ద్విభాషా చిత్రంలో సునీల్‌

ద్విభాషా చిత్రంలో సునీల్‌

 

రాజ్‌తరుణ్‌ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్‌ విజయ్‌ మిల్టన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో…
రాజ్‌తరుణ్‌ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్‌ విజయ్‌ మిల్టన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సునీల్‌ నటించనున్నారని మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ ‘‘సినిమాలో సునీల్‌ చేయనున్న పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోంది. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే పాత్ర ఇది’’ అని తెలిపారు. చిత్ర టైటిల్‌ను ఈ నెల 15న ప్రకటించనున్నారు.

చిన్న బోనాల, ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో.

చిన్న బోనాల, ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి

మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని చిన్న బోనాల మరియు ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా బోధన తీవ్రంగా ప్రభావితమవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలంటూ 10 వార్డ్ మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ చిన్న బోనాల అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ మరియు ముష్టి పెళ్లి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, DEO, MEO లకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ..
చిన్న బోనాల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు కేవలం 4 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా, ఇద్దరు డిప్యూటేషన్‌పై, ఒకరు రిటైర్డ్ అయ్యారు. అలాగే ముష్టిపల్లి ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జీవో నెం.25 ప్రకారం ఈ సంఖ్యకు తగినట్టు అదనపు టీచర్లను నియమించాలి అని ప్రజావాణిలో అధికారులకు తెలిపారు.ఈ వినతిపత్ర సమర్పణలో బండారి భాగ్య, గుగ్గిల లావణ్య లలిత, బి.వినోద్, నరాల లత, సరోజ,అనన్య,లింబ్బవ్వ,సురేష్,మహేష్, బాబు,పరశురాములు, రమేష్, శివ, కుమార్, అనిల్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న,

బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణం కేంద్రం లో ని ప్రెస్ క్లబ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ వాకిటి
శ్రీ హరికి మంత్రి పదవి ఇచ్చి,ముదిరాజులకు ఇచ్చిన మాట ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని, అన్నారు. అలాగే చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం ముదిరాజులు ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పిటిసి మరియు జడ్పీ చైర్మన్ స్థానాలను కూడా ముదిరాజులకు కేటాయించాలని అన్నారు. బీసీడీఈ లో ఉన్న ముదిరాజులను బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు సంయుక్త కార్యదర్శి జంగాపల్లి శేఖర్,రాయిని ప్రతాప్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు వంకాయల కార్తీక్,కోలా నరేష్, మామిండ్ల నారాయణ మునిగల రాజు చుక్క శేఖర్ బల్లెపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

 

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది తింటే జీవితంలో మధుమేహం రాదని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణంగా ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. నేటి కాలంలో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దలవరకు చాలా మంది ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. దీని కోసం కొంతమంది మందులు వాడతారు. మరికొందరు ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ, అరటి పువ్వు డయాబెటిస్‌కు ఒక అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అరటి పువ్వు మధుమేహానికి దివ్య ఔషధమని అంటున్నారు. దీని నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని, దీనిలోని ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని చెబుతున్నారు.
అరటి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. అరటి పువ్వులో మెగ్నీషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇవి మహిళల్లో రుతుక్రమ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్లు ఎ, సి, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధులను నివారిస్తాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు.

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు.

#సంఘ అభివృద్ధి కొరకై కృషి చేస్తా.

#నాపై నమ్మకంతో 5వ సారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘానికి కృతజ్ఞతలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

 

మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల అధ్యక్షుని ఎన్నిక సోమవారం కుల దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా పోటీలో పాండవుల రాంబాబు, పప్పు మొగిలి బరిలో నిలవగా ఎన్నికల నిర్వాహకులు రావుల రవి, కేశవ వర్మ, జక్కుల రవి, పోతు రెడ్డి రవిఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా సంఘ సభ్యులు ఓటును హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో పాండవుల రాంబాబు అధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా సంఘానికి అన్ని విధాలుగా సహకరిస్తూ పార్టీలకు అతీతంగా కుల సమస్యలపై పోరాడి అభివృద్ధి దిశగా నడిపిస్తూ. కుల బాంధవులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సాధక బాధలను తీర్చడం జరిగిందని. కుల సంఘానికి పనిచేసే వ్యక్తి కావాలని 5 సారిగా మరోసారి నాకు అవకాశం కల్పించిన కుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన తెలిపారు. అదేవిధంగా కుల సంఘానికి ఎలాంటి సమస్యలు వచ్చిన పెద్ద చిన్న అని తేడా లేకుండా సమస్యల పరిష్కరణ కొరకై అనునిత్యం పనిచేస్తానని ఆయన కుల సంఘానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

రెడ్డి కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన.

