ఆపరేషన్‌ సింధూర్‌తో వెల్లడైన భారత్‌ సత్తా

మన రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగే అవకాశం

మన సామర్థ్యానికి వేదికగా మారిన పాక్‌

భౌతికంగా ఓడిన పాక్‌…కానీ నిజంగా ఓడిరది చైనా

దేశానికి నిబ్బరాన్నిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌

ఆయుధ సంపత్తిలో సూపర్‌పవర్‌గా భారత్‌

ప్రపంచ వేదికపై బలీయమైన అగ్రరాజ్యంగా భారత్‌

నేటిధాత్రి ,డెస్క్‌: 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాశ్చాత్యమీడియా చైనా ఆయుధాల సామర్థ్యాన్ని ఆకాశానికెత్తే స్తూ విపరీతంగా వార్తలు ప్రచురించడం ఒక విచిత్ర పరిణామం. వీటిల్లో వచ్చిన వార్తలకు, క్షే త్రస్తాయిలో జరుగుతున్నదానికి అసలు పొంతనే లేదు! పాకిస్తాన్‌లో నెలకొల్పిన చైనాతయారీ రక్షణ వ్యవస్థలు అసలు ఏఒక్క భారత క్షిపణని లేదా డ్రోన్లను ఆపలేకపోయాయి. ఇదే సమయం లో పాక్‌ డ్రోన్‌లు లేదా క్షిపణులు భారత్‌ భూభాగంలోకి ప్రవేశించకుండానే ధ్వంసమైపోయాయి. ప్రస్తుతానికి ఈ పాకిస్తాన్‌, చైనా అనుకూల మీడియా ప్రచారాన్ని పక్కన పెడితే, నిజానికి భారత్‌ను రక్షించిందేమిటి? ప్రపంచానికి ఇది ఎటువంటి సందేశం ఇచ్చిందనేది పరిశీలిద్దాం.

అమెరికా సైన్యంలో పనిచేసి ప్రస్తుతం మాడిసన్‌లో అర్బన్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌కు చీఫ్‌గా వున్న జాన్‌ స్పెన్సర్‌ సింధూర్‌ సందర్భంగా భారత్‌ సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ ఏవిధంగా పనిచేసిం దో, దాని సామర్థ్యమెంటో చాలా నిశితంగా పరిశీలించి అత్యంత విలువైన సమాచారాన్ని వెల్లడిరచారు. అంతేకాదు ఆపరేషన్‌ సింధూర్‌ నుంచి ప్రపంచం నేర్చుకోవలసిన పాఠాలు కూడా చాలనే వున్నాయని ఆయన విశ్లేషించారు. సింధూర్‌ ఆపరేషన్‌లో భారత్‌ ప్రపంచానికి ఒక సరికొత్త ఆధునిక రక్షణ ప్రక్రియను పరిచయం చేసింది. తన గగనతలాన్ని కొన్ని అంచెలుగా ఏర్పరచుకున్న పటిష్ట రక్షణ వ్యవస్థ సహాయంతో సమర్థవంతంగా కాపాడుకోవడమే కాదు, ప్రత్యర్థి పాకిస్తాన్‌ భూభాగంలో నెలకొల్పిన చైనా రక్షణ వ్యవస్థలను తుత్తినియలు చేసి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. ఇక్కడ పాకిస్తాన్‌కు మాత్రమే కాదు ప్రపంచానికి భారత్‌ ఒక పాఠాన్ని నేర్పింది. అదేంటంటే ‘‘ఎన్ని రక్షణ ఆయుధాలను, వ్యవస్థలను కొనుగోలు చేసావన్నది కాదు ఇక్కడ ప్రశ్న. వాటిని ఎంత చక్కగా సమన్వయంతో ఉపయోగించావన్నది ప్రధానం’’. భారత్‌ ఈ ఆపరేషన్‌ లో త్రివిధ దళాలను సమన్వయం చేయడమే కాదు, చక్కటి ప్రణాళికతో, తనవద్ద వున్న సాంకేతిక నైపుణ్యాన్ని చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టింది. నిజం చెప్పాలంటే బాహ్యంగా ఓటమిపాలైనట్టు పాకిస్తాన్‌ కనిపిస్తున్నా, అసలు దెబ్బతగిలింది మాత్రం చైనాకు!

