వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో . ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం గంగాపూర్ గ్రామం పి.మల్ శెట్టి పాటిల్ కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వెడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, రామలింగారెడ్డి, శివరాజ్ పాటిల్,జలీల్, జి.నర్శింలు,నబిసాబ్, చెంగల్ జైపాల్,చంద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు విశిష్టత కార్డు తప్పనిసరి.

రైతులకు విశిష్టత కార్డు తప్పనిసరి

నెక్కొండ నేటి ధాత్రి:

 

రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు విశిష్ట కార్డు రైతులకు ముఖ్యమని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర లో రైతు విశిష్ట కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి నాగరాజు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కిసాన్ యోజన తో పాటు ఎరువులు విత్తనాలు కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకున్న రోజున ఈ విశిష్టత కార్డు ప్రభుత్వం తప్పనిసరి అనే విధానాన్ని కల్పించ నున్నదని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నూతన విధానాన్ని రైతుల కోసం ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రైతు విశిష్టత రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు, కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి వసంత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మేరకు బృందాల ప్రదర్శన. !

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళా బృందాల ప్రదర్శన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర.సంబంధాల శాఖ ఆధ్వర్యంలో. తెలంగాణ సాంస్కృతిక సారధి గడ్డం శ్రీనివాస్ కళాబృందం ఆధ్వర్యంలో పలు గ్రామాలలో బృందంచే. అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు అయిన. కెసిఆర్. కాలనీ కాబట్టి ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పారిశుభ్రత పాటిస్తూ ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా .తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. తెలియజేస్తూ ముఖ్యంగా యువత పిల్లలు డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని. పెద్దలు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిసి కలకాలం. పిల్లాపాపలతో చల్లగా ఉండాలని. ముఖ్యంగా ప్రజలు వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని. కూలి పనికి వెళ్లేవారు. ఉదయం. సాయంత్రం. పనులు చేసుకోవాలని ఎండలో పనిచేసేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తలపాగా టోపీ గొడుగు మంచిరు వంటివి వెంట తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందిరమ్మ ఇల్లు రాజు యువ వికాసం గృహ జ్యోతి ఉచిత . వంట గ్యాస్. 200 యూనిట్ల ఇంటి కరెంటు సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో. జిల్లా సాంస్కృతిక. సారధి టీం లీడర్ గడ్డం శ్రీనివాస్. కళాకారులు. శ్రీరాముడు రామచంద్రం. గుగ్గిళ్ళ పరశురాములు. వంతడుపుల గణేష్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ.

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ బృందం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

హైదరాబాద్ లోని మినిష్టర్ నివాసంలో వ్వవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరావు ను సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కె కె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, వైస్ చైర్మెన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, కమిటీ డైరెక్టర్ లు కలసి పుష్పగుచ్చాము అందజేసి శాలువతో సత్కరించారు.అనంతరం సర్దాపూర్ లో గల వ్వవసాయ్ మార్కెట్ కమిటీ సిసి రోడ్ కాపౌండ్ వాల్ కొరకు నిధులు కొరకు మంత్రి దృష్టి కి తీసుకెళ్లగా, మంత్రి గారు స్పందించి, సిసి రోడ్ కు నిర్మాణానికి 1 కోటి 30 లక్షలు, కాంపౌండ్ వాల్ కోటి రూపాయలు కేటాయించి నిధులు మంజూరు చేశారాని మార్కెట్ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ కు సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్స్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం.!

రేపు రంజోల్ దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి :

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ. స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. లియో క్రాఫ్ట్, ఇంటిరియర్స్ అధినేత చెవుల ఉమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి గణపతి పూజ, పంచామృత అభిషేకం, 9గం. లకు దత్త హోమం, 11. 30 కి పూర్ణహుతి, మ. 12 గం. లకు స్వామివారికి హారతి, 12. 30 కి అన్నప్రసాద కార్యక్రమలు జరుగునని తెలిపారు.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి..

#ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

#దేవాలయ స్థల దాతకు ఘన సన్మానం .

#మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.!