రెడ్డి కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి
మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డికాలనీ పేస్ – 1 లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు రెడ్డికాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పిసిసి మెంబర్ చల్లూరి మధు అప్పం కిషన్ దాట్ల శ్రీనివాసు ముంజల రవీందర్ కేతరాజు సాంబమూర్తి కురుమిళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ

 

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేది ఎప్పుడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. దాంతో నెట్టింట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జులై తొలి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. జూన్‌ 26న రిలీజ్‌ కానుందని ఓవర్సీస్‌కు చెందిన ఓ డిస్ర్టిబ్యూషన్‌ సంస్థ పోస్టు పెట్టింది. సంబంధిత పోస్టర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మేకర్స్‌ ఎక్స్‌ వేదికగా స్పందించి రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. ‘‘హరిహర వీరమలుల్ల’  రిలీజ్‌ డేట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌లను నమమకండి. మా సోషల్‌ మీడియా ఖాతా ద్వారా మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటి వరకూ మీ ప్రేమ, మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం’’ అని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పేర్కొంది. నాలుగేళ్ల క్రితం క్రిష్‌ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యమైంది. ఆ తర్వాత సినిమా క్రిష్‌ చేతుల నుంచి జ్యోతికృష్ణ చేతికి వచ్చింది.  నిధి అగర్వాల్‌ ఈ చిత్రంలో కథానాయిక. . అనుపమ్‌ ఖేర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు.

జిల్లా ఎస్పీని కలిసిన ఎస్ఐ వినయ్ కుమార్.

జిల్లా ఎస్పీని కలిసిన ఎస్ఐ వినయ్ కుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్సై వినయ్ కుమార్ జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ ఎస్ఐగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధి.

సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్..

విజయవంతంగా దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వార్షిక మహాసభ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ వలన సంఘాల్లో సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు.దుగ్గొండి మండల కేంద్రంలో గల
దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన ఆ సమితి 12 వ వార్షిక మహాసభ కార్యాలయం ఆవరణలో జరిగింది.సమితి పరిధిలోని దుగ్గొండి,చంద్రయ్యపల్లి,దేశాయిపల్లి, రేబల్లె,వెంకటాపురం,నేరేడుపల్లి,

 

వసంతాపురం,ప్రగతిసింగారం,అక్కంపేట అనే 10 సంఘాలు ఉండగా మొత్తం 4382 మంది సభ్యులు కాగా మొత్తం రూ.10 కోట్ల నిధులు ఉన్నాయి.సమితి నిర్వహణ పట్ల స్థితిగతులు,అభివృద్ధి పట్ల చర్చించుకున్నారు.ఈ నేపథ్యంలో 2024-25 వార్షిక నివేదికను అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,గణకులు పోలోజు రమణాచారిలు చదివి ప్రవేశపెట్టారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న సహకార వికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సహకార సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు మంచిన నడిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశ్యంతో సహకార వికాస సంస్థ ఏర్పాటు చేయగా నేడు స్వకృషీ ఉద్యమం వజయవంతంగా నడుస్తున్నాయని తెలియజేశారు.
1995 చట్టం ద్వారానే రాజకీయ పార్టీలకతీతంగా సహావికాస సంస్థ సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

 

సహకార ఉద్యమంలో 54 సమితిలు ఉండగా సేవా దృక్పథంతో నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.సిడీఎఫ్ ధర్మకర్తల మండలి ప్రతినిధి దర్మవతి మాట్లాడుతూ సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి కీలకమని అన్నారు.రానున్న రోజుల్లో సభ్యులు ,సంఘాలు ఇబ్బందులు పదద్దనే ఉద్దేశ్యంతో సహావికాస కార్యశాల నిర్ణయించిందని దీంతో కొన్ని ఖాతాలు నిలిపివేసిందని తెలియజేశారు.సిడీఎఫ్ అభివృద్ధి అధికారి నవీన్ మాట్లాడుతూ సంఘాల్లో బకాయి శాతం జీరో చేస్తేనే మెరుగు లభిస్తుంది అని పేర్కొన్నారు.అనంతరం చంద్రయ్యపల్లి,వసంతాపూర్, కమ్మపెల్లి,ప్రగతిసింగారం సంఘాలకు ఉత్తమ సంఘాలుగా ఎన్నిక కాగా మరో నలుగురిని ఉత్తమ పాలకవర్గ సభ్యులుగా ఎంపిక కాగా వారికి అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో
సమితి ఉపాధ్యక్షుడు కందికొండ రవీందర్,సంఘాల అధ్యక్షులు,సమితి పాలకవర్గ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, మోతుకూరి ప్రభాకర్,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి,బట్టి బక్కయ్య,పొగాకు రమేష్ గౌడ్,వేములపల్లి బాబు,పెండ్యాల మల్లేశం,రాయరాకుల రమేష్,ప్రేమ్ సాగర్,ఆయా సంఘాల ఉపాధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు,గణకులు పాల్గొన్నారు.

మారుపాక కృష్ణకు గిడుగు జాతీయ కవిత పురస్కారము.

మారుపాక కృష్ణకు గిడుగు జాతీయ కవిత పురస్కారము

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం 2025 గాను గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవనంలో గౌరవ అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తిడాక్టర్ రాధా రాణి, తెలంగాణ కళా రత్న బిక్కి కృష్ణ, గిడుగురామా మూర్తి సంస్థ ఫౌండేషన్ దివాకర్ బాబు,కాంతి కృష్ణ అధ్యక్షుడు, సినిమా రచయిత డాక్టర్ సరళ సినిమా రచయిత విశ్వపుత్రిక గజల్ డాక్టర్ విజయలక్ష్మి పండిత్, వారి చేతుల మీదుగా మారుపాక కృష్ణ కు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి :

 

 

భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించిందన్నారు.

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యల పరిస్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుమలత,జూనియర్ అసిస్టెంట్ రాజు,రెవన్యూ సిబ్బంది,కారోబార్ వెనుకమూరి ఆనందరావు, స్థానికులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరా

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే.!

రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే అందించాలి

బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వెంటనే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు సివిల్ స్కోర్ ఎలాంటి షరతులు విధించకుండా అర్హులైన వారికి పథకము అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మాత్రమే కేటాయించాలని,అనర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మరిపెడ నేటిధాత్రి : 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???
మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం
అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి???
అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి
క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను
అప్పు రూపంలో ఇందిరమ్మ ఇండ్ల కమిషన్
కంచె చేను మేస్తే బాధితులకు దిక్కెవరు???
నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే మండల కమిటీ మార్పు తద్యం అని నాయకులు భావిస్తున్నారు.

 

ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆపత్కాలంలో ఉన్న నాయకులతో మండల కమిటీని సర్దుబాటు చేయగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేదని వారంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

 

అయితే మండల కమిటీలో ఇన్నాళ్లు ఏకపక్షంగా వ్యవహరించిన నాయకులు త్వరలో జరగబోయే స్థానిక సమరంలోను పదవులు ఆశిస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారికి మళ్ళీ పదవులు ఇస్తే కేడర్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు.

 

అందుకే పోటీపై ఆసక్తి ఉన్న నాయకులకు మండల కమిటీలో చోటు లేకుండా చేసి అసంతృప్తితో ఉన్న నాయకులతో మండల కమిటీని పూర్తి చేసి పాత కొత్త నాయకులను కలుపుకొని ముందుకు పోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

అంతే కాకుండా ప్రస్తుత అధ్యక్షుని వ్యవహార శైలి పై వివిధ గ్రామాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

మండల కమిటీ అంటే తాను ఒక్కడినే అన్నట్లు భావిస్తూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి నాయకులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 

మండలంలో ఉన్న ఒకరిద్దరు వైట్ కాలర్ నాయకులను వెంటవేసుకొని తం చెప్పిందే మండలంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఈ గ్రూపు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.

 

పాత కొత్త నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నాయకులే తాము చెప్పిందే వేదం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇదే విషయాన్ని వాళ్ళ పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పార్టీలో తమ స్థానం ఏమిటో కొత్తగా వచ్చిన నాయకులకు తెలియని పరిస్థితి. ఇటు మండల కమిటీ లోను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ లోను కొత్తవారికి చోటు కల్పించలేదు.

 

 

అంతేకాకుండా ప్రభుత్వ పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదని పదవులు పథకాలు అన్ని సీనియర్లము అన్న పేరుతో పాత కాంగ్రెస్ నాయకులే పెత్తనం చెలాస్తుండడంతో ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన నాయకులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

 

అంతే కాకుండా అయినవోలు మండలంలో ఉన్న పెద్ద నాయకుడు కాంగ్రెసులో చేరికతో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచిన నాయకులు కార్యకర్తలకు రాబోయే స్థానిక సమరంలోనూ టికెట్లు కేటాయిస్తారు అన్న ఆశ లేదు.

 

తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారి తాము తప్పు చేశామా అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీస్ భాస్ గా ఎన్నో ఆపరేషన్లు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయాల్లో అరగంట తర్వాత రాజకీయ చాణక్యతను చూపి పాత కొత్త నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు చెక్ పెట్టి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తారా లేదా వేచి చూడాలి.

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని సమస్త పంచాయతి కార్యదర్శులు,ఉపాధి హామీ సిబ్బందితో జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ,ఎంపీఓ ఆధ్వర్యంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు,పారిశుద్ధ్య కార్మికులకు,ఈజీఎస్ సిబ్బందికి కొన్ని ముఖ్య నిర్ణయాలను,సూచనలను తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.వివరాలలోకి వెళితే అన్ని గ్రామ పంచాయతీలలో ఈత చెట్ల ప్లాంటేషన్,కెనాల్ ప్లాంటేషన్,బండ్ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని,ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని,అన్ని రకాల రోడ్ల ప్రక్కన అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటాలని,కంక మొక్కల ప్లాంటేషన్,ఆర్ఓఆర్ బండ్ ప్లాంటేషన్,ఫారెస్ట్ ల్యాండ్ లలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో,ప్రభుత్వ భవనములలో మంచి పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటించాలనీ,వన మహోత్సవం రిజిష్టరులో నమోదు చేసి ఉంచుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీలలో అవసరమున్న చోట కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించాలని,డ్రైన్ చివరన సోక్ పిట్స్ నిర్మించి పూర్తి చేయాలని తెలిపారు.ఐహెచ్ హెచ్ఐ పూర్తి చేయాలని,కొత్త పనులు అన్ని గ్రౌండ్ చేయాలని,ఇందిరమ్మ ఇళ్లకు ఐహెచ్ హెచ్ఐ తనిఖీ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని పంచాయతి కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.సైడ్ డ్రైన్ లలో డీసిల్టింగ్ క్లీన్ గా చేపించాలని,వాటర్ పేమెంట్ తప్పకుండా చేయాలని,ప్రతీ మంగళ వారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు.ఎంపీడబ్ల్యు వర్కర్లచే 8 గంటలు పని చేయించాలనీ,వారు ఏ ఇంటినుండి ఎక్కడికి పనిచేసినది రికార్డుల్లో నమోదు చేయాలని,2025-25 డిసిబి రిజిష్టర్లు ప్రింట్ తీసుకోవాలని,మాన్యువల్ గా రిజిష్టర్ వ్రాసి చూపించాలన్నారు.అన్ని బిల్లులు గ్రామ పంచాయతీ వారిగా ఇవ్వాలని,ఆడిట్ రిపోర్ట్ లు తయారు చేసి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,పంచాయతీ కార్యదర్శులు,ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటిధాత్రి గార్ల :-

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది. ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ. ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు. పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు. మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు. ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు. అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు. 1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు .!

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఎంపీడీవో కి వినతిపత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు పంచాయతీ కార్యదర్శుల యొక్క దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతి కార్యదర్శులు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపిడిఓ ఇట్టి లేఖను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిఓ శ్రీపతి బాపు రావు,పంచాయతి కార్యదర్శులు సుమన్,సురేష్, సత్యనారాయణ,ఉదయ్ కుమార్,శ్రీనివాస్,ప్రశాంత్,సాయి కిరణ్,రమాదేవి,తిరుమల,సుప్రియ మరియు జూనియర్ అసిస్టెంట్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

 

 

BJP Executive Committee

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version