భారత్‌ నేడు ఉపయోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌, క్యు.ఆర్‌.ఎస్‌.ఏ.ఎం.లతో పాటు ఇజ్రాయిల్‌కు చెందిన బరాక్‌ా8, రష్యా తయారీ ఎస్‌ా400 వున్నాయి. ఈ మూడు స్వల్ప, మధ్య, దీర్ఘ శ్రేణి అంచెలు నిరంతరం వివిధ దశల్లో సమన్వయం తో పనిచేసి ఒక రక్షణ జాలాన్ని ఏర్పరచాయి. 

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ చైనా తయారీ హెచ్‌.క్యుా9 (ఇది ఎస్‌ా300 మాదిరిగా పనిచేస్తుంది), ఎల్‌వైా80, మరియు ఎఫ్‌ఎరా90. వీటి పనితీరు పేపరుపై వివరించడానికి తప్ప, యుద్ధక్షేత్రంలో ఎంతమాత్రం పనికిరావన్నది స్పష్టమైంది. ఎందుకంటే భారత్‌ తన ఎలక్ట్రానిక్‌ యుద్ధతంత్రం, సైద్ధాంతిక క్రియాశీలత, గతిశీలక దాడులతో ఈ రక్షణ వ్యవస్థలను ఎందుకూ కొరగాకుండా చేయడమే కాదు, పాక్‌ భూభాగాల్లోకి చాలా సమర్థవంతంగా చొచ్చుకెళ్లి అనుకున్న లక్ష్యాలను సాధించగలిగింది. 

ఇదే సమయంలో రష్యాతో జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్‌ కూడా ఎన్నో పాఠాలు నేర్పింది. ఎట్లా అంటే ఉక్రెయిన్‌ విస్తీర్ణం 6లక్షల చదరపు కిలోమీటర్లు. సువిశాల మైదానాలు, విస్తరించిన పట్ట ణ మౌలిక సదుపాయాలు ఈ యుద్ధంలో పెను సవాలుగా నిలిచాయి. ఇక్కడ ఉక్రెయిన్‌కు అ త్యంత ఖర్చుతో కూడిన పరిమిత వ్యవస్థలు వుండటం మాత్రమే కాదు ఇక్కడ సమస్య. వీటిని ఎంత సమర్థవంతంగా సమన్వయంతో ఉపయోగించామన్నది అత్యంత కీలకం. పశ్చిమ దేశాలు అందించిన ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులు (ఎస్‌ఏఎం), సోవియట్‌ యూనియన్‌ కాలంనాటి ఆయుధాలు, ఎస్‌`300 యూనిట్లు, సంచార ఐఆర్‌ఐఎస్‌`టి బ్యాటరీ లు, మనుషులు మోసుకెళ్లగల గగనతల రక్షణ వ్యవస్థలు, విమాన విధ్వంసక శతఘ్నులు ము ఖ్యంగా జర్మన్‌ తయారీ జెపార్డ్‌లు ఉక్రెయిన్‌ వద్ద వున్నప్పటికీ వీటిని ఉపయోగించడంలో సమ న్వయం లోపించడం పరాజయానికి దారితీసింది.

