వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
సిరిసిల్ల (నేటి ధాత్రి):
శాతవాహన విశ్వవిద్యాలయం గురువారం 20.3.2025 రోజున ప్రకటించిన 1, 3, 5 సెమిస్టర్ ఫలితాలలో సిరిసిల్ల జిల్లాలోని వికాస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ విద్యార్థులు జిల్లా మరియు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఇందుకుగాను సిరిసిల్ల జిల్లా ఎస్. పి మహేష్ బి. గితే కళాశాల విద్యార్థులను శాలువా, మెమెంటో తో సత్కరించారు.
అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులను అభినందించారని తెలిపారు. ఈ ఫలితాలలో 9 జి. పి. ఏ మరియు ఆ పైన జి. పి. ఏ సాధించిన మా కళాశాల విద్యార్థులు
1. బి దినేష్ నాయక్ 9.4 జి.పీ. ఏ ( ఫుడ్ సైన్స్)
2. కే అక్షిత 9.24 జి.పీ.ఏ(బీ కాం)
3. కే శ్రావణి 9.19 జి.పీ.ఏ(బీ కాం)
4. ఈ భవాని 9.11 జి.పీ.ఏ(బీ కాం)
5. టీ.మేఘన 9.20 జి.పీ.ఏ(బీ కాం)
6. జి సుప్రియ 9.12 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
7. వి నవ్య 9.04 జి.పీ.ఏ(బీ కాం)
8. వి .సుప్రియ 9 జి.పీ.ఏ( డేటా సైన్స్)
9. జ.వైష్ణవి 9 జి.పీ.ఏ(ఫుడ్ సైన్స్)
10. అబ్దుల్ అఖిబ్ 9 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
11. నల్ల శ్రేయ 9 జి.పీ.ఏ( ఏం.పీ. సీఎస్)