జర్నలిస్టు కాలనీ స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్య
లు తప్పవు బెల్లంపల్లి తహసిల్దార్ జోష్ణ.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

 

బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదా
రిని ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీ స్థలంలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్లాటింగ్ చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేయడంతో రెవె
న్యూ అధికారులు బుధవారం తొలగిం
చారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల కిందట జర్నలిస్టు కాలనీ లోని స్థలంలోకొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా సిమెంటు పోల్స్ పాతిస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు(టేకు
లబస్తీ) జర్నలిస్టు కాలనీకి వెళ్లి క్షేత్ర
స్థాయిలో పరిశీలించి సంబంధిత తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లను విషయాన్ని వివరించి స్థలాన్ని రక్షించి అర్హులైన జర్నలిస్టులకు సంబంధిత స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయడం జరి
గింది. స్పందించిన బెల్లంపల్లి తహసీల్ జోష్ణ ఆదేశాల మేరకు బెల్లంపల్లి రెవెన్యూ ఆర్ఐ మురళీదర్ రెవెన్యూ సిబ్బంది సహాయంతో స్థలంలో పాతిన సిమెంట్ పోల్స్ ను తొలగించారు. ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి జర్నలిస్టు కాలనీ స్థలాన్ని రక్షించినందుకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జోష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హామీ హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసుకున్న వర్కింగ్ జర్నలిస్టు
లందరికీ జర్నలిస్టు కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి. !

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం సీతారాంతండకు చెందిన వాంకుడోత్ రజిత-ఉక్కస్వామి దంపతుల కూతురు కృష్ణవేణి-శ్రీనివాస్ ల. వివాహ వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి.

విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు మృతి
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

 

మండలంలో విద్యుత్ ఘాతంతో జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షంలో రైతు మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన పడిదల బాపురావు ఇంటినుండి దగ్గరలోని విద్యుత్ పోల్ నుండి సర్వీస్ వైర్ ఈదురు గాలులకు మధ్యలో తెగి జెర్సీ అవుమీదపడి విద్యుత్ ప్రసరణ జరగడంతో.రైతు పడిదల బాపురావు కు చెందిన 60 వేల విలువగల జెర్సీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ షాక్ గురై ఆవు చనిపోయిన. రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నూతన టివైజెఎఫ్ జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక.!

నూతన టి.వై.జె.ఎఫ్. జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక….!

◆-టి.వై.జె.ఎఫ్.అధ్యక్షుడుగా చెలిమేడ అనిల్ కుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ జర్నలిస్టు వృత్తి బాధ్యత గల వృత్తి అని, ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని రాష్ట్ర టి . వై.జె.ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ తనుగులు జితేందర్ రావు అన్నారు.హైదరాబాద్ లోని రాష్ట్ర టీ .వై .జె.ఎఫ్ ఆఫీసులో నిర్వహించిన ముఖ్య సమావేశంలో డాక్టర్ జితేందర్ రావు అధ్యక్షతన జహిరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన (టి.వై.జె.ఎఫ్) అధ్యక్షుడు కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన చెలిమేడ అనిల్ కుమార్ ను, టి.వై.జె.ఎఫ్. ఉపాధ్యక్షుడిగా ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామానికి చెందిన నాగేష్ , నూ రాష్ట్ర టి.వై.జె.ఎఫ్.

 

President

అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు నియమిస్తున్నట్లు తెలపడం జరిగింది. త్వరలోనే జహీరాబాద్ టీ.వై.జె.ఎఫ్. మిగతా శాఖలను అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కలిసి నియమించుకోవాలని రాష్ట్ర టి. వై .జె .ఎఫ్.అధ్యక్షుడు కోరడం జరిగింది. చెలిమేడ అనిల్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జహీరాబాద్ నియోజకవర్గ టీ.వై.జె.ఎఫ్. అధ్యక్షుడిగా నాకు ఇంత పెద్ద బాధ్యత చెప్పినందుకు రాష్ట్ర టీ.వై.జె.ఎఫ్.అధ్యక్షులకు డాక్టర్ తనుగుల జితేందర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో.!

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి

నేటి యువత అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నారు అది తెలంగాణ మట్టిగడ్డ యొక్క గొప్పతనం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని శాంతినగర్ లో శ్రీసేవాలాల్ మహారాజ్ కాంప్లెక్స్ నందు మాలోత్ కల్పన రాజు నాయక్ పెట్టిన రాయల్ బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ కొత్తపెల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ లతో కలసి ప్రారంభించడం జరిగినది. ఈసందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నేటి యువతరం కష్టపడి తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో రకమైన వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని ఒకప్పుడు ఏపని లేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు ఎదుగుతుంది అంటే అందుకు కారణం యువతరమని ఏదో ఒక పని చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తున్నారని అందుకోసమే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఉద్యోగం కాదు వ్యాపారంలో కూడా అధిక లాభాలు సంపాదించి అభివృద్ధి చెందవచ్చనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించారన్నారు. అందులో భాగమే నేడు కల్పన రాజు నాయక్ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడడం కోసం బేకరీ ఫాస్ట్ ఫుడ్ పెట్టడం జరిగిందని సందర్భంగా వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మాజీ వార్డ్ మెంబర్ నజీమా బేగం, బిజెపి నాయకులు సదానందం నాయక్,
బిఆర్ఎస్ నాయకులు చెట్టుపెళ్లి నరేందర్, మల్లేశం, భాస్కర్ నాయక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ రవి నాయక్, గిరిజన నాయకులు రంగనాయక్, మోహన్ నాయక్, పాప నాయక్, జాంగిర్, పైడిపాల రవి, శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

