పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

జైపూర్,నేటి ధాత్రి:

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు.

మౌలిక వసతులు లేని పాఠశాలల పై వెంటనే చర్య తీసుకోవాలి

 

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ

 

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సువర్ణ అనే అమ్మాయి పై కుక్క కాటుదాడి జరిగినందున

సిరిసిల్ల జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మరియు బిజెపి మహిళ కార్యకర్తలు మొన్నటి రోజున గురుకుల పాఠశాలను చెక్ చేయడానికి వెళ్లడం జరిగినది.

కానీ అక్కడ ఎలాంటి గురుకుల పాఠశాల పిల్లలకు సదుపాయాలు లేకుండా ఉన్నందున ప్రిన్సిపాల్ ని అడగడం జరిగినది.

ఆ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఉండడం ఇలాంటివి జిల్లాలో ఎన్ని ఉన్నాయో, అవన్నీ గురుకుల పాఠశాలలను గుర్తించి వెంటనే కలెక్టర్ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.

అంతేకాకుండా ఇలాంటి సిరిసిల్ల జిల్లాలో సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రెస్ మీట్ సందర్భంగా మహిళ బీజేపీ పక్షాన కోరడం జరిగినది.

అంతేకాకుండా హాస్టల్ లోనికి రాకుండా చాలా సేపు బయట వెయిట్ చేయించడం జరిగిందని అన్నారు.

హాస్టల్ యొక్క పరిస్థితులు బాగా లేవని ఎక్కడ బయట పడుతుందో అని మమ్మల్ని లోనికి రాకుండా చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు.

ఒక మహిళా విలేఖరిని కూడా లోనికి రానివ్వలేదని తెలిపారు.

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా కలెక్టర్ కి విన్నవిస్తున్నామని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి,జిల్లా కార్యదర్శి దుంపెన స్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్డి రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బిజెపి మహిళా నాయకురాలు కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు.!

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు

గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం
కాంగ్రెస్ పార్టీనే దళిత వ్యతిరేక పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. అగ్ర కులస్తులకు పెద్దపీట వేసింది, దళితులను సేవకులుగా చూసిన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు సరైన గౌరవం లేదని, ఇప్పటివరకు మాదిగ కులస్తులకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా దళితులను అవమానించిందన్నారు.
దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని అన్నారు.
సభ సంప్రదాయాలు ఎక్కడ కూడానూ ఉల్లంగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని అదే విదంగా దళితులపట్ల గాని దళిత ప్రజా ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా అమర్యాదగా మాట్లడింది కాంగ్రెస్ పార్టి అనిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అదికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బిఅర్ఎస్ పార్టి మిద ఏడవడం ఎందుకని ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చండి అనిటూ మెము ఇంకా ప్రతిపక్షాల్లోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టి ఉందని వారు విమర్శించారు.
అలాగె జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఏఎత్తివేయాలని డిమాండ్ చేశారు

సిఎస్ఐ హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ.

సి. ఎస్. ఐ. హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ని సి ఎస్ ఐ హై స్కూల్ చదువుతున్న పదోతరగతి పిల్లలకు పరీక్ష సామాగ్రీ అందజేసిన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మారపెళ్లి ప్రభాకర్ ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ హన్నా జాన్, స్కూల్ సిబ్బంది శివాజీ, రత్న బాబు పాల్గొన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను మొగుళ్ళపల్లి ఎస్ ఐ.బి. అశోక్  అభినందించారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య.!

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్, మెయింటెనెన్స్ రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కొందరు సమావేశానికి హనుమకొండకు వెళ్ళగా కలెక్టర్ ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల డబ్బాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు.!

