విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, పాత మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న జి యు పి ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన నూతన పుస్తకాలు, దుస్తులను కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు శానవాజ్ ఖాన్, గోరటి శ్రీనివాసులు,నాయకులు సాబేర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ పట్టణ 18వ మహాసభలను జయప్రదం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి పట్టణంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 18వ పట్టణ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్, సిపిఐ నాయకులు గురుజపెల్లి.సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఆదివారం సింగరేణి కమ్యూనిటీ హాల్ సుభాష్ కాలనీలో పట్టణ 18వ మహాసభను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.పట్టణ మహాసభకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అని తెలిపారు.
పట్టణంలోని 30 వార్డులలో సుమారు 250 మంది డెలిగేట్స్ తో ఈ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలో పట్టణ అభివృద్ధి కోసం, అర్హులైన వాళ్లందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్, వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళ పింఛన్ల కోసం ఈ మహాసభలో పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.
భూపాలపల్లి పట్టణం మీదగా నడుస్తున్న లారీలను అదుపు చేసి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలను మేధావులు,కార్మికులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాతంగి రాంచంధర్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, అస్లాం, రవీందర్, శాంతి, శేఖర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు.

సర్కారీ బడి పిల్లలు సత్తా కలిగిన పిడుగులు…

సువిశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన…

ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ…

ఇంగ్లీష్ మీడియంలో బోధన…

పుష్టికరమైన మధ్యాహ్న భోజనం…

డిజిటల్ క్లాసు రూములు…

ఉచిత యూనిఫాం అందజేత

నేటి ధాత్రి గార్ల:

ప్రైవేటు పాఠశాలల్లో లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజ్ఞపాటవ పోటీలకు ఒత్తిడి లేని శిక్షణ ప్రభుత్వ బడులల్లో ఇస్తున్నట్లు ఎంపీడీవో మంగమ్మ, ఎంఈఓ వీరభద్రరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా పునః ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ,బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు.సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా వారి తల్లిదండ్రులకు ప్రోత్సహించాలని సూచించారు.నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారని వారు అన్నారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ప్రాథమిక పాఠశాల పెద్దకిష్టాపురం లో సు విశాలమైన తరగతి గదులలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు మరియు స్పోర్ట్స్ డ్రస్సులు అందజేయడమే కాకుండా ఉచిత పాఠ్య పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.సర్కారు బడిలో సన్నబియ్యంతో కూడిన రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరియు రాగి జావా వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం లో బోధిస్తూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ద్వారా ప్రగతిని అంచన వేస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూన్నట్లు తెలిపారు. గ్రామంలోని బడియిడు పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ తద్వారా సమగ్ర గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగుగులోత్ వీరభద్రం, బానోత్ చంద్రమోహన్, టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాలోత్ శివ నాయక్,గంగావత్ రాంసింగ్ నాయక్,ఉపాధ్యాయులు బి. రామ, నాగేశ్వరావు,వేణుకుమార్, రాంబాబు,రాజ్ కుమార్, స్వాతి, మాలోత్ సురేష్, గంగావత్ సంత్ర, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే వర్ధంతి

సిరిసిల్ల టౌన్ ( నేటి ధాత్రి ):

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్ష్మణ్ ప్రింటర్స్ లో డాక్టర్ జ నపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి ఘనంగా జరిగింనది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహితి సముద్రుడు మేరు నగ ధీరుడు తెలుగు వెలుగును, తెలుగు కవితను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కడలి దాటించిన తొలి తెలంగాణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె, అంటూ ఘన నివాళి సమర్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకునూరి శంకరయ్య పూర్వ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ సినారే ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు నాటక ప్రదర్శనలో అతని చేతులు మీదుగా బహుమతి అందుకున్న జ్ఞాపకం ఉందని, వారి సినీ పాటలు కవిత్వము జగము నకు తెలిసిన మహానుభావులు అన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ గులేబకావళి కథలో గుబాలింపజేసే సాహిత్యాన్ని విరచించి, సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి సినారే,అని అన్నారు. సహాధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ సి నారాయణ రెడ్డి ప్రముఖ కవిగా గాయకుడిగా బోధకుడిగా గురువుగా మరి సాహిత్యంలో ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ కవిగా మరియు సినిమాకు రంగంలో పాత్రకు తగ్గట్టుగా పాటలు రాసి మన్నన పొందినాడు. మన తెలంగాణకే ఒక మనీ మకుటమై నిలిచినారు అని అన్నారు. ఉపాధ్యక్షులు బూర దేవానందం కవితా గానం ఆలాపించారు. అంకారపు రవి తన ఘనంగా కవితను సినరే కు అంకితం ఇచ్చారు.ముడారి సాయి మహేష్ కవితలు ఆలపించారు.గుండెల్లి వంశీ తన కవితను ఆలాపించారు. దొంత దేవదాసు, ఏనుగుల ఎల్లయ్య,అంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రజా దవాఖాన అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా.