ఖానాపూరం మండలం బుధరావుపేట గ్రామంలో భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారా తోరణం (ఆర్చ్) ను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుదవారం ప్రారంభించారు.అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు,దేవాలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి :

 

 

రైతులు రైతు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. రైతులు కేంద్ర ప్రభుత్వం పథకాలను పొందడానికి ఈ రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దీని ద్వారా 11 అంకెల కార్డు రావడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అప్పుల బాధలు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని . మహేంద్ర కాలనీకి చెందిన మృతుడు రవికాంత్ చారీ 32 స్వర్ణకారుడు వ్యాపారం చేస్తుండేవాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహీర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు ఇస్తామని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉందని పేర్కొన్నారు.

సీబీఎస్ఈ ఫలితాలలో కేవీ విద్యార్థుల ప్రతిభ.

సీబీఎస్ఈ ఫలితాలలో కేవీ విద్యార్థుల ప్రతిభ.

◆ వందశాతం ఉత్తీర్ణత.● శ్రీనిధి విద్యార్థినికి 586 మార్కులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కన బరిచారు. పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల చెందిన విద్యార్థినికి శ్రీనిధి 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్, ఝరాసంగం తహసిల్దార్ తిరుమలరావు, కేంద్రీయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు కేవీడీ పవన్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

ఆపరేషన్‌ సింధూర్‌తో వెల్లడైన భారత్‌ సత్తా

మన రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగే అవకాశం

మన సామర్థ్యానికి వేదికగా మారిన పాక్‌

భౌతికంగా ఓడిన పాక్‌…కానీ నిజంగా ఓడిరది చైనా

దేశానికి నిబ్బరాన్నిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌

ఆయుధ సంపత్తిలో సూపర్‌పవర్‌గా భారత్‌

ప్రపంచ వేదికపై బలీయమైన అగ్రరాజ్యంగా భారత్‌

నేటిధాత్రి ,డెస్క్‌: 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాశ్చాత్యమీడియా చైనా ఆయుధాల సామర్థ్యాన్ని ఆకాశానికెత్తే స్తూ విపరీతంగా వార్తలు ప్రచురించడం ఒక విచిత్ర పరిణామం. వీటిల్లో వచ్చిన వార్తలకు, క్షే త్రస్తాయిలో జరుగుతున్నదానికి అసలు పొంతనే లేదు! పాకిస్తాన్‌లో నెలకొల్పిన చైనాతయారీ రక్షణ వ్యవస్థలు అసలు ఏఒక్క భారత క్షిపణని లేదా డ్రోన్లను ఆపలేకపోయాయి. ఇదే సమయం లో పాక్‌ డ్రోన్‌లు లేదా క్షిపణులు భారత్‌ భూభాగంలోకి ప్రవేశించకుండానే ధ్వంసమైపోయాయి. ప్రస్తుతానికి ఈ పాకిస్తాన్‌, చైనా అనుకూల మీడియా ప్రచారాన్ని పక్కన పెడితే, నిజానికి భారత్‌ను రక్షించిందేమిటి? ప్రపంచానికి ఇది ఎటువంటి సందేశం ఇచ్చిందనేది పరిశీలిద్దాం.

