటినిల్వ వలన సీజనల్ వ్యాధులు సోకే అవకాశలు ఎక్కువ
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
సూపరిండెంట్ గౌతమ్ చౌహాన్,ఆర్ఎంఓ డాక్టర్.బాలకృష్ణ
పరకాల నేటిధాత్రి
ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరకాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని,కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.కలుషిత నీరు,కలుషిత ఆహారం,అపరిశుభ్ర వాతావరణం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్నారు. పందులు,ఈగలు,దోమలు విషజ్వరాల వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని నీటి కుండిలను,పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకెట్లలో,ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదని ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని,కూలరులో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా,దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని,ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.మన ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నీటి నిలువ లేకుండా చూడాలని,పరిసర ప్రాంతాలు శుభ్రతగా ఉంటేనే మనకు ఎటువంటి వ్యాధులు రావని,డెంగ్యూ,మలేరియా వ్యాదులు అనేవి ప్రధానంగా దోమల వల్ల వస్తుందని,ప్రధానంగా గ్రామాలలో ఎక్కడ నీటి నిలువ లేకుండా చూసుకోవాలని ఒకవేళ నీటి నిలువ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలని అన్నారు.పరిసరాల ప్రాంతాల శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లక్షణాలు కనిపించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి అని వైద్యులు తెలిపారు.