కవిన్ సరసన ప్రియాంక…

కవిన్ సరసన ప్రియాంక…

అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ కిట్ లో మరో అవకాశం వచ్చి పడింది. ప్రముఖ తమిళ నటుడు కవిన్ సరసన ఆమె ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతోంది.

మూడు పదుల వెన్నెల సోన ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కు ఇంకా గ్రాండ్ విక్టరీ దొరకలేదు. అయితే… తమిళంలో ఆమె నటించిన ‘డాక్టర్ (Doctor), డాన్ (Don)’ చిత్రాలు కొంతలో కొంత ఊరటను కలిగించాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘ఓజీ’ (OG) లో నటిస్తోంది ప్రియాంక అరుల్ మోహన్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘ఓజీ’ పై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.

తెలుగులోనూ ఇప్పటికే నటిగా తన సత్తా చాటడానికి శతవిధాలా ప్రయత్నించింది. నానిస్ ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక… ఆ తర్వాత శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ‘గ్యాంగ్ లీడర్’లో ఆమె చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందుకే మరోసారి నాని సరసన ‘సరిపోదా శనివారం’ (Saripoda Sanivaaram) లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో మిస్ ఫైర్ అయింది.

ఇదిలా ఉంటే… ప్రియాంక అరుల్ మోహన్ కు ఇప్పుడో కొత్త ప్రాజెక్ట్ లభించింది. హీరో కవిన్ (Kavin) తొమ్మిదో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కెన్ రాయ్ సన్ దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రొడ్యూస్ చేబోతోంది. ‘కొత్త ప్రయాణం… కొత్త సినిమా’ అంటూ వీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కవిన్ సరసన ప్రియాంక తొలిసారి నటిస్తోంది. మరి సెప్టెంబర్ 25న రాబోతున్న ‘ఓజీ’తో ప్రియాంక స్టార్ హీరోయిన్ కేటగిరిలోకి చేరిపోతుందేమో చూడాలి.

ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

హన్మకొండ నేటిధాత్రి:

ఎం జె పి ఆర్ సి ఓ రాజ్ కుమార్ ద్వారా ఎం జె పి కార్యదర్శి డాక్టర్ సైదులుకి వినతి పత్రం అందజేత.బిఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడాపాక రాజేందర్ బోట్ల నరేష్ మాట్లాడుతూ…

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఎంజేపి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.

వేల సంఖ్యలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోకుండా ఈరోజు నిర్వహించే స్పాట్ కౌన్సిలింగ్ హాజరు కాగా కేవలం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికే మెరిట్ ప్రకారం అవకాశం కల్పిస్తామని సంబంధిత అధికారులు చెప్పడంతో విద్యార్థులు. 

చాలామంది జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో తండ్రి గాని తల్లి గాని కోల్పోయిన విద్యార్థిని విద్యార్థులకు అవకాశం కల్పించాలని మరియు సంచార జాతులకు చెందిన విద్యార్థులకు. 

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం కల్పించి వారినీ ఆదుకోవాల్సిందిగా ఎం జె పి గురుకుల కార్యదర్శి డాక్టర్ సైదులుని కోరారు.

కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి :

 

 

రైతులు రైతు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. రైతులు కేంద్ర ప్రభుత్వం పథకాలను పొందడానికి ఈ రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దీని ద్వారా 11 అంకెల కార్డు రావడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు సద్వినియోగం చేసుకోవాలి.

ధాన్యం కొనుగోలు సద్వినియోగం చేసుకోవాలి.

వ్యవసాయ సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి.

వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాపురం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2320, సీ గ్రేడ్ ధాన్యానికి రూ.2300 ప్రభుత్వ మద్దతు ధర కేటాయించిందని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరతోపాటు రూ.500 బోనస్ అదనంగా రైతులకు అందిస్తుందని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్, జంగిలి రవి,జరుపుల శ్రీను, సీఈఓ ఎం రమేష్, ప్రకాష్ ,ఇన్చార్జి సాంబయ్య, రైతులు లింగారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుపతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version