అమెరికా సైన్యంలో పనిచేసి ప్రస్తుతం మాడిసన్‌లో అర్బన్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌కు చీఫ్‌గా వున్న జాన్‌ స్పెన్సర్‌ సింధూర్‌ సందర్భంగా భారత్‌ సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ ఏవిధంగా పనిచేసిం దో, దాని సామర్థ్యమెంటో చాలా నిశితంగా పరిశీలించి అత్యంత విలువైన సమాచారాన్ని వెల్లడిరచారు. అంతేకాదు ఆపరేషన్‌ సింధూర్‌ నుంచి ప్రపంచం నేర్చుకోవలసిన పాఠాలు కూడా చాలనే వున్నాయని ఆయన విశ్లేషించారు. సింధూర్‌ ఆపరేషన్‌లో భారత్‌ ప్రపంచానికి ఒక సరికొత్త ఆధునిక రక్షణ ప్రక్రియను పరిచయం చేసింది. తన గగనతలాన్ని కొన్ని అంచెలుగా ఏర్పరచుకున్న పటిష్ట రక్షణ వ్యవస్థ సహాయంతో సమర్థవంతంగా కాపాడుకోవడమే కాదు, ప్రత్యర్థి పాకిస్తాన్‌ భూభాగంలో నెలకొల్పిన చైనా రక్షణ వ్యవస్థలను తుత్తినియలు చేసి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. ఇక్కడ పాకిస్తాన్‌కు మాత్రమే కాదు ప్రపంచానికి భారత్‌ ఒక పాఠాన్ని నేర్పింది. అదేంటంటే ‘‘ఎన్ని రక్షణ ఆయుధాలను, వ్యవస్థలను కొనుగోలు చేసావన్నది కాదు ఇక్కడ ప్రశ్న. వాటిని ఎంత చక్కగా సమన్వయంతో ఉపయోగించావన్నది ప్రధానం’’. భారత్‌ ఈ ఆపరేషన్‌ లో త్రివిధ దళాలను సమన్వయం చేయడమే కాదు, చక్కటి ప్రణాళికతో, తనవద్ద వున్న సాంకేతిక నైపుణ్యాన్ని చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టింది. నిజం చెప్పాలంటే బాహ్యంగా ఓటమిపాలైనట్టు పాకిస్తాన్‌ కనిపిస్తున్నా, అసలు దెబ్బతగిలింది మాత్రం చైనాకు!

భారత్‌ నేడు ఉపయోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌, క్యు.ఆర్‌.ఎస్‌.ఏ.ఎం.లతో పాటు ఇజ్రాయిల్‌కు చెందిన బరాక్‌ా8, రష్యా తయారీ ఎస్‌ా400 వున్నాయి. ఈ మూడు స్వల్ప, మధ్య, దీర్ఘ శ్రేణి అంచెలు నిరంతరం వివిధ దశల్లో సమన్వయం తో పనిచేసి ఒక రక్షణ జాలాన్ని ఏర్పరచాయి. 

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ చైనా తయారీ హెచ్‌.క్యుా9 (ఇది ఎస్‌ా300 మాదిరిగా పనిచేస్తుంది), ఎల్‌వైా80, మరియు ఎఫ్‌ఎరా90. వీటి పనితీరు పేపరుపై వివరించడానికి తప్ప, యుద్ధక్షేత్రంలో ఎంతమాత్రం పనికిరావన్నది స్పష్టమైంది. ఎందుకంటే భారత్‌ తన ఎలక్ట్రానిక్‌ యుద్ధతంత్రం, సైద్ధాంతిక క్రియాశీలత, గతిశీలక దాడులతో ఈ రక్షణ వ్యవస్థలను ఎందుకూ కొరగాకుండా చేయడమే కాదు, పాక్‌ భూభాగాల్లోకి చాలా సమర్థవంతంగా చొచ్చుకెళ్లి అనుకున్న లక్ష్యాలను సాధించగలిగింది. 

ఇదే సమయంలో రష్యాతో జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్‌ కూడా ఎన్నో పాఠాలు నేర్పింది. ఎట్లా అంటే ఉక్రెయిన్‌ విస్తీర్ణం 6లక్షల చదరపు కిలోమీటర్లు. సువిశాల మైదానాలు, విస్తరించిన పట్ట ణ మౌలిక సదుపాయాలు ఈ యుద్ధంలో పెను సవాలుగా నిలిచాయి. ఇక్కడ ఉక్రెయిన్‌కు అ త్యంత ఖర్చుతో కూడిన పరిమిత వ్యవస్థలు వుండటం మాత్రమే కాదు ఇక్కడ సమస్య. వీటిని ఎంత సమర్థవంతంగా సమన్వయంతో ఉపయోగించామన్నది అత్యంత కీలకం. పశ్చిమ దేశాలు అందించిన ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులు (ఎస్‌ఏఎం), సోవియట్‌ యూనియన్‌ కాలంనాటి ఆయుధాలు, ఎస్‌`300 యూనిట్లు, సంచార ఐఆర్‌ఐఎస్‌`టి బ్యాటరీ లు, మనుషులు మోసుకెళ్లగల గగనతల రక్షణ వ్యవస్థలు, విమాన విధ్వంసక శతఘ్నులు ము ఖ్యంగా జర్మన్‌ తయారీ జెపార్డ్‌లు ఉక్రెయిన్‌ వద్ద వున్నప్పటికీ వీటిని ఉపయోగించడంలో సమ న్వయం లోపించడం పరాజయానికి దారితీసింది.