పల్లె ప్రజా దవాఖాన-అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా…

గార్ల నేటి ధాత్రి:

ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు నిధుల వెచ్చించి సుందరమైన సువిశాలమైన అన్నీ వసతులతో కూడిన పల్లె దవాఖానలను కట్టించి,సరిపడ సిబ్బందిని నియమించి,జీతాలు,పనిముట్లు,వైద్య సామాగ్రి,మందులు,మెయింటనెన్సు అలవెన్సులు ఇచ్చి ప్రజలకు కనీస ఆరోగ్య అవసరాలు తీర్చజూస్తుంటే స్థానిక గార్ల మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానతో మాత్రం తమకు ఏమాత్రం ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మీ సేవే మా లక్ష్యమని-మేమున్నాము,మీ రు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకొమ్మని ప్రజలకేనాడు నమ్మకం కల్గించిన పాపాన ఇక్కడి సిబ్బంది పోలేదంటున్నారు.ఈ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ నియామకమైనప్పటి నుండి నేటికీ స్థానికంగా నివాసముండక, అందుబాటులో అసలుండక,ఖమ్మం నుండి నిత్యం అప్ అండ్ డౌన్లు చేస్తుంటారు.విచిత్రమైన విషయం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రిలో ఒక్క డాక్టరు కూడా పనిచేయడం లేదు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముంచుకోస్తున్న వేళ గ్రామంలో విషజ్వరాలు,డెంగీ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.ఇక్కడి వైద్యులు, సిబ్బంది డియం అండ్ హెచ్ వో మెడికల్ క్యాంపులనేర్పాటు చేసినపుడు మాత్రమే కనపడి,మిగతా వేళల్లా అపరిచితమే అన్నట్టుంది.వేలకు వేల జీతాలు తీసుకుంటూ,ఏజన్సీ పల్లె ప్రజల అనారోగ్యాలను బేఖాతరు చేస్తూ వైద్య వృత్తికే కళంకం చేస్తున్నారని ప్రజలు నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.ఏదో ఒక సమయంలో హెల్మెట్ల ధరించుక వచ్చి,రిజిష్టరులో సంతకాలు చేసుకుని వెళుతున్నా,గిరిజన ప్రజలింకా చోద్యం చూస్తూనే ఉన్నారు.ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలు,సిరంజీలు,వైద్య వేస్టులు, కుళాయి లేని నల్లా కనెక్షను నీటితో నిండే నిరంతర మురికి గుంటలతో పరిసరమంతా మురికిమయమైనా ఈ సిబ్బందికి మాత్రం పట్టదు.కురుస్తున్న వర్షాలకు పల్లెలో ఇంటికో ముగ్గురు చొప్పున విషజ్వరాల బారినపడి గతంలో గార్ల, మహబూబాబాద్, ఖమ్మం వంటి పట్టణాలకు గిరిజనులు దారులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సూదిమందుకి గానీ మందుబిళ్ళకి గానీ ఆసరా లేక,ఏనాడూ తిమోఫాస్ వంటి దోమల మందులు పిచికారీ చేయక,దోమతెరల పంపిణీ చేయక,ఫ్రైడే-డ్రైడేలు,శానిటేషన్ నిర్వహించక,పేదలకు నెలవారీ బి.పి,షుగరు మాత్రలు ఇవ్వక,రోగాల నివారణపై ప్రజల చైతన్యపర్చని ఈ దవాఖాన గానీ,ఈ సిబ్బంది గానీ మాకెందుకని పల్లె ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దేనికీకొరగానిదానిగా ఆస్పత్రిని మార్చి,కర్తవ్యాన్ని మర్చిన ఈ సిబ్బందిమాకొద్దని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.అలాగే ఇక్కడి సిబ్బంది పనితీరుపై ప్రజాక్షేత్రంలో సమగ్ర విచారణ జరిపి,వారు ఏమాత్రం పనిచేయక తీసుకున్న జీతాలను,ప్రభుత్వం రికవరీ చేసి,తగు శాఖాపరమైన చర్యలు తీసుకుని,వారిని స్థానచలనం కలిగించాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

పంట మార్పిడితో సుస్థిర ఆదాయం

‘పంట మార్పిడితో సుస్థిర ఆదాయం’

జహీరాబాద్ నీటి ధాత్రి:

సంగారెడ్డి: కొత్తూరు రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలను అందించటమే మా లక్ష్యం.