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర నాయకులు జన్నె మొగిలి మాతృమూర్తి జన్నె దుర్గమ్మ మధ్యాహ్నం మృతి చెంది నాట్లు తెలియగానే వచ్చి వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అంతిమయాత్రలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిషిధర్ రెడ్డి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న చదువు రామచంద్ర రెడ్డి కన్నం యుగదీశ్వర్ రాష్ట్ర నాయకులు బట్టు రవి గణపురం బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు నాయకులు భాస్కర్ రావు రామచంద్ర రావు సోమా దామోదర్ దుప్పటి భద్రయ్య మంద మహేష్ దుగ్గిశెట్టి పున్నం చందర్, భూక్యా హరిలాల్, మాదాసు మొగిలి, పెండ్యాల శ్రీకాంత్ వేణు రావు రాజు శివరాత్రి వేణు, రాకేష్ రెడ్డి శాస్త్రాల తిరుపతి తదితరున్నారు

వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రికి ఆహ్వానం.

వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రికి ఆహ్వానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు జ్యోతిష పండితుల ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 23 న జరిగే జాతీయస్థాయి వైదిక జ్యోతిష్య సమ్మేళనానికి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రవన్ శాస్త్రి బూరుగుపల్లికి ఆహ్వానం అందింది.విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజున విజయవాడలో నిర్వహించనున్న వైదిక జ్యోతిష సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన వాస్తు సిద్ధాంతులు, జ్యోతిష్య పండితులను ఆహ్వానించగా వారిలో తనకు చోటు దక్కడం సంతోషంగా ఉందని శ్రవణ్ శాస్త్రి శుక్రవారం తెలిపారు. రాబోయే తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు సెషన్లుగా జ్యోతిష్య సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పలు జ్యోతిష్య ,వాస్తు గ్రంథాల రచయిత, దైవజ్ఞరత్న పుచ్చా శ్రీనివాసరావు చే
ద్రేక్కాణ చక్ర రహస్యాలు,
శతాధిక జ్యోతిష గ్రంధ సంకలనకర్త ఆదిపూడి శివ సాయిరామ్ చే
జాతక దోషాలు- సులభ నివారణలు,
జ్యోతిష గ్రంథ రచయిత
శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ తో
ప్రశ్నా జ్యోతిషం- ఫలితాలు,
శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ధాంతి
లక్కావఝుల విజయసుబ్రహ్మణ్య సిద్ధాంతి
తో వైదిక జీవనం-అనుసరణీయం అనే అంశాలపై ప్రసంగాలు,
శ్రీ శృంగేరి శంకర మఠం – శ్రీ మహాలక్ష్మి ఆలయ ధర్మాధికారి- ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ, రాజమండ్రి కి చెందిన బహు గ్రంథ రచయిత గురురాజేష్ కొటేకల్, పంచాంగ కర్త శ్రీనివాస శశికాంత్ శర్మతో సమకాలిన వాస్తు జ్యోతిష అంశాలపై చర్చ గోష్టి ఉంటుందన్నారు.ప్రముఖ వైదిక జ్యోతిష వాస్తు పండితులతో నిర్వహించే ఈ సమ్మేళనం కో ఆర్డినేటర్ డాక్టర్ డి విశ్వనాథ్ నుండి ఆహ్వానం అందినట్లు శ్రవణ్ శాస్త్రి తెలిపారు.

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం..

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

The annual exams for class 10th have begun…

10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. రామకృష్ణాపూర్ పట్టణం లో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆల్ఫాన్సా పాఠశాల, తవక్కల్ పాఠశాల ల్లో 291 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

 

The annual exams for class 10th have begun…

పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిలు అలజడి చేయకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ల ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విదించడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి తెలిపారు. వేసవి కాలం కావడం తో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం తో పాటు, వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరిగిందన్నారు. ఏఎస్ఐ రజిత, పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చేశారు.

మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం అంబేద్కర్ కాలనీలోని ఎమ్మార్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది.ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితం అమరుల త్యాగాల ఫలితంగా వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ ఎస్సీ లోని 59 ఉప కులాలకు సమాన న్యాయం జరగాలని మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ కి పాదాభివందనాలు తెలియజేశారు.అలాగే పాలాభిషేకం అనంతరం కాలనీవాసులు టపాసులు పేల్చి డబ్బు చప్పుళ్లతో ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు కొప్పర్తి రాజం,అంబేద్కర్ కాలనీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మాడుగుల మహేష్,ప్రధాన కార్యదర్శి ఇరికల్లా మనోజ్,ఎమ్మార్పీఎస్ నాయకులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..

వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

శాతవాహన విశ్వవిద్యాలయం గురువారం 20.3.2025 రోజున ప్రకటించిన 1, 3, 5 సెమిస్టర్ ఫలితాలలో సిరిసిల్ల జిల్లాలోని వికాస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ విద్యార్థులు జిల్లా మరియు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఇందుకుగాను సిరిసిల్ల జిల్లా ఎస్. పి మహేష్ బి. గితే కళాశాల విద్యార్థులను శాలువా, మెమెంటో తో సత్కరించారు.
అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులను అభినందించారని తెలిపారు. ఈ ఫలితాలలో 9 జి. పి. ఏ మరియు ఆ పైన జి. పి. ఏ సాధించిన మా కళాశాల విద్యార్థులు
1. బి దినేష్ నాయక్ 9.4 జి.పీ. ఏ ( ఫుడ్ సైన్స్)
2. కే అక్షిత 9.24 జి.పీ.ఏ(బీ కాం)
3. కే శ్రావణి 9.19 జి.పీ.ఏ(బీ కాం)
4. ఈ భవాని 9.11 జి.పీ.ఏ(బీ కాం)
5. టీ.మేఘన 9.20 జి.పీ.ఏ(బీ కాం)
6. జి సుప్రియ 9.12 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
7. వి నవ్య 9.04 జి.పీ.ఏ(బీ కాం)
8. వి .సుప్రియ 9 జి.పీ.ఏ( డేటా సైన్స్)
9. జ.వైష్ణవి 9 జి.పీ.ఏ(ఫుడ్ సైన్స్)
10. అబ్దుల్ అఖిబ్ 9 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
11. నల్ల శ్రేయ 9 జి.పీ.ఏ( ఏం.పీ. సీఎస్)

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన.

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని కలిసిన సోషల్ మండల కోఆర్డినేటర్.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించిన సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం లో భాగంగా కొత్తగూడ మండల నికి అదనంగా యూనిట్లు కేటాయించాలని కోరడం జరిగింది.. అందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారని  తెలిపారు…

23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశంలోని 23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో tata ipl fan park లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మరియు మార్చి 22 నుండి ఛాంపియన్‌షిప్ అంతటా ఇవి పనిచేస్తాయి.

ప్రత్యక్ష మ్యాచ్ స్క్రీనింగ్‌లు, సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలం మరియు వర్చువల్ బ్యాటింగ్ జోన్, నెట్స్ ద్వారా బౌలింగ్, ఫేస్-పెయింటింగ్ జోన్‌లు, రెప్లికా డగ్-అవుట్‌లు, చీర్-ఓ-మీటర్ మరియు 360 డిగ్రీల ఫోటో బూత్‌లతో సహా ఉత్తేజకరమైన యాక్టివేషన్‌లతో పూర్తి చేసిన ఫ్యాన్ పార్కులు అభిమానులను నిమగ్నం చేయడం మరియు దేశంలోని ప్రతి మూలకు ఐపీఎల్ థ్రిల్‌ను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయని గురువారం మీడియా విడుదల తెలిపింది.

ఈ సీజన్‌లో మొదటి ఫ్యాన్ పార్కులు రోహ్‌తక్ (Haryana), బికనీర్ (Rajasthan), గ్యాంగ్‌టక్ (Sikkim), కొచ్చి (Kerala) మరియు కోయంబత్తూర్ (Tamil Nadu)లలో ప్రారంభమవుతాయి. ప్రతి వారాంతంలో వివిధ రాష్ట్రాలలో ఒకేసారి బహుళ ఫ్యాన్ పార్కులు నిర్వహించబడతాయి, గరిష్ట అభిమానుల నిశ్చితార్థాన్ని నిర్ధారిస్తాయి. కాకినాడ (ఆంధ్రప్రదేశ్), దిమాపూర్ (Nagaland), కరైకల్ (Puducherry), మన్భుమ్, పురులియా (West Bengal), రోహ్తక్ మరియు టిన్సుకియాలలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌లు జరగడం ఇదే మొదటిసారి.
“భారతదేశం అంతటా అభిమానులకు టోర్నమెంట్‌ను దగ్గరగా తీసుకురావాలనే మా దార్శనికతలో ipl fan park ‌లు కీలకమైన భాగం. బహుళ నగరాలు మరియు పట్టణాల్లో ఈ ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా, విద్యుదీకరించే స్టేడియం వాతావరణాన్ని తిరిగి సృష్టించడం మరియు అభిమానులు కలిసి ఐపీఎల్‌ను జరుపుకునేలా చేయడం మా లక్ష్యం. ఈ చొరవ దేశవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులతో మా బంధాన్ని బలపరుస్తుంది, వారు క్రీడ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని ఉత్సాహభరితమైన మరియు ఉత్సాహభరితమైన వాతావరణంలో అనుభవించేలా చేస్తుంది, ”అని ipl chairman anurag singh ధుమల్ అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి..