ఇక భారత్‌ విషయానికి వస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలను ఎంతో చక్కగా సమర్థవంతంగా వినియోగించింది. వీటి పనితీరు నూటికి నూరుపాళ్లు నిక్కచ్చిగా వుండటంతో ప్రపంచానికి భారత సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యంపై గట్టి విశ్వాసం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో రష్యా తయారీ ఎస్‌`400కు సమానమైన ప్లాట్‌ఫామ్‌లు, ఇతర దేశీయ తయారీ ఆయుధాలను ఇప్పుడు భారత్‌ చక్కగా విదేశాలకు అమ్ముకోగలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే తన ఆయుధ సామర్థ్య ప్రదర్శనకు పాకిస్తాన్‌ను ఒక వేదికగా భారత్‌ ఉపయోగించుకున్నదనే చెప్పాలి. దీనివల్ల ఒనగూడిన ప్రయోజనాలు రెండు. పాకిస్తాన్‌ పొగరు అణచడం. రెండవది తన ఆయుధ మార్కెట్‌లో మరింత విశ్వసనీయతను సంపాదించుకోవడం. ఇదే సమయంలో చైనా తయారీ పరికరాలు ఎంత నిప్పచ్చరంగా వున్నాయో ప్రపంచానికి విస్పష్టంగా చూపడం! ఈ మూడు లక్ష్యాలను భారత్‌ సునాయాసంగా సాధించింది. మరో ప్రధాన విషయమేంటంటే గత యు ద్ధాల్లో మాదిరిగా భారత్‌ ఎంతో కష్టపడి చమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తనవద్ద వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సునాయాసంగా పాక్‌ను మట్టికరిపించింది. 

మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థ, క్షిపణుల సామర్థ్యం ఎంత బాగా వున్నదీ ప్రపంచానికి వెల్లడి కావడంతో, ఈ రంగాల్లో రానున్న కాలంలో భారత్‌ ఎగుమతులు బాగా ఊపందుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు తక్కువ ఖరీదుకు చైనా నుంచి కొనుగోలు చేస్తున్న ఆయుధాల విషయంలో సంశయాత్మకత పెరగడమే కాదు, ఇక ముందు నాణ్యమైన భారత్‌ ఉత్పత్తులవైపు దృష్టి సారించే అవకాశాలే మెండు.

ఇప్పటికే భారత్‌ తన భౌగోళిక రాజకీయ విస్తృతిని బాగా పెంచుకుంటూ, చైనా ఆధిపత్యాన్ని స వాలు చేస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే తయారీరంగంలో కూడా చైనాకు పెద్ద పోటీదారుగా మారబో తున్నది. అంతేకాదు ఆధునిక రక్షణ వ్యవస్థల తయారీ, అమ్మకాల విషయంలో ఇప్పటివరకు కొనసాగుతున్న చైనా ఆధిపత్యాన్ని క్రమంగా దెబ్బతీయవచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఆసియా, ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాలను నెరపుతూ, చైనా తన ఆయుధాలను ఆయా దేశాలకు అమ్ము కుంటూ వస్తున్నది. ఇప్పుడు భారత సామర్థ్యం బహిర్గతం కావడంతో ఆయా దేశాలు ఇక క్రమంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించకమానవు. ఇప్పటికే చైనా పట్ల యూరప్‌, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా దౌత్యం ముసుగులో ఆధిపత్య రాజకీ యాలు చేయడం చేయడం చైనాకు అలవాటు కను, ఇప్పటివరకు అవసరం రీత్యా తప్పనిసరిగా సహిస్తూ వస్తున్న ఆసియా దేశాలు తమ వైఖరిని పూర్తిగా మర్చుకునే అవకాశాలే ఎక్కువ. ఒక పక్క స్నేహసంబంధాలు నెరపుతూనే ఆయా దేశాలను రుణ ఊబిలో నెట్టిన చైనా వైఖరిపట్ల చా లా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ఈ ఊబినుంచి బయటపడటానికి యత్నిస్తుండగా, కొన్ని బయటకు రాలేక చైనా కబందహస్తాల్లో కునారిల్లుకుపోతున్నాయి. ముఖ్యంగా చైనా క ల్పించే రుణ ఊబి ఆయా దేశాలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. 