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలను అందించటమే మా లక్ష్యం

ఎస్పీ రోహిత్ రాజు

మావోయిస్టు ప్రభావిత గ్రామాల ప్రజలకు మినీ రైస్ మిల్లులు అందజేత

నేటిధాత్రి చర్ల:

 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి కనీస సౌకర్యాలను అందజేయటమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.

ఈ రోజు చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామాలైన 20 గ్రామాలకు మినీ రైస్ మిల్లులను అందజేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు రాళ్లపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ అధికారి నరేందర్ భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో 20 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మినీ రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరిగిందని. ఎస్పీ తెలిపారు మినీ రైస్ మిల్లు కొరకు ఏర్పాటు చేసిన షెడ్డుతో కలిపి ఒక్కో యూనిట్ విలువ 250000 రూపాయల ఖర్చుతో 20 గ్రామాలలో 20 యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేశారు రాళ్లపురం గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలను కూడా అందించటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు తమ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని అట్టి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు ఏజెన్సీ గ్రామాలలోని యువత అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు రాళ్లపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో పాల్గొన్న ఆడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు అనంతరం అడమయ్యను ఎస్పీ గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అలాంటి అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించకూడదని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసు శాఖ ఆదివాసి ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని చూసి లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు రాళ్లపురం గ్రామం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న పొడియం లక్ష్మి కుటుంబాన్ని సందర్శించి ఆమె కుటుంబ సభ్యులకు దుస్తులను అందజేశారు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును ప్రారంభించి అట్టి మిషన్ పని చేసే విధానాన్ని ఎస్పీ పరిశీలించారు ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం చర్ల మండల పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు

ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజు వర్మ ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయలు పుష్ప గుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు.

మల్లాపూర్ జూన్ 12 నేటి ధాత్రి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లోని మొగిలిపేట మండల పరిషత్ ప్రైమరీ. పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయలు పుష్ప గుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో హెచ్ఎం శ్రీనివాస్ ఉపాధ్యా యులు రాజేందర్, సుమిత్ర దేవి, కృష్ణవేణి, ఆఫీస్ సభర్డినేట్ రాకేష్, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.

అమ్మ మాట అంగన్వాడి బాట ప్రారంభం.

అమ్మ మాట అంగన్వాడి బాట ప్రారంభం

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలం మిట్టపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం అమ్మ మాట..అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈరోజు నుంచి విద్యార్థులకు వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యాని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది.

children

అలాగే వారం రోజులపాటు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కనిపిస్తూ రెండు,మూడు సంవత్సరాల వయసు దాటిన పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత,అంగన్వాడి టీచర్లు నిరోషా,సరోజ,లావణ్య, ఆయాలు,పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అన్నదాతల ఆట పాటలతో సంబురంగా ఏరువాక పౌర్ణమి.

అన్నదాతల ఆట పాటలతో సంబురంగా ఏరువాక పౌర్ణమి

జహీరాబాద్ నేటి ధాత్రి:

వర్షాలు విరివిగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరుతూ.. మండలంలోని అన్నదాతలు వర్ణ దేవుని వేడుకున్నారు. బుధవారం ఏరువాక పౌర్ణమి శుభ సందర్భంగా రైతులు, కౌలు రైతులు గ్రామ దేవతలకు ప్రత్యేకంగా దర్శించుకుని ఆట పాటలతో సందడి చేశారు. మండల కేంద్రమైన న్యాల్ కల్, మండలంలోని మల్గి,గ్రామంలో పండగను ఘనంగా జరుపుకున్నారు. పశు సంపద, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. కోడెదూడలు, ఎద్దులను, గోమాతలకు ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

పంట పొలాల్లో భూమాతకు ప్రత్యేక పూజలు చేశారు. బండ్లు, ట్రాక్టర్లను సుందరంగా ముస్తాబు చేసి గ్రామంలోని ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మండలంలోని మల్గి గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయం నుండి గ్రామ శివారులోని ఇస్మాల్ ఖాద్రి దర్గా వరకు ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో భక్తులు, రైతులు, జడ్గొండ మారుతి, శివానంద శ్రీపతి, రాజు, సిద్ధారెడ్డి, మారుతి, విట్టల్, బసవరాజ్, ప్రతాపరెడ్డి, జైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, శాంతు, ధనరాజ్, జలంధర్, మహేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం.

రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ ఎస్పై రాజు కమిషనర్ కు పూల మొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ఆఫ్ హానర్ ను స్వీకరించారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్, లాఠీ పరేడ్ ను పర్యవేక్షించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, కేసుల్లో స్వాధీనమైన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్ కాప్, హెస్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు కోసం వినియోగించే టెక్ డాటం వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు కేటాయించిన ఫింగర్ ప్రింట్ డివైస్ వినియోగాన్ని బ్లూకోల్ట్స్ సిబ్బంది చేత పరిశీలించారు. అలాగే ఎఫ్ఎఆర్ ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్ష చేసి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రామడుగు మండలంలోని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీసు అధికారులను నియమించాలని సూచించారు. కోత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు రికార్డు నిర్వహణ, కోర్టు డ్యూటీ, బీట్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సమన్లు తదితర విధులపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, వారి కదలికలను నిరంతరం గమనిస్తూ తాజా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్పై రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు.

పాలక మండలి సభ్యులు కే మల్లయ్య స్వామి సన్మానించిన గ్రామ పెద్దలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాగేష్ సజ్జన్ బొగ్గుల నాగన్న సార్ మర్యాద పూర్వకముగా కలిసి
మల్లయ్య స్వామి గారికి పూలమాలలతో షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ తమ్మలి మరియు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా హృదయంలో ఉన్న ప్రజా నాయకుడు ఉజ్వలుడు.

ప్రజా హృదయంలో ఉన్న ప్రజా నాయకుడు ఉజ్వలుడు….

◆: వృత్తి రీత్యా వైద్యుడైన పేద ప్రజలకు పెన్నిధి…

◆: ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ త్రాగునీటి సౌకర్యాలు పేద ప్రజల వైద్య ఖర్చులు భరిస్తూ…

◆: ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు….

◆:ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే హృదయ నాయకుడు…

◆:సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి పనితీరుపై ప్రశంసలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి పనితీరుపై జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి చేసిన ఈ సర్వేలో ఆయన ముందువరుసలో ఉండడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.నియోజకవర్గంలోని ఆయా గ్రామాల అవసరాలకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అనేక తన సొంత డబ్బు ఖర్చుతో అభివృద్ధి పనులు చేయడం, ప్రతి ఒకరికీ చేరువై ప్రజా నాయకుడిగా ముద్రవేసుకోవడం వంటి అంశాలు ఆయనకు ఈ గుర్తింపు తీసుకొచ్చినట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నది. అంతేగాక ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా.. చెప్పినప్పుడే పనిచేసి చూపడంలో ముందుండే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి ముందు సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో అందుబాటులో ఉండడం, ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండడం ఆయనకు విశేషమైన విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ప్రజల మద్దతే తనకు ప్రధాన బలమని.. ఈ సర్వే ర్యాంకింగ్‌ ద్వారా మళ్లీ రుజువు అయిందని తెలిపారు.పనితీరు బాగుందని రావడం సంతోషం.నిదర్శనం. కేవలం పనితీరే కాకుండా ప్రజల కోసం నిత్యం పాటుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యం బాగుండాలని తన సొంత ఖర్చుతో ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయం. ఇలాంటి నాయకుడు జహీరాబాద్ ప్రజలకు దొరకడం అదృష్టం. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆయన.. మరింత సేవ చేసి మొదటి స్థానం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

హైదరాబాద్ :నేటిధాత్రి

 

car accident

కన్నీళ్లు మిగిల్చిన జన్మదిన వేడుక కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లి వస్తుండగా..
రోడ్డు ప్రమాదం ముగ్గురు అన్నదమ్ముల మృతి..
మరో నలుగురికి గాయాలు

 

