అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???
మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం
అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి???
అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి
క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను
అప్పు రూపంలో ఇందిరమ్మ ఇండ్ల కమిషన్
కంచె చేను మేస్తే బాధితులకు దిక్కెవరు???
నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే మండల కమిటీ మార్పు తద్యం అని నాయకులు భావిస్తున్నారు.

 

ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆపత్కాలంలో ఉన్న నాయకులతో మండల కమిటీని సర్దుబాటు చేయగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేదని వారంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

 

అయితే మండల కమిటీలో ఇన్నాళ్లు ఏకపక్షంగా వ్యవహరించిన నాయకులు త్వరలో జరగబోయే స్థానిక సమరంలోను పదవులు ఆశిస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారికి మళ్ళీ పదవులు ఇస్తే కేడర్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు.

 

అందుకే పోటీపై ఆసక్తి ఉన్న నాయకులకు మండల కమిటీలో చోటు లేకుండా చేసి అసంతృప్తితో ఉన్న నాయకులతో మండల కమిటీని పూర్తి చేసి పాత కొత్త నాయకులను కలుపుకొని ముందుకు పోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

అంతే కాకుండా ప్రస్తుత అధ్యక్షుని వ్యవహార శైలి పై వివిధ గ్రామాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

మండల కమిటీ అంటే తాను ఒక్కడినే అన్నట్లు భావిస్తూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి నాయకులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 

మండలంలో ఉన్న ఒకరిద్దరు వైట్ కాలర్ నాయకులను వెంటవేసుకొని తం చెప్పిందే మండలంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఈ గ్రూపు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.

 

పాత కొత్త నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నాయకులే తాము చెప్పిందే వేదం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇదే విషయాన్ని వాళ్ళ పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పార్టీలో తమ స్థానం ఏమిటో కొత్తగా వచ్చిన నాయకులకు తెలియని పరిస్థితి. ఇటు మండల కమిటీ లోను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ లోను కొత్తవారికి చోటు కల్పించలేదు.

 

 

అంతేకాకుండా ప్రభుత్వ పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదని పదవులు పథకాలు అన్ని సీనియర్లము అన్న పేరుతో పాత కాంగ్రెస్ నాయకులే పెత్తనం చెలాస్తుండడంతో ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన నాయకులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

 

అంతే కాకుండా అయినవోలు మండలంలో ఉన్న పెద్ద నాయకుడు కాంగ్రెసులో చేరికతో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచిన నాయకులు కార్యకర్తలకు రాబోయే స్థానిక సమరంలోనూ టికెట్లు కేటాయిస్తారు అన్న ఆశ లేదు.

 

తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారి తాము తప్పు చేశామా అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీస్ భాస్ గా ఎన్నో ఆపరేషన్లు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయాల్లో అరగంట తర్వాత రాజకీయ చాణక్యతను చూపి పాత కొత్త నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు చెక్ పెట్టి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తారా లేదా వేచి చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version