ఇటువంటి పరిస్థితుల్లో వాటికి భారత్‌ ఒక ప్రత్యామ్నాంగా కనిపిస్తున్నా, విశ్వసించడానికి అనువైన వేదిక లేకపోవడంతో అవి మౌనంగా వుంటూ వస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్‌ పుణ్యమాని ఆపరేషన్‌ సింధు భారత్‌ సామర్థ్య ప్రదర్శనకు చక్కటి వేదికగా మారడంతో, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాల వైఖరిలో గణనీయమైన మార్పు రావడం తథ్యం.

దినామ్‌ ఆరోపణలే..ఎల్ల కాలం రాజకీయాలే!!

`అభివృద్ధికి ఏది సమయం.. చెప్పుకోవడానికి ఏది సందర్భం.

`నిన్నటి దాకా వీళ్లు..ఇప్పుడు వాళ్లు!

`అవినీతి ఆరోపణలు రాకుండా రాజకీయాలు చేయలేరా?

`దోచుకున్నారన్న విమర్శలు లేకుండా పాలన సాగించలేరా?

`మీరంటే మీరు దోచుకున్న ముచ్చట్లు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడరా?

`దోచుకు తింటున్నారనే నాయకులు తప్ప ప్రజలకు దిక్కులేదా!

`నిన్నటి దాగా బిఆర్‌ఎస్‌ లక్షల కోట్లు దోచుకుందన్నారు

`రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దివాలా తీయించిందన్నారు

`నిరూపించమని ప్రతి అంశంలోనూ బిఆర్‌ఎస్‌ సవాలు చేస్తూనే వుంది

`సంవత్సరంన్నరైనా ఏది నిరూపించింది లేదు

`ఎవరికీ శిక్ష పడిరది లేదు

`పత్రికలకు వార్తలకు కొదువ లేదు

`ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ఆరోపణలు మొదలయ్యాయి

`కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దోచుకుంటున్నారంటున్నారు

`నిజాయితీగా ఏ పార్టీ ప్రజాసేవ చేయలేదా?