యాచారం, న్యూస్టుడే: వారంతా స్నేహితులు.. పాతికేళ్లలోపు యువకులు.. వారిలో ఒకరి పుట్టినరోజు నేపథ్యంలో సరదాగా గడిపేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ గ్రామానికి చెందిన వాసా సాయితేజ(23), వాసా పవన్ కుమార్(25), వాసా రాఘవేందర్ (24), వాసా శివకుమార్, ఇ. సాయికుమార్ వరసకు అన్నదమ్ములు. మూసాపేటలో నివాసం ఉండే ఎం.సందీప్, శివకుమార్ వారి మిత్రులు. వీరందరూ హైదరాబాద్లో వేర్వేరు చోట్ల ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాసా శివకుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం అందరూ కలిసి నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం వైజాగ్ కాలనీలోని కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లారు. పొద్దుపోయే వరకూ అక్కడే ఆనందంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో.. రాత్రి 2 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా యాచారం మాల్ పట్టణం దాటిన కొద్దిసేపటికి వీరు ప్రయాణిస్తున్న కారు..ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు నుజ్జయింది. వాసా సాయితేజ, వాసా పవన్కుమార్, వాసా రాఘవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్కుమార్కు మూడేళ్ల కుమార్తె ఉందని, ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి అని పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా అవివాహితులని వెల్లడించారు.

పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత.

పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత..

 ◆ చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

◆ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు

◆ పుస్తకాల బరువు తగ్గించాలంటున్న వైద్యులు

◆ పట్టించుకోని విద్యా శాఖ అధికారులు

◆ నేలను చూస్తున్న పసి నడుములు

◆ బ్యాక్ పెయిన్ తో చిన్నారుల అవస్థలు

◆ వ్యాపారంగామారిన నోట్ పుస్తకాలు

◆ బాల్యంపై బరువు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్కూల్ పిల్లల బాల్యంపై బ్యాగుల భారం పడుతున్నది. అంత బరువును ఎలా మోస్తారో అని వారి వీపులకు బ్యాగులు చూసే తల్లిదండ్రులకు బాధేస్తున్నది. బరువైన స్కూల్ బ్యాగులతో బడులకు వెళ్లే విద్యార్థులను మనం చూస్తుంటాం. పాఠశాలల యాజమాన్యాలు అవసరం లేకపోయినా పుస్తకాలను కొనుగోలు చేయించి పిల్లల వీపునకు తగిలిస్తున్నాయి. పుస్తకాల బ్యాగు మోత.. పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నది. తద్వారా చిన్నారులు విద్యార్థి దశ నుంచే కండరాల బలహీనత, వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. బడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికే నీరసపడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమన్యాలు ఇష్టం వచ్చినట్లు పుస్తకాలను అంటగడుతున్నాయి.

ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు బ్యాగుల భారం తగ్గడంలేదు. గతంలో విద్యాశాఖ జీవో జారీ చేసినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల వయస్సుకు, తరగతులకు మించి పుస్తకాల భారం మోపుతున్నాయి. దీంతో పిల్లలపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ భారం తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు 2017 జూలై 19న విద్యాశాఖ జీవో నంబర్ 22 జారీ చేసింది. జీవోను పకడ్బందీగా అమలుచేయాలని ప్రభుత్వం విధివిధానాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మండలాల పరిధుల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నిబంధనలను పాటించడం లేదు. విద్యను వ్యాపారంగా మారుస్తూ పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరానికి మించి పుస్తకాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

నిబంధనలు ఇవీ………

విద్యార్థుల బ్యాగు బరువుకు సంబంధించి గతేడాది విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ పాటించాలని ఆదేశించింది. 1, 2 తరగతులు చదివే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు 1.5 కిలోల లోపు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకు, 6, 7 తరగతులకు 4 కిలోల లోపు, 8, 9, 10 తరగతులకు 5 కిలోల లోపు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ రకాల మెటీరియల్స్, సిలబస్ల పేరుతో పిల్లల భుజాన మోయలేని భారం మోపుతున్నాయి. జిల్లాలో పలు స్కూళ్లు పలు అంతస్తుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థులు బ్యాగులు మోస్తూ పైఅంతస్తులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యంపైన భారం పడుతున్నది. పలు సమావేశాల్లో బ్యాగుల భారం తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.

లెక్కకు మించి బుక్స్…….

ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ సిలబస్తోపాటు అసైన్మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్ ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థులపై అధిక భారం మోపుతున్నారు. ప్రతి రోజూ ఆయా సబ్జెక్టులు చెప్పనప్పటికీ విద్యార్థులు ప్రతి రోజూ అన్ని పుస్తకాలను మోసుకెళ్తున్నారు. విద్యార్థుల బరువులో బ్యాగు బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థికి 3 కిలోల బ్యాగు ఉండాలని. కానీ ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే పుస్తకాల బరువు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఇలా ఏ తరగతి విద్యార్థిలను తీసుకున్నా పరిమితికి మించి బ్యాగులు ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో సబ్జెక్ట్ వారీగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉంటాయి. తమ స్కూల్లోనే పుస్తకాలను కొనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు సూచిస్తుండడంతో పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అధిక బరువు ఉన్న బ్యాగులు మోయడం ద్వారా పిల్లల్లో ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు మెడ, భుజాలు, వెన్నునొప్పితో బాధపడుతున్నారు.