ఇక భారత్‌ విషయానికి వస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలను ఎంతో చక్కగా సమర్థవంతంగా వినియోగించింది. వీటి పనితీరు నూటికి నూరుపాళ్లు నిక్కచ్చిగా వుండటంతో ప్రపంచానికి భారత సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యంపై గట్టి విశ్వాసం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో రష్యా తయారీ ఎస్‌`400కు సమానమైన ప్లాట్‌ఫామ్‌లు, ఇతర దేశీయ తయారీ ఆయుధాలను ఇప్పుడు భారత్‌ చక్కగా విదేశాలకు అమ్ముకోగలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే తన ఆయుధ సామర్థ్య ప్రదర్శనకు పాకిస్తాన్‌ను ఒక వేదికగా భారత్‌ ఉపయోగించుకున్నదనే చెప్పాలి. దీనివల్ల ఒనగూడిన ప్రయోజనాలు రెండు. పాకిస్తాన్‌ పొగరు అణచడం. రెండవది తన ఆయుధ మార్కెట్‌లో మరింత విశ్వసనీయతను సంపాదించుకోవడం. ఇదే సమయంలో చైనా తయారీ పరికరాలు ఎంత నిప్పచ్చరంగా వున్నాయో ప్రపంచానికి విస్పష్టంగా చూపడం! ఈ మూడు లక్ష్యాలను భారత్‌ సునాయాసంగా సాధించింది. మరో ప్రధాన విషయమేంటంటే గత యు ద్ధాల్లో మాదిరిగా భారత్‌ ఎంతో కష్టపడి చమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తనవద్ద వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సునాయాసంగా పాక్‌ను మట్టికరిపించింది. 

మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థ, క్షిపణుల సామర్థ్యం ఎంత బాగా వున్నదీ ప్రపంచానికి వెల్లడి కావడంతో, ఈ రంగాల్లో రానున్న కాలంలో భారత్‌ ఎగుమతులు బాగా ఊపందుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు తక్కువ ఖరీదుకు చైనా నుంచి కొనుగోలు చేస్తున్న ఆయుధాల విషయంలో సంశయాత్మకత పెరగడమే కాదు, ఇక ముందు నాణ్యమైన భారత్‌ ఉత్పత్తులవైపు దృష్టి సారించే అవకాశాలే మెండు.

ఇప్పటికే భారత్‌ తన భౌగోళిక రాజకీయ విస్తృతిని బాగా పెంచుకుంటూ, చైనా ఆధిపత్యాన్ని స వాలు చేస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే తయారీరంగంలో కూడా చైనాకు పెద్ద పోటీదారుగా మారబో తున్నది. అంతేకాదు ఆధునిక రక్షణ వ్యవస్థల తయారీ, అమ్మకాల విషయంలో ఇప్పటివరకు కొనసాగుతున్న చైనా ఆధిపత్యాన్ని క్రమంగా దెబ్బతీయవచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఆసియా, ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాలను నెరపుతూ, చైనా తన ఆయుధాలను ఆయా దేశాలకు అమ్ము కుంటూ వస్తున్నది. ఇప్పుడు భారత సామర్థ్యం బహిర్గతం కావడంతో ఆయా దేశాలు ఇక క్రమంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించకమానవు. ఇప్పటికే చైనా పట్ల యూరప్‌, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా దౌత్యం ముసుగులో ఆధిపత్య రాజకీ యాలు చేయడం చేయడం చైనాకు అలవాటు కను, ఇప్పటివరకు అవసరం రీత్యా తప్పనిసరిగా సహిస్తూ వస్తున్న ఆసియా దేశాలు తమ వైఖరిని పూర్తిగా మర్చుకునే అవకాశాలే ఎక్కువ. ఒక పక్క స్నేహసంబంధాలు నెరపుతూనే ఆయా దేశాలను రుణ ఊబిలో నెట్టిన చైనా వైఖరిపట్ల చా లా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ఈ ఊబినుంచి బయటపడటానికి యత్నిస్తుండగా, కొన్ని బయటకు రాలేక చైనా కబందహస్తాల్లో కునారిల్లుకుపోతున్నాయి. ముఖ్యంగా చైనా క ల్పించే రుణ ఊబి ఆయా దేశాలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. 

ఇటువంటి పరిస్థితుల్లో వాటికి భారత్‌ ఒక ప్రత్యామ్నాంగా కనిపిస్తున్నా, విశ్వసించడానికి అనువైన వేదిక లేకపోవడంతో అవి మౌనంగా వుంటూ వస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్‌ పుణ్యమాని ఆపరేషన్‌ సింధు భారత్‌ సామర్థ్య ప్రదర్శనకు చక్కటి వేదికగా మారడంతో, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాల వైఖరిలో గణనీయమైన మార్పు రావడం తథ్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version