`ప్రజలకు ప్రత్యామ్నాయం వీళ్లు తప్ప ఇంకెవరూ లేరా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఏ రాజకీయ పార్టీ నాయకుడి గురించి విన్నా ఏమున్నది గర్వకారణం సమస్తం అవినీతి ఆరోపణల మయం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలైనా, నాయకులైనా సరే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వాళ్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు. వాళ్లు నిజంగా సంపాదించారా? లేదా? అన్నది ఎవరికీ తెలియదు. కాని ఆస్ధులు కూడబెట్టుకున్నారన్నది నిజం. జనంలో ఆ దర్పం కనిపిస్తున్నది నిజం. కాని రాజకీయ అవినీతి ద్వారా సంపాదించారా? అన్నది మాత్రం పూర్తిగా నిజంకాకపోవచ్చు. ఒకప్పుడు నాయలంటే కేవలం ప్రజా ప్రతినిధులుగానే కొనసాగుతూ వుండేవారు. ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం వుండేది కాదు. వుంటే గింటే అంతో ఇంతో వ్యవసాయం వుండేది. అంతే తప్ప పెద్దగా వ్యాపారాలుండేవి కాదు. సంపాదనపై పెద్దగా వారికి ఆసక్తి వుండేది కాదు. ఎన్నికల సమయాల్లో కూడా వారికి వ్యాపారులు సహకరించేవారు. ఎన్నికల తంతు పూర్తి చేసుకునేవారు. కాని ఎనభైవ దశకం నుంచి పార్టీలపైన విమర్శలు, నాయకుల మీద అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. అవి ఇప్పుడు తారాస్దాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు లక్షల రూపాలయలు సంపాదించారంటే అది పెద్ద విషయంగా చెప్పుకునే వారు. తర్వాత కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు, ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లు అనే మాటలు తప్ప తక్కువ వినిపించడం లేదు. నిజంగా నాయకులు అంత సంపాదిస్తారా? అంటే అవును ఎవరూ సమాదానం చెప్పలేరు. విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నామనే వారు కూడా వున్నారు. అయితే ఆ విమర్శించే వాళ్లు కూడా ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నవాళ్లే..అందులో ఎవరూ సుద్దపూసలు కాదన్న మాటలు పడుతున్నవాళ్లే..ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆరోపణలు ఎదుర్కొని నాయకులు ఒక్కరు కూడ లేదు. కాకపోతే ఇప్పటికీ కనిపిస్తున్న ఒక్కరో, ఇద్దరో నాయకులు వున్నప్పటికీ వారు క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఎన్నికల్లో పోటీచేసినా వాళ్లు ఇప్పుడు గెలవలేరు. గతంలో నాలుగుసార్లు, ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ఎలాంటి అవినీతి మరకలు అంటని వారు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసినా తప్పకుండా వాళ్లు కూడా ఆరోపణలు ఎదుర్కొక తప్పని పరిస్దితులు వచ్చేశాయి. రాజకీయాల్లో అవినీతి అనే పదం అంతకు ముందుఎలా వున్నా..ఎంత వున్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే పుట్టిందని చెప్పకతప్పదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కాలంలో గురించిగొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అప్పట్లో ఎన్టీఆర్‌ అవినీతి మీద, ఆశ్రిత పక్షపాతం మీద, అదికార దుర్వినియోగం మీద, కుటుంబ పాలన మీద అనేక సిని మాలు వచ్చాయి. నేరుగా ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ సినీ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అనేక సినిమాలు తీశాడు. కాని ఇప్పుడు ఎన్టీఆర్‌ కాలం గొప్పదనట్లు చెబుతుంటారు. అదే నిజమైతే అప్పట్లో అలాంటి సినిమాలు వచ్చేవి కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ది అనే మాట అటకెక్కింది. నిత్యం రాజకీయ పరమైన ఆరోపణలతోనే కాలం గడిచింది. నిజమైన అభివృద్దిని ఆనాడు చేసిందేమీ లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తొమ్మిదేళ్ల కాలంలో పెద్దగా వ్యవసాయపరమైన ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ఎంత సేపు పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీ కరణ, ప్రభుత్వ కంపనీల అమ్మకాలులతో వచ్చే ఆదాయాల్లో కమీషన్లు అనే ఆరోపణలు అనేకం ఎదుర్కొన్నారు. రైతులకు సబ్సిడీలు తగ్గించారు. విపరీతమైన కంరటు చార్జీలు పెంచారు. వ్యవసాయం లాభసాటి నుంటి గిట్టుబాటు కాదన్నంత దూరం తెచ్చాడు. వ్యవసాయం పంగడ కాదు, దండగ అన్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ది ఏమిటని బూతద్దం పెట్టి వెతికినా ఒక్క ప్రాజెక్టు కనిపించదు. రాష్ట్రాదాయమేమో కాని, ఆయన ఆస్దులు మాత్రం పెరిగిపోయాయన్న ఆరోపణలుఅనేకం వచ్చాయి. రెండు ఎకరాల చంద్రబాబు, ఇరవై వేలకోట్లు సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులతో, అవసరం లేని పనులు చేపట్టి, రైతులను ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టుల చేత ప్రపంచ బ్యాంకు జీతగాడు అని పుస్తకాలు కూడా ప్రచురించారు. తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలలోనే లక్ష కోట్లు సంపాదించారన్న ఆరోపణలుఎదుర్కొన్నారు. ఆయన హయాంలో కూడా పెద్దగా చేసిన పనులేమీ లేదు. కాని నిత్యం అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. తర్వాత మరో ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొని రోశయ్య, రాష్ట్రం విడిపోయే సయమంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి పెద్దఎత్తున సంతకాలు పెట్టి సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దాదాపు ఆ ముప్పై ఎళ్ల కాలంలో వచ్చిన మార్పులు ఏమిటంటే అంతా హైటెక్‌ హంగులు తప్ప మరేం కనిపించడం లేదు. కేవలం ఐటి తప్ప మరేం కొత్త పుంతలు తొక్కిన ఆర్ధిక పరిస్దితి లేదు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కేసిఆర్‌ పరిపాలన చేసిన పదేళ్ల కాలం పాటు కాంగ్రెస్‌ నుంచి అనేక ఆరోపణలు, విమర్శలే. తొలి ఐదేళ్ల కాలంలో కొంత ప్రతిపక్షాల నుంచి పెద్దగా నిరసనలు, ఆరోపణలు వినిపించలేదు. కాని కేసిఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక ఆర్ధికపరమైన ఆరోణలతోనే కాలం గడిచింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ గాని, బిజేపి గాని నిత్యం ఆరోపణలే తప్ప కేసిఆర్‌ తోపాటు, బిఆర్‌ఎస్‌కు చెందిన నాయకుల ఆర్ధికపరమైన దోపిడీ గురించి స్పష్టమైన ఆధారాలు సంపాదించిందేమీ లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా యుగం మొదలైన తర్వాత బిఆర్‌ఎస్‌ పతనం మొదలైంది. పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి నియాకంతో బిఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ అమాంతం పడిపోయింది. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ వంతు వచ్చింది. ఏడాదిన్నర కాలం పూర్తవుతోంది. గతంలో నాయకులు చేసిన ఆరోపణలు మీడియా గుర్తు చేస్తే తప్ప వాటి గురించి ఆలోచనలు వుండేవి కాదు. ప్రజలు కూడా పట్టించుకునేంత తీరిక వుండేది కాదు. కాని నేడు ఆ పరిస్దితి లేదు. సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువైంది. నాయకులు మర్చిపోయినా, సోషల్‌ మీడియా నిత్యం ప్రశ్నిస్తూనే వుంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ హాయంలో జరిగిన, ప్రతిపక్షంలో వున్నప్పుడు చేసిన ఆరోపణల మీద నిజా నిజాలు తేలుతాయని అందరూ అనుకున్నారు. కాళేశ్వరంలో లక్ష రూపాయలు తిన్నారన్నది ప్రదాన ఆరోపణ కేసిఆర్‌ మీద వుంది. అంతే కాకుండా కేసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో వందల ఎకరాలున్నాయన్నాదానిపై విమర్శలున్నాయి. కేసిఆర్‌ పాలనా సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులు అనేవి ఇప్పటికీ సజీవంగా సాగుతున్న ఆరోపణలు. మరి ఆ ఆరోపణలు ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోతోంది. ఏడాదిన్న కాలం గడిచిపోతోంది. యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుతోపాటు, అనేక ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి దీనిపై చర్యలు తీసుకుంటామని చెబుతూనే వున్నారు. మీరు ఎలాంటి దర్యాప్తులైనా చేసుకోండని బిఆర్‌ఎస్‌ ఎదరు సవాలు చేస్తూనే వుంది. బిఆర్‌ఎస్‌ హాయాంలో కేసిఆర్‌ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని అంటున్నారు. వాటి లెక్కలు చెప్పరు. అందులో జరిగిన అవినీతి చెప్పరు. ఇక బిఆర్‌ఎస్‌ వంతు వచ్చింది. ఏడాదిన్న కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడు? ఆయన సోదరులు ఇన్ని తిన్నారు? ఫలానా మంత్రి ఇలా వసూలు చేస్తున్నాడు? అని ఆరోపణలు మొదలు పెట్టారు. కాని వివరాలు చెప్పమంటే మాత్రం సమయం వచ్చినప్పుడు అన్నీ బైట పెడతామంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. వారికి వివరాలు చెప్పడానికి సమయం, సందర్భం అవసరామా? అంటే పార్టీలు ఏవైనా సరే నాయకులంతా ఎల్ల కాలం రాజకీయాలు తప్ప మరేం చేయారా? ఎమ్మెల్యేలు ఎవరూ తమ నియోజకవర్గాలలో వున్న సమస్యలు ప్రస్తావించారా? వాటి పనుల పూర్తి గురించి, అబివృద్ది గురించి మాట్లాడరా? చేసిన అభివృద్ది గురించి చెప్పరా? దినాం..అధికార పార్టీ నాయకులతోపాటు, ప్రతిపక్ష నాయకులంతా అవినీతి ఆరోపణలు తప్ప మరేం మాట్లాడుకోరా? నువ్వుంటే,నువ్వు అని నిత్యం ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలు వింటూ ప్రజలు కూడాపంచ తంత్ర కథలు వింటున్నట్లు సంబరపడి పోతున్నారు. ఇది కూడా తమ మంచికే అని నాయకులు లోలోన నవ్వుకుంటున్నారు..అంతే అంతకు మించి ఈ కథ ఒక్క అడుగు కూడా ముందుకు పోదు..అవినీతి నిరూపణలు అన్నవి ఆమడదూరం…అంతే!!!

వార్డులో సమస్యలు పరిష్కరించాలి .

వార్డులో సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి :

 

 

వార్డులో డ్రైనేజీలు క్రమ క్రమంగా తీయక దుర్వాసన వస్తుందని,ఇంటింటికి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించాలని,నల్లాల ద్వారా ఇంటింటికి క్రమం. తప్పకుండా నీళ్లు అందే విధంగా చూడాలని,వీధిలైట్లు వెలుగని చోట వెలిగేలా చూడాలని,ఎండకాలం దృష్ట్యా బోరింగులు రిపేరు ఉన్న దగ్గర ఎప్పటికప్పుడు రిపేర్లు చేపించాలని,వీధులన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని, దోమల మందు ఫాగింగ్ చేపించాలని,డ్రైనేజీల వెంట బ్లీచింగ్ చల్లించాలని మున్సిపాలిటీలోని ఒకటో వార్డు ప్రజల సౌకర్యార్థం వార్డును పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version