పిల్లల ఎదుగుదల పై ప్రభావం పడుతుంది……

విద్యార్థులు అధిక బరువులు మోయడం ద్వారా మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మెడ, వీపు, నడుముపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్నారుల శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. నిబంధనలకు అనుగుణంగా బ్యాగులు ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఎక్కువ పుస్తకాలు అమ్మిన వారిపై చర్యలు తల్లిదండ్రులు………

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎక్కువ పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులపై బ్యాగుల భారం వేయవద్దని గతంలోనే సూచనలు చేశాం. ఏ తరగతి విద్యార్థి బ్యాగు బరువు ఎంత ఉండాలో స్పష్టంగా సూచించాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.

రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ.

రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలల రేషన్‌ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయన్నారు.ఝరాసంగం గ్రామంలో ఉదయం,7.00 సాయంత్రం 10.00 వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంచుతున్నారని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ తెలిపారు.సమస్యలు ఉత్పన్నం కాకుండా వెంట వెంటనే పరిష్కరిస్తూ రేషన్ లబ్ధిదారుల డీలర్లు ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా జరిగేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

30 శాతం పంపిణీ పూర్తి

ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 15 శాతం మందికి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేశామని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ ఆయన తెలిపారు.
ఝరాసంగం మండల కేంద్ర పరిధిలోని రేషన్ షాపుల్లో 30 శాతం పంపిణీ పూర్తయిందని అధికారి తెలిపారు.

దుకాణాల వద్ద క్యూ కడుతున్న లబ్ధిదారులు

సన్న బియ్యం పంపిణీకి తోడు ఒకేసారి మూడు నెలల సరుకు పంపిణీ చేస్తుండడంతో దుకాణాల వద్ద భారీ రద్దీ ఉంటోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ పీడీఎస్ను అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. బియ్యం పంపిణీకి ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా ఒక్కో నెలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్రలు పీఓఎస్ యంత్రంపై ఇవ్వాల్సి ఉండడంతో పంపిణీ నెమ్మదిగా కొనసాగుతోంది.

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.

కారేపల్లి నేటి ధాత్రి:

కారేపల్లి మండలం లోని కొమ్ముగూడెం ముత్యాలంపాడు గ్రామాల లో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వై ఆర్ జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్లో వై ఆర్ జి కేర్ డిఆర్పి శివయ్య క్లస్టర్ లింక్ వర్కర్ ఆదేర్ల శంకర్ రావు డాక్టర్ ప్రబంధ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ హెచ్ఐవి రక్ష పరీక్షలు చేయడం జరిగింది అలాగే టిబి ఎలా వ్యాపిస్తుంది దానికి నివారణ మార్గాలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎలాంటి అనారోగ్యం కలిగినను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని.

Blood tests

ఈ వర్షాకాలపు సీజన్లో దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ ప్రబంధ తెలిపారు వివరిస్తూ తెమడ పరీక్షలు టెస్టులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూర్యం ల్యాబ్ సూపర్వైజర్ రామకృష్ణ టీబీ పేషెంట్ సూపర్వైజర్ విజయ కుమారి ఎల్ హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు ఏఎన్ఎం శ్యామల విజయ కుమారి ఆశా వర్కర్లు సుజాత హనుమంతి పద్మ సావిత్రి వెంకటరమణ లక్ష్మి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ.

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య.

దేవరకద్ర నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ సిజీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టిన శివాలయం పునర్నిర్మాణంకు సంబంధించి బుధవారం దేవాలయం వద్ద చేపట్టిన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో.. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రో” జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Shiva temple

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరు చదువుకోవాలని లక్ష్యంతో. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని, ఇప్పటికే అన్ని స్కూళ్లకు యూనిఫాం లు, పాఠ్యపుస్తకాలను చేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్గొన్నారు.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.

75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా అతను జన్మత భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి.

 

నాగర్ కర్నూల్  నేటి ధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలిపారు. అలాగే నిరుపేదలు ఎవరు ఉన్నా సరే వారు ఏ పార్టీలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరు అధైర్య పడకూడదు అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version