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఓటర్ జాబితా సవరణ పై కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా జరగాలని, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు ఓటర్ జాబితా చాలా కీలకమని, సరైన ఓటర్ జాబితాతో ఎన్నికల నిర్వహిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు.
ఓటర్ జాబితా, పారదర్శకమైన పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, బ్యాలెట్ ఎన్నికల వ్యవస్థకు కీలకమని అన్నారు.

ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణ పై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని,ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగించే సమయంలో తప్పనిసరిగా నిర్దేశిత మార్గదర్శకాలు పాటించాలని అన్నారు.
ఓటరు జాబితాలో డబల్ ఎంట్రీ ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మన జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమందికి ఓట్లు ఉన్నట్లు వస్తున్న ఫిర్యాదులను జాతీయ ఓటర్ సర్వీస్ పోర్టల్ వివరాలు పరిశీలిస్తూ పరిష్కరిస్తామని అన్నారు.
ప్రతి సంవత్సరం 4 సార్లు ఓటర్ జాబితా సవరణ చేయడం జరుగుతుందని అన్నారు.

ప్రజాప్రతినిధుల చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం ఓటర్ నమోదు సమయంలో తప్పుడు సమాచారం అందిస్తే నేరమని, మోసపూరిత ఉద్దేశాలతో రెండు చోట్ల ఓటు హక్కు కల్గి ఉండే ఓటర్ల వివరాలు ఆదారాలతో అందిస్తే తప్పనిసరిగా విచారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వీటి పరిధిలో ఇప్పటివరకు 2 లక్షల 30 వేల 157 మంది పురుష ఓటర్లు, 2 లక్షల 47 వేల 977 మంది మహిళా ఓటర్లు, 38 మంది ఇతరులు మొత్తం 4 లక్షల 77 వేల 182 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
గత అసెంబ్లీ, పార్లమెంట్ , ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వ్యయ వివరాలు నిర్దిష్ట సమయంలో నమోదు చేయాలని , లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరారు.

 

ఓటర్ జాబితా సవరణపై ఎటువంటి సందేహాలు ఫిర్యాదులు సూచనలు ఉన్న తెలియజేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు రాధాబాయి రాజేశ్వర్ భాజాపా పార్టి ప్రతినిథి నాగుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సంపత్, భారస పార్టీ ప్రతినిధి రాజన్న, బి.ఎస్.పి పార్టీ ప్రతినిధి రమేష్, సి.పి.ఐ(ఎం) పార్టీ ప్రతినిధి రమణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం.

పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్ కార్యక్రమం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ ద స్కూల్స్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది‌.ఈ కార్యక్రమానికి నడికూడ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలు, యుపిఎస్ చౌటపర్తి, యుపిఎస్ ముస్త్యాలపల్లి, యుపిఎస్ పులిగిల్ల, యుపిఎస్ నర్సక్కపల్లి నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరై జడ్పీహెచ్ఎస్ నడికూడ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు వసతులు, విద్యార్థులు పరిశీలించడం జరిగింది.ఇందులో భాగంగా గ్రంథాలయం,సైన్స్ ల్యాబ్, కిచెన్ గార్డెన్,డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి ఉన్నత పాఠశాల పట్ల అవగాహన పొందినారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని ఉపాధ్యాయులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని, ఆనందాన్ని,సంతోషాన్ని పొందారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సిరిసిల్ల అగ్గిపెట్టెలో చీరను మెచ్చిన.!

సిరిసిల్ల అగ్గిపెట్టెలో చీరను మెచ్చిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి దాత్రి )

సిరిసిల్ల నేతన్న ప్రతిభకు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అబ్బురపడ్డారు.

జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇంత చిన్న అగ్గిపెట్టెలో అమరిన చీరను నేసిన నేతన్నను అభినందించారు.

వివరాల్లోకి వెళితే 2025 మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం 2024 మిస్ వరల్డ్ పోటీలలో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ అందాల భామ క్రిస్టినా హైదరాబాద్ సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కళాకారుల అద్భుత పనితీరును మిస్ వరల్డ్ క్రిష్టినాకు పరిచయం చేశారు.

అందులో భాగంగా సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ఖండాంతరాలకు వ్యాపింప చేసిన వెల్ది హరిప్రసాద్ తాను నేసిన చేనేతలను మిస్ వరల్డ్ కు చూపించారు.

అద్భుత నైపుణ్యంతో నేసిన చేనేత వస్త్రాలను చూసిన మిస్ వరల్డ్ క్రిస్టినా నేతన్న పనితీరుకు మంత్రముగ్ధులయ్యారు.

అగ్గిపెట్టెలో ఇమిడి చీరను ప్రత్యేకంగా తన భుజాలపై వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.

మిస్ వరల్డ్ సిరిసిల్ల చేనేతలను ప్రశంసించడం పట్ల నేత కళాకారుడు హరి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.

సిరిసిల్ల నేతన్నల కీర్తిని విశ్వవ్యాప్తం చేసే దిశగా మరిన్ని ఆవిష్కరణలను రూపొందిస్తానని హామీ ఇచ్చారు.

సిసి రోడ్ల ప్రారంభం..

సిసి రోడ్ల ప్రారంభం

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చౌకత్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రావిపల్లి అమర సేనా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో 500 మీటర్ల మేర 20 లక్షల నిధులతో సిసి రోడ్ ను ప్రారంభించామన్నారు . అలాగే వారికి కృతజ్ఞతలు తెలిపారు ఎల్లవేళలా రోహిత్ కు రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాల్య నాయక్, రాములు, సూర్య నాయక్, రాజు నాయక్, మంజుల, బోయిని నాగరాజ్ ,బాలయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేర్ కి ఆర్థిక సహాయం..

ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేర్ కి ఆర్థిక సహాయం చేసిన కిరాణం వ్యాపారి
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరు చేయించడానికి వనపర్తి పట్టణానికి చెందిన వాసవి సప్లయర్స్ ఎదురుగా చిరు కిరాణం వ్యాపారి ద్వారకా కిరాణం కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు కు అందజేశారు పూరి ని శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురాం కాంగ్రెస్ నాయకులు రాజకుమార్ శెట్టి ఆవోప పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు లగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టిని సన్మానం చేశారు ఆర్యవైశ్య వైకుంఠంరథాని కి ఆర్థిక సహాయం చేసిన చిరు వ్యాపారి కాలూరు శ్రీనివాసులశెట్టిని ఆర్యవైశ్య నేతలు అభినందించారు

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున.!

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి:

అలంపూర్ జోగులాంబ అమ్మవారిని గురువారం రాష్ట్ర *మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు ఈసందర్భంగా
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డని జోగులాంబ అమ్మవారి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు మాజీమంత్రి వెంట ఆర్యవైశ్యడు
వెంకట్రామయ్య శెట్టి మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు

మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం.

మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ని స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కు సుదీర్ఘ పోరాటం కొనసాగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పంజా మహేందర్ ,జిల్లా నాయకులు కొమ్మాట సుధాకర్ ,మండల అధ్యక్షుడు కొమ్మాట అమర్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎల్లం, స్వామి, శమల మహేష్ ,రాజు, స్వామి,